యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

Personal Loan

పర్సనల్ లోన్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడగబడే ప్రశ్నలు

EMI అంటే ఏమిటి?

ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI లు) అనేవి చిన్న అనువైన ఇన్స్టాల్మెంట్లలో పర్సనల్ లోన్ తిరిగి చెల్లించే సౌలభ్యం మరియు ప్రయోజనం ఇస్తాయి. ఇన్స్టాల్మెంట్లలో ప్రిన్సిపల్ మరియు వడ్డీ అమౌంట్లు రెండూ ఉంటాయి.

ఫోర్‍క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు ఏమైనా ఉన్నాయా?

Yes, there are foreclosure and part-prepayment charges applicable. To read more on the interest rates and charges, click here.

ఒక సాలరీడ్ పర్సనల్ లోన్ కోసం మీరు అప్లై చేసినప్పుడు మీరు పొందగల మాగ్జిమం లోన్ అమౌంట్ ఎంత?

• మీరు ₹ .25 లక్షల వరకు ఒక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ మొత్తాన్ని పొందవచ్చు.
• అయితే, మంజూరు చేయబడిన తుది మొత్తం మీ ఆదాయం, మీ CIBIL స్కోర్ మరియు ఇతర అర్హతా ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

అందుబాటులో ఉన్న అవధి ఎంపికలు ఏమిటి?

మీ ప్రిఫరెన్స్ మరియు లోన్ శాంక్షన్ చేసే పరిస్థితులను బట్టి మీరు 12 నుంచి 60 నెలల రేంజిలో అవధిని ఎంచుకోవచ్చును.

బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ తీసుకోవడంలో ఉండే లాభాలు లేదా ప్రయోజనాలు ఏమిటి?

మరిన్ని వివరాల కోసం దయచేసి పర్సనల్ లోన్ ఫీచర్స్ మరియు ప్రయోజనాలు సెక్షన్ చెక్ చేయండి.

ఒక శాలరీడ్ పర్సనల్ లోన్ కోసం నేను ఎలా అప్లై చేయాలి?

మీరు మా ఆన్‍లైన్ అప్లికేషన్ ఫెసిలిటీ ద్వారా ఆన్‍లైన్ అప్లై చేసుకోవచ్చు లేదా contact us సెక్షన్లో పేర్కొన్న వివిధ పద్ధతుల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

నాకు సాలరీడ్ పర్సనల్ లోన్ ఎప్పుడు అందుతుంది?

ఆన్‍లైన్ అప్లికేషన్ల కోసం, మీకు తక్షణ ఆప్రూవల్ లభిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన 24 గంటల్లో మీ అకౌంట్ కు ఫండ్స్ డిస్బర్స్ చేయబడతాయి.

నేను లోన్ ఎలా తిరిగి చెల్లించాలి?

ECS సౌకర్యాన్ని ఉపయోగించి లేదా పోస్ట్ డేటెడ్ చెక్స్ ద్వారా మీరు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI లు) లో లోన్ ని తిరిగి చెల్లించవచ్చు.

ఒక సాలరీడ్ పర్సనల్ లోన్ కోసం ఆన్‍లైన్ అప్రూవల్ ప్రాసెస్ ఏది?

మా ఆన్‍లైన్ అప్లికేషన్ ఫెసిలిటీ తో, మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఒక సాలరీడ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు మరియు మీ అప్లికేషన్ పై తక్షణ అప్రూవల్ పొందవచ్చు.

ఒక తక్షణ పర్సనల్ లోన్ కోసం నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి?

వివరాల కోసం, పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి విభాగంలో దశలవారీగా విధానాన్ని తనిఖీ చేయండి.

నాకు రుణం ఏ అర్హత ప్రమాణంపై మంజూరు చేయబడుతుంది?

మరింత సమాచారం పొందడానికి మీరు పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు విభాగాన్ని చెక్ చేయవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ యొక్క అంతర్గత పాలసీల ఆధారంగా అన్ని లోన్‍లు శాంక్షన్ చేయబడతాయి.

ఒక పర్సనల్ లోన్ కోసం ఆన్‍లైన్ లో అప్లై చేయడం యొక్క ప్రయోజనాలు ఏమిటి?

• మా ఆన్‍లైన్ అప్లికేషన్ ఫెసిలిటీ ద్వారా, మీరు ఏ బ్రాంచ్ కు ప్రయాణించే అవసరం లేకుండా, ఒక లోన్ కోసం ఎక్కడినుంచైనా మరియు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు.
• మీకు మీ లోన్ పై తక్షణ అప్రూవల్ కూడా పొందుతారు మరియు ఇంటర్నల్ వెరిఫికేషన్ పూర్తి అయిన 24 గంటల్లో ఫండ్ డిస్బర్సల్ జరుగుతుంది.

నేను ఆన్‍లైన్ అప్లై చేసిన నా లోన్ యొక్క స్థితిని నేను ఎలా చెక్ చేసుకోగలను?

To check your loan status:
• మీరు మా కస్టమర్ కేర్ ను 1800-103-3535 పై కాల్ చేయవచ్చు మరియు మీకు ఇమెయిల్ మరియు SMS ద్వారా అందించబడిన మీ యునీక్ రిఫరెన్స్ నంబర్ అందించవచ్చు.
• పేరు మరియు పుట్టిన తేదీ వంటి వివరాల ధృవీకరణపై, మీ ఖాతా యొక్క స్థితి మీకు తెలియజేయబడుతుంది.

నేను అందించే సమాచారం ఎంత సురక్షితం?

స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉపయోగించి, మా ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఒక పూర్తిగా సురక్షితమైన అప్లికేషన్ వ్యవస్థ, కాబట్టి మీ సమాచారం అంతా మాతో సురక్షితంగా ఉంటుంది.

ఆన్‍లైన్ అప్లికేషన్ కోసం సెక్యూర్ ఫీజు అంటే ఏమిటి?

సెక్యూరిటీ ఫీజు అనేది మీరు మీ అప్లికేషన్ ఫారమ్ను ఆన్లైన్లో సమర్పించటానికి లేదా ప్రాసెసింగ్ చేయడం కోసం చెల్లించవలసిన ఒక ఛార్జి.

నేను ఆన్‍‍లైన్లో సెక్యూర్ ఫీజు చెల్లించకపోతే ఏమి జరుగుతుంది?

మీరు సురక్షిత ఫీజు చెల్లించకూడదని ఎంచుకుంటే, మీరు తక్షణ ఆన్‍లైన్ అప్రూవల్ యొక్క ప్రయోజనాన్ని కోల్పోతారు.

నేను పర్సనల్ లోన్ ఆన్‍లైన్ అప్లికేషన్ ద్వారా ఇప్పటికే సెక్యూర్ ఫీజు చెల్లించాను, కాని నేను ఇప్పుడే పర్సనల్ లోన్ వినియోగించుకోవాలి అనుకోవడం లేదు. బజాజ్ ఫిన్సర్వ్ నుంచి నేను పర్సనల్ లోన్ వినియోగించుకోకపోతే నాకు సెక్యూర్ ఫీజు వెనక్కు చెల్లిస్తారా?

• లోన్ మంజూరు చేయబడి, కాని పంపిణీ చేయబడిన మొత్తం మంజూరు చేయబడిన 30 రోజులలో మీ ద్వారా వినియోగించుకోబడకపోతే, మేము మీకు సెక్యూర్ ఫీజు మొత్తం రిఫండ్ చేస్తాము.
• మీ లోన్ తిరస్కరించబడినట్లయితే, మీరు చెల్లించిన సెక్యూరిఠీ ఫీజును పూర్తిగా మేము రిఫండ్ చేస్తాము.

నేను సెక్యూర్ ఫీజు ఎలా చెల్లించగలను?

ఆన్లైన్లో మీ సురక్షిత రుసుము చెల్లించటానికి అనేక మార్గాలు ఉన్నాయి:
1 డెబిట్ కార్డు
2 నెట్ బ్యాంకింగ్

ఈ సైట్లో నా డెబిట్ కార్డును ఉపయోగించడం సురక్షితమేనా?

మా వెబ్సైట్ లో అన్ని ట్రాన్సాక్షన్లు సురక్షితంగా ఉంటాయి. మేము బెస్ట్-ఇన్-క్లాస్ సెక్యూరిటీని ఉపయోగిస్తాము మరియు చేయబడే ట్రాన్సాక్షన్లు సురక్షితంగా ఉంటాయి. మేము అనధికార వ్యక్తులు సమాచారాన్ని చూడటం నుంచి రక్షించే SSL డేటా ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తాము.

నేను ఒక లావాదేవీని ఎలా రద్దు చేయాలి లేదా రిఫండ్ పొందాలి?

• ఏవైనా వ్యత్యాసాలకు సంబంధించి మరియు ఆ కారణాలు చెల్లుబాటు అయ్యేవి అయితేనే, మేము డబ్బును రిఫండ్ చేస్తాము.
• దయచేసి 1800-103-3535వద్ద మాకు కాల్ చేయండి లేదా personalloans@bajajfinserv.in వద్ద మాకు వ్రాయండి. మీకు సహాయం చేయడం మాకు సంతోషకరం.
• దయచేసి మరిన్ని వివరాల కోసం నిబంధనలు మరియు షరతులను చదవండి.

ఫ్లెక్సీ టర్మ్ లోన్ యొక్క ఫీచర్స్ ఏమిటి?

• ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ అనేది మా ప్రీమియం కస్టమర్లకు బజాజ్ ఫిన్సెర్వ్ ద్వారా అందజేయబడుతున్న ఒక పరిశ్రమలో-మొదటి సౌకర్యం.
• ఇది రెండింటి లక్షణాల కలయికతో ఉన్న ఒక హైబ్రిడ్ ప్రొడక్ట్, ఒక టర్మ్ లోన్ మరియు ఒక వ్రాతపూర్వక విలువ ఆధారిత రుణ పరిమితి.
• ఈ ప్రాడక్ట్ తో మీరు, ప్రక్రియను సులభం మరియు అవాంతరం లేకుండా చేస్తూ మీకు కావలసినన్ని సార్లు మీరు డబ్బుని ప్రీ-పే మరియు డ్రౌడౌన్ చేయవచ్చు.
• మీరు ఉపసంహరించుకున్న మొత్తంమీద మాత్రమే వడ్డీ ఛార్జి చేయబడుతుంది కానీ మొత్తం రుణ మొత్తం పై కాదు.
• ఇది వినియోగించుకున్న మీదట, ఏ అదనపు ఖర్చు లేకుండా మీరు రుణాన్ని ముందుగా-చెల్లింపు చేయవచ్చు కాబట్టి మీరు వడ్డీ ఆదా చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
• మీ డ్రాయింగ్ పవర్ నెలవారీ ప్రాతిపదికన తగ్గుతుంది, తద్వారా అవధి ముగింపు వద్ద అప్రూవ్డ్ లోన్ అమౌంట్ ని సున్నాకు తగ్గిస్తుంది.

ఒక సాధారణ టర్మ్ లోన్ తో పోలిస్తే ఫ్లెక్సీ ఫెసిలిటీ యొక్క ప్రయోజనం ఏమిటి?

సాధారణ టర్మ్ లోన్ తో పోలిస్తే ఫ్లెక్సీ లోన్లు అనేక ప్రయోజనాలు అందిస్తాయి:
1 ఐడిల్ ఫండ్స్ తో లోన్ ను ప్రీ-పే చేసే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంటుంది.
2 ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా లోన్ అవధి సమయం లోపు ఏ సమయంలోనైనా డ్రాప్-లైన్ సదుపాయంలో మీరు ప్రీ-పెయిడ్ మొత్తాన్ని తిరిగి-వినియోగించుకోవచ్చు.
3 మీరు వడ్డీ ఖర్చులపై ఆదా చేస్తారు - ఉపయోగించిన లోన్ అమౌంట్ పై మాత్రమే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ప్రీ-పెయిడ్ అమౌంట్ పై విధించే వడ్డీ ఏదీ ఉండదు.
4 నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల ద్వారా BFL కు ప్రీ-పేమెంట్లు చేయడానికి మిమ్మల్ని అనుమతించే డ్రాడౌన్ మరియు RTGS కోసం సెల్ఫ్-సర్వీస్ అకౌంట్ యాక్సెస్ టూల్ అయిన బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ఇంటర్నెట్ పోర్టల్-ఎక్స్పీరియా పై సీమ్లెస్, అవాంతరం లేని ఆన్‍లైన్ ట్రాన్సాక్షన్లు.

డ్రాప్లైన్ ఫెసిలిటీ యొక్క ముఖ్యమైన భాగాలు ఏమిటి?

డ్రాప్ లైన్ ఆధారిత అమోర్టైజేషన్ యొక్క భాగాలు ఇవి:

1 డ్రాప్లైన్ బ్యాలెన్స్: ఇది అవధి అంతటా క్రిందికి పడిపోతూ ఉండే ఒక రన్నింగ్ లోన్ ఫెసిలిటి.
2 ఉపయోగించబడిన అమౌంట్: మీరు ఉపయోగించిన అమౌంట్. ఇది POS (ప్రిన్సిపల్ ఔట్స్టాండింగ్).
3 అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ : ఇది మీరు డ్రాడౌన్ (డ్రాప్లైన్ బ్యాలెన్స్ మరియు ఉపయోగించబడిన అమౌంట్ మధ్య వ్యత్యాసం గా కాలిక్యులేట్ చేయబడుతుంది) చేయగల అమౌంట్.

బిల్లింగ్ సైకిల్ ఏమై ఉంటుంది?

బిల్లింగ్ సైకిల్ ప్రతి నెల యొక్క 26th నుంచి 25th వరకు ఉంటుంది మరియు అదే తరువాతి నెల 5th నాటికి డ్యూ అవుతుంది.

నా ఇన్స్టాల్మెంట్ చెల్లింపు తేదీ ఏమై ఉంటుంది?

అన్ని ఫ్లెక్సీ లోన్ల కోసం ఇన్స్టాల్మెంట్ చెల్లింపు తేదీ ప్రతి నెల 5th అయి ఉంటుంది.

బిల్లింగ్ సైకిల్ తర్వాత కస్టమర్ ఉపసంహరణ చేసినా లేదా పాక్షికంగా చెల్లించినా వడ్డీ ఎలా లెక్కించబడుతుంది?

ప్రతినెల 26th నుంచి 25th మధ్య అమలు చేయబడిన అన్ని ట్రాన్సాక్షన్ల కోసం, ఆ అమౌంట్ ఉపయోగించబడిన నిర్దిష్ట రోజుల సంఖ్య కోసం మీరు చార్జ్ చేయబడతారు.
ఉదా., మీకు రూ.10 లక్ష లోన్ పరిమితి ఉండి మీరు రూ..10 లక్షని ఆ నెలలో 26th నాడు డ్రాడౌన్ చేసి అదే నెల 29th నాడు రూ.5 లక్ష ప్రీ-పే చేసి, ఆ విధంగా ఆ నెల 29th నుంచి తరువాతి నెల 25th వరకు కేవలం రూ.5 లక్ష మాత్రమే ఉపయోగించినట్లయితే, అప్పుడు మీకు 26th – 29th వరకు రూ..10 లక్ష పై మరియు 30th – 25th వరకు రూ.5 లక్ష పై వడ్డీ ఛార్జి చేయబడుతుంది.
అదేవిధంగా, మీకు రూ.15 లక్ష లోన్ పరిమితి ఉండి మీరు రూ..10 లక్షని ఆ నెలలో 26th నాడు డ్రాడౌన్ చేసి, మరియు 29th నాడు మరొక రూ.5లక్షని డ్రాడౌన్ చేసి, తద్వారా అందుబాటులో ఉన్న పూర్తి బ్యాలెన్స్ ని ఉపయోగించుకుని ఉంటే, మీకు ఆ నెల 26th – 29th వరకు రూ .10 లక్షల కోసం మరియు తరువాతి నెల 30th – 25th వరకు రూ .15 లక్ష కోసం ఛార్జి చేయబడతారు.

సాధారణ టర్మ్ లోన్ తో పోలిస్తే వడ్డీ రేట్లు అంతే / తక్కువగా ఉంటాయా?

దయచేసి టర్మ్ లోన్లు మరియు ఫ్లెక్సీ టర్మ్ లోన్ల పై వర్తించే ఛార్జీల వివరణాత్మక జాబితా కోసం పర్సనల్ లోన్ వడ్డీ రేటు చూడండి.

నేను ఏ ఆన్‍లైన్ ఉపసంహరణ చేయాలనుకోవడం లేదు, లావాదేవీ మరేదైనా విధంగా చేయబడవచ్చా?

• ఫ్లెక్సీ టర్మ్ లోన్స్ ద్వారా మీ ఇంటి / కార్యాలయం యొక్క సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణం నుండి లావాదేవీ చేయడానికి మీకు స్వేచ్ఛనిచ్చే, వేగవంతమైన మరియు సులభమైన రుణ సదుపాయాన్ని కల్పించాలని మేము భావిస్తున్నాము.
• ప్రస్తుతం అన్ని ఫ్లెక్సీ లావాదేవీలను ఇంటర్నెట్ ద్వారా నిర్వహించవలసి ఉంటుంది.

నేను ఏ ఆన్‍లైన్ చెల్లింపు చేయాలనుకోవడం లేదు, ప్రతిసారీ ఎవరైనా ఇంటికి వచ్చి లావాదేవీ చేసిపెట్టడం నాకు అవసరం?

విత్డ్రాయల్స్ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే అనుమతించబడగా చెల్లింపులు RTGS / NEFT / IMPS ద్వారా ఆన్లైన్లో లేదా మీ బ్యాంక్ ద్వారా చేయబడవచ్చు.

నేను డ్రాబ్యాక్/చెల్లింపు మోడ్ కోసం దాన్ని ఉపయోగించగలిగేందుకు మీరు ఈ సౌకర్యం కోసం చెక్ బుక్ అందిస్తారా?

లేదు, ఇది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంగల ఒక కరెంట్ అకౌంట్ గా పనిచేయదు. అంతేకాక ఒక బ్యాంక్ లాగా కాక, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఒక NBFC అయి ఉండటం వలన, ఫ్లెక్సీ లోన్లు, అలాగే మా ఇతర లోన్ ప్రొడక్టులు ఈ సదుపాయాన్ని అందించలేవు.

కస్టమర్ వెల్కమ్ కిట్ ను అందుకోకపోయి ఉంటే సంగతేమిటి?

కస్టమర్ మాకు cs@bajajfinserv.inవద్ద వ్రాయవచ్చు మరియు అదే రిజిస్టర్డ్ అడ్రస్ కు తిరిగి పంపబడుతుంది.

నేను నా ఎక్స్పీరియా లాగిన్ ID మరియు పాస్వర్డ్ ను ఎప్పుడు అందుకుంటాను?

• మీ ఎక్స్పీరియా ID మరియు పాస్వర్డ్ కొత్త లోన్ రిలేషన్షిప్ కిట్ / వెల్కమ్ కిట్ తో పాటు పంపబడుతుంది.
• రుణం మార్పిడి జరిగిన 10 రోజుల్లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు పై మీకు ఒక SMS పంపబడుతుంది.

రీపేమెంట్ షెడ్యూల్ / వడ్డీ సర్టిఫికేట్లు / అకౌంట్ల స్టేట్మెంట్ / నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం నా స్టేట్మెంట్లను నేను ఎలా పొందగలను?

• All loan account statements are available to you online and can be viewed / downloaded by logging on to https://www.bajajfinserv.in/customer-portal using your Experia Id & password.
• అయితే, మీరు మా కస్టమర్ కేర్ కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా లేదా ఒక ఇ-మెయిల్ అభ్యర్థన ద్వారా మీ స్టేట్మెంట్ల యొక్క హార్డ్ కాపీ కోసం అభ్యర్థించవచ్చు.
• బజాజ్ ఫిన్సర్వ్ ప్రతి సంవత్సరపు చివరిలోనూ ఇమెయిల్ ద్వారా వార్షిక స్టేట్మెంటుని కూడా పంపుతుంది.

నా పూర్తి లోన్ వివరాలను నేను ఎలా తెలుసుకుంటాను?

• మీరు మీ ఇ-మెయిల్ ID పై ఒక వెల్కమ్ కిట్ అందుకుంటారు (& ఎక్స్పీరియాలో కూడా అదే ఉంటుంది) అందులో ఇవి ఉంటాయి:
1 మీ ఫ్లెక్సీ లోన్ వివరాలు అన్నీ
2 ఎక్స్పీరియా కోసం యూజర్ ID మరియు పాస్వర్డ్
3 డ్రాడౌన్ ట్రాన్సాక్షన్ల కోసం మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు.
4 యునీక్ వర్చువల్ అకౌంట్ నంబర్
5 రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్
6 మీరు ఆ ప్రాడక్ట్ ని అర్థం చేసుకునేందుకు మరియు సెల్ఫ్-సర్వీస్ టూల్ ని సమర్ధవంతంగా ఉపయోగించడానికి సహాయపడటానికి రిఫరెన్స్ సర్వీస్ గైడ్.

నా ఫ్లెక్సీ టర్మ్ లోన్ బ్యాలెన్స్ నేను ఎలా తెలుసుకోగలను?

• మీ ప్రస్తుత అకౌంట్ ID మరియు పాస్ వర్డ్ తో మా కస్టమర్ పోర్టల్, ఎక్స్పీరియా కు లాగ్ ఆన్ అవడం ద్వారా మీరు అన్ని లోన్ వివరాలను ఫ్లెక్సీ టర్మ్ లోన్ అకౌంట్కు సంబంధించిన అన్ని లోన్ వివరాలు మరియు సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.
• మీరు ఎక్స్పీరియా పై డ్రాడౌన్ రిక్వెస్ట్ పెట్టవచ్చు.

పార్ట్-ప్రీపేమెంట్ ప్రాసెస్ ఏమిటి?

• బజాజ్ ఫిన్సర్వ్ మీకు ఒక ప్రత్యేకమైన ఖాతా నంబర్ అందిస్తుంది.
• మీరు మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా ఈ యునీక్ అకౌంట్ లోకి అన్ని పేమెంట్స్/ ప్రీ-పేమెంట్స్ చేయవచ్చు.
• బ్యాంకింగ్ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన సమయం లోపల అదే ఫ్లెక్సీ టర్మ్ లోన్ అకౌంట్‍కు క్రెడిట్ చేయబడుతుంది.

ఫ్లెక్సీ లోన్ పైన ముందస్తు-చెల్లింపు కోసం ఏదైనా ఛార్జి ఉందా?

ముందస్తు-చెల్లింపు కోసం ఏ ఛార్జి లేదు. ఒక ఫ్లెక్సీ లోన్ కస్టమర్గా, మీరు ఎన్నిసార్లైనా లావాదేవీ (మీ ఖాతాలో చెల్లింపులు చేయడం మరియు అందుబాటులో ఉన్న మిగులు మొత్తం నుంచి డ్రా డౌన్ చేయడం) చేయవచ్చు.

నేను మొదటి పార్ట్ ప్రీపేమెంట్ ఎప్పుడు చేయవచ్చు?

పాక్షిక ముందస్తు చెల్లింపు రుణం వితరణ తర్వాత 36 గంటలకు చేయవచ్చు.

నేను పాక్షిక ముందస్తు-చెల్లింపుని ఎన్నిసార్లు చేయగలను?

ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ కస్టమర్ అతను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తన రుణంపై పాక్షిక ముందస్తు చెల్లింపులను చేయవచ్చు. ఒక రోజులో పాక్షిక ముందస్తు చెల్లింపుల సంఖ్యకు ఏ పరిమితి లేదు.

నేను ఒక రోజులో నా ఫ్లెక్సీటర్మ్ లోన్ నుండి ఎన్ని సార్లు ఉపసంహరించుకోవచ్చు?

ప్రస్తుతం, మీరు గరిష్టంగా రోజుకు ఐదు సార్లు ఉపసంహరించుకోవచ్చు.

నేను అదే రోజున ఉపసంహరించుకుని పాక్షికంగా ముందస్తుచెల్లింపు చేయవచ్చా?

అవును, మీరు విత్డ్రా చేసి అదే రోజున పార్ట్-ప్రీపే చేయవచ్చు.

నా అకౌంట్‍కు ఎంత సమయంలో డబ్బు చెల్లించబడుతుంది?

బజాజ్ ఫిన్సర్వ్ డబ్బు ట్రాన్స్ఫర్ల కోసం RTGS / NEFT ఉపయోగిస్తుంది. బ్యాంకింగ్ గైడ్ లైన్స్ ప్రకారం అదే నిర్ధిష్ట సమయం లోపల మీ అకౌంట్కు క్రెడిట్ చేయబడుతుంది.

నేను నా EMI తేదీకి ముందే పార్ట్ ప్రీపేమెంట్ చేసాను. నేను ఇప్పటికీ నా ఇన్స్టాల్మెంట్ చెల్లించవలసి ఉంటుందా?

అవును, పార్ట్-ప్రీపేమెంట్ అమౌంట్ తో సంబంధం లేకుండా గడువు తేదీన, ఇన్స్టాల్మెంట్ డిడక్ట్ చేయబడుతుంది. బిల్లింగ్ కాలంలో ఉపయోగించబడిన అమౌంట్ పై EMI రికవర్ చేయబడుతుంది కాబట్టి.

పాక్షిక-ముందస్తు చెల్లింపు మరియు ఉపసంహరణ ఖాతా స్టేట్మెంట్లో అమలులోకి రావడానికి ఎంత సమయం పడుతుంది?

• ఫ్లెక్సి టర్మ్ ఋణాల క్రింద చెల్లింపుల కోసం అభ్యర్థనలు 20 నిమిషాలలోపు ప్రాసెస్ చేయబడతాయి
• ప్రస్తుతం, ఫ్లెక్సీ టెర్మ్ లోన్ ఉపసంహరణ అభ్యర్థనలు ఒక గంట ప్రాతిపదికన లేవనెత్తబడుతూ ఉంటాయి, మరియు అంగీకరించబడిన సమయ వ్యవధి ప్రకారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభించబడుతుంది.
• చెల్లింపు అభ్యర్థన వ్యవస్థలో వ్రాయబడిన వెంటనే విత్డ్రాయల్ ఎంట్రీలు ఖాతాల స్టేట్మెంట్లో ప్రతిబింబిస్తాయి.
• అయితే, మీ అకౌంట్‍కు క్రెడిట్ చేయబడటానికి ముందు, ఆ బ్యాచ్ బ్యాంకు సైట్ వద్ద ఆథరైజ్ చేయబడాలి.

ఉపసంహరణ లేదా పాక్షిక ముందస్తు చెల్లింపు సమయంలో కస్టమర్ ఏదైనా సమస్య ఎదుర్కొంటే- ఎవరిని సంప్రదించాలి?

మీరు మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు:
1 మా కాల్ సెంటర్ నం. - 020-39574151
2 https://www.bajajfinserv.in/reach-usవద్ద మమ్మల్ని సంప్రదించండి

డ్యూ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మరియు తేదీ కోసం నాకు ఏదైనా ఇంటిమేషన్ ఉంటుందా?

• అవును, ఒక ఫ్లెక్సీ కస్టమర్గా మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో ఈ క్రింది ఇంటిమేషన్లు అందుకుంటారు.
1 ప్రతి ట్రాన్సాక్షన్ పై SMS (పేమెంట్ మరియు డ్రాడౌన్ ఎక్స్పీరియా పై చేయబడుతుంది)
2 గడువు తేదీకి ముందు ఇన్స్టాల్మెంట్ డ్యూ ఇన్టిమేషన్
3 క్లియరెన్స్ మరియు క్రెడిట్ తర్వాత ఇన్స్టాల్మెంట్ అందుకున్న ఇన్టిమేషన్
4 ప్రత్యామ్నాయంగా మీరు మీ వీలు ప్రకారంగా మీ ఎక్స్పీరియా అకౌంట్ లోకి లాగిన్ అవడం ద్వారా మీరు మీ లోన్ వివరాలను మరియు ఇన్స్టాల్మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ఫ్లెక్సి లోన్ ని నేను ఎలా మరియు ఎప్పుడు ముందస్తుగా మూసివేయవచ్చు?

• మీరు ఏదైనా అదనపు ఫీజు చెల్లించకుండా ఏ అమౌంట్ వరకు అయినా ప్రీ-పేమెంట్ లేదా ప్రీ-క్లోజర్ చేయవచ్చు.
• మీకు కేటాయించబడిన ఏకైక బజాజ్ ఫిన్సర్వ్ అకౌంట్‍కు RTGS ద్వారా మీరు ముందస్తు-చెల్లింపుని చేయవచ్చు.
• మీరు ఈ రుణ సదుపాయాన్ని నిలిపివేయాలని కోరుకుంటే మీరు ముందస్తుగా మూసివేయడానికి అభ్యర్ధనతో వడ్డీతో సహా రుణ ఖాతాలో ఉన్న పూర్తి బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా అలా చేయవచ్చు.
• ఫోర్క్లోజర్ కోసం రిక్వెస్ట్ రెయిజ్ చేయడానికి- సందర్శించండి ఎక్స్పీరియా/ వి కేర్/ కస్టమర్ కేర్ నం./ బ్రాంచ్.

నా చిరునామా / మొబైల్ నంబర్ / బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను నేను ఎలా మార్చగలను? నేను ఏమైనా ప్రూఫ్ పంపించాలా?

మీ ద్వారా సరిగ్గా ఎటెస్ట్ చేయబడి సంతకం చేయబడిన ఒక అభ్యర్థన లేఖతో సంబంధిత రిలేషన్షిప్ అధికారికి డాక్యుమెంటరీ రుజువు సమర్పించడం ద్వారా మీ వ్యక్తిగత వివరాలన్నీ సులభంగా మార్చబడవచ్చు.

ఫ్లెక్సీ లోన్ కోసం ముందస్తు ముగింపు ఛార్జీలు ఏమైనా ఉన్నాయా?

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు స్వచ్ఛమైన ఫ్లెక్సీ లోన్ల కోసం పంపిణీ చేయబడిన మొత్తం పై మరియు ఫ్లెక్సీ లోన్ల కోసం ప్రస్తుతం చెల్లించవలసి ఉన్న బాకీ ప్రస్తుత POS అవుట్‍స్టాండింగ్ పై లెక్కించబడతాయి.

ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీ కింద లభించే మినిమం మరియు మాగ్జిమం లోన్ అమౌంట్ ఏమిటి?

రూ.80 వేల మినిమం అమౌంట్ మరియు రూ.15 లక్షల మాగ్జిమం అమౌంట్ వినియోగించుకోవచ్చు.

ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీ వినియోగించుకునేందుకు అవధి ఏమై ఉంటుంది?

మినిమం అవధి 1-సంవత్సరం దీని తర్వాత మీరు మీ ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీని రెన్యూ చేసుకోవచ్చు.

లోన్ వినియోగించుకునేందుకు అవధి ఏమై ఉంటుంది?

అవధి 1-సంవత్సరం అయి ఉంటుంది ఆ తర్వాత కస్టమర్ ఆ లైన్ ని తరువాతి 12నెలల కోసం రెన్యూ చేసుకోవచ్చు లేదా దానిని సాధారణ టర్మ్ లోన్ కు మార్చుకోవచ్చు.

ఫ్లెక్సీ టర్మ్ లోన్ యొక్క నెలసరి ఇన్స్టాల్మెంట్ / EMI ప్రిన్సిపల్ అమౌంట్ని కలిగి ఉంటుందా?

ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ లో, మీరు EMI రూపంలో వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ఉదాహరణకు: రూ.5 లక్షల ఫ్లెక్సీ టర్మ్ లోన్ మొత్తానికి EMI సుమారుగా రూ.6,000 ఉంటుంది (వడ్డీ మాత్రమే) కానీ సాధారణ రూ. 12,000 EMI కాదు.

పార్ట్-పేమెంట్ లేదా డ్రాడౌన్ చేసినప్పుడల్లా, EMI లో మార్పులు తక్షణమే రిఫ్లెక్ట్ అవుతాయా?

ఏదైనా నెలలో 22nd కు ముందు ఏదైనా పార్ట్-పేమెంట్ లేదా విత్డ్రాయల్ చేయబడితే, EMI లో మార్పు తరువాతి నెలలోనే రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే, మార్పులు ఒక నెల లాగ్ తో రిఫ్లెక్ట్ అవుతాయి.

యాన్యువల్ మెయిన్టెనెన్స్ ఛార్జీల కలెక్షన్ సైకిల్ తేది ఏమిటి?

వార్షిక నిర్వహణ ఛార్జీలు మీ రుణం యొక్క వార్షికోత్సవం నాడు మీ ఖాతా నుండి ఆటో డెబిట్ చేయబడతాయి.

మొదటి డిస్బర్స్మెంట్ లో నాకు రూ.25లక్ష కు అర్హత ఉంది, అయితే లైన్ ఆఫ్ క్రెడిట్ పాలసీ ప్రకారంగా నాకు రూ. 15లక్ష కేటాయించబడింది. నా లైన్ ప్రకారం నాకు తర్వాతి సంవత్సరంలో నేను అదనపు లోన్ కావాలనుకుంటే, ప్రక్రియ ఏమై ఉంటుంది?

మీరు మా కస్టమర్ కేర్ ను సంప్రదించి లోన్ అమౌంట్ రెయిజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీ లోన్ రెన్యూ చేయబడుతుంది మరియు మీ క్రెడిట్ పర్ఫార్మెన్స్ ప్రకారం కొత్త లోన్ అమౌంట్ శాంక్షన్ చేయబడుతుంది.

నేను ఒక ఫ్లెక్సీ టర్మ లోన్ ని ఒక టర్మ్ లోన్ గా ఎలా మార్చగలను?

• మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్ ను ఒక సాధారణ లోన్ అప్లికేషన్ గా మార్చడానికి మీరు మా కస్టమర్ సర్వీసుకు ఒక ఇమెయిల్ (మీ సమ్మతితో) వ్రాయవలసి ఉంటుంది.
• కస్టమర్ సర్వీస్ మీ సమ్మతి తీసుకొని మీ తరపున ఒక అభ్యర్థనను పంపుతుంది.
• దీని తర్వాత, మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్ 60 నెలల కోసం ఒక టర్మ్ లోన్లోకి మరియు ప్రిన్సిపల్ మొత్తం కూడా చేర్చబడి ఉండే ఒక సాధారణ EMI కి మార్చబడుతుంది.

ఒక టర్మ్ లోన్ ని ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ గా మార్చుకోవచ్చా?

అవును, ఒక కొత్త అగ్రిమెంట్ తో ఒక కొత్త ఫ్లెక్సీ టర్మ్ లోన్ బుక్ చేయబడుతుంది మరియు ఇప్పటికే ఉన్న లోన్ మూసివేయబడుతుంది.

ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీని టర్మ్ లోన్ కు మార్చడం కోసం ప్రక్రియ ఏమిటి?

లోన్ ను ఒక సాధారణ లోన్ అప్లికేషన్ కు మార్చేందుకు మీరు మా కస్టమర్ కేర్ కు (మీ సమ్మతితో) ఒక మెయిల్ చేయవలసి ఉంటుంది. కస్టమర్ సర్వీస్ మీ సమ్మతి తీసుకొని మీ తరపున ఒక రిక్వెస్ట్ పెడతారు. దీని తర్వాత మీ ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీ 60 నెలలు కోసం ఒక టర్మ్ లోన్ గా మార్చబడుతుంది మరియు ఒక రెగ్యులర్ EMI రావడం ప్రారంభిస్తుంది, ఇందులో ప్రిన్సిపల్ కూడా చేర్చబడి ఉంటుంది.

12 నెలల పర్పెచ్యువల్ డ్రా పీరియడ్ అంటే ఏమిటి?

యాన్యువల్ మెయిన్టెనెన్స్ ఛార్జీలు చెల్లించడం ద్వారా మీరు ప్రతి 12 నెలల తర్వాత మీ ఫ్లెక్సీ లోన్ ఫెసిలిటీని రెన్యూ చేసుకోవాలి. యాన్యువల్ మెయిన్టెనెన్స్ ఛార్జీలు శాంక్షన్ చేయబడిన లోన్ అమౌంట్ యొక్క 1.0% గా ఛార్జి చేయబడతాయి.

నేను ఒక పాక్షిక ముందస్తు చెల్లింపు ఎలా చేయగలను?

• మీ లోన్ శాంక్షన్ అయిన మీదట కస్టమర్ పోర్టల్ (ఎక్స్పీరియా) ను ఉపయోగించడం ద్వారా మీరు ఒక ప్రీ-పేమెంట్ చేయవచ్చు.
• మీ రుణ పంపిణీ అనంతరం స్వాగత లేఖలో ఎక్స్పీరియా ID మరియు పాస్వర్డ్ మీతో పంచుకోబడతాయి.
• రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9227564444 కు ఒక SMS పంపడం ద్వారా వర్చువల్ ఖాతా నంబర్ (VAN) ను పొందవచ్చు.

నేను 1st EMI లోపల పార్ట్ ప్రీ-పేమెంట్ చేయవచ్చా?

లేదు, 1st EMI లోపల మీరు పార్ట్ ప్రీ-పేమెంట్ చేయలేరు.

నేను నా ఫ్లెక్సీ టర్మ్ లోన్ ని ఎలా డ్రాడౌన్ చేయగలను?

మా కస్టమర్ పోర్టల్- ఎక్స్పీరియా ద్వారా మీరు మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్ ని డ్రాడౌన్ చేసుకోవచ్చు.

ఏ పరిస్థితుల్లో ఫ్లెక్సీ లోన్ సదుపాయం వినియోగించుకోవడం నుంది బ్లాక్ చేయబడింది?

ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ ఫెసిలిటీని మీరు ఉపయోగించడం బ్లాక్ చేయబడవచ్చు ఈ కారణంగా:
• బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లేదా ఇతర ఆర్థిక సంస్థ దేనితోనైనా మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ బౌన్స్ అవడం
• మీ క్రెడిట్ బ్యూరో స్కోరు క్రిందికి పడిపోవడం
• ఎంప్లాయ్మెంట్ లో మార్పు
• కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో మార్పు (బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు ముందుగానే ఇంటిమేట్ చేస్తే తప్ప).

నేను ఏదైనా భద్రత, అనుషంగికం లేదా హామీలను అందించవలసి ఉంటుందా?

జీతంకల వ్యక్తిగత రుణాన్ని పొందడానికి ఏ భద్రత, అనుషంగికం లేదా హామీదారులు అవసరం లేదు.

మీ పర్సనల్ లోన్ EMI చెక్ చెయ్యండి

లోన్ మొత్తం

దయచేసి లోన్ అమౌంట్ ఎంటర్ చేయండి

అవధి

దయచేసి అవధి ఎంటర్ చేయండి

వడ్డీ రేటు

దయచేసి వడ్డీ రేటు నమోదు చేయండి

మీ EMI మొత్తం

రూ.0

ఇప్పుడే అప్లై చేయండి

డిస్క్లెయిమర్ :

EMI క్యాలిక్యులేటర్ అనేది ఒక సూచనాత్మక సాధనం, ఇంకా వాస్తవ వడ్డీ రేట్ల ఆధారంగా మరియు పంపిణీ తేదీ మరియు మొదటి EMI తేదీ మధ్య వ్యవధి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లెక్కింపు ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు.
మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
OTP ను ధృవీకరించండి

దయచేసి మీ మొబైల్ నంబర్ 80005 04163కు మేము పంపిన OTP నమోదు చేయండి
మొబైల్ నంబర్ మార్చండి

క్రింద OTP ని ఎంటర్ చేయండి

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

కొత్త OTPని అభ్యర్థించండి 0 సెకన్లు

ధన్యవాదాలు

మీ మొబైల్ నంబర్ విజయవంతంగా ధృవీకరించబడింది మరియు అప్‌డేట్ చేయబడింది. మా ప్రతినిధి త్వరలోనే ఈ నంబర్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.