మీ అన్ని ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి ఆస్తి పైన లోన్ వేగంగా తీసుకోవచ్చు. లోన్ పంపిణీ కేవలం 4 రోజుల్లో జరుగుతుంది.
స్వయం ఉపాధి పొందే వారు, ఈ క్రింద పేర్కొన్న అవసరాలకు మీ లోన్ ఉపయోగించుకోవచ్చు:
• వ్యాపార విస్తరణ
• కార్యకలాపాల నిర్వహణ కోసం
• డెట్ పునరుద్ధరణకు
• ముడి పదార్థాల కొనుగోలు
• కొత్త పెట్టుబడులు పెట్టడం మరియు వ్యక్తిగత ఉపయోగం
జీతం పొందేవారు, ఈ క్రింద పేర్కొన్న అవసరాలకు మీ లోన్ ఉపయోగించుకోవచ్చు:
• తనఖా పెట్టిన ఆస్తి కొనుగోలు / ప్రస్తుత లోన్ బ్యాలెన్స్ బదిలీ
• డెట్ ఏకీకరణ
• పెళ్లి ఖర్చుల నిర్వహణ
• కొత్త పెట్టుబడులు
• విద్యా వ్యయం భరించటం
ఆస్తి పైన ఇచ్చే లోన్ అర్హత లెక్కించటానికి ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు:
• వయస్సు
• ఆదాయం
• ఆస్తి విలువ
• ఇప్పటికే ఉన్న అప్పులు, ఒకవేళ ఏమైనా ఉంటే
• స్థిరత్వం / ఉద్యోగం కొనసాగింపు / వ్యాపారం
• గత రుణాల ట్రాక్ రికార్డ్
అవును, మీ లోన్ కాలపరిమితి సమయంలో అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి మీ ఆస్తికి ఇన్సూరెన్స్ చేయించాలి. ప్రతి సంవత్సరం లేదా అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ సాక్ష్యాన్ని బజాజ్ ఫిన్‌సర్వ్ కు మీరు సమర్పించాలి.
మీ ఆస్తి ఎలాంటి వివాదాలు లేకుండా, స్పష్టంగా ఉండాలి మరియు దానిపై ఎలాంటి తనఖా లేదా లోన్ ఉండకూడదు.
అవును, మీరు పొందవచ్చు. అయితే ఆ ఆస్తికి సంబంధించి సహ-యజమానులు లోన్ యొక్క సహ-దరఖాస్తుదారులుగా పరిగణించబడతారు.
ఆస్తి పైన లోన్ పంపిణీ ప్రాసెస్ ఇలా ఉంటుంది:
• డాక్యుమెంట్లను సమర్పించాలి
మీరు లోన్ అప్లికేషన్ లో పేర్కొన్న ప్రకారం డాక్యుమెంట్ల సెట్ ను సమర్పించాలి (మరిన్ని వివరాల కోసం 'అర్హత మరియు డాక్యుమెంట్లు' అనే పేజీని చూడండి.).
• లోన్ మంజూరు చేయడం
మీ ఆదాయం, వయసు, యజమాని లేదా మీరు పనిచేసే సంస్థ, CIBIL రిపోర్ట్ ను పరిగణనలోకి తీసుకొని బజాజ్ ఫైనాన్స్ మీ రుణ సామర్ధ్యాన్ని లెక్కిస్తుంది. ఒకవేళ మీది స్వయం ఉపాథి పొందే వారు అయితే మీరు చేసే పని, బ్యాంక్ స్టేట్ మెంట్లు , మరియు CIBIL రిపోర్ట్ ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంశాలను బట్టి మీకు గరిష్ఠంగా ఎంత మొత్తం లోన్ ఆఫర్ చేయవచ్చో బజాజ్ ఫైనాన్స్ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత లోన్ మంజూరు చేసిన లేఖను మీకు అందిస్తుంది.
• లోన్ అంగీకారం
ఒకవేళ మీరు లోన్ నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తే, లోన్ మంజూరు లేఖ కాపీ పై సంతకం చేసి సమర్పించాలి.
• లోన్ పంపిణీ
ఆస్తికి సంబంధించిన అన్ని కాగితాలను తనిఖీ చేసి, డాక్యుమెంట్లను సమర్పించి, లోన్ ఒప్పందం అమలుచేయబడిన తర్వాత లోన్ పంపిణీ చేయబడుతుంది.
మీరు కింది మార్గాల్లో మీ సంప్రదింపు సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు
• మాకు కాల్ చేయడం ద్వారా 020 3957 4151 (కాల్ ఛార్జీలు వర్తిస్తాయి)
• మా టోల్-ఫ్రీ నంబర్ పై మాకు కాల్ చేయడం ద్వారా: 1800 209 4151
• మమ్మల్ని సందర్శించడానికి మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDని ఉపయోగించడం ద్వారా: https://www.bajajfinserv.in/reach-us మీ అడ్రస్ ప్రూఫ్ మరియు ఫోటో ఐడెంటిటి యొక్క స్కాన్ చేయబడిన కాపీలతో పాటు
మీ కొత్త చిరునామా రుజువు కలిగిన ఒరిజినల్ కాపీలపై స్వయంగా సంతకం చేసి దగ్గరలోని మా బ్రాంచ్ కు వెళ్లి అందించండి.
మీ EMI రెండు భాగాలుగా ఉంటుంది— మీరు అప్పుగా తీసుకున్న అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడం, మరియు దానిపై విధించబడే వడ్డీ రేట్లు. మూడు అంశాలు ఇందులో ఉంటాయి —ఎంత మొత్తం అప్పు తీసుకున్నారు, వడ్డీరేటు, లోన్ కాలపరిమితి. మీ EMI తగ్గించుకోవడానికి మార్గాలు: వడ్డీ రేట్లు గనక తగ్గితే ఆటోమేటిగ్గా అది తగ్గుతుంది, లేదా మీరు చెల్లించాల్సిన దానికంటే అధికంగా చెల్లిస్తే (దీనినే పాక్షిక ప్రీపేమెంట్ అంటారు).
ఈ క్రింది మార్గాల ద్వారా మీరు చెల్లించే EMI సులభంగా పెంచుకోవచ్చు:
• మా కస్టమర్ పోర్టల్ ఎక్స్పీరియాలో లాగిన్ అవ్వండి
• మీరు మమ్మల్ని ఇక్కడ సందర్శించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us
• మీరు దీనిపై మాకు కాల్ చేయవచ్చు 020 3957 4151 (కాల్ ఛార్జీలు వర్తిస్తాయి)
నెలవారీ వాయిదా చెల్లించడం ద్వారా లోన్ మొత్తం తగ్గుదలను చూపే టేబుల్ ను రుణ ఎమోర్టైజేషన్ షెడ్యూల్ అంటారు. ఎమోర్టైజేషన్ షెడ్యూల్ ప్రతి EMI లో వడ్డీ యొక్క రిపేమెంట్ మరియు మీ లోన్ యొక్క బాకీ ఉన్న అసలు మొత్తాన్ని సూచిస్తుంది.
వడ్డీరేట్లు పెరిగితే EMI లో వడ్డీరేటు శాతం పెరుగుతుంది. EMI లో ఎలాంటి మార్పూ ఉండదు కాకపోతే అసలు మొత్తం చెల్లింపు తగ్గుతుంది. వడ్డీరేట్లు క్రమం తప్పకుండా పెరుగుతుంటే ఒక్కోసారి వడ్డీరేటు EMI ని మించిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అసలు మొత్తం(EMI మైనస్ వడ్డీ మొత్తం) తగ్గడానికి బదులు పెరుగుతుంది. ఇదే తీరు కొనసాగితే మిగిలిన మొత్తంలో అసలు వాటా తగ్గడానికి బదులు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి నెగటివ్ ఎమోర్టైజేషన్ గా చెప్పబడుతుంది.
ఎమోర్టైజేషన్ నెగటివ్ గా ఉన్నప్పుడు లోన్ మొత్తం తిరిగి చెల్లించబడదు, వడ్డీ మొత్తం చెల్లించడానికి నిరంతర చెల్లింపులు ఏమాత్రం సరిపోవు. చెల్లించని వడ్డీ అసలుకు కలిసి లోన్ మొత్తం పెరుగుతుంది. వడ్డీరేట్లు తగ్గినప్పుడే పరిస్థితి మారుతుంది. ఈ పరిస్థితిలో కస్టమర్ పాక్షిక ముందస్తు చెల్లింపు చేస్తే EMI పెరుగుతుంది లేదా రెండూ పెరుగుతాయి.
ఒకవేళ చర వడ్డీ రేటుతో లోన్ ఉన్నట్లైతే, వడ్డీ రేటు పరిస్థితిని బట్టి మారుతుంది. వడ్డీ రేటు మారినప్పుడు, లోన్ లో క్రింది రెండు మార్పులలో ఒకటి జరుగుతుంది:
• లోన్ యొక్క అవధి పొడిగించబడుతుంది (రేట్లు పెరిగినప్పుడు) లేదా కుదించబడుతుంది (రేట్లు తగ్గినప్పుడు)
• EMI మొత్తం మారుతుంది (వడ్డీరేట్లు పెరిగితే పెరుగుతుంది మరియు వడ్డీరేట్లు తగ్గితే తగ్గుతుంది)
ఉదాహరణకు, కస్టమర్ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన నాటి నుంచి లోన్ కాలపరిమితి పొడిగించబడటం సాధారణమైన అంశం. వడ్డీరేట్లు మారిన ప్రతిసారి వాటిని మార్చడం కష్టం. ఒకవేళ నిర్మాణంలో ఉన్న ఆస్తులైతే ముందస్తు - EMI మొత్తం దానంతట అదే పెరుగుతుంది.
మీ అనుకూలతను బట్టి పైన పేర్కొన్న ఏ రకమైన ఆప్షన్ అయినా మీరు ఎంచుకోవచ్చు. మిగిలిన లోన్ మొత్తానికి సరిపడేలా డిఫాల్ట్ ఆప్షన్ EMI కు అనుగుణంగా మార్పులు చేస్తుంది.
నిధుల సేకరణ వ్యయం పెరిగిన సందర్భాల్లో మాత్రమే ధరలు పెరుగుతాయి. కొత్తగా పొందిన వాటికి అనుగుణంగా మీ లోన్ ధరలు పెరగకుండా ప్రోయాక్టివ్ రీప్రైజింగ్ ధరల పాలసీలోని క్రియాశీల లెక్కింపు విధానం పనిచేస్తుంది. అందువల్ల మీ లోన్ విషయంలో సమానత్వం ఉంటుంది.
ఒక సుహృద్భావ చిహ్నంగా మరియు మా విలువైన ప్రస్తుతం ఉన్న స్వయం ఉపాధి పొందే కస్టమర్ల కోసం పారదర్శక విధానాన్ని నిర్వహించటానికి, బజాజ్ ఫిన్‌సర్వ్ మా ప్రో-యాక్టివ్ డౌన్‌వర్డ్ రీ-ప్రైజింగ్ స్ట్రాటజీ ద్వారా మా ప్రస్తుత కస్టమర్లు ఎవరు గత 3 నెలల నెలవారీ సగటు సేకరణ రేటు 100 BPS కు మించి లేరని నిర్ధారిస్తుంది. ఒకవేళ కస్టమర్ మా గత 3 నెలల సగటు సేకరణ రేటు నుంచి 100 BPS కంటే ఎక్కువగా ఉంటే, అలాంటి కస్టమర్లందరికీ గత 3 నెలల సగటు సేకరణ రేటు కంటే గరిష్ఠంగా 100 BPS పైకి తీసుకురావడానికి వడ్డీ రేటు యొక్క డౌన్వర్డ్ రీ-ప్రైజింగ్ ను నిర్వహిస్తాము. ఇది ఆరు నెలలకు ఒకసారి పాటిస్తాం. ఇది దేశంలో ఇంతవరకు ఏ NBFC ప్రవేశపెట్టని మరొక మొట్టమొదటి ఫీచర్.
ప్రాపర్టీ డోసియర్ అనేది బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క మార్టిగేజ్ కస్టమర్లకు అందించే పరిశ్రమలో-మొదటిదైన, విలువ ఆధారిత సర్వీస్. ఒక ఆస్తిని సొంతం చేసుకునే విషయంలో అన్ని చట్టపరమైన మరియు సాంకేతిక అంశాలకు సంబంధించి సులభమైన మరియు అద్భుతమైన విధానంలో కస్టమర్ ను గైడ్ చేసే ఒక రిపోర్ట్. ఇందులో సాధారణ ఆస్తి పరిజ్ఞాన చిట్కాలతోపాటు నగర ఆస్తి సూచిక, ముఖ్యమైన ఆస్తి చిట్కాలు మొదలైన అన్ని స్థూల అంశాలు ఉంటాయి.
ఈ క్రింద వాటి పై మీరు ఆస్తి పైన లోన్ పొందవచ్చు:
• స్వయంగా నివాసం ఉండే ఇల్లు
• అద్దెకు ఇచ్చిన నివాస / వాణిజ్య
• ఖాళీగా ఉన్న నివాస / వాణిజ్య
• భాగస్వామిగా ఉన్న ఆస్తి
ఈ క్రింద వాటిపై మీరు ఆస్తి పైన లోన్ పొందలేరు:
• ప్లాట్
• నగరం / మునిసిపాలిటీ పరిధి బయట ఉన్న ఆస్తి
• 5 ఏళ్లు పైబడి కిరాయిదారులు ఉన్న ఆస్తి (కొత్తగా కిరాయి ఒప్పందం పొడిగించనప్పుడు)
• భారీ స్థాయిలో మరమ్మతు చేయాల్సిన అవసరం ఉన్న నిర్మాణ లోపాలు కలిగిన ఆస్తి
• వ్యవసాయ భూమి / సాగు భూమిలో నిర్మాణం చేసిన ఆస్తి
• అక్రమ ఆస్తులు
• ఇతర బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తి
• నిర్ణీత అధికార సంస్థ అప్రూవల్ లేకుండా నివాస ఆస్తిని వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆస్తి
• NRP ట్రాన్సాక్షన్ మినహాయించి నిర్మాణంలో ఉన్న ఆస్తి
• పారిశ్రామిక ఆస్తి
• స్కూల్స్ లేదా హాస్టల్స్
• హోటల్
ఫోర్ క్లోజర్ స్టేట్మెంట్ జారీకి సాధారణంగా TAT 12 పనిదినాలు.
అటువంటి విషయాల్లో మీరు క్రింద పేర్కొన్న సంబంధిత వ్యక్తికి ఫిర్యాదు చేయవచ్చును:
ప్రోడక్ట్ | సంప్రదించాల్సిన వ్యక్తి | మొబైల్ నెంబర్ | ఇమెయిల్ ఐడి |
---|---|---|---|
హోమ్ లోన్ (నార్త్ వెస్ట్) | జస్ప్రీత్ చద్దా | 9168360494 | jaspreet.chadha@bajajfinserv.in |
హోమ్ లోన్ (సౌత్ ఈస్ట్) | ఫ్రాన్సిస్ జోబాయి | 9962111775 | francis.jobai@bajajfinserv.in |
రూరల్ లోన్ | కుల్దీప్ లౌరీ | 7722006833 | kuldeep.lowry@bajajfinserv.in |
ఆస్తి పైన లోన్ | పంకజ్ గుప్తా | 7757001144 | pankaj.gupta@bajajfinserv.in |
లీజు రెంటల్ డిస్కౌంటింగ్ | విపిన్ అరోరా | 9765494858 | vipin.arora@bajajfinserv.in |
'డెవలపర్ ఫైనాన్స్' | దుశ్యంత్ పొద్దార్ | 9920090440 | dushyant.poddar@bajajfinserv.in |
ప్రొఫెషనల్ లోన్లు | నీరవ్ కపాడియా | 9642722000 | nirav.kapadia@bajajfinserv.in |