హోమ్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్

లోన్ యొక్క పూర్తి అవధి పూర్తయ్యేలోపు లోన్‌ను పాక్షికంగా (లేదా పూర్తిగా) తిరిగి చెల్లించడం ద్వారా మీరు మీ రుణాన్ని తగ్గించుకునే లేదా ఏకీకృతం చేసే కొన్ని మార్గాలలో ప్రీపేమెంట్ ఒకటి. ఇది మీ అప్పును తగ్గించడమే కాకుండా వడ్డీ రూపంలో అత్యధిక డబ్బును చెల్లించడం నుండి కూడా మిమ్మల్ని రక్షించవచ్చు.

ప్రీపేమెంట్‌తో హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ అనేది ప్రీపేమెంట్ ఉపయోగించి మీరు ఆదా చేసుకోగల మొత్తాన్ని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. ఉపయోగించడానికి సులభమైన క్యాలిక్యులేటర్ కోసం మీరు ఫీల్డ్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది:

  • బాకీ ఉన్న మొత్తం
  • అవధి
  • వడ్డీ రేటు
  • ప్రీపేమెంట్ మొత్తం

మీరు ఫీల్డ్స్‌లోకి ఎంటర్ చేసిన విలువల ఆధారంగా, ప్రీపేమెంట్ తర్వాత క్యాలిక్యులేటర్ కుడివైపున కొత్త ఇఎంఐ ను మీరు చూడవచ్చు.

హోమ్ లోన్ పాక్షిక-ప్రీపేమెంట్ తరచుగా అడగబడే ప్రశ్నలు

హోమ్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ అంటే ఏమిటి?

ప్రీపేమెంట్ అనేది రుణం యొక్క ముందస్తు చెల్లింపును సూచిస్తుంది. ఇది బకాయి తేదీకి ముందు చెల్లించే ఒక వాయిదా చెల్లింపు మరియు సాధారణంగా ఇది ఒక ఏకమొత్తంగా ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద మీ హోమ్ లోన్ ప్రీపేమెంట్ ప్రారంభించడానికి అవసరం అయినా కనీస మొత్తం మీ మూడు ఇఎంఐ లకు సమానం. మీరు చెల్లించవలసిన బకాయి మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే చెల్లింస్తున్నారు కనుక, ఇది మీ అవధిని తగ్గిస్తుంది లేదా మీ ఇఎంఐ మొత్తాన్ని తగ్గిస్తుంది.

హోమ్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

హోమ్ లోన్ పార్ట్-ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ అనేది మీ లోన్ యొక్క ముందస్తు రీపేమెంట్ యొక్క సానుకూల ప్రభావాన్ని చూపించే ఒక సాధనం.

హోమ్ లోన్ పాక్షిక-ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

మీరు చేయవలసిందల్లా కేవలం మీ రుణ వివరాలను నమోదు చేయడం మరియు మీరు ప్రీ-పే చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయడం. ఈ మొత్తం లెక్కించబడిన ఇఎంఐ కు కనీసం మూడు రెట్లు ఉండాలని గుర్తుంచుకోండి.

విలువలను సర్దుబాటు చేయడానికి మీరు స్లైడర్లని మీ ఎడమ లేదా కుడివైపు కదిలించవచ్చు లేదా క్రింది వాటి కోసం నేరుగా మీరు విలువలను టైప్ చేయవచ్చు:

  • రుణ మొత్తాలు
  • అవధి (నెలల్లో)
  • వడ్డీ రేటు
  • మీరు చెల్లించాలనుకున్న పాక్షిక ముందస్తు చెల్లింపు మొత్తం

వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, “డన్” పై క్లిక్ చేయండి. మీకు రెండు ఎంపికలు కనబడతాయి:

  • సేవ్ చేయబడిన EMI : ఈ పట్టిక మీ EMI లో తగ్గింపు మరియు పార్ట్ ప్రీ-పేమెంట్‌ తర్వాత EMI లో నెలవారీ పొదుపులను చూపుతుంది
  • సేవ్ చేయబడిన అవధి : ఈ టేబుల్ పార్ట్ ప్రీ-పేమెంట్ తర్వాత మీ అవధిలో తగ్గింపును చూపుతుంది.
హోమ్ లోన్‌లో ప్రీపేమెంట్ ప్రయోజనాలు ఏమిటి?

హోమ్ లోన్ ప్రీపేమెంట్ అనేది తగ్గించబడిన అవుట్‌స్టాండింగ్, తగ్గించబడిన అవధి మరియు తక్కువ ఇఎంఐలు వంటి అనేక ప్రయోజనాలతో వస్తుంది. దీర్ఘకాలంలో, ప్రీపేమెంట్లు మీకు డెట్-ఫ్రీగా మారడానికి సహాయపడతాయి, ఇది చివరికి మీ సిబిల్ స్కోర్ ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

ప్రీపేమెంట్ EMI ను తగ్గిస్తుందా?

మీ హోమ్ లోన్‌లో కొంత భాగాన్ని మీరు ప్రీపే చేసినప్పుడు, మీకు రెండు ఎంపికలు ఉంటాయి. మీరు మీ రుణదాత అవధిని తగ్గించుకోవచ్చు, ఆ సందర్భంలో మీరు అదే మొత్తాన్ని ఇఎంఐ గా చెల్లించవచ్చు లేదా మీ ఇఎంఐలు తగ్గుతూ ఉంటే అదే అవధిని కొనసాగించవచ్చు.

హోమ్ లోన్లపై ప్రీపేమెంట్ జరిమానా ఉందా?

ఇది హోమ్ లోన్ వడ్డీ రేటు రకంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు హోమ్ లోన్ ఉన్న వ్యక్తులు ప్రీపేమెంట్ లేదా ఫోర్‍క్లోజర్ పై ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించరు. మరొకవైపు, ఫిక్స్‌డ్ వడ్డీ రేటు హోమ్ లోన్లు ప్రీపేమెంట్ లేదా ఫోర్‍క్లోజర్ పై నామమాత్రపు ఫీజును కలిగి ఉంటాయి.

మరింత చదవండి తక్కువ చదవండి