లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ FAQలు: మీ LRD సందేహాలకు సమాధానాలు పొందండి | బజాజ్ ఫిన్సర్వ్

లీజు రెంటల్ డిస్కౌంటింగ్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

బజాజ్ ఫిన్సర్వ్ నుంచి నేను పొందగలిగే కనిష్ఠ, గరిష్ఠ లోన్ మొత్తం ఎంత?

మేము కార్పొరేట్ లీజు రెంటల్ డిస్కౌంటింగ్ లో రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు లోన్ ఆఫర్ చేస్తున్నాం.

లోన్ అర్హత ఎలా నిర్ణయిస్తారు?

ఈ క్రింద పేర్కొన్న అంశాలతో అర్హత నిర్ణయిస్తాం:
ఆస్తి విలువ (సరసమైన మార్కెట్ విలువ) – వాణిజ్య ఆస్తి విలువలో 55% వరకు
తనఖా పెట్టే ఆస్తిపై ఇప్పుడు వస్తున్న అద్దె - కనీసం 90% వరకు నెట్ అద్దె రసీదులు

ఒకవేళ ఆస్తికి ఒక వ్యక్తి మరియు అతని/ఆమె బంధువులు ఉమ్మడి యజమానులు అయితే, అతడు/లేదా ఆమె ఆ ఆస్తి పైన లోన్ తీసుకోవచ్చా?

పరిగణించబడే ఆస్తి యొక్క సహ-యజమానులు అందరూ లోన్ కోసం సహ-దరఖాస్తుదారులుగా రావలసివుంటుంది.

కార్పొరేట్ LRD లోన్ కోసం నాకు అనుమతించబడిన కాలపరిమితి ఎంత?

మిగిలిన లీజ్ కాలం అనుగుణంగా లోన్ గరిష్టంగా 11 సంవత్సరాల అవధికి అందుకోవచ్చు.

నేను నా లోన్ తిరిగి ఎలా చెల్లించవచ్చు?

మీ EMI మీ లీజుదారుడు అద్దె మొత్తం జమ చేసిన ESCROW అకౌంటు నుంచి డెబిట్ చేయబడుతుంది.

ఇంటర్నల్ FRR ఏ ప్రాతిపదికన మారుతుంది?

ఇంటర్నల్ FRR అంటే బెంచ్ మార్క్ రిఫరెన్స్ రేట్. ఇది మార్కెట్ పరిస్థితులు మరియు ఫండ్స్ కోసం కంపెనీకి అయ్యే ఖర్చులను అనుసరించి నిర్ణయించబడుతుంది, ఇది అనేక బాహ్య కారణాలు మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మారుతుంది.

వడ్డీ రేట్లు ఎంత తరచుగా మారతాయి?

మా రీ-ప్రైసింగ్ పాలసీ ప్రకారం ప్రతీ రెండు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తారు మరియు వడ్డీరేట్లు మార్చాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.

నెల రోజుల క్రితం నేను లోన్ తీసుకున్నాను. వడ్డీ రేట్లలో మార్పు నా పై ఎలా పనిచేస్తుంది?

అంతర్గత ప్రైసింగ్ పాలసీ, రీ-ప్రైసింగ్ పాలసీ ప్రకారం కనీసం 3 నెలల పాతవి అయిన సందర్భాలలో మాత్రమే వడ్డీ రేట్లు మారతాయి. మీ విషయానికి వస్తే, FRR లో మార్పులు మీ లోన్ యొక్క వడ్డీ రేటు పై వెంటనే ప్రభావం చూపవు. అయితే, ఒకసారి మీ లోన్ 3 నెలలు దాటితే, అప్పుడు గత 3 నెలల్లో FRR లో మార్పులు మీ లోన్ వడ్డీ రేటుపై ప్రభావం చూపుతాయి.

ఫోర్‍క్లోజర్ స్టేట్‍‍మెంట్‍‍కు TAT(టర్న్ అరౌండ్ టైమ్) ఏమిటి?

ఫోర్ క్లోజర్ స్టేట్‍‍మెంట్ జారీకి సాధారణంగా TAT 12 పనిదినాలు.