ఫిక్స్‌‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) క్యాలిక్యులేటర్

ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం మీ వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తాన్ని లెక్కించడానికి చదవండి.

FD calculator

ఫిక్స్‌డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్

మీ పెట్టుబడిని మెరుగ్గా ప్లాన్ చేసుకోండి

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ పెట్టుబడిని ప్లాన్ చేసుకోవడం అవసరం. మీ కస్టమర్ రకాన్ని ఎంచుకోండి (సీనియర్ సిటిజన్స్, నాన్-సీనియర్ సిటిజన్స్), పెట్టుబడి మొత్తం, అవధిలను ఎంటర్ చేయండి మరియు చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి. మీ తుది వడ్డీ రేటు, వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం ఇన్‌పుట్‌ల ఆధారంగా ప్రదర్శించబడుతుంది.

ఒక ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ వివిధ అవధులు, చెల్లింపు ఫ్రీక్వెన్సీ కోసం అందించబడే ఎఫ్‌డిల మెచ్యూరిటీ మొత్తం మరియు వడ్డీ రేట్లను సరిపోల్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రత్యేక అవధి కోసం అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఆధారంగా రెండు రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి:

a. క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్: మీరు క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ వడ్డీ కాంపౌండ్ చేయబడుతుంది మరియు మెచ్యూరిటీ సమయంలో చెల్లించబడుతుంది. ఆన్‌లైన్ ఎఫ్‌డి వడ్డీ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు మీ రాబడులను విశ్లేషించవచ్చు.
b. నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్: మీరు నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షికంగా లేదా వార్షికంగా పీరియాడిక్ వడ్డీ చెల్లింపులను సంపాదించవచ్చు. మీ పెట్టుబడి ప్రకారం చెల్లింపు మొత్తాలను నిర్ణయించడానికి ఎఫ్‌డి వడ్డీ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ వడ్డీని లెక్కించండి.

FD calculator

ఎన్ఆర్ఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్

మెరుగ్గా పెట్టుబడి పెట్టడానికి మీ రాబడిని లెక్కించండి

ఒక ఎన్ఆర్ఐగా మీరు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై స్థిర వడ్డీని పొందుతారు, ఇది కాలానుగుణంగా కాంపౌండ్ చేయబడుతుంది. ఎన్ఆర్ఐ క్యాలిక్యులేటర్ అనేది మీ మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ణయించడానికి మీకు సహాయపడే ఒక సాధారణ సాధనం, తద్వారా మీరు మీ పెట్టుబడిని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కావలసిన డిపాజిట్ మొత్తాన్ని నమోదు చేయండి, తగిన అవధిని ఎంచుకోండి, మరియు మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు కూడా మెచ్యూరిటీ సమయంలో మీ డిపాజిట్ పై రాబడులను ఆటోమేటిక్‌గా చూస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆన్‌లైన్‌లో ఎఫ్‍‌డి క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఎఫ్‌డి వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ ఉపయోగించడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి అవసరమైన స్టెప్పులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. మీ కస్టమర్ రకాన్ని ఎంచుకోండి, అంటే 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కస్టమర్లు (ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టడం) లేదా సీనియర్ సిటిజన్
2. మీకు కావలసిన ఫిక్స్‌‌డ్ డిపాజిట్ రకాన్ని ఎంచుకోండి, అంటే క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్
3. మీ ఫిక్సెడ్ డిపాజిట్ మొత్తాన్ని ఎంచుకోండి
4. ఫిక్సెడ్ డిపాజిట్ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి
5. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా మీ వడ్డీ చెల్లింపును ప్రదర్శిస్తుంది మరియు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మెచ్యూరిటీ సమయంలో సంపాదించిన మొత్తం పెట్టుబడి పెట్టడానికి ముందే మీ రాబడులను నిర్ణయించడానికి ఒక గొప్ప మార్గం కావచ్చు. ఇది మీ ఫైనాన్సులను సమర్థవంతంగా స్ట్రీమ్‌లైన్ చేయడానికి మరియు మీ పెట్టుబడిపై రాబడులను పెంచడానికి మీకు సహాయపడుతుంది.

ఫిక్స్‌‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా లెక్కించాలి?

ఎఫ్‌డి మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ణయించడానికి మీరు ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ లేదా టర్మ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్ ఎఫ్‌డి వడ్డీ కాలిక్యులేటర్‌కు వెళ్లి కస్టమర్ కేటగిరీని ఎంచుకోండి - సీనియర్ సిటిజన్ లేదా 60 కంటే తక్కువ ఉన్న కస్టమర్. తరువాత, మీరు ఎఫ్‌డి రకాన్ని ఎంచుకోవాలి - క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్. చివరగా, మీకు ఇష్టమైన డిపాజిట్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి. వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం అప్పుడు స్క్రీన్ పై ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడుతుంది.
మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ణయించడానికి మీరు ఎఫ్‌డి క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఎంచుకున్న ఎఫ్‌డి రకం ప్రకారం వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి, అంటే క్యుములేటివ్/నాన్-క్యుములేటివ్ మరియు అవధి. ఈ ఎఫ్‌డి వద్దే క్యాలిక్యులేటర్ మెచ్యూరిటీ మొత్తాన్ని ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలో తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ ఎలా కాలిక్యులేట్ చేయబడుతుంది?

మీ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ పెట్టుబడిపై రాబడులు మీ వడ్డీ రేట్లు మరియు వడ్డీ చెల్లింపుల ఫ్రీక్వెన్సీ ద్వారా నిర్ణయించబడతాయి. ఈ వడ్డీ రేట్‌లు క్రమానుగతంగా మిళితం చేయబడతాయి మరియు FD వడ్డీ రేట్‌ల కాలిక్యులేటర్‌కు ఆధారమైన సూత్రం దిగువన పేర్కొనబడింది.
ఎఫ్‌డి లెక్కింపు ఫార్ములా ఇక్కడ ఇవ్వబడింది:
A=P(1+r/n)^n*t
ఎక్కడ;
A అనేది మెచ్యూరిటి మొత్తం
p అనేది అసలు మొత్తం
r అనేది వడ్డీ రేటు
t అనేది సంవత్సరాల సంఖ్య
n అనేది కాంపౌండెడ్ వడ్డీ ఫ్రీక్వెన్సీ.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వడ్డీ క్యాలిక్యులేటర్ వడ్డీతో పాటు డిపాజిట్ మెచ్యూరిటీ సమయంలో మీరు అందుకునే మొత్తాన్ని నిర్ణయించడానికి మీకు సహాయపడుతుంది. డిపాజిట్ మొత్తం, అవధి మరియు వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా అందుకోదగిన వడ్డీని లెక్కించడానికి మరియు పోల్చడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది.

ఫిక్స్‌‌డ్ డిపాజిట్ పై నెలవారీ వడ్డీని పొందవచ్చా?

అవును, మీరు చెల్లింపు మోడ్ డ్రాప్‌డౌన్‌లో 'నెలవారీ' ఎంచుకుంటే మీరు నెలవారీ వడ్డీ చెల్లింపులను పొందవచ్చు. మీరు మీ డబ్బును ఎఫ్‌డి లలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు మీ అసలు మొత్తంపై వడ్డీ పొందుతారు. ఆన్‌లైన్‌లో ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించి, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మీరు పొందగలిగే లాభాలను తెలుసుకోవడానికి మీరు ఇష్టపడే అవధిని మరియు చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు మీ పెట్టుబడి నుండి నెలవారీ ఆదాయం కోసం చూస్తున్నట్లయితే, మీరు ప్రతి నెలా మీ వడ్డీ చెల్లింపులను పొందడానికి ఎంచుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ కాలిక్యులేటర్ సహాయంతో, మీ నెలవారీ వడ్డీని సమర్థవంతంగా లెక్కించవచ్చు.
అయితే మీ వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీ వడ్డీ రేటును కూడా ప్రభావితం చేస్తుంది. మీరు ఎంత త్వరగా మీ వడ్డీని విత్‌డ్రా చేస్తే, అంత తక్కువ వడ్డీని పొందుతారు. పెట్టుబడి చేయడానికి ముందు మీ రిటర్న్స్ తెలుసుకోవడానికి మీరు బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి రిటర్న్ క్యాలిక్యులేటర్‌ని తనిఖీ చేయవచ్చు.

ఎఫ్‌డి లో 'మెచ్యూరిటీ మొత్తం' అంటే ఏమిటి?

మీ ఫిక్సెడ్ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ మొత్తం అనేది ఎంచుకున్న అవధిలో ముందుగా-నిర్ణయించబడిన రిటర్న్స్ తో పాటు పెట్టుబడి పెట్టబడిన మీ ప్రిన్సిపల్ మొత్తం. మీరు పెట్టుబడి పెట్టడానికి ముందే మీరు ఎఫ్‌డి మెచ్యూరిటీ క్యాలిక్యులేటర్‌తో ఎఫ్‌డి మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా లెక్కించవచ్చు. కావలసిన పెట్టుబడి మొత్తం, కోరుకున్న అవధిని నమోదు చేయండి మరియు మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ మొత్తం వేగంగా లెక్కించబడుతుంది.

మరింత చూపండి తక్కువ చూపించండి

డిస్‌క్లెయిమర్:

ఫిక్స్‌డ్ డిపాజిట్ అవధిలో లీప్ ఇయర్ ఉంటే వాస్తవ రాబడులు కొద్దిగా మారవచ్చు.