కాల్, SMS, ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని చేరుకోండి లేదా మా బ్రాంచ్ ఆఫీసులలో ఒకదానిని సందర్శించండి.

మోసం సందేశం

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు మీద నకిలీ లోన్ ఆఫర్లకు వ్యతిరేకంగా హెచ్చరిక నోటీస్

మోసపూరిత ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లేదా బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ మరియు దాని గ్రూప్ కంపెనీలను పోలి ఉండే లేదా ఏకరూపంగా కనిపించే నకిలీ ఇమెయిల్ ఐడిలతో పాటుగా నకిలీ డొమైన్ పేర్లు/వెబ్సైట్ లింకులు సృష్టించారని మా దృష్టికి వచ్చింది. వారిని తప్పుడు వాగ్దానాలతో పురిగొల్పడం ద్వారా మోసగాళ్ళు కాబోయే కస్టమర్ల నుండి మోసపూరితంగా డబ్బు వసూలు చేశారని కూడా మేము గమనించాము.

సాధారణ ప్రజలు మరియు కాబోయే కస్టమర్లకు మేము ఇందుమూలంగా ఇచ్చే సలహా ఏమిటంటే:

(i): తమను తాము బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు/లేదా దాని గ్రూప్ కంపెనీలకు చెందినవారిగా చెప్పుకుంటూ మోసగాళ్ళు సృష్టించే నకిలీ ఈమెయిల్ ఐడిలు, డొమైన్స్, వెబ్సైట్లు, టెలిఫోన్లు మరియు వార్తాపత్రికలు/పత్రికల్లో ప్రకటనలు మొదలైనవాటి నుండి మరియు తక్కువ వడ్డీతో లోన్లు ఆఫర్ చేస్తూ, కస్టమర్ అకౌంట్ వివరాలు సేకరించే, లోన్లు ప్రాసెస్ చేయడానికి అడ్వాన్స్ నగదు,మొదలైనవి అడిగేవారితో జాగ్రత్తగా ఉండండి.
(ii): బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు భావి లోన్ అప్లికేషన్లను విశ్లేషించడం కోసం క్షుణ్ణమైన ప్రాసెస్ కలిగి ఉంది మరియు దాని యొక్క ప్రక్రియల్లో అన్ని నియంత్రణ మార్గదర్శకాలను అనుసరిస్తుంది. బజాజ్ ఫైనాన్స్/బజాజ్ ఫిన్ సర్వ్ లేదా దాని గ్రూప్ కంపెనీలు లేదా దాని ఏ ఒక్క ప్రతినిధి కూడా లోన్ శాంక్షన్ చేయడానికి ముందు, దాని యొక్క కాబోయే/కస్టమర్ల నుండి ఏ విధమైన అడ్వాన్స్ నగదు చెల్లింపు అడగరు.
(iii): బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్/బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ యొక్క ఇమెయిల్ ID “bajajfinserv.in” కలిగి ఉంటుంది మరియు Gmail/Yahoo/Rediff మొదలైనటువంటి ఏ ఇతర డొమైన్ పేరు లేదా ఏ ఇతర రూపాన్ని కలిగి ఉండదు.
(iv): ఫోన్ ద్వారా కాల్ చేసి తమను తాము బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు/లేదా దాని యొక్క ఉద్యోగి/ప్రతినిధిగా చెప్పుకుని కల్పిత ఆఫర్లుతో మోసం చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండడం;

అందుచేత మేము మా కాబోయే కస్టమర్లకు మరియు ప్రజలకు ఇచ్చే సలహా ఏమిటంటే అటువంటి క్లెయిముల యొక్క ప్రామాణికతను కంపెనీ యొక్క వెబ్సైట్ https://www.bajajfinserv.in ద్వారా ధృవీకరించుకోవడం లేదా అటువంటి మోసగాళ్ళతో వ్యవహరించే మరియు వారికి ప్రతిస్పందించే/ఏవైనా మోసపూరిత ప్రకటనలు, టెలిఫోన్ కాల్స్, ఇమెయిల్స్ మరియు వెబ్సైట్లకు యాక్సెస్ పొందే ముందు చాలా జాగ్రత్తగా, అలసత్వం లేకుండా ఉంటూ నేరగాళ్ల యొక్క మోసం మరియు క్రిమినల్ చర్యల నుండి తమను తాము రక్షించుకోవాలని.
 
ఏదైనా అనుమానిత సంఘటన మరియు/లేదా ఈ మోసపూరిత చర్యలు మరియు అలవాట్లు కారణంగా మోసపూరితంగా డబ్బు వసూలు చేసిన సంఘటన జరిగినప్పుడు వెంటనే వాటి గురించి సైబర్ క్రైమ్ సెల్ తో పాటుగా వారి న్యాయపరిధిలో ఉన్న అధికారులు అనగా పోలీస్ మరియు టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ అధికారికి తెలియజేయవలసిందిగా సలహా ఇవ్వడం జరుగుతుంది. మా వైపు నుండి చర్యల కోసం ఈ సంఘటనల గురించి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు కూడా సూచించవచ్చు.
 
దయచేసి గమనించండి అటువంటి మోసగాళ్ళతో వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరైనా అతని /ఆమె యొక్క సొంత రిస్క్ మరియు బాధ్యతతో వ్యవహరిస్తారు. ఈ సంబంధంగా ఏర్పడిన నష్టానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు/లేదా దాని యొక్క ఏదైనా గ్రూప్ కంపెనీ బాధ్యత వహించవు.
 
సాధారణ ప్రజల యొక్క ప్రయోజనం కోసం జారీ చేయబడింది.
 
ఇమెయిల్: wecare@bajajfinserv.in
 
తేదీ: 3rd జనవరి 2017

స్థాపకుని యొక్క మెసేజ్

ప్రియమైన షేర్ హోల్డర్,

బజాజ్ ఫిన్ సర్వ్ ఒక హోల్డింగ్ కంపెనీ దీని క్రింద మూడు కీలక ఫైనాన్షియల్ రంగ వ్యాపారాలు ఉన్నాయి:
(i) లిస్టెడ్ కంపెనీ అయిన, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL) ద్వారా రుణం అందించడం;
(ii) బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లేదా BALIC క్రింద లైఫ్ ఇన్సూరెన్స్; మరియు
(iii) బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, లేదా BAGIC క్రింద, జనరల్ ఇన్సూరెన్స్.

అదనంగా, 65.2 MW స్థాపిత సామర్థ్యంతో మహారాష్ట్రలో విండ్-ఫారం ఆస్తులు ఉన్నాయి.

FY2015లో BFL, BALIC మరియు BAGIC క్రింద మీ కంపెనీ యొక్క కీలకమైన విజయాలను మీతో క్లుప్తంగా పంచుకోవడానికి నేను ఈ లేఖను ఉపయోగిస్తాను.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL)

FY2015 యొక్క గడిచిన రెండు త్రైమాసికాలలో ఆర్థిక ఎదుగుదల నెమ్మదించినప్పటికీ, గణనీయంగా తక్కువ ముడి చమురు ధరలు, తక్కువ వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు చట్టపరమైన ద్రవ్య నిష్పత్తిలో (SLR) మూడు కోతలుతో మొత్తంగా 50 బేసిస్ పాయింట్లు అయిన రెండు పాలసీ కట్టింగులు, ఈ సంవత్సరం బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసులకు కఠినంగా ఉంది. 9.5%లో, క్రెడిట్ ఎదుగుదల గడిచిన 18 సంవత్సరాలలో కనిష్ట స్థాయిలో ఉంది. తక్కువ క్రెడిట్ పెరుగుదల మరియు అధిక ప్రదర్శన లేని ఆస్తులు (NPAలు) ఫలితంగా బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని మరియు తేలికపాటి ద్రవ్యత మరియు రేట్ కోతల యొక్క ప్రయోజనాలను పాస్ చేయడానికి విముఖత చూపించడం జరిగాయి. మొత్తంగా, పరిస్థితులు మొత్తం ఆర్థిక సేవలకు సవాలుగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులలో, BFL అద్భుతమైన ఫలితాలు అందించింది-అది గడిచిన కొద్ది సంవత్సరాలలో చేసినట్లుగా. నేను వీటిలో కొన్నింటిని గురించి చెబుతాను.
BFL యొక్క మొత్తం ఆదాయం 33% మేరకు పెరిగి రూ.5,418 కోట్లుకు చేరుకుంది.
ఫైనాన్సింగ్ క్రింద అందుకోవలసినవి 36% మేరకు పెరిగి రూ.31,199 కోట్లకు చేరుకుంది.
మేనేజ్‍మెంట్ క్రింద ఉన్న ఆస్తులు 35% మేరకు పెరిగి రూ.32,410 కోట్లకు చేరుకున్నాయి.
పన్ను ముందు లాభం 24% మేరకు పెరిగి రూ.1,357 కోట్లకు చేరుకుంది.
పన్ను తరువాత లాభం 25% మేరకు పెరిగి రూ.898 కోట్లకు చేరుకుంది.
RBIచే సూచించబడిన దానికంటే చాలా కఠినంగా ఉన్న అంతర్గత ప్రొవిజనింగ్ నిబంధనలు కారణంగా, లోన్ నష్టాలు మరియు ప్రొవిజన్లు రూ. 385 కోట్లుగా ఉన్నాయి,.
లోన్లను జాగ్రత్తగా పర్యవేక్షించినందుకు కృతజ్ఞతలు, BFL యొక్క నెట్ NPA మొత్తం అసెట్లలో 0.45%, ఇది పరిశ్రమలో అత్యంత తక్కువ.

31 మార్చ్ 2015 నాటికి క్యాపిటల్ సంపూర్ణత 17.97% వద్ద ఉంది, ఇది RBI నిబంధనల కంటే చాలా ఎక్కువ.

బజాజ్ ఫిన్ సర్వ్ యొక్క షేర్ హోల్డరుగా, BFLకు చెందిన ముఖ్యమైన పరిణామం గురించి మీరు తెలుసుకోవాలి. 21 ఏప్రిల్ 2015న, BFL యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు అదే ఎదుగుదల పథాన్ని కొనసాగించడానికి కంపెనీకి ఎందుకు ఎక్కువ క్యాపిటల్ అవసరమవుతుంది అనే నిర్బంధ సందర్భం ఎదురయింది. ఇవి జారీ చేయడం ద్వారా ఫండ్స్ పెంచాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధికారికంగా పరిగణించారు:

క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ (QIP) మార్గం ద్వారా రూ. 1,400 కోట్లు వరకు సెక్యూరిటీలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదార్లకు, మరియు
925,000 వారెంట్స్ వరకు ప్రాధాన్యత జారీ, బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ కు దాదాపు రూ. 400 కోట్లు వరకు వచ్చే సమాన సంఖ్య ఈక్విటీ షేర్ల రూపంలోకి మార్చుకోదగినవి.,
BFL యొక్క ప్రమోటర్. BFL యొక్క బోర్డు రెండు ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంకా, అంతకుమునుపు నిర్వహించబడిన అసాధారణ జనరల్ బాడీ సమావేశంలో BFL యొక్క షేర్ హోల్డర్లచే అది ఆమోదించబడింది, 20 మే 2015 అందుచేత, ఉత్తమమైన క్యాపిటల్ సంపూర్ణత నిర్వహిస్తూ అధిక వృద్ధి కోసం ఫైనాన్స్ చేయడానికి అదనపు క్యాపిటల్ పొందే మార్గంలో వెళుతుంది BFL.

జనరల్ ఇన్సూరెన్స్: BAGIC

BAGIC మోటార్, మెరైన్, ఆరోగ్య మరియు వివిధ రకాల కార్పొరేట్ ఇన్సూరెన్స్ తో సహా పలు రకాల ఇన్స్యూరెన్సులు అందించే ఒక మిశ్రమ ఇన్సూరెన్స్. అత్యంత పోటీతత్వ మార్కెట్లో, BAGIC ఒక బలమైన రిటైల్ ఫ్రాంచైజీని నిర్మించుకుంది మరియు ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలలో ఆగ్ర స్థానాన్ని నిలుపుకుంది. సాధారణ ఇన్సూరెన్స్ లో ఇది అత్యంత గౌరవనీయమైన బ్రాండ్లలో ఒకటి మరియు బలమైన నగదు సర్దుబాటు, మల్టీ-ఛానల్ పంపిణీ మరియు వివేకవంతమైన ఫైనాన్షియల్ మేనేజ్‍మెంట్ తో నాణ్యమైన పోర్ట్ ఫోలియోతో నిర్మాణం పైన దృష్టి పెడుతుంది. FY2015లో రెండు పెద్ద విపత్తులు – కాశ్మీర్ లోయలో ఇంతకుమునుపు ఎన్నడూ లేని వరదలు వచ్చి BAGIC రూ. 930 కోట్లు విలువైన27,000 పైగా క్లెయిములు సెటిల్ చేయవలసి వచ్చినప్పటికీ, మరియు తూర్పు భారతదేశంలో ఉష్ణమండల తుఫాను ‘హూద్ హూద్’ కోసం కంపెనీ రూ. 32 కోట్లు విలువైన 1,000 క్లెయిములు సెటిల్ చేయవలసి వచ్చినప్పటికీ – BAGIC మంచి పనితీరును ప్రదర్శించడం కొనసాగించింది. ఇక్కడ కొన్ని వాస్తవాలు ఇవ్వబడ్డాయి:

FY2015 కోసం గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) దాదాపుగా 16% మేరకు పెరిగి రూ. 5,301 కోట్లకు చేరుకుంది.
ప్రైవేట్ సంస్థలలో BAGICకు నంబర్ 2 ర్యాంక్ ఇవ్వబడింది. ప్రత్యేక ఇన్సూరెన్స్ సంస్థల మినహాయించి, మార్కెట్ వాటా 6.7%, గడిచిన సంవత్సరం కంటే 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ.
సంపాదించిన నెట్ ప్రీమియం 10% మేరకు పెరిగి రూ. 3,832 చేరుకున్న సంవత్సరం FY2015 ముందరి సంవత్సరంలో 6.7 మిలియన్ పాలసీలతో పోలిస్తే FY2015లో BAGIC 7.3 మిలియన్ పాలసీలు జారీ చేసింది.
FY2015లో పన్నుకు ముందు లాభం రూ. 777 కోట్లుగా ఉంది, ముందరి సంవత్సరం కంటే 32% ఎక్కువ.
పన్ను తరువాతి లాభం రూ. 562 కోట్లుగా ఉంది, FY2014తో పోలిస్తే 37% శాతం పెరిగింది.
31 మార్చ్2015 నాటికి సాల్వెన్సీ నిష్పత్తి 182% వద్ద ఉంది, ఇన్సూరెన్స్ రెగులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDA)చే నిర్దేశించబడిన కనీసం 150% కంటే చాలా ఎక్కువ.
సగటు ఈక్విటీ పైన రిటర్న్ 28.9% - FY2014లో నమోదు చేయబడిన 28% కంటే స్వల్పంగా ఎక్కువ.

జనరల్ ఇన్సూరెన్స్: BAGIC

BALIC మొదటి ఐదు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటి మరియు అధిక సాల్వెన్సీ మార్జినుతో రూ. 36,000 కోట్ల పాలసీ హోల్డర్ల ఫండ్స్ మేనేజ్ చేస్తూ ఉంది. గడిచిన కొద్ది సంవత్సరాలలో, ఫైనాన్షియల్ పొదుపు రేట్లు మరియు రీటైల్ చిన్న పొదుపరులు రిస్క్ తీసుకునే స్థాయి తగ్గుదల కారణంగా పరిశ్రమ ఎదుగుదల కష్టమవుతూ ఉంది. ఈ వాస్తవానికి BALIC ఏమీ మినహాయింపు కాదు. వ్యాపార నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు దాని పంపిణీని పునర్వ్యవస్థీకరించేందుకు అది పలు చర్యలు తీసుకుంది. ఆ కార్యక్రమాలు ఫలితాలను రాబోయే రెండు సంవత్సరాలలో కనిపించాలి. కొత్త ఉత్పత్తి నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించబడిన, క్రొత్త ఉత్పత్తుల అమ్మకాల యొక్క మొదటి పూర్తి సంవత్సరం FY2015. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమలు అన్నింటికీ ఒక సవాలుగా నిలిచింది, మరియు BALIC అందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే, అది క్రొత్త బిజినెస్ ప్రీమియం లో 4% వృద్ధి మరియు స్థూల రిటన్ ప్రీమియంలో 3% వృద్ధితో సంవత్సరాన్ని ముగించింది. FY2015లో BALIC యొక్క పనితీరుకు సంబంధించి ముఖ్యమైన అంశాలు అనగా:

BALIC యొక్క క్రొత్త బిజినెస్ ప్రీమియం FY2015 లో 4% మేరకు పెరిగి, రూ. 2,702 కోట్లకు చేరుకుంది. క్రొత్త బిజినెస్ ప్రీమియం పరంగా, ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలలో BALIC 4వ స్థానంలో నిలిచింది. ప్రైవేట్ సెక్టారులో, క్రొత్త బిజినెస్ లో BALIC యొక్క మార్కెట్ షేర్ FY2015 లో 7.8%. BALIC యొక్క రెన్యూవల్ ప్రీమియం FY2015లో 2% మేరకు పెరిగి రూ. 3,315 కోట్లకు చేరుకుంది. FY2015 లో గ్రాస్ రిటర్న్ ప్రీమియం 3% పెరిగి రూ. 6,017 కోట్లకు చేరుకుంది.

31 మార్చ్ 2015 నాటికి మేనేజ్‍మెంట్ క్రింద ఆస్తులు రూ. 43,554 కోట్లుగా ఉన్నాయి, ఇది అంతకు ముందరి సంవత్సరాంతం కంటే 12% ఎక్కువ.
పన్ను తరువాతి లాభం 15% మేరకు తగ్గి - FY2014లో రూ. 1,025 కోట్లు నుండి FY2015లో రూ. 876 కోట్లకు వచ్చింది.
ఎలా, అప్పుడు, మీ కంపెనీ కష్టతరమైన సంవత్సరంలో స్థిరపడుతుంది. ఒక్క వాక్యంలో: BFL యొక్క పనితీరు ప్రకారం అది అద్భుతంగా చేసింది; BAGIC పరంగా చాలా బాగా చేసింది; BALIC కొంత మెరుగుదల ఆశిస్తుండంగా, అది చాలా త్వరలో చూస్తామని నేను ఆశిస్తున్నాను. మొత్తం మూడు కంపెనీలు చాలా మంచి మేనేజీరియల్ జట్టులు మరియు అత్యుత్తమ నాయకులను కలిగి ఉన్నాయి. అందుచేత, నాతో పాటుగా మీరు, FY2016 మరియు రాబోయే సంవత్సరాలలో ఇంకా మెరుగైన ఫలితాలను ఆశించాలి.
నేను మీతో మరొక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. 1 ఏప్రిల్ 2013 నుండి, BAGIC మరియు BALIC యొక్క బోర్డులు సంజీవ్ బజాజ్ ను రెండు కంపెనీల ఛైర్మన్ గా నియమించాయి. ఆయన ఈ రెండు కంపెనీలకు ఆర్థికపరమైన ప్రతినిధిగా అత్యుత్తమ పనితీరు కనబరిచారు. నేను రెండు బోర్డులలో సేవలు అందించడం కొనసాగిస్తాను.

మీ సహకారానికి కృతజ్ఞతలు.
మీ భవదీయుడు,

Rahul Bajaj Sign
రాహుల్ బజాజ్
ఛైర్మన్

డెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ టర్మినేట్ చేయబడిన భాగస్వాములు

మా సోషల్ ఛానళ్ళు

సోషల్ మీడియాలో మాతో కనెక్ట్ అవ్వండి మరియు మా కొత్త వార్తలు మరియు ఆఫర్ల గురించి అప్డేట్ అయి ఉండండి