తరచుగా అడిగే ప్రశ్నలు
మీ రుణాన్ని చెల్లించడానికి సులభమైన మార్గాలలో ఒకటి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఇఎంఐ), ఇక్కడ మీ రుణం సమాన, స్థిర మొత్తాలుగా విభజించబడుతుంది మరియు రుణం పూర్తిగా తిరిగి చెల్లించబడే వరకు ఇవి నెలవారీగా చెల్లించబడతాయి. ఒక ఇఎంఐలో రుణం యొక్క అసలు మొత్తం మరియు దానిపై విధించబడిన వడ్డీ ఉంటుంది.
ఒక బిజినెస్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీకు కావలసిన అవధి కోసం, మీరు తీసుకోవాలనుకుంటున్న రుణం మొత్తంపై ఇఎంఐ గా మీరు చెల్లించవలసిన సుమారు మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది. ఇది మీకు రుణం పై చెల్లించవలసిన పూర్తి వడ్డీ మొత్తాన్ని అలాగే చెల్లించవలసిన పూర్తి మొత్తాన్ని కూడా తెలియజేస్తుంది.
ఈ సమాచారంతో, మీ ప్రస్తుత మరియు భవిష్యత్తు ఆదాయం మరియు ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి మీరు మీ రీపేమెంట్‌ను మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు మీ ఇఎంఐ మొత్తాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. మీకు కావలసిన రుణం మొత్తం, రుణదాత విధించే వడ్డీ రేటు మరియు మీకు కావలసిన అవధిని క్యాలిక్యులేటర్‌లోకి నమోదు చేయడానికి టాగిల్స్ ఉపయోగించండి.
అప్పుడు క్యాలిక్యులేటర్ మీ సంభావ్య ఇఎంఐ మొత్తం, బాకీ ఉన్న మొత్తం వడ్డీ మరియు తిరిగి చెల్లించవలసిన మొత్తాన్ని తక్షణమే ప్రదర్శిస్తుంది.
ఒక బిజినెస్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించడం సులభం. మీ బిజినెస్ లోన్ ఇఎంఐని లెక్కించడానికి మీరు, మీ రుణ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని (నెలల్లో) నమోదు చేయాలి.
ఒక బిజినెస్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ ప్రతి నెలాఖరులో చెల్లించాల్సిన మొత్తాన్ని ముందుగానే నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు మీ బిజినెస్ ప్లాన్లకు సరిపోయే లోన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు మరియు తదనుగుణంగా మీ నగదు వనరులను ప్లాన్ చేసుకోవచ్చు.
బిజినెస్ లోన్లకు వర్తించే వడ్డీ మరియు ఇతర ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి:
- వడ్డీ రేటు: సంవత్సరానికి 9.75% నుండి 30% వరకు.
- ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 3.54% వరకు*
- బౌన్స్ ఛార్జీలు: రూ. 1,500
- జరిమానా వడ్డీ: నెలకు 3.50% (గడువు తేదీన/ ముందు నెలవారీ వాయిదా చెల్లించకపోతే వర్తిస్తుంది)
ఈ క్రింది అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా మీరు రూ. 50 లక్షల వరకు ఎంఎస్ఎంఇ లోన్ పొందవచ్చు:
- మీ వయస్సు తప్పనిసరిగా 24 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి
- మీరు ఖచ్చితంగా 685 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోరును కలిగి ఉండాలి
- మీరు కనీసం 3 సంవత్సరాలపాటు నడుస్తున్న వ్యాపారాన్ని కలిగి ఉండాలి