ఆర్‌బిఐకి కాకుండా బజాజ్ ఫైనాన్స్‌కు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు
బిఎఫ్ఎల్ లేదా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటి, ఇది విస్తృత శ్రేణి ఆర్థిక ప్రొడక్టులను అందజేస్తుంది వివిధ రకాల సెక్యూర్డ్ మరియు అన్‌సెక్యూర్డ్ లోన్లను మొదలుకొని మీరు ఈ ఆర్థిక సంస్థ నుండి క్రెడిట్ కార్డులు, ఇఎంఐ కార్డులు మరియు ఇతరత్రా పొందవచ్చు.
అయితే, ఏదైనా సమస్య లేదా మీరు మా సేవల్లో దేనితోనైనా సంతృప్తి చెందకపోతే, మీరు ఫిర్యాదును నమోదు చేయడానికి ఆర్‌బిఐని ఆశ్రయించడానికి బదులు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గరిష్ట కస్టమర్ సౌలభ్యాన్ని నిర్థారిస్తుందని విశ్వసిస్తుంది మరియు అందువల్ల, మేము 2 పని దినాల్లో అన్ని ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి కట్టుబడి ఉన్నాము.
ఆర్‌బిఐకి బదులుగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద ఫిర్యాదు చేయడం వలన కలిగే ప్రయోజనాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ఫిర్యాదు పరిష్కారం కోసం మమ్మల్ని సంప్రదించే ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి –
- వేగవంతమైన ప్రతిస్పందన
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైనా ఫిర్యాదుకు వీలైనంత త్వరగా ప్రతిస్పందించడంలో గర్విస్తుంది కారణం ఏమిటంటే, ఒకసారి మీరు ఫిర్యాదు పంపిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు ప్రత్యేకంగా దాని కోసం కేటాయించబడతారు ఆ తర్వాత, అతను/ఆమె దానిని పూర్తిగా పరిష్కరించడానికి అవసరమైతే మిమ్మల్ని సంప్రదించి సమస్యను పరిష్కరిస్తారు.
అంతేకాకుండా, మీకు ఏవైనా అదనపు సమస్యలు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మమ్మల్ని సంప్రదించవచ్చు.
- ఫిర్యాదులు తెలపడానికి అనేక మార్గాలు
ఫిర్యాదులు తెలియజేయడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద మీకు వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి, అవి కస్టమర్ పోర్టల్ ద్వారా నా అకౌంట్‌కు వెళ్లడం, కస్టమర్ కేర్‌ను సంప్రదించడం లేదా బ్రాంచ్‌ను సందర్శించడం అందువల్ల, మీ సౌలభ్యం ఆధారంగా, మీరు ఒక ఎంపికను ఎంచుకోవచ్చు.
ప్రత్యామ్నాయంగా, మీరు ఆర్‌బిఐతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వగలరు.
ఒక ఫిర్యాదును రైజ్ చేయడానికి దయచేసి దిగువ ఇవ్వబడిన వివరాలను పరిశీలించండి:
- స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార డెస్క్ మరియు ప్రిన్సిపల్ నోడల్ అధికారి
మేము ఒక స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార డెస్క్‌ను, మీ సమస్యను వెంటనే మరియు న్యాయంగా పరిష్కరించే ప్రధాన నోడల్ కార్యాలయాన్ని కలిగి ఉన్నాము ఇది మీ ఫిర్యాదు కోసం ఒక నిష్పాక్షికమైన, వేగవంతమైన పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది.
ఫిర్యాదుల పరిష్కార డెస్క్ నుండి సహాయం పొందడానికి కస్టమర్లుgrievanceredressalteam@bajajFinserv.inకు మెయిల్ పంపవచ్చు. లేదంటే 020 7117 7266 పై మాకు సోమవారం నుండి శుక్రవారం వరకు (ప్రభుత్వ సెలవులు మినహా) ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు కాల్ చేయవచ్చు. దయచేసి గమనించండి కాల్ ఛార్జీలు వర్తిస్తాయి.
ఫిర్యాదుల పరిష్కార డెస్క్ 7 పనిదినాల్లోపు సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు ospno@bajajfinserv.in పై ప్రిన్సిపల్ నోడల్ అధికారికి మెయిల్ రాయవచ్చు .