మా కస్టమర్ పోర్టల్‌లో మీ లోన్ ఇఎంఐలను నిర్వహించండి
మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు, నిర్ణీత వ్యవధిలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. మీరు ప్రతి నెలా చెల్లించే ఆ నిర్ధిష్ట రుణ మొత్తాన్ని వాయిదా లేదా ఇఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్ మెంట్) అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఒక టర్మ్ లోన్ ఎంచుకుంటే, మీరు చెల్లించే ఇఎంఐలో అసలు మొత్తం అనగా మీరు అప్పుగా తీసుకున్న నిర్ధిష్ట మొత్తం మరియు దానిపై వసూలు చేయబడే వడ్డీ ఉంటుంది. అయితే, మీరు మా ఫ్లెక్సీ వేరియంట్లలో ఒకదాన్ని ఎంచుకున్నట్లయితే, వాయిదాలో వడ్డీ మాత్రమే లేదా వడ్డీ మరియు అసలు రెండూ ఉండవచ్చు.
మీ ఇఎంఐలు రుణ అవధి ప్రారంభంలోనే నిర్ణయించబడతాయి. ప్రతి నెలా నిర్ణీత తేదీన మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఈ వాయిదాలు మినహాయించబడతాయి. రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ఉపయోగించగల అనేక ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపులు, పార్ట్-ప్రీపేమెంట్ మరియు లోన్‌ను ఫోర్క్లోజ్ చేయడం లాంటివి ఉంటాయి.
మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్ సందర్శించండి మరియు ఇలాంటి మా లోన్ రీపేమెంట్ ఆప్షన్లను గురించి తెలుసుకోండి:
-
గడువు మీరిన ఇఎంఐలు
మీరు ఒక లోన్ ఇఎంఐ మిస్ చేసినట్లయితే లేదా సకాలంలో దానిని చెల్లించలేకపోతే, తదుపరి మై అకౌంట్‌ను సందర్శించి ఆ గడువు మీరిన చెల్లింపును పూర్తి చేయవచ్చు.
-
అడ్వాన్స్ ఇఎంఐ
బౌన్స్ ఛార్జీలను నివారించడానికి ఇఎంఐని ముందస్తుగా చెల్లించండి. ఇది మీ సిబిల్ స్కోర్‌ను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.
-
పార్ట్-ప్రీపేమెంట్
మీ రుణంలో కొంత భాగాన్ని సమయానికి ముందే తిరిగి చెల్లించండి. మీరు మీ లోన్ అవధిని త్వరగా పూర్తి చేసుకొని, వడ్డీని ఆదా చేసుకోవచ్చు.
-
ఫోర్‌క్లోజర్
బాకీ ఉన్న రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించండి.
మీ గడువు మీరిన ఇఎంఐలను క్లియర్ చేయండి
సాధారణంగా, మీ లోన్ ఇఎంఐలు గడువు తేదీన మీ బ్యాంక్ అకౌంటు నుండి ఆటోమేటిక్‌గా మినహాయించబడతాయి. అయితే, అరుదుగా వచ్చే సాంకేతిక సమస్యలు లేదా మీ అకౌంటులో తగినన్ని నిధులు నిర్వహించబడకపోతే మీ ఇఎంఐ చెల్లించబడకపోవచ్చు. అలాంటి చెల్లించబడని వాయిదాని గడువు మీరిన ఇఎంఐ అంటారు.
గడువు మీరిన వాయిదాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు మరియు భవిష్యత్తులో మీరు రుణాలు పొందడం కష్టతరమవుతుంది. అంతేకాకుండా, మీరు జరిమానా వడ్డీ అని పిలువబడే అదనపు ఫీజు లేదా ఛార్జీలను కూడా చెల్లించవలసి వస్తుంది.
మీరు ఒక లోన్ ఇఎంఐ మిస్ చేసినట్లయితే, దానిని వీలైనంత త్వరగా క్లియర్ చేయడం మంచిది. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి తీసుకున్న రుణాల విషయంలో గడువు మీరిన ఇఎంఐలను మై అకౌంట్ నుండి సులభంగా నిర్వహించవచ్చు.
-
గడువు మీరిన చెల్లింపు
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్ నుండి మీ గడువు ముగిసిన ఇఎంఐలను సులభంగా చెల్లించవచ్చు:
- మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్ళడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు ఓటిపి సబ్మిట్ చేయండి.
- లోన్ అకౌంట్‌తో పాటు గడువు మీరిన ఇఎంఐలు ఎంచుకోండి.
- బాకీ ఉన్న మొత్తాన్ని నమోదు చేయండి మరియు వర్తించే జరిమానా ఛార్జీలను సమీక్షించండి.
- చెల్లింపును పూర్తి చేయండి మరియు మీ బకాయిలను క్లియర్ చేయండి.
దిగువన ఉన్న 'మీ గడువు మీరిన ఇఎంఐని క్లియర్ చేయండి' ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ గడువు ముగిసిన వాయిదాను కూడా చెల్లించవచ్చు. మీరు చెల్లింపు విభాగానికి మళ్ళించబడతారు, ఇక్కడ మీరు మీ రుణం అకౌంట్‌ను ఎంచుకోవచ్చు, ఆప్షన్‍ల జాబితా నుండి 'గడువు మీరిన బాకీ లేదా మిస్ అయిన ఇఎంఐ' పై క్లిక్ చేయండి మరియు చెల్లింపుతో కొనసాగండి.
-
మీ లోన్ ఇఎంఐలను నిర్వహించండి
బహుళ చెల్లింపు ఆప్షన్ల నుండి ఎంచుకోండి మరియు మీ రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించండి. ప్రారంభించడానికి మై అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
మీ ఇఎంఐలను ముందుగానే చెల్లించండి
చాలా వరకు లోన్ల విషయంలో వాయిదా అనేది పూర్తి అవధి కోసం నిర్ణయించబడుతుంది. నిర్ణీత తేదీన మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆ మొత్తం మినహాయించబడుతుంది. ఒకవేళ మీ వద్ద మిగులు నిధులు ఉంటే, గడువు తేదీకి ముందే ఇఎంఐ చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం కొనసాగుతున్న నెలలో 22వ తేదీకి ముందుగా అడ్వాన్స్ చెల్లింపు చేసినట్లయితే, మీ ఇఎంఐ ఆటోమేటిక్‌గా తదుపరి నెల వాయిదాకు సర్దుబాటు చేయబడుతుంది. అంటే, మీ తదుపరి నెలలో మీ బ్యాంక్ అకౌంటు నుండి ఇఎంఐ మినహాయించబడదు.
మీకు మీ గడువు తేదీని మిస్ అవుతానని భయం ఉంటే, మీ ఇ-మ్యాండేట్‍తో సమస్యలు ఉంటే లేదా అలాంటి ఏవైనా సందర్భాల్లో మీరు అడ్వాన్స్ ఇఎంఐ ఆప్షన్‍ను ఎంచుకోవచ్చు. వాస్తవానికి, మీరు అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపు కోసం అనేక చెల్లింపు విధానాల నుండి ఎంచుకోవచ్చు. ఇది మీ ఇఎంఐ సమయానికి ముందే చెల్లించబడుతుందని నిర్ధారిస్తుంది. అలాగే, మిస్ అయిన ఇఎంఐ సందర్భంలో మీకు వర్తించే జరిమానా ఛార్జీలను మరియు మీ క్రెడిట్ స్కోర్ పై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని నివారిస్తుంది.
మీరు మా ఫ్లెక్సీ లోన్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లయితే మై అకౌంట్ సహాయంతో ఒక ఇఎంఐని ముందుగా చెల్లించవచ్చు మరియు ఒక సాధారణ టర్మ్ లోన్ ఎంచుకుంటే గరిష్ఠంగా ఐదు ఇఎంఐల వరకు చెల్లించవచ్చు.
గమనిక: అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపు అనేది మీరు పొందిన లోన్ వేరియంట్ లేదా మీరు చెల్లించిన మొత్తంతో సంబంధం లేకుండా పార్ట్-ప్రీపేమెంట్ లేదా లోన్(లు) ఫోర్‍క్లోజర్‌గా పరిగణించబడదు. అందువల్ల, అడ్వాన్స్ ఇఎంఐ పై బిఎఫ్ఎల్ ఎలాంటి వడ్డీని చెల్లించదు లేదా అడ్వాన్స్ ఇఎంఐ మొత్తాన్ని లోన్‌లో పార్ట్ పేమెంట్‌గా పరిగణించి ఏ వడ్డీ ప్రయోజనాన్ని అందించదు.
-
అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపులు
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్ నుండి అడ్వాన్స్ లోన్ ఇఎంఐలు చెల్లించవచ్చు:
- ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్ళండి.
- మీ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి మరియు ఒక ఓటిపితో మీ వివరాలను ధృవీకరించండి.
- మీరు ముందస్తు చెల్లింపు చేయాలనుకుంటున్న లోన్ అకౌంటుపై క్లిక్ చేయండి.
- జాబితా నుండి 'అడ్వాన్స్ ఇఎంఐ' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు చెల్లించడానికి కొనసాగండి.
దిగువ ఇవ్వబడిన 'మీ ఇఎంఐని ముందస్తుగా చెల్లించండి' ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు సమయానికి ముందే ఇఎంఐ చెల్లించవచ్చు. మీకు 'మై అకౌంట్'కు సైన్-ఇన్ అవమని అడగడం జరుగుతుంది. సైన్-ఇన్ తర్వాత, మీరు లోన్ అకౌంట్‌ను ఎంచుకుని, 'అడ్వాన్స్ ఇఎంఐ' ఆప్షన్‍ను ఎంచుకుని చెల్లింపుతో కొనసాగవచ్చు. - ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్ళండి.
మీ రుణాన్ని పార్ట్-ప్రీపే చేయండి
ఒకవేళ మీ వద్ద మిగులు నిధులు ఉంటే, మీరు షెడ్యూల్ కంటే ముందుగానే మీ రుణ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించవచ్చు. దీని అర్థం మిగిలిన మొత్తం పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది - తద్వారా మీ రుణ అవధి మరియు/లేదా ఇఎంఐ తగ్గుతుంది.
-
మీ రుణంలో కొంత భాగాన్ని ముందుగానే తిరిగి చెల్లించండి
మీరు కేవలం కొన్ని సులభమైన దశల్లో మీ రుణ మొత్తాన్ని పార్ట్-ప్రీపే చేయవచ్చు:
- మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
- మీరు పార్ట్-ప్రీపేమెంట్ చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి.
- చెల్లింపు కోసం ఇవ్వబడిన ఆప్షన్ల నుండి 'పార్ట్-ప్రీపేమెంట్' ఎంచుకోండి.
- మీరు చెల్లించే మొత్తాన్ని ఎంటర్ చేసి మరియు వర్తించే ఛార్జీలు, ఏవైనా ఉంటే వాటిని సమీక్షించండి.
- మీరు అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, పార్ట్-ప్రీపే చేయడానికి కొనసాగండి.
మీరు దిగువన ఉన్న ‘మీ రుణంలో కొంత భాగాన్ని చెల్లించండి’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 'మై అకౌంట్'కు సైన్-ఇన్ చేసి, 'పార్ట్-ప్రీపేమెంట్' ఆప్షన్‌ను ఎంచుకోండి మరియు కొనసాగండి.
- మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
మీ లోన్‌ను ఫోర్క్లోజ్ చేయండి
మీ వద్ద ఉన్న అదనపు నిధుల ఆధారంగా, మీరు బాకీ ఉన్న రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి ఎంచుకోవచ్చు. దీనినే లోన్ ఫోర్‌క్లోజర్ లేదా లోన్ పూర్తి ప్రీ-పేమెంట్ అంటారు.
మీ లోన్‌ను ఫోర్క్లోజ్ చేయడం వలన వడ్డీ చెల్లింపులను ఆదా చేయవచ్చు మరియు మీ పూర్తి రుణ ఖర్చును తగ్గించవచ్చు.
మీరు మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు నిబంధనలు మరియు షరతులను అలాగే లోన్ ఫోర్‌క్లోజర్ కోసం వర్తించే అదనపు ఛార్జీలను జాగ్రత్తగా విశ్లేషించడం చాలా ముఖ్యం.
-
మీ పూర్తి రుణ మొత్తాన్ని ముందుగానే తిరిగి చెల్లించండి
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్ నుండి మీ రుణాలలో దేనినైనా ఫోర్‌క్లోజ్ చేయవచ్చు:
- పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపితో మా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
- మీరు ఫోర్‍క్లోజ్ చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి.
- అందుబాటులో ఉన్న చెల్లింపు ఆప్షన్ల నుండి 'ఫోర్‍క్లోజర్' ఎంచుకోండి.
- అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు వర్తించే ఫోర్‍క్లోజర్ ఛార్జీలను సమీక్షించండి.
- అవసరమైన వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయడానికి చెల్లింపుతో కొనసాగించండి.
దిగువ ఇవ్వబడిన 'మీ లోన్‌ను ఫోర్క్లోజ్ చేయండి' ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు మీ రుణాన్ని పూర్తిగా చెల్లించవచ్చు. మీరు 'మై అకౌంట్'కు లాగిన్ అయి, మీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి, 'ఫోర్‍క్లోజర్' ఆప్షన్ పై క్లిక్ చేసి చెల్లింపుతో కొనసాగండి.
మీ లోన్‌ను ఫోర్క్లోజ్ చేయండి
- పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపితో మా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
అడ్వాన్స్ ఇఎంఐ అనేది గడువు తేదీకి ముందు మీరు చెల్లించే ఒక ఇఎంఐని సూచిస్తుంది. ఈ మొత్తం మీ రాబోయే ఇఎంఐలో సర్దుబాటు చేయబడుతుంది. అయితే, ప్రస్తుత నెలలో 22వ తేదీకి ముందు మీరు అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపును పూర్తి చేయాలి.
నెలలో 22వ తేదీ తర్వాత చేసిన ముందస్తు ఇఎంఐ చెల్లింపులు తదుపరి నెల ఇఎంఐలో సర్దుబాటు చేయబడతాయి. మీ అడ్వాన్స్ ఇఎంఐలను చెల్లించడానికి మా కస్టమర్ పోర్టల్‌లోని 'మై అకౌంట్' ను సందర్శించండి.
మీ ఇఎంఐని ముందస్తుగా చెల్లించండి
అవును, మీరు అడ్వాన్స్ ఇఎంఐని చెల్లించవచ్చు. అయితే, మీరు నెలలో 22వ తేదీ తర్వాత అడ్వాన్స్ ఇఎంఐ చెల్లిస్తే, మీ అడ్వాన్స్ ఇఎంఐ మొత్తం తదుపరి నెల వాయిదాలో సర్దుబాటు చేయబడుతుంది. ఇది ఎందుకంటే, మీ ప్రస్తుత నెల ఇఎంఐ మినహాయింపు కోసం బ్యాంకుకు సమర్పించబడుతుంది. అయితే, ఒకవేళ మీ ప్రస్తుత నెల ఇఎంఐ బౌన్స్ అయితే, మేము మీ లోన్ కోసం అడ్వాన్స్ చెల్లింపును సర్దుబాటు చేస్తాము.
మీ ఇఎంఐని ముందస్తుగా చెల్లించండి
ఏదైనా టర్మ్ లోన్ లేదా ఫ్లెక్సీ లోన్ కోసం అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపులు చేయవచ్చు. మీకు సాధారణ టర్మ్ లోన్ ఉంటే ఐదు ఇఎంఐల వరకు మరియు ఫ్లెక్సీ లోన్ ఉంటే ఒక ఇఎంఐని అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు.
మీరు మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయడానికి ముందు అన్ని బౌన్స్/ ఓవర్‌డ్యూ ఛార్జీలను క్లియర్ చేయాలి. మీరు రుణాన్ని ఫోర్‍క్లోజర్ చేయడానికి అప్లై చేసినప్పుడు, లోన్ అకౌంట్ పై వర్తించే అన్ని ఓవర్‍డ్యూ ఛార్జీలను చెక్ చేయవచ్చు మరియు వాటిని చెల్లించవచ్చు.
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లకు మరియు ఇన్‌స్టా ఇఎంఐ కార్డు పై తీసుకున్న లోన్లకు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఏమీ వర్తించవు.
అయితే, బిజినెస్ లోన్లు, ప్రొఫెషనల్ లోన్లు మరియు పర్సనల్ లోన్ల కోసం ఫోర్‍క్లోజర్ ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజులు మరియు ఛార్జీల ఇక్కడ పూర్తి జాబితాను చెక్ చేయడానికి మీరు క్లిక్ చేయవచ్చు.
లేదు, అలాంటిదేమి జరగదు. ఒకసారి మీరు లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేసిన తర్వాత, అది 'జీరో' బకాయితో 'మూసివేయబడింది' అని సిబిల్‌కు నివేదించబడుతుంది.