image

  1. హోం
  2. >
  3. షేర్ల పైన లోన్
  4. >
  5. షేర్ల పైన లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

షేర్ల పైన లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ IDని ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మొత్తం పోర్ట్ ఫోలియో విలువను నమోదు చేయండి

ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సేవల గురించి కాల్/SMS చేయడానికి, నేను బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధికి అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

ధన్యవాదాలు

తరచుగా అడగబడే ప్రశ్నలు

సెక్యూరిటీల పైన లోన్ అంటే ఏమిటి?

సెక్యూరిటీల పైన ఇచ్చే లోన్ అంటేనే మార్కెటబుల్ సెక్యూరిటీల పైన ఇచ్చే లోన్ అని తెలుస్తుంది. ఈ విధానంలో కస్టమర్ తన పెట్టుబడిని రుణదాతకు తనఖా పెట్టి డబ్బును అప్పుగా తీసుకోవడం ద్వారా పెట్టుబడులను విక్రయించకుండానే తన ఆర్ధిక, వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటాడు.

సెక్యూరిటీల పైన లోన్ ఏ ఉద్దేశంతో ఇస్తారు?

మీ పెట్టుబడిని జాగ్రత్త చేసుకుంటూనే మరోవైపు పర్సనల్ అవసరాలు, ఇతర అనిశ్చిత అవసరాలను తీర్చుకోవడంతో పాటు ప్రైమరీ ఇష్యూలు, రైట్స్ ఇష్యూలను సబ్స్క్రైబ్ చేయడం కోసం లోన్ ఇస్తారు. వాటిని విక్రయించకుండానే లిక్విడిటీ సమకూర్చుకోవడానికి ఇదొక సరైన మార్గం. కొన్ని నెలల తరువాత కొంత మొత్తం డబ్బును ఆశిస్తుండగా, మధ్యలో కొంత ఫండ్స్ అవసరం కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించటం తెలివైన పని.

సెక్యూరిటీలు తనఖాపై లోన్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి?

1.రూ. 100 కోట్ల వరకు లోన్ పొందవచ్చు
2.లోన్ కాలపరిమితి 12 నెలలు
3.లోన్ మొత్తంపై ప్రతీ నెలా వడ్డీ మాత్రమే చెల్లించాలి
4. తనఖా పెట్టిన సెక్యూరిటీలు బదిలీ చేసుకునే సౌలభ్యం
5.రియల్ టైమ్ ప్రాతిపదికన ""ఎక్స్ పీరియా"" పోర్టల్ పై ఆన్‍లైన్ పోర్ట్ ఫోలియోను యాక్సెస్ చేసుకోవచ్చు
6.ప్రత్యేకమైన రిలేషన్షిప్ మేనేజర్

సెక్యూరిటీల పైన వివిధ రకాల లోన్లు ఏవి?

విస్తారంగా చెప్పాలంటే ఈ విభాగంలో రెండు రకాల లోన్లు ఉన్నాయి:

1 షేర్ల పై లోన్
2 బాండ్ల పైన లోన్
3 మ్యూచువల్ ఫండ్స్ పైన లోన్
4 ఇన్సూరెన్స్ పాలసీల పైన లోన్*
5 ESOP ఫైనాన్సింగ్ పైన లోన్
6 IPO ఫైనాన్సింగ్ పైన లోన్
7 FMP ల పైన లోన్

*బజాజ్ అలయన్జ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు మాత్రమే

బజాజ్ ఫైనాన్స్, సెక్యూరిటీలపై ఎటువంటి లోన్‌ రకాలను ఆఫర్ చేస్తుంది?

Bajaj Finance offers Loan Against Securities for term loan & Flexi Loan. In a term loan, a customer borrows for a certain period like 3, 6, 9 & 12 months and can repay the loan amount at the time of completion of the loan tenure. In a Flexi Loan, a customer can request for repayment as well as disbursement up to his eligibility amount at any time during the tenor of loan.

సెక్యూరిటీల అకౌంట్ పైన తీసుకున్న లోన్ ఫోర్ క్లోజ్ చేయవచ్చా?

అసలు లోన్ మొత్తం తో పాటు వడ్డీ మొత్తాన్ని చెల్లింపు చేసిన తర్వాత మీరు ఏక్షణంలోనైనా మీ లోన్ ను ఫోర్‍క్లోజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫోర్‍క్లోజర్ చార్జీలు చెల్లించనక్కర లేదు.

సెక్యూరిటీల పైన తీసుకున్న లోన్ కు పాక్షిక చెల్లింపు చేయవచ్చా?

మా లోన్లు అన్నీ పాక్షిక-ప్రీపేమెంట్ చెల్లింపు సౌకర్యం కలిగివున్నాయి. దీని ప్రకారం లోన్ కాల పరిమితి సమయంలో మీకు నచ్చినంత మొత్తంతో పాక్షిక ప్రీపే చేయవచ్చు.

సెక్యూరిటీల పైన మంజూరు చేసే కనిష్ఠ, గరిష్ఠ లోన్ ఎంత?

కనీస లోన్ మొత్తం 5 లక్షలు మరియు గరిష్ట లోన్ మొత్తం 10 కోట్లు

సెక్యూరిటీల పైన లోన్ కోసం నేను ఎలా అప్లై చేయాలి?

మీరు మా ఆన్‍లైన్ అప్లికేషన్ సౌకర్యం ద్వారా అప్లై చేయవచ్చు లేదా 'మమ్మల్ని సంప్రదించండి' విభాగంలో పేర్కొనబడిన వివిధ రకాల మాధ్యమాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ నుండి షేర్లపై లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు లేదా లాభాలు ఏంటి?

దయచేసి మరిన్ని వివరాల కోసం ఫీచర్లు మరియు ప్రయోజనాలు విభాగాన్ని చెక్ చేయండి.

షేర్ల పైన లోన్ నేను ఎప్పుడు పొందగలను?

అన్ని ఆన్‍లైన్ అప్లికేషన్లకు, మీరు తక్షణ అప్రూవల్ లభిస్తుంది.

నేను లోన్ ఎలా తిరిగి చెల్లించాలి?

మీరు లోన్ కాలపరిమితిలో ఎప్పుడైనా సరే మీ లోన్ ను తిరిగి చెల్లించవచ్చు. ఇందుకోసం వడ్డీరేటుతో సహా అసలు మొత్తాన్ని RTGS / NEFT / చెక్ ద్వారా మీరు చెల్లించవచ్చు. మా కస్టమర్ పోర్టల్ (ఎక్స్పీరియా) ద్వారా కూడా మీరు లోన్ చెల్లించవచ్చు.

షేర్ల పైన లోన్ యొక్క ఆన్‍లైన్ ప్రాసెస్ అంటే ఏమిటి?

మా ఆన్‍లైన్ అప్లికేషన్ సౌకర్యంతో, మీరు ఎక్కడున్నా కూడా షేర్ల పైన లోన్ కోసం అప్లై చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు తక్షణ అప్రూవల్ పొందవచ్చు.

నాకు రుణం ఏ అర్హత ప్రమాణంపై మంజూరు చేయబడుతుంది?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంతర్గత విధానాల మేరకు అన్ని లోన్లు మంజూరు చేయబడతాయి.

ఒకవేళ ఆన్ లైన్లో అప్లై చేస్తే నేను లోన్ ఎప్పుడు పొందగలను?

మీ లోన్ అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత, మీ లోన్ 72 గంటలలో పంపిణీ చేయబడుతుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ఆన్‍‍లైన్లో లోన్‍‍కు అప్లై చేయడం ద్వారా ప్రయోజనాలేమిటి?

మా ఆన్‍లైన్ అప్లికేషన్ సౌకర్యంతో, మీరు ఎక్కడి నుండైనా అప్లై చేసే సౌలభ్యం ఉంటుంది. మీరు కొన్ని వివరాలను నింపిన వెంటనే మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

ఆన్‍‍లైన్లో అప్లై చేసిన లోన్ స్టేటస్ నేను ఎలా తెలుసుకోవచ్చు?

మీ అప్లికేషన్ స్టేటస్ పరిశీలించడానికి, 18001033535 నంబరుపై మా కస్టమర్ కేర్ ను సంప్రదించగలరు.

నేను అందించే సమాచారం ఎంత సురక్షితం?

మీకు సంబంధించిన సమాచారం మా వద్ద భద్రంగా ఉంటుంది. అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో పూర్తిగా సెక్యూర్డ్ అప్లికేషన్ తో రూపొందించిన ఆన్‍లైన్ అప్లికేషన్ అత్యంత సురక్షితం.

ఈ సైట్లో నా డెబిట్ కార్డును ఉపయోగించడం సురక్షితమేనా?

మా వెబ్‍సైట్ ద్వారా చేసే అన్ని లావాదేవీలు సురక్షితం. మేము అత్యాధునిక భద్రతను ఉపయోగిస్తున్నాం. అందువల్ల లావాదేవీలు అత్యంత సురక్షితం. మేము SSL డాటా ఎన్క్రిప్షన్ ఉపయోగించడం వల్ల అధికారం లేని వ్యక్తులెవరూ దానిని చూడకుండా ఈ విధానం తోడ్పడుతుంది.

నేను ట్రాన్సాక్షన్ ఎలా రద్దు చేసుకోవచ్చు లేదా రిఫండ్ ఎలా తీసుకోవచ్చు?

ఒకవేళ సరైన కారణాలతో ఏదైనా లోపాలు తలెత్తితే మేము డబ్బును రిఫండ్ చేస్తాం, 1800 1033535 నంబరుపై మాకు కాల్ చేయండి. మరిన్ని వివరాల కోసం 'షరతులు, నియమాలను' చదవండి.

షేర్ల పైన మంజూరు చేసే కనిష్ఠ, గరిష్ఠ మొత్తం లోన్ ఎంత?

కనిష్ఠ మొత్తం లోన్ రూ. 15 లక్షలు. గరిష్ఠ మొత్తం లోన్ రూ. 10 కోట్లు.

ఒకవేళ కస్టమర్‌కు బజాజ్‌ ఫైనాన్స్‌లో డీమ్యాట్ అకౌంట్ లేనట్లయితే, అతను బజాజ్ ఫైనాన్స్ నుండి షేర్లపై లోన్ పొందవచ్చా?

అవును. NSDL లేదా CDSL డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లో ఉన్న షేర్లని అయినా మీరు తనఖా పెట్టవచ్చు

లోన్ కోసం విలువ మరియు మార్జిన్ ఎలా లెక్కిస్తారు?

సెక్యూరిటీలు తనఖా పెట్టి 50% విలువ మొత్తం లోన్ మీరు పొందవచ్చు. షరతులు, నియమాలు వర్తిస్తాయి.

కస్టమర్ ఎంత మొత్తం వడ్డీని చెల్లించాల్సివుంటుంది?

రోజూవారీ మిగిలిన మొత్తంపై వడ్డీరేటు లెక్కిస్తారు. అయితే దీనిని నెలవారీ పద్ధతిలో చెల్లించాల్సివుంటుంది. కస్టమర్ యొక్క పోర్టుఫోలియో ప్రకారం ఇది ఉంటుంది.

కస్టమర్ తన పోర్టుఫోలియోలోని మొత్తం సెక్యూరిటీలు తనఖా పెట్టవచ్చా?

బజాజ్ ఫిన్సర్వ్ కు తమ స్వంత అప్రూవ్డ్ స్క్రిప్ట్ జాబితా ఉంది మరియు అది ఆ జాబితాకు అనుగుణంగా మాత్రమే అప్పు ఇస్తుంది.

ఒకవేళ కస్టమర్ సెక్యూరిటీలు తన కంపెనీ పేరుపై హోల్డ్ చేస్తే, అతడు వాటిని తనఖా పెట్టి లోన్ తీసుకోగలడా?

అవును. కస్టమర్ తన కంపెనీ పేరుపై ఉన్న షేర్లను తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం సంబంధిత డాక్యుమెంట్లను అందించాలి.

కస్టమర్ తన భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రుల పేరిట ఉన్న సెక్యూరిటీలు తనఖా పెట్టవచ్చా?

అవును. అతడు ఈ సెక్యూరిటీల పైన లోన్ పొందవచ్చు. అయితే అతడు వాళ్ళందరినీ సహ-రుణ గ్రహీత / సెక్యూరిటీగా తీసుకోవాలి.

తనఖా పెట్టడానికి చార్జీలు ఎంత?

DP నుంచి DP కి తనఖా ఛార్జీలు వేరుగా ఉంటాయి. అయితే, సాధారణంగా తనఖా మొత్తం 0.04% గా ఉంటుంది.

ఒక కస్టమర్ తన లోన్ అర్హత మొత్తం ఎంతో ఎలా తెలుసుకోవాలి?

సెక్యూరిటీలు తనఖా నిమిత్తం, బజాజ్ ఫిన్సర్వ్ క్లయింట్ ప్రొఫైల్, తనఖా పెట్టే సెక్యూరిటీలు విలువ మరియు ఇప్పటికే అమల్లో ఉన్న చెల్లింపులు, ఒకవేళ ఉంటే, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని లోన్ అర్హత మొత్తాన్ని నిర్ధారిస్తుంది. వ్యక్తిగత సమావేశం సమయంలో అర్హత మొత్తం తెలుసుకోవడానికి ASM సహాయపడతారు.

కస్టమర్ సెక్యూరిటీల పైన లోన్ అకౌంటు స్టేట్‍మెంట్‍ ను ఎలా పొందవచ్చు?

కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా ద్వారా కస్టమర్ ఆన్లైన్లో SOA పొందవచ్చు. లేదా సెక్యూరిటీలు తనఖాపై లోన్ కు సంబంధించిన రిలేషన్షిప్ మేనేజర్ ను సంప్రదించాలి.

కస్టమర్ లోన్ మొత్తం ఎలా తిరిగి చెల్లించాలి?

కస్టమర్ లోన్ కాలపరిమితి సమయంలో ఎప్పుడైనా బజాజ్ ఫిన్సర్వ్ పేరుపై చెక్ పంపడం లేదా RTGS/NEFT ద్వారా లోన్ మొత్తం లో కొంత భాగం లేదా పూర్తిగా చెల్లించవచ్చు. కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా ద్వారా కూడా కస్టమర్ తన లోన్ ను తిరిగి చెల్లించవచ్చు.

తనఖా పెట్టిన షేర్లు / సెక్యూరిటీలు పాక్షికంగా వెనక్కు తీసుకునే సదుపాయం కస్టమర్ కు ఉంటుందా?

అవును. లోన్ మొత్తం చెల్లించిన తరువాత కస్టమర్ దీనిని విడుదల చేయవచ్చు. అయితే అవసరమైన మేరకు మార్జిన్ ఉండేలా చూసుకోవాలి.

రీపేమెంట్ ఛార్జీలు అంటే ఏమిటి?

బజాజ్ ఫిన్సర్వ్ రీపేమెంట్ ఛార్జీలు వసూలు చేయదు.

కస్టమర్ తనఖా పెట్టిన సెక్యూరిటీలు ఎలా విడుదల చేసుకోగలరు?

బజాజ్ ఫిన్సర్వ్ కు లోన్ మొత్తం మరియు వడ్డీ చెల్లించిన తర్వాత కస్టమర్ సెక్యూరిటీలు విడుదల కోసం తన DP ద్వారా విజ్ఞప్తి చేయవచ్చు.

ESOP ఫైనాన్సింగ్ అంటే ఏమిటి?

ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రణాళిక క్రింద ఉన్న తన షేర్స్ ను వినియోగించుకునేందుకు అతనికి/ఆమెకు ఋణదాత, కేటాయింపు సమయములో ఆ షేర్స్ ను తాకట్టు పెట్టమని అడిగి, ఫండ్స్ అందిస్తారు.

ESOP ఫైనాన్స్ పొందటానికి ఎవరికి అర్హత ఉంది?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుమతించిన ఏ కంపెనీ ఉద్యోగి అయినా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ESOP ఫైనాన్స్ లో భాగంగా ఇచ్చే కనిష్ఠ, గరిష్ఠ మొత్తం లోన్ ఎంత?

ESOP ఫైనాన్స్ క్రింద ఇచ్చే కనిష్ఠ, గరిష్ఠ మొత్తం లోన్ రూ. 10 లక్షలు మరియు రూ. 10 కోట్లు.

లోన్ అర్హత మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు?

లోన్ అర్హత మొత్తాన్ని దీని ఆధారంగా లెక్కిస్తారు:
1. స్వాధీనం ధర
2.మార్కెట్ ధర
3.షేర్ల యొక్క మార్జిన్

మీరు FBT (ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్) కూడా ఫండ్ చేస్తారా?

అవును. ఒకవేళ అవసరమైన లోన్ మొత్తం మరియు FBT మొత్తం లోన్ అర్హత మొత్తం పరిధిలో ఉన్నప్పుడు FBTకి ఫండ్ చేస్తాం.

ESOP ఫైనాన్స్ లో ఎంత మార్జిన్ పరిగణనలోకి తీసుకుంటారు?

మార్జిన్ అనేది కంపెనీ, కంపెనీకి వేరుగా ఉంటుంది. అయితే ఇది 30% నుంచి 40% వరకు ఉంటుంది.

ESOP ఫైనాన్స్ కాలపరిమితి ఎంత?

ESOP ఫైనాన్స్ కాలపరిమితి 30 రోజుల నుంచి 180 రోజులు.

ESOP ఫైనాన్స్ నిమిత్తం ఎంత రుసుము చెల్లించాలి?

చెల్లించాల్సిన రుసుములు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
1.వడ్డీ రేటు
2.ప్రాసెసింగ్ ఫీజు
3.తనఖా / తనఖా లేని రుసుములు
4.డిమాట్ అకౌంట్ తెరవడానికి రుసుములు
5.డిమాట్ అకౌంటుకు AMC రుసుములు
6.డాక్యుమెంటేషన్ రుసుములు

ESOP ఫైనాన్స్ పొందడానికి ప్రాసెస్ ఏమిటి?

లోన్ దరఖాస్తుతో పాటు కొత్త POA ఆధారిత డిమాట్ అకౌంట్ దరఖాస్తును ఉద్యోగి నింపి, వాటిని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు అందజేయాలి

1. అతడికి/ఆమెకు జారీ చేసిన ESOP లేఖను ఉద్యోగి యజమానికి సమర్పించాలి
2.డాక్యుమెంటేషన్ ను బజాజ్ ఫైనాన్స్ తనిఖీ చేస్తుంది మరియు లోన్ అకౌంటు తెరిచి, ESOP ఫైనాన్స్ నిమిత్తం POA డిమాట్ అకౌంటును తెరవడానికి వీలు కల్పిస్తుంది
3.అతడు/ఆమె సంతకం చేసిన తనఖా దరఖాస్తును ఉద్యోగి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సమర్పించాలి
4.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లోన్ అర్హత మొత్తాన్ని లెక్కించి దానిని ఉద్యోగికి తెలియజేస్తుంది
5.ఉద్యోగి ESOP ఫైనాన్స్ కోసం ఏర్పాటు చేసిన POA డిమాట్ అకౌంట్ నంబర్ ను పేర్కొనాలి. అప్పుడు ESOP అప్లికేషన్ పరిశీలన సాధ్యపడుతుంది
6.అర్హత మొత్తం మరియు ఇఎస్ఒపి అవసరాలకు అనుగుణంగా బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి తరఫున యజమాని పేరుపై RTGS / చెక్కు జారీ చేస్తుంది
7.షేర్లు కేటాయించే తేదీని ఉద్యోగి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు తెలియజేయాలి
8. ఎంప్లాయర్ ఉద్యోగి యొక్క POA డిమాట్ అకౌంట్‍కు షేర్స్ ను కేటాయిస్తారు, ఇక్కడ POA బజాజ్ ఫైనాన్స్ లి. పేరున ఉంటుంది
8.ఒకసారి POA డిమాట్ అకౌంటుకు షేర్లు కేటాయించిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ వాటిని తనఖా పెట్టుకుంటుంది

ESOP లోన్ పై వడ్డీ ఎలా లెక్కిస్తారు?

మీరు ESOP ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎంపిక చేసుకున్న కాలపరిమితి ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. అయితే, 30 రోజులలో లోన్ తిరిగి చెల్లిస్తే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కనీసం 30 రోజుల వడ్డీ వసూలు చేస్తుంది.

వడ్డీ చెల్లింపు ప్రాసెస్ ఏమిటి?

నెలవారీ విధానంలో వడ్డీ వసూలు కోసం PDC చెక్కు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకులో వేస్తుంది.

నేను నా లోన్ తిరిగి ఎలా చెల్లించవచ్చు?

ఈ క్రింది పద్ధతుల్లో మీ లోన్ మీరు తిరిగి చెల్లించవచ్చు:
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా కేటాయించబడిన సెక్యూరిటీలు విక్రయించడం - ఈ విధానంలో సెక్యూరిటీలు విక్రయించే బాధ్యత బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్వయంగా చేపడుతుంది మరియు లోన్ మరియు వడ్డీ మొత్తానికి సరిపడా నిధులను తనవద్ద ఉంచుకుంటుంది మరియు వడ్డీతో కలిపి లోన్ మొత్తాన్ని బజాజ్ ఫైనాన్స్ లి. వారికి చెల్లించడం ద్వారా మిగిలిన మొత్తం ఉద్యోగి బెనిఫీషియరీ అకౌంటుకు క్రెడిట్ చేయబడుతుంది. ఈ సందర్భంలో, బజాజ్ ఫైనాన్స్ లి. వారు అకౌంట్ ను రీకన్సైల్ చేస్తుంది మరియు తనఖా విడుదల చేసి సెక్యూరిటీలను ఉద్యోగి బెనిఫీషియరీ అకౌంటుకు బదిలీ చేస్తుంది

నేను ఎక్కువసార్లు ESOP లోన్ కు దరఖాస్తు చేసుకోవచ్చా?

అవును మీ లోన్ అకౌంట్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద యాక్టివ్‌గా ఉన్నంత కాలం మీరు ESOP ఫైనాన్సింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు"

నేను ఏ ఏజెంట్ ద్వారానైనా ఈ లోన్ పొందవచ్చా?

మేము ఈ క్రింది భాగస్వాముల ద్వారా సెక్యూరిటీల పై మా ఆన్‌లైన్ లోన్‌ను పంపిణీ చేస్తాము:

1 ఎన్‌జె ఇండియా ఇన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్
2 ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్
3 అరువేక్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ( కువేరా)

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

బిజినెస్ లోన్

మీ బిజినెస్ పెరుగుదలకు సహాయపడేందుకు, రూ. 30 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడే పొందండి

EMI నెట్వర్క్

మీకు అవసరమైన ప్రతిదాన్ని సులభమైన మరియు సరసమైన EMI లలో పొందండి

మరింత తెలుసుకోండి
Personal Loan People Considered Image

పర్సనల్ లోన్

మా ఫ్లెక్సీ ఇంట్రెస్ట్- ఓన్లీ లోనుతో వడ్డీ మొత్తం మాత్రమే EMIగా చెల్లించండి.

ఇప్పుడే అప్లై చేయండి