ఫిక్స్‌డ్‌ డిపాజిట్ అర్హత ప్రమాణాలు

 • Individual
  ఇండివిడ్యువల్

  నివాస భారతీయులు, భారతీయ మూలానికి చెందిన వ్యక్తులు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ మరియు విదేశీ పౌరులు ఎఫ్‌డి బుక్ చేసుకోవడానికి అర్హులు.

 • Non-individuals
  నాన్-ఇండివిడ్యువల్స్

  సోల్ ప్రొప్రైటర్‌షిప్స్, పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్స్, కంపెనీలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యుఎఫ్‌లు), క్లబ్‌లు, సంఘాలు, సొసైటీలు, కుటుంబ ట్రస్టులు కూడా ఎఫ్‌డిని బుక్ చేసుకోవడానికి అర్హులు.

బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టడానికి, మీరు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఒక త్వరిత కాగితరహిత ప్రక్రియతో మీరు మీ డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు మరియు కేవలం రూ. 25,000 పెట్టుబడి మొత్తంతో ప్రారంభించవచ్చు. 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో మీ డిపాజిట్‌ను బుక్ చేసుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టండి.

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు వారి డిపాజిట్‌పై అదనంగా 0.10%* ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్‌లు వారు ఎంచుకున్న పెట్టుబడి విధానంతో సంబంధం లేకుండా, తమ డిపాజిట్‌పై 0.25%* అదనపు రేటు ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

బజాజ్ ఫైనాన్స్ యొక్క ప్రస్తుత ఎఫ్‌డి కస్టమర్‌లు రెన్యూవల్ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లను తిరిగి సమర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకనగా ఇది వన్-టైమ్ ప్రాసెస్. కొత్త కస్టమర్ల కోసం, బజాజ్ ఫైనాన్స్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

 • లేటెస్ట్ ఫోటో
 • అందరు అప్లికెంట్ల కెవైసి
 1. పాన్ కార్డ్
 2. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి (ఏదైనా ఒకటి)

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడగబడే ప్రశ్నలు

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి పబ్లిక్/ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఏవి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి, ఒక పబ్లిక్/ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి:

 • ఇన్‌కార్పోరేషన్/రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
 • మెమోరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
 • అకౌంట్ తెరవడానికి బోర్డ్ చేసిన తీర్మానం
 • కంపెనీ పాన్
 • తాజా టెలిఫోన్ బిల్లు లేదా విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
 • ఆథరైజ్డ్ సంతకందారుల కెవైసి
ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక పార్ట్‌నర్‌షిప్ సంస్థకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఏవి?

ఒక భాగస్వామ్య సంస్థ ఈ కింది వాటిని సమర్పించి ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టవచ్చు
డాక్యుమెంట్లు:

 • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
 • పాన్
 • పార్ట్నర్‌షిప్ డీడ్
 • అధీకృత సంతకందారుల కెవైసి
ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యుఎఫ్) కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి?

ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించి హెచ్‌యుఎఫ్, ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టవచ్చు:

 • పాన్
 • హెచ్‌యుఎఫ్ డీడ్ మరియు డిక్లరేషన్
 • కర్త యొక్క కెవైసి
ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను తెరవడానికి ఒక చట్టపరమైన సంస్థ/స్థానిక అధికారులకు కావలసిన డాక్యుమెంట్లు ఏవి?

ఎఫ్‌డిని బుక్ చేయడానికి చట్టపరమైన సంస్థలు, స్థానిక అధికారులకు ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించాలి:

 • ప్రభుత్వ అథారిటీ / సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా మంజూరు చేయబడిన అనుమతి కాపీ
 • ఇన్‌కార్పోరేషన్/రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
 • పాన్ కార్డ్
 • తాజా టెలిఫోన్ బిల్లు లేదా విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
 • అధీకృత సంతకందారుల కెవైసి
ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను తెరవడానికి రిజిస్టర్డ్ సొసైటీలకు ఏయే డాక్యుమెంట్లు అవసరం?

ఎఫ్‌డి అకౌంట్‌ను తెరవడానికి రిజిస్టర్డ్ సొసైటీలు ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించాలి:

 • ఇన్‌కార్పోరేషన్/రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
 • మెమోరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
 • అకౌంట్ తెరవడానికి బోర్డ్ చేసిన తీర్మానం
 • పాన్
 • తాజా టెలిఫోన్ బిల్లు లేదా విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
 • అధీకృత సంతకందారుల కెవైసి
మరింత చదవండి తక్కువ చదవండి