అత్యవసర వైద్య పరిస్థితి సమయాలలో కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఒక వరంగా మారతాయి మరియు డబ్బుల గురించి ఆందోళన లేకుండా కుటుంబం తక్షణమే చికిత్స పొందడాన్ని సాధ్యం చేస్తాయి. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మొత్తం కుటుంబం యొక్క ప్రధాన మరియు చిన్న వైద్య ఖర్చులను ఒకే ప్లాన్ కింద కవర్ చేస్తాయి. ప్రీమియం విలువ మరియు ఇన్సూర్ చేయబడిన మొత్తం ప్రతి పాలసీకి మారుతుంది. ఎంపిక చేయబడిన పాలసీ ప్రకారం ఈ ప్లాన్లు రూ. 2 కోట్ల వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తంతో ఒక సమగ్ర ప్యాకేజీలాగా లభిస్తాయి. ఇంకా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రిజిస్టర్ చేయబడిన సభ్యుల మధ్య ఇన్సూర్ చేయబడిన మొత్తం పంచుకోబడుతుంది.
హాస్పిటలైజేషన్కు ముందు మరియు తరువాతి వైద్య ఖర్చులకు, డాక్టర్ ఫీజు, ఆధునిక మరియు ఆయుష్ చికిత్స, డేకేర్ విధానాలు, డొమిసిలియరీ చికిత్స మరియు ఇతర వైద్య సంబంధిత ఖర్చులకు మీరు కవరేజ్ పొందవచ్చు. ప్లాన్ పై ఇన్సూరెన్స్ చేయబడిన గరిష్ట మొత్తం వరకు ఇన్సూరర్ పరిహారం చెల్లిస్తారు. అయితే, మీ ప్లాన్ సమ్ రీఇన్స్టేట్మెంట్ సౌకర్యాన్ని అందిస్తే, మీరు పాలసీ పై ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100% రిస్టోర్ చేయడం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు.
మెడిక్లెయిమ్ అనేవి రూ. 5 లక్షల పాలసీల వరకు ఉండే పరిమిత ఇన్సూరెన్స్ మొత్తం. నాకు అర్థం అయినంత వరకు, మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే మెడిక్లెయిమ్ పాలసీలు ఏమీ లేవు. దయచేసి సరైన సందర్భంతో కీవర్డ్స్‌ను సూచించండి మరియు ఇన్సూరెన్స్ నిబంధనలను అర్థం చేసుకోండి.
కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల యొక్క ముఖ్య ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది:
హామీ ఇవ్వబడిన మొత్తం | రూ. 1.5 లక్ష – రూ. 2 కోట్లు |
డేకేర్ విధానాలు | 586 డేకేర్ విధానాలు |
క్యుములేటివ్ బోనస్ | హామీ ఇవ్వబడిన మొత్తంపై 10% - 50% |
పన్ను ప్రయోజనం | చేర్చబడిన |
అంబులెన్స్ ఛార్జీలు (సంవత్సరానికి) | రూ. 20,000 వరకు |
ఉచిత నివారణ పరీక్షలు | ప్రతీ 3 సంవత్సరాలు |
రూ. 1.5 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు హామీ ఇవ్వబడిన మొత్తాన్ని పొందండి మరియు మీ మొత్తం కుటుంబం యొక్క వైద్య బిల్లులను చెల్లించండి.
ఒకే ఒక్క ప్రీమియం మొత్తాన్ని చెల్లించి మొత్తం కుటుంబానికి ఉత్తమమైన వైద్య చికిత్సను పొందండి.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్‌తో, మీరు అమలులో ఉన్న పన్ను చట్టాల క్రింద పన్ను ఆదా చేసుకోవచ్చు.
నిర్దిష్ట పాలసీ నిబంధనల ఆధారంగా మీ ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక కుటుంబ సభ్యుడిని జోడించండి.
ఒకే పాలసీ కింద అవయవ దాతలు, ప్రసూతి మరియు నవజాత శిశువు, బేరియాట్రిక్ సర్జరీ లేదా ఆయుర్వేద మరియు హోమియోపతి హాస్పిటలైజేషన్ కోసం అయ్యే ఖర్చులను యాడ్-ఆన్ ప్రయోజనాల శ్రేణి కవర్ చేస్తుంది.
ఒకవేళ పాలసీలో పేర్కొనబడి ఉంటే తప్ప, స్వచ్ఛమైన ప్రతిపాదన ఫారమ్‌కు లోబడి ఉన్నపుడు వైద్య పరీక్ష చేయవలసిన అవసరం లేదు.
పాలసీ కలిగి ఉన్నవారు అందరూ క్లెయిమ్ తో సంబంధం లేకుండా, ప్రతి 3 సంవత్సరాలకు ఉచిత నివారణ హెల్త్ చెక్-అప్ కు అర్హత కలిగి ఉంటారు.
ఒక పాలసీ సంవత్సరానికి రూ. 20,000 వరకు అంబులెన్స్ ఛార్జీల కోసం కవర్‌ను పొందండి.
బజాజ్ ఫైనాన్స్ అందించే కుటుంబం కోసం కొన్ని టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు | ప్లాన్ గురించి | బీమా చేయబడిన మొత్తం | నెట్వర్క్ హాస్పిటల్స్ |
---|---|---|---|
Aditya Birla Activ Assure Diamond | ఈ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు విస్తృత శ్రేణి ఆరోగ్య ఫీచర్లపై సమగ్ర కవరేజీని అందించడం వలన ఇది అత్యంత సరైన పెట్టుబడి ప్లాన్లలో ఒకటి. | రూ. 2 కోట్ల వరకు | 8000+ |
ఆదిత్య బిర్లా గ్రూప్ యాక్టివ్ హెల్త్ ప్లాన్ | ఆస్తమా, రక్తపోటు సమస్యలు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ మరియు మరెన్నో ప్రధాన అనారోగ్యాల నుండి మీరు కవర్ చేయబడవచ్చు కాబట్టి ఇది కుటుంబాల కోసం అగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకటి ఈ పాలసీ ఇన్సూర్ చేయబడిన సభ్యులందరికీ ఈ వైద్య ఖర్చులు మరియు హాస్పిటల్ చికిత్సలను కవర్ చేస్తుంది. | రూ. 10 లక్షల వరకు | 8000+ |
ఆదిత్య బిర్లా సూపర్ టాప్-అప్ | మీకు మీ కుటుంబం కోసం యాడ్-ఆన్ హెల్త్ కవరేజ్ అవసరమైతే, Aditya Birla Super Top-Up ప్లాన్ తగినది. మీ కుటుంబం కోసం అవసరం అయిన, అనేక ఇతర ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అందుబాటులో లేని అన్ని అదనపు ప్రయోజనాలను ఎంచుకోవడానికి ఈ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. | రూ. 50 లక్షల వరకు | 8000+ |
బజాజ్ అలియంజ్ హెల్త్-గార్డ్ పాలసీ | బజాజ్ అలియంజ్ నుండి హెల్త్-గార్డ్ అనేది తీవ్రమైన అనారోగ్యం, శస్త్రచికిత్స లేదా ప్రమాదం కారణంగా హాస్పిటల్లో చేరిన సమయంలో అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేసే ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. | రూ. 50 లక్షల వరకు | 6500+ |
బజాజ్ అలియంజ్ గ్లోబల్ | కుటుంబాల కోసం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ప్రమాదం కారణంగా మరణం, దుర్బలం అవ్వడం లేదా గాయపడితే ప్రపంచవ్యాప్త కవరేజ్ అందించడానికి ఉద్దేశించినది ఈ పాలసీ పేరుకి తగ్గట్లుగా ఉంటుంది: మీకు సమగ్ర రక్షణ అందించే ఒక సింగిల్ పాలసీ. | రూ. 2 కోట్ల వరకు | 6500+ |
పారామీటర్లు | అర్హత ప్రమాణాలు |
---|---|
కనీస వయస్సు | కుటుంబ సభ్యులు - 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఆధారపడిన పిల్లలు - 3 నెలల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. |
రెన్యూవబిలిటీ | జీవితకాలం |
కవర్ చేయబడే సభ్యులు | స్వీయ, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులు మరియు అత్తమామలు |
ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడానికి, కుటుంబం కోసం మెడిక్లెయిమ్ పాలసీలో ప్రాథమిక చేర్పుల గురించి తెలుసుకోవాలి. అనేక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ క్రింది వాటిని కవర్ చేస్తాయి:
అదనంగా, వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అనేక ఇతర సేవలు మరియు ఖర్చులు కవర్ చేయబడతాయి.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఈ క్రింది ఖర్చులు కవర్ చేయబడవు:
గమనిక: మినహాయింపులు వివిధ ప్లాన్లకు భిన్నంగా ఉండవచ్చు. దయచేసి కొనుగోలు చేయడానికి ముందు పాలసీ వివరాలను చదవండి.
వైద్య ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం పెరుగుతున్నందున ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కీలకంగా మారింది. చిన్న గాయాల నుండి తీవ్రమైన అనారోగ్యాల వరకు, ప్రమాదం కారణంగా కలిగిన గాయాల నుండి అవుట్పేషంట్ విధానాల వరకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబం అంతటికీ సమగ్రమైన రక్షణను అందిస్తుంది.
ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకే ప్రీమియం క్రింద కుటుంబ సభ్యులందరినీ కవర్ చేస్తుంది. ఒకేసారి అనేక క్లెయిమ్‌లు దాఖలు చేయబడితే, మొత్తం కుటుంబ సభ్యులలో హామీ ఇవ్వబడిన అమౌంట్ విభజించబడుతుంది. ఇది చికిత్స మరియు రికవరీపై దృష్టి పెట్టడానికి మానసిక శాంతిని మరియు స్వేచ్ఛను అందిస్తుంది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క కీలక ప్రయోజనాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండటం గురించిన ఉత్తమ విషయాల్లో ఒకటి ఏంటంటే, ఇది మీ బంధువులతో సహా మీ కుటుంబంలోని అందరు వ్యక్తులు ఒకే పాలసీ క్రింద ఉండవచ్చు.
ఊహించని అనారోగ్యం కుటుంబ ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేస్తుంది మరియు వారి నిధులను తగ్గిస్తుంది. ఒక హెల్త్ పాలసీ మీ పొదుపులను సరిగ్గా ఉంచుకునేటప్పుడు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం ముగిసినట్లయితే మీరు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం యొక్క 100% రీఇన్స్టేట్మెంట్ను పొందవచ్చు.
అది అనారోగ్యం అయినా లేదా గాయం అయినా, ఫ్యామిలీ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు రోగి యొక్క ఆరోగ్యం, చికిత్స మరియు పునరావాసం కోసం అయ్యే బిల్లులు మరియు చెల్లింపుల బాధ్యతను తీసుకుంటాయి.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మరియు ప్రముఖ ఆసుపత్రులలో ఉత్తమ చికిత్సలను అందుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ దేశంలోని అగ్రశ్రేణి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల ద్వారా అందించబడే ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ప్లాన్లను మీకు అందిస్తుంది. ఇది అన్ని పాలసీలలో కస్టమర్ల ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన మరియు విశ్వసనీయమైన సంస్థ. బజాజ్ ఫైనాన్స్ తక్కువ ఖర్చుతో కూడిన మరియు సౌకర్యవంతమైన సమగ్ర ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. వారి ఆన్లైన్ కస్టమర్ పోర్టల్, పాలసీలను కొనుగోలు చేయడం/రెన్యూవల్ చేయడం లేదా నష్టపరిహారం కోసం దరఖాస్తు చేయడాన్ని చాలా సులభం చేస్తుంది. బజాజ్ ఫైనాన్స్ అద్భుతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని కూడా కలిగి ఉంది.
బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లలో విశ్వాసాన్ని కలిగించే పేరు. ఈ సంస్థ అన్ని రంగాల్లో సమర్థవంతమైన మరియు సరసమైన ఇన్సూరెన్స్ పాలసీలను అందించింది మరియు దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల పంపిణీదారుల్లో ఉత్తమమైన వారిలో ఒకరిగా నిలిచింది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ కస్టమర్ పోర్టల్ త్వరగా, సులభంగా మరియు సురక్షితంగా ఉంటుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కస్టమర్-సెంట్రిక్ విధానంతో సమాచారవంతంగా మరియు ఇంటరాక్టివ్‌గా ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి, మరియు తక్కువ సమయంలో క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది మరియు సులభంగా నిర్వహించబడుతుంది.
కస్టమర్లు మమ్మల్ని ఎందుకు ఇష్టపడతారో ఇక్కడ ఇవ్వబడింది:
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద రిజిస్టర్ చేయబడిన ప్రతి కుటుంబ సభ్యునికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కుటుంబంలోని సభ్యులందరి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఈ పాలసీలో కవర్ చేయబడతాయి.
ఇన్సూరర్‌కు అవసరమైతే, మెడికల్ రిపోర్ట్లు.
ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేయడం చాలా వేగవంతమైన మరియు సులభమైన ప్రాసెస్. చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సైట్లు, ఆన్లైన్లో పాలసీ కొనుగోలు మరియు రెన్యూవల్ కోసం ఒక విభాగాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాసెస్ చాలా సురక్షితమైనది మరియు సూటిగా ఉంటుంది మరియు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలును అవాంతరాలు లేకుండా చేస్తుంది.
ఆన్లైన్లో ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి లేదా రెన్యూ చేయడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఉన్నాయి.
మీరు ఈ క్రింది మార్గాల్లో ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు:
ఒక ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ పన్నులపై ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇది 1961 ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద మీకు ఒక ముఖ్యమైన పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వైద్య ప్రయోజనాలకు అదనంగా, పాలసీ కోసం చెల్లించబడిన ప్రీమియం కూడా మీ వార్షిక ఆదాయ పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకే పాలసీ కింద కుటుంబ సభ్యులందరికీ మెడికల్ కవరేజీని అందించే ఒక సమగ్ర పాలసీ. ఇది సరసమైనది, మరింత సమర్థవంతమైనది, పాలసీదారునికి మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో తల్లిదండ్రులను చేర్చవచ్చు. వారి వయస్సు మరియు ముందుగా ఉన్న వ్యాధులను బట్టి ప్రీమియంలో పెరుగుదల ఉండవచ్చు.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో, వయస్సు మరియు అవసరాలను బట్టి కుటుంబంలోని ప్రతీ సభ్యునికి ప్రత్యేక పాలసీలు ఇవ్వబడతాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో, ఒకే పాలసీ కింద కుటుంబం మొత్తం కవర్ చేయబడుతుంది మరియు సభ్యులందరికీ ప్రయోజనాలు అందించబడతాయి.
పుట్టిన మూడు నెలల తర్వాత, నవజాత శిశువుని ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చవచ్చు.
ప్రాథమిక పాలసీదారు మరణించినట్లయితే, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కుటుంబంలోని ఇతర వయోజన సభ్యులకు పాస్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రీమియం తగ్గించబడదు. తదుపరి రెన్యూవల్ వరకు ఒరిజినల్ పాలసీ యొక్క ప్రయోజనాలు చెక్కుచెదరకుండా ఉంటాయి, తిరిగి రెన్యూవల్ సమయంలో అవసరమైన మార్పులు చేయవచ్చు.
చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పునఃస్థాపన సౌకర్యం ఉంటుంది. హామీ ఇవ్వబడిన మొత్తం ముగిసినట్లయితే, అదనపు ఖర్చులను కవర్ చేయడానికి ఒక టాప్-అప్ మొత్తం జోడించబడుతుంది. టాప్-అప్ మొత్తం యొక్క శాతం పాలసీ నుండి పాలసీకి భిన్నంగా ఉంటాయి.
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక వ్యక్తి కోసం. పోల్చి చూస్తే, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకే పాలసీ క్రింద కుటుంబ సభ్యులందరినీ కవర్ చేస్తుంది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంలు బీమాదారుడి నుండి భీమాదారునికి భిన్నంగా ఉంటాయి. బజాజ్ ఫైనాన్స్ వద్ద మీరు కేవలం మీ జేబులో ఉన్న మొత్తంతో సరిపోయే ప్రీమియంలతో కూడిన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల నుండి ఎంచుకోవచ్చు.
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అందించే కవరేజ్ మరియు దాని కోసం చెల్లించిన ప్రీమియం విలువకు తగినట్లుగా ఉండాలని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నమ్ముతుంది. మీ మొత్తం కుటుంబానికి సమగ్ర కవరేజీని అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి. ఇది అధిక సంఖ్యలో నెట్వర్క్ హాస్పిటల్స్ అందించాలి. హాస్పిటలైజేషన్ లేదా అత్యవసర సమయంలో మీరు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ నుండి క్యాష్‌లెస్ సేవలను పొందవచ్చు. హాస్పిటలైజేషన్కు ముందు మరియు తరువాత, మీరు అనేక పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ హాస్పిటల్లో చేరడానికి ముందు మరియు తర్వాత ఖర్చులను కవర్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ బిజీ జీవనశైలిలో పీరియాడికల్ మెడికల్ చెక్-అప్లు అనివార్యమైనవి. కావున, మీ కుటుంబంలో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులందరికీ కాంప్లిమెంటరీ మెడికల్ చెకప్ అందించే ప్లాన్‌ను ఖరీదు చేయండి. మీరు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో మీ అన్ని అవసరాలకు సరిపోయే, సరైన ప్లాన్లను ఎంచుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్
తేదీ - 22 మార్చ్ 2022
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి సరైన వయస్సు మీ ఇరవైల మధ్యలో మరియు ముప్పైల ప్రారంభంలో ఉంటుంది. ఈ వయస్సులో. మరింత చదవండి
హెల్త్ ఇన్సూరెన్స్
తేదీ - 25 మార్చ్ 2022
హెల్త్ ఇన్సూరెన్స్ కింద మానసిక వ్యాధుల కవరేజ్ గురించి తాజా సమాచారాన్ని అన్వేషించండి. మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే రిసోర్స్‌ను తనిఖీ చేయండి. మరింత చదవండి
హెల్త్ ఇన్సూరెన్స్
తేదీ - 12 మార్చ్ 2022
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్యాటరాక్ట్ సర్జరీ కవరేజ్ గురించి మీరు ఆందోళన పడుతున్నట్లయితే, మీరు ఇప్పుడే రిసోర్స్‌ను తనిఖీ చేసి కంటి సర్జరీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. మరింత చదవండి
హెల్త్ ఇన్సూరెన్స్
తేదీ - 22 మార్చ్ 2022
మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అధిక మరియు తక్కువ మినహాయించదగిన ఇన్సూరెన్స్ ప్లాన్ల గురించి మీరు తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ మినహాయింపు గురించి రిసోర్స్‌ను తనిఖీ చేయండి. మరింత చదవండి
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?