తరచుగా అడగబడే ప్రశ్నలు

ఎవరైనా మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

మెటర్నిటీ ఖర్చులు సాధారణంగా ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల లో అయినా కవర్ చేయబడవు మరియుమెటర్నిటీ-సంబంధిత ఖర్చులు ఈ రోజులలో చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుచేత, గర్భధారణ-సంబంధిత అన్ని ఖర్చుల నుండి రక్షణ కల్పించే మెటర్నిటీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏమేమి కవర్ అవుతాయి?

సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ ఏదైనా మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రసవ సంబంధ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇందులో శిశు జననం తరువాతి సంరక్షణ, టీకాలు మరియు మందులు కూడా కవర్ అవుతాయి.

మెటర్నిటీ ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ పీరియడ్ ఉందా?

అవును, మీ గర్భధారణ-సంబంధిత ఖర్చులను కవర్ చేయుటకు 2 నుండి 6 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందువలన ముందుగానే ఒక మెటర్నిటీ కవర్ తీసుకోవడం మంచిది.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ IVF ను కవర్ చేస్తుందా?

లేదు, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ IVF చికిత్స ఖర్చులను కవర్ చేయదు.