ఆస్తి పైన లోన్

ఆస్తిపై లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు

అస్తిపై లోన్‌కు కావలసిన డాక్యుమెంట్లు

ఆస్తి పై లోన్ కోసం ఎలా అప్లై చెయ్యాలి తెలుసుకోవడానికి మీకు ఈ క్రింది డాక్యుమెంట్లు* అవసరమవుతాయి:

 • జీతం పొందే వారి కోసం

 • ఇటీవలి జీతం స్లిప్పులు

 • గత 3నెలలకు బ్యాంక్ అక్కౌంట్ స్టేట్‌మెంట్

 • PAN కార్డ్/ఆధార్ కార్డ్

 • అడ్రెస్ ప్రూఫ్

 • మార్ట్‌గేజ్ చేయబడే ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలు

 • IT రిటర్న్స్

 • సెల్ఫ్- ఎంప్లాయిడ్ వారి కోసం

 • గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు

 • PAN కార్డ్/ఆధార్ కార్డ్

 • అడ్రెస్ ప్రూఫ్

 • మార్ట్‌గేజ్ చేయబడే ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలు

 

*పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచన కోసం అందించామని గుర్తుంచుకోండి. లోన్ ప్రాసెసింగ్ సమయంలో, అదనపు డాక్యుమెంట్లు అవసరమవగలవు. అదే అంశం అవసరమైన సమయంలో తగిన విధంగా మీకు తెలియజేయబడుతుంది.

ఆస్తిపై లోన్ అర్హతా ప్రమాణాలు

జీతం పొందే వారి కోసం
 

మీరు దిగువ తెలిపిన ప్రమాణాలు కలిగివున్నట్లయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి సులభమైన ఆస్తిపై లోన్ అతివేగంగా పొందవచ్చు:

 • మీరు 33 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండాలి.
 • మీరు ఏదైనా MNCలో లేదా ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో జీతం అందుకొనే వ్యక్తి అయివుండాలి.
 • మీరు భారతదేశపు నివాసి అయి ఉండాలి.

సెల్ఫ్- ఎంప్లాయిడ్ వారి కోసం
 

మీరు క్రింది ప్రమాణాలను నెరవేర్చితే, మీరు వేగవంతమైన లోన్ పంపిణీతో 4 రోజుల్లో సెల్ఫ్- ఎంప్లాయిడ్ వారి కోసం ప్రాపర్టీ పై లోన్ కోసం మీరు అర్హులవుతారు

 • మీరు 25 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండాలి.
 • మీరు నిరంతరం ఖచ్చితమైన ఆదాయ వనరు కలిగి ఉన్న ఒక సెల్ఫ్- ఎంప్లాయిడ్ వ్యక్తి అయి ఉండాలి
 • మీరు క్రింది నగరాల్లో నివసిస్తున్న భారతదేశపు నివాసి అయి ఉండాలి

పట్టణాల జాబితా:
 

హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై,థానే, పుణె, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూర్, అహ్మదాబాద్, వైజాగ్, ఉదయ్‌పూర్, సూరత్, ఇండోర్, కొచ్చిన్, ఔరంగాబాద్

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఆస్తి పై లోన్ పొందడానికి క్రింద పేర్కొన్న ప్రాథమిక అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి:

అర్హతా ప్రమాణం జీతంగల వ్యక్తి స్వయం-ఉపాధిగల వ్యక్తి
బారోవర్ వయస్సు ఇంత మధ్య ఉండాలి 33 మరియు 58 సంవత్సరాలు 25 మరియు 70 సంవత్సరాలు
నివాస స్థితి భారతదేశం యొక్క నివాసి అయి ఉండడం అవసరం కింది నగరాల్లో ఒకదానిలో నివసిస్తున్న భారతదేశం యొక్క నివాసి అయి ఉండడం అవసరం.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పూణే, బెంగళూరు, చెన్నై, ఉదయ్‌పుర్, వైజాగ్, సూరత్, కొచ్చిన్, ఔరంగాబాద్, ఇండోర్.
ఉద్యోగం యొక్క స్థితి ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ లేదా MNC లో ఉపాధి పొందే జీతం పొందే వ్యక్తి అయి ఉండాలి ఒక స్వయం-ఉపాధి పొందే వ్యక్తి అయి ఉండాలి ఇది క్రమానుగత ఆదాయ వనరులు కలిగి ఉండాలి
గరిష్ట లోన్ అవధి అందుబాటులో ఉంది 2 మరియు 20 సంవత్సరాల మధ్య అనువైన అవధి 18 సంవత్సరాల వరకు అనువైన అవధి
అర్హత కలిగిన గరిష్ట లోన్ మొత్తం రూ. 1 కోట్ల వరకు రూ. 3.5 కోట్ల వరకు

రెగ్యులర్ ఆదాయానికి ప్రూఫ్ తో పాటుగా ఒక అప్లికెంట్ తప్పక అవసరమైన ఆస్తి డాక్యుమెంట్లను కూడా కలిగి ఉండాలి. మీరు అర్హతా ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత, 48 గంటల్లో సత్వర అప్రూవల్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లతో బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఆస్తి పై లోన్ కోసం అప్లై చెయ్యండి.

ఆస్తిపై లోన్ అర్హతా ప్రమాణాలు తరచుగా అడిగే ప్రశ్నలు

ఆస్తిపై లోన్ కోసం అవధి ఎంత ఉంటుంది?

వ్యాపారం లేదా వ్యక్తిగత కారణాల కోసం మీకు అధిక-విలువ ఫైనాన్సింగ్ అవసరమైతే, బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఒక ఆస్తి పై లోన్ అనేది చాలా సరైన ఫైనాన్సింగ్ పరిష్కారం కాగలదు. రూ. 3.5కోట్ల వరకు పొందటానికి ఆస్తి పై లోన్ అర్హతను నెరవేర్చండి. మీ ఫైనాన్సెస్ ప్రకారం రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.

మీరు 2 సంవత్సరాల నుండి ప్రారంభించి ఒక అనుకూలమైన రీపేమెంట్ షెడ్యూల్‌ను ఎంచుకోవచ్చు. ఆస్తి పై లోన్ కోసం మ్యాగ్జిమం అవధి 20 సంవత్సరాలు.

సరైన అవధిని ఎంచుకోండి

 • మీ ప్రస్తుత ఆర్థిక బాధ్యతలను విశ్లేషించండి.
 • స్పష్టంగా కనిపించే నెలవారీ బడ్జెట్‌ను సమీక్షించండి.
 • ఆర్థిక అవకాశాలను మూల్యాంకన చేయండి.

మీరు మరింత దీర్ఘమైన ఆస్తి పై లోన్ అవధిని ఎంచుకుంటే, EMI లు తక్కువగా ఉంటాయి, అయితే చెల్లించవలసిన మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది మరియు వైస్ వెర్సా.

తనఖా లోన్ అప్రూవల్ కోసం ఏ సెక్యూరిటీ అవసరం?

ఆస్తి పై లోన్ అనేది భారతదేశంలో అత్యంత ఇష్టపడే సెక్యూర్డ్ లోన్లలో ఒకటి, దీనిని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 75% - 90% వరకు లోన్ గా అందిస్తుంది. దీన్ని పొందటానికి, తనఖా లోన్ ఇన్స్టెంట్ అప్రూవల్ మరియు పంపిణీ కోసం కింది వాటిలో దేనినైనా కొల్లేటరల్ గా అందించండి –

 • రెసిడెన్షియల్ ఆస్తులు (స్వంతగా-ఉంటున్నవి మరియు అద్దెకు ఇవ్వబడినవి రెండూ).
 • కమర్షియల్ ఆస్తులు (స్వంతగా-ఉంటున్నవి మరియు అద్దెకు ఇవ్వబడినవి రెండూ).
 • నిర్మాణం ఏదీ లేకుండా రెసిడెన్షియల్ ప్లాట్.
 • ఇండస్ట్రియల్ ఆస్తులు.

వయస్సు, ఉపాధి స్థితి మొదలైన వాటికి సంబంధించిన సాధారణ అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి మరియు వేగవంతమైన తనఖా లోన్ అప్రూవల్ ఆనందించడానికి అతి తక్కువ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.. రూ. 3.5 కోట్ల వరకు ఫండ్స్ కోసం బజాజ్ ఫిన్‌సర్వ్‌తో అప్లై చేయండి.

ఆస్తిపై లోన్ ని దేని కోసం ఉపయోగించవచ్చు?

మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఫైనాన్సింగ్ ఎంపికల్లో, ఆస్తి పై లోన్ రుణగ్రహీతలలో ఆదరణ పొందుతోంది. అది ప్రజాదరణ పొందడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆస్తి పై లోన్ యొక్క ఉపయోగాలు. మీరు ఫండ్స్ ని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు –

వ్యక్తిగత ప్రయోజనాలు

 • ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య సమస్యలు
 • ఉన్నత విద్య
 • వెడ్డింగ్
 • ఒక అధిక-విలువ కొనుగోలు మొదలైన వాటి కోసం డౌన్ పేమెంట్.

వ్యాపార ప్రయోజనాలు

 • విదేశాలకు వ్యాపార ట్రిప్
 • వ్యాపార విస్తరణ
 • స్టాక్ ఇన్వెంటరీ
 • మార్కెటింగ్ మరియు ప్రమోషన్ మొదలైనవి.

రుణగ్రహీతలు మరింత ఎక్కువ అవధి, అతి తక్కువ డాక్యుమెంటేషన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం వంటి ఆస్తి పై లోన్ ప్రయోజనాలను ఆనందించవచ్చు. ఆస్తిపై లోన్ ని ఎలా ఉపయోగించాలి తెలుసుకోండి మరియు మీ అన్ని అవసరాలను తీర్చడానికి ఫండ్స్ ను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోండి.

ఆస్తి పై లోన్ కోసం ఒక కో-అప్లికెంట్ ఉండవచ్చా? ఆవును అయితే, ఒక కో-అప్లికెంట్ గా ఎవరు ఉండవచ్చు?

తనఖా యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా బజాజ్ ఫిన్సర్వ్ కస్టమైజ్డ్ ఆస్తి పై లోన్లు అందిస్తోంది. అవసరమైన మొత్తాన్ని మంజూరు చేయడానికి ఆస్తి విలువ సరిపోకపోతే, మీరు ఒక ఆస్తి పై లోన్ కో-అప్లికెంట్కోసం ఎంచుకోవచ్చు.

ఒక ఆస్తిపై లోన్ కు కో-అప్లికెంట్ గా ఎవరు ఉండవచ్చు?

ఈ కో-అప్లికెంట్లలో ఎవరితోనైనా ఎక్కువ మొత్తం కోసం సులభంగా అప్లై చేసుకోండి –

 1. సహోదరులు
 2. జీవిత భాగస్వామి
 3. తల్లిదండ్రుల్లో ఎవరైనా
 4. తల్లిదండ్రులు మరియు పెళ్లికాని కుమార్తెలు

ఆస్తిపై లోన్ కోసం ఒక కో-అప్లికెంట్ గా ఉండగల వ్యక్తులు వీరు. అవసరమైన అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయడం నిర్ధారించుకోండి, బజాజ్ ఫిన్‌సర్వ్‌తో రూ. 3.5 కోట్ల వరకు మొత్తాల కోసం అప్లై చేసుకోండి.

ఆస్తి పై లోన్ గురించి వీడియోలు