సిఎ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

మా సిఎ లోన్‌ను పొందడానికి కేవలం కొన్ని సులభమైన దశలలో ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.

సిఎ లోన్ అప్లికేషన్ ప్రాసెస్

సిఎ లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ గైడ్

  1. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయండి.
  2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
  3. మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేదీ మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
  4. మీరు మీ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, రుణం ఎంపిక పేజీని సందర్శించడానికి దయచేసి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
  5. మీకు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి. మా మూడు సిఎ లోన్ వేరియంట్ల నుండి ఎంచుకోండి - టర్మ్, ఫ్లెక్సీ టర్మ్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్.
  6. రీపేమెంట్ అవధిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు అవధి ఎంపికలను ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయవచ్చు'.
  7. మీ కెవైసి ని పూర్తి చేయండి మరియు మీ సిఎ లోన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

గమనిక: కెవైసి ప్రక్రియను పూర్తి చేయడానికి మీ సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోండి.

మా ప్రతినిధి తదుపరి దశలలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత రుణం మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు పొందగల గరిష్ఠ సిఎ లోన్ మొత్తం ఎంత?

మీరు ఒక ప్రాక్టీసింగ్ సిఎ అయితే, మీరు మా సాధారణ అర్హతా పరామితులను నెరవేర్చడం ద్వారా రూ. 55 లక్షల వరకు రుణం పొందవచ్చు.

సిఎ లోన్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

మీకు ఇటువంటి డాక్యుమెంట్లు అవసరం:

  • పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి లేదా పాస్‌పోర్ట్ వంటి కెవైసి డాక్యుమెంట్లు
  • సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు
నాకు ఇప్పటికే ఒక లోన్ ఉంటే నేను సిఎ లోన్ కోసం అప్లై చేయవచ్చా?

మీకు ఇప్పటికే ఉన్న లోన్ ఉన్నప్పటికీ మీరు సిఎ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే, మేము అప్రూవల్‌కు ముందు మీ రుణం రీపేమెంట్ సామర్థ్యాన్ని విశ్లేషిస్తాము. గుర్తుంచుకోండి, అనేక రుణాల కోసం అప్లై చేయడం వలన మీ సిబిల్ స్కోర్ ప్రతికూలంగా ప్రభావితం అవ్వచ్చు మరియు మరొక రుణం పొందే అవకాశాలను ప్రభావితం చేయవచ్చు.

ఫ్లెక్సీ టర్మ్ లోన్ అంటే ఏమిటి?

ఫ్లెక్సీ టర్మ్ లోన్ అనేది మా సిఎ లోన్‌కు చెందిన ప్రత్యేక వేరియంట్. ఇది మీకు కేటాయించబడిన రుణం మొత్తం నుండి విత్‍డ్రా చేసుకోవడానికి లేదా మీకు అవసరమైనప్పుడు మీ రుణంలో ఒక భాగాన్ని చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు విత్‍డ్రా చేసే మొత్తం పై మాత్రమే వడ్డీ ఛార్జ్ చేయబడుతుంది. మరియు ఎటువంటి పాక్షిక-ప్రీపేమెంట్ ఫీజు వర్తించదు.

మరింత చూపండి తక్కువ చూపించండి