మీ రుణం ప్రీపే చేయడానికి ప్రాసెస్ మరియు ఛార్జీలను తెలుసుకోండి

2 నిమిషాలలో చదవవచ్చు

పార్ట్-ప్రీపేమెంట్ అంటే మీరు ఒకేసారి 1 ఇఎంఐ కంటే ఎక్కువ మొత్తంతో మీ రుణాన్ని తిరిగి చెల్లించడం. భవిష్యత్తులో ఇఎంఐ లను తగ్గించడంలో, క్రెడిట్ స్కోర్‌ని పెంచడంలో మరియు తక్కువ వ్యవధిలో త్వరగా రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

పార్ట్-ప్రీపేమెంట్ చేయడానికి, మీరు కనీసం 1 ఇఎంఐ కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది, మరియు మీరు పార్ట్-ప్రీపే చేయగల గరిష్ట మొత్తం పై ఎటువంటి పరిమితి లేదు. అయితే, మీరు పాక్షిక-ప్రీపే చేస్తున్న మొత్తం పై 2% (మరియు పన్నులు) ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరోవైపు, మీరు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కోసం పార్ట్-ప్రీపే చేస్తున్నట్లయితే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.

మీరు పార్ట్-ప్రీపేమెంట్ చేయడానికి ముందు, బజాజ్ ఫిన్‌సర్వ్ పార్ట్-ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ని ఉపయోగించండి. ఇది ప్రీపేమెంట్ తర్వాత మీరు చెల్లించాల్సిన రివైజ్డ్ ఇఎంఐ, మీరు పొందే సేవింగ్స్, అలాగే మీ సవరించిన అవధిని చూపుతుంది.

కావున, మీరు ఉద్యోగంలో బోనస్ లేదా నగదు బహుమతిని అందుకున్నట్లయితే, దానిని పార్ట్-ప్రీపేమెంట్‌లో ఉంచడం గురించి ఆలోచించండి, పర్సనల్ లోన్ రీపేమెంట్‌ను అవాంతరాలు- లేకుండా చేయండి.

పాక్షిక-చెల్లింపు ఛార్జీలను తెలుసుకోవడానికి బజాజ్ కస్టమర్ పోర్టల్కు లాగిన్ అవ్వండి.

మరింత చదవండి తక్కువ చదవండి