తరచుగా అడిగే ప్రశ్నలు

వివిధ రకాల ఫ్లెక్సీ లోన్లు ఏవి?

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లెక్సీ లోన్‌లో రెండు రకాలు ఉన్నాయి:

  • ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్: ఇది ఒక మానిటరీ లోన్, ప్రారంభ అవధుల సమయంలో మీరు ఉపయోగించిన లోన్ మొత్తంపై మాత్రమే వడ్డీ ఇఎంఐగా చెల్లించబడుతుంది. అయితే, తదుపరి కాలవ్యవధులలో మీరు మీ వినియోగించిన లోన్ మొత్తంపై మాత్రమే వడ్డీ మరియు అసలు రెండింటినీ చెల్లిస్తారు. ఇది మొదటి కొన్ని సంవత్సరాల్లో మీ నగదు ప్రవాహాన్ని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.
  • ఫ్లెక్సీ టర్మ్ లోన్: ఇది నిర్ణీత వ్యవధిలో సాధారణ చెల్లింపుల్లో తిరిగి చెల్లించే ఒక మానిటరీ లోన్. ఇక్కడ, మీ ఇఎంఐలో అసలు మరియు వడ్డీ చెల్లింపులు రెండూ ఉంటాయి. ఉపయోగించిన మొత్తంపై వడ్డీ విభాగం వసూలు చేయబడుతుంది.
ఫ్లెక్సీ టర్మ్ లోన్ ఫీచర్లు ఏవి?

ఫ్లెక్సీ టర్మ్ లోన్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి, అది ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన:

  • ఈ ప్రొడక్టుతో మీరు ప్రీ-పే చేయవచ్చు మరియు మీకు కావలసినన్ని సార్లు డబ్బును డ్రాడౌన్/ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఇది సులభమైన మరియు అవాంతరాలు లేని ప్రాసెస్.
  • మీరు ఉపసంహరించుకున్న మొత్తంమీద మాత్రమే వడ్డీ ఛార్జి చేయబడుతుంది కానీ మొత్తం రుణ మొత్తం పై కాదు.
  • ఈ సదుపాయాన్ని పొందిన తరువాత మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు, ఈ విధంగా మీరు వడ్డీ ఖర్చులను ఆదా చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
  • నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా మీ లోన్‌ కోసం ప్రీ-పేమెంట్లు చేయడానికి మిమ్మల్ని అనుమతించే అవాంతరాలు-లేని, సులభమైన, సజావుగా సాగే ఆన్‌లైన్ లావాదేవీలను మీరు ఆనందిస్తారు.
టర్మ్ లోన్ల నుండి ఫ్లెక్సీ లోన్లు ఎలా భిన్నంగా ఉంటాయి?
  • ఫ్లెక్సీ లోన్లు మరియు టర్మ్ లోన్ల మధ్యనున్న ప్రధాన వ్యత్యాసాల్లో వడ్డీ రేటు కూడా ఒకటి. ఫ్లెక్సీ లోన్ విషయంలో వడ్డీ అమౌంటు అనేది లోన్ పరిమితిపై కాకుండా వినియోగించిన మొత్తంపై మాత్రమే లెక్కించబడుతుంది. అయితే, టర్మ్ లోన్స్ కోసం వడ్డీ రేటు అసలు మొత్తంపై లెక్కించబడుతుంది.
  • ఫ్లెక్సీ లోన్‌లో పార్ట్ పేమెంట్ కోసం అదనపు ఛార్జీలు లేవు కానీ టర్మ్ లోన్‌ విషయంలో ఇది వర్తిస్తుంది.
  • "ఫ్లెక్సీ లోన్"లో మీరు అదనపు పార్ట్ పేమెంట్ చెల్లించినట్లయితే మీరు అమౌంటును విత్‌డ్రా చేసుకోవచ్చు కానీ, టర్మ్ లోన్ కోసం ఏదైనా పార్ట్ పేమెంట్ చెల్లించినట్లయితే మీరు విత్‌డ్రా చేయలేరు.
నేను ఫ్లెక్సీ లోన్ కోసం అప్లై చేయడాన్ని ఎంచుకుంటే ఏ ప్రయోజనాలను పొందగలను?

మీ క్యాష్ ఫ్లో అవసరాలకు అనుగుణంగా మీ లోన్ అకౌంటు ద్వారా ట్రాన్సాక్షన్లు (ప్రీపే మరియు డ్రాడౌన్/విత్‍డ్రా) చేసే సౌకర్యాన్ని మీరు పొందుతారు. అలాగే, మీరు వినియోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించడం ద్వారా పొదుపును పెంచుకుంటారు.

పార్ట్-ప్రీపేమెంట్ అంటే ఏమిటి?

పార్ట్-ప్రీపేమెంట్ అనేది ఒక రకమైన లోన్ రీపేమెంట్ పద్ధతి, దీనిలో మీ వద్ద మిగులు నిధులు ఉన్నప్పుడు మీరు మీ రుణ మొత్తంలో ఒక భాగాన్ని చెల్లించాలి. మీరు మీకు కావలసినన్నిసార్లు పార్ట్ చెల్లింపులు చేయవచ్చు. అయితే, మీరు పార్ట్-ప్రీపేమెంట్ చేసినప్పుడు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు అదనపు ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ మీరు మా ఫ్లెక్సీ లోన్ వేరియంట్లను ఎంచుకున్నట్లయితే, మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ లోన్‌ను పార్ట్-ప్రీపే చేయవచ్చు.

దయచేసి గమనించగలరు, మీరు మీ ఫ్లెక్సీ లోన్ అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మీ బాకీ ఉన్న అసలు మొత్తంగా కనీసం రూ.100 బ్యాలెన్స్‌ను నిర్వహించాలి.

నా ఫ్లెక్సీ లోన్ పై వడ్డీ రేటు (ఆర్ఒఐ) ఎలా లెక్కించబడుతుంది?

మీ రోజువారీ గరిష్ట వినియోగం మొత్తంపై వడ్డీ లెక్కించబడుతుంది. ఉదాహరణకు, మీ ఇన్‌స్టాల్‌మెంట్ గడువు తేదీ నెలలో 2 వ తేదీ అయితే, అప్పుడు మీ వడ్డీ గత నెల 27 నుండి తదుపరి నెల 26 వరకు లెక్కించబడుతుంది. 

వార్షిక నిర్వహణ ఛార్జీ (ఎఎంసి) అంటే ఏమిటి?

వార్షిక నిర్వహణ ఛార్జీ (ఎఎంసి) అనేది మీ లోన్ అకౌంటును యాక్టీవ్‌గా ఉంచడానికి మరియు మీకు సేవలను అందించడానికి మేము ప్రతి సంవత్సరం విధిస్తున్న నామమాత్రపు ఫీజు:

  • మీ అవసరాలకు అనుగుణంగా మీ లోన్‌ను పార్ట్ పే చేయండి మరియు డ్రాడౌన్/విత్‌డ్రా చేయండి
  • మీ లోన్ అకౌంట్ వివరాలను ఎప్పుడైనా మరియు ఎక్కడినుండైనా యాక్సెస్ చేయండి
    గమనిక - మీ లోన్ వేరియంట్ ప్రకారం ఎఎంసి ఛార్జీలు వసూలు చేయబడతాయి. మరిన్ని వివరాల కోసం దయచేసి "మీ లోన్ అగ్రిమెంట్‌ను చూడండి"“
నేను వార్షిక నిర్వహణ ఛార్జీని ఎప్పుడు మరియు ఏవిధంగా చెల్లించగలను?

మీ లోన్ పంపిణీ చేసిన నెల ప్రకారం మీరు ప్రతి సంవత్సరం వార్షిక నిర్వహణ ఛార్జీని చెల్లించాలి. ఈ అమౌంటు ఆటోమేటిక్‌గా మీ బ్యాంకు అకౌంట్ నుండి డెబిట్ చేయబడుతుంది.

నేను నా రుణాన్ని ఎప్పుడు ఫోర్‌క్లోజ్ చేయగలను?

మీరు మీ 1వ ఇఎంఐ క్లియర్ చేసిన/ చెల్లించిన తర్వాత, ఎప్పుడైనా మీ రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేయవచ్చు.

దయచేసి గమనించండి: మీ లోన్ అగ్రిమెంట్ ప్రకారం ఫోర్‍క్లోజర్ ఛార్జీలు వర్తిస్తాయి.

మరింత చదవండి తక్కువ చదవండి