ఆస్తి పై లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించే విధానం

ఒక ఆస్తి పై లోన్ అర్హత క్యాలిక్యులేటర్ అనేది అనేక ప్రమాణాలను బట్టి మీకు అర్హత గల లోన్ మొత్తాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ కింది సమాచారాన్ని విశ్లేషించి ఫలితాన్ని అందిస్తుంది:

  • పుట్టిన తేదీ
  • నగరం
  • నికర నెలసరి జీతం
  • లోన్ కాలపరిమితి
  • ఇతర నెలవారీ ఆదాయం
  • ప్రస్తుత ఇఎంఐలు లేదా బాధ్యతలు

అర్హత క్యాలిక్యులేటర్ ఏవిధంగా పనిచేస్తుంది?

గరిష్ఠ నెలవారీ జీతం మరియు ప్రస్తుతం ఉన్న తక్కువ ఆర్థిక బాధ్యతలు అధిక రుణ మొత్తాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉదాహరణకు:

  • మీరు నెలకు రూ. 50,000 ఆదాయాన్ని పొందినట్లయితే మరియు 18-సంవత్సరాల లోన్ అవధిని ఎంచుకుంటే సుమారు రూ. 37 లక్షల వరకు ఆస్తి పై లోన్ కోసం అర్హత పొందుతారు
  • మీకు రూ. 10,000 విలువగల ఇప్పటికే ఉన్న ఇఎంఐలు/బాధ్యతలు ఉంటే లోన్ అమౌంటు సుమారు రూ.26 లక్షలకు తగ్గుతుంది
  • ఎలాంటి ప్రస్తుత ఇఎంఐ బాధ్యతలు లేకుండా మీ నెలవారీ ఆదాయం రూ. 30,000 అయితే, లోన్ మొత్తం సుమారు రూ. 22 లక్షలకు తగ్గుతుంది

కావున, ప్రస్తుత లోన్లను ఫోర్‍క్లోజ్ చేయడం మరియు క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడం అనేవి మీ లోన్ అర్హతను పెంచుతాయి. మీరు లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌లో విలువలను ఎంటర్ చేసినప్పుడు మీ ఆదాయం, బాధ్యతలు మరియు లోన్ మొత్తం మధ్య ఈ సంబంధాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.

ఒక లోన్ కోసం జాయింట్‌గా అప్లై చేయడం అనేది మీకు అర్హత గల లోన్ మొత్తాన్ని పెంచుతుంది. ఒక జాయింట్ దరఖాస్తుదారుగా తల్లిదండ్రులు, సోదరులు, కుమారుడు లేదా పెళ్లి కాని కుమార్తె అయి ఉండవచ్చు. సహ-దరఖాస్తుదారు కొన్ని అర్హత ప్రమాణాలను కూడా నెరవేర్చాలని గమనించడం చాలా ముఖ్యం. ఒక సహ-దరఖాస్తుదారుతో కలిసి అప్లై చేయడం అనేది మీకు అర్హత గల రుణం మొత్తాన్ని పెంచుతుంది.

ఆస్తి పై లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ద్వారా లెక్కించిన రుణం మొత్తం తాత్కాలికమైనది అని దయచేసి గమనించగలరు. రుణగ్రహీతలు వారి ఆస్తి విలువలో 80% వరకు లోన్లు పొందవచ్చు.
లోన్-టు-వాల్యూ కూడా లోన్ అప్రూవల్ లేదా తిరస్కరణను నిర్ణయిస్తుంది. అధిక ఎల్‌టివి కోసం అప్లై చేయడం అనేది లోన్ తిరస్కరణకు దారితీయవచ్చు, ఎందుకనగా అధిక రుణం ప్రమాదకరం; తక్కువ ఎల్‌టివి అనేది రుణం ఆమోద అవకాశాలను మెరుగుపరుస్తుంది.
పేర్కొన్న అంశాలు మాత్రమే కాకుండా, తుది అర్హత కలిగిన లోన్ అమౌంట్ అనేది మీరు నెరవేర్చాల్సిన అనేక ఇతర అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

అర్హత ప్రమాణాలు ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ కోసం ఆస్తి పై లోన్ అర్హతా ప్రమాణాలలో ఇవి ఉంటాయి:

  • CIBIL score

    సిబిల్ స్కోర్

    కనీసం 750

  • Age

    వయస్సు

    జీతం పొందేవారి కోసం 28 నుండి 58 సంవత్సరాల మధ్య* మరియు స్వయం-ఉపాధి గలవారి కోసం 25 నుండి 70 మధ్య*

  • Work experience (for salaried)

    పని అనుభవం (జీతం పొందేవారి కోసం)

    ఒక పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ కంపెనీ లేదా ఎంఎన్‍సి వద్ద కనీసం 3 సంవత్సరాలు

  • Business continuity (for self-employed)

    వ్యాపార కొనసాగింపు (స్వయం-ఉపాధి గలవారికి)

    ప్రస్తుత సంస్థలో కనీసం 5 సంవత్సరాలు

అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

ఆస్తిపై లోన్ కోసం అప్లై చేయడానికి దరఖాస్తుదారులు ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

  • తనఖా పెట్టవలసిన ఆస్తి డాక్యుమెంట్లు
  • ఆధార్ లేదా పాన్
  • అడ్రస్ ప్రూఫ్
  • ఆదాయం పన్ను రిటర్న్స్
  • రుణం దరఖాస్తుదారుల కోసం 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు
  • ఫారం 16 లేదా తాజా జీతం స్లిప్స్

పైన పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా సూచనాత్మకమైనదని దయచేసి గమనించండి. మీరు డిమాండ్ పై అదనపు డాక్యుమెంట్లను అందించవలసి రావచ్చు.

రుణం ఇఎంఐలను ఎలా లెక్కించాలి?

ఇఎంఐ లెక్కింపుల కోసం ఆస్తి పై లోన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి మరియు లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు చెల్లించవలసిన నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‍లను తెలుసుకోండి. మీ రీపేమెంట్ సామర్థ్యాల ప్రకారం తగిన లోన్ అవధిని కనుగొనడానికి కూడా ఈ టూల్ మీకు సహాయపడుతుంది.