Bajaj Finance Best Investment Plans

ఫిక్సెడ్ డిపాజిట్ వర్సెస్ రియల్ ఎస్టేట్స్

ఫిక్సెడ్ డిపాజిట్ వర్సెస్ రియల్ ఎస్టేట్స్

మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో తక్కువ రిస్క్ మరియు మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్ల యొక్క ఒక మంచి కలయిక అయి ఉండాలి. సాధారణంగా, మీరు తక్కువ రిస్క్ ఇన్వెస్ట్మెంట్లతో తక్కువ రిటర్న్స్ పొందుతారు మరియు స్టేక్స్ అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ పొందుతారు. అయితే, తక్కువ-రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు సాధారణంగా స్టెబిలిటీ మరియు ఎస్యూర్డ్ రిటర్న్స్ అందిస్తాయి. రిస్క్ గురించి వారికి ఉన్న కోరికని బట్టి, ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ ఇన్వెస్ట్మెంట్ సాధనాల కోసం చూస్తారు.

ఫిక్సెడ్ డిపాజిట్ మరియు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లు రెండూ కూడా ఎంతో కాలం నుంచి ఉన్న అత్యంత పాపులర్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఒకటిగా ఉన్నాయి. అయితే, అవి రెండూ కూడా విభిన్నమైనవి మరియు ఇన్వెస్టర్ల విభిన్న అవసరాలను నెరవేర్చుతాయి.
మీరు షార్ట్-టర్మ్ లేదా లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నా, ఫిక్సెడ్ డిపాజిట్లు మరియు రియల్ ఎస్టేట్ మధ్య ఎంచుకోవడానికి ఈ పరిగణనలు మీకు సహాయపడగలవు.

గ్యారెంటీడ్ రిటర్న్స్:

ప్రజలు తరచూ తొలగించడానికి వీల్లేని అపోహలకు లోనవుతూ ఉంటారు. ప్రాపర్టీ ధరలు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటాయి అనేది అటువంటి కల్పనల్లో ఒకటి. భారతదేశంలో ప్రాపర్టీ ధరలు ఒకసారి కళ్ళుతిరిగే ఎత్తుకు చేరుకున్నాక మార్కెట్ నిలిచిపోయే లేదా ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి, ఇది అనేక సందర్భాలలో జరిగింది. మీరు పెద్ద లాభాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెడుతూ ఉంటే, మీకు రియల్ ఎస్టేట్ అందించేది ఎక్కువ. అయితే, మీరు గ్యారెంటీఢ్ రిటర్న్స్ కోసం చూస్తున్నట్లయితే, అప్పుడు FDలను ఎంచుకోండి. ఫిక్సెడ్ డిపాజిట్లు మార్కెట్ ఒడుదుడుకులతో ప్రభావితం కావు మరియు కాలక్రమంలో స్థిరమైన వడ్డీ రేటుని అందిస్తాయి. FD క్యాలిక్యులేటర్ సహాయంతోనైనా, మీరు మీ ఫైనల్ మెచ్యూరిటీ మొత్తంను చెక్ చేసుకోవచ్చు.

అఫోర్డబిలిటీ మరియు ప్రాఫిట్:

ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ప్రజలు తరచూ లోన్ తీసుకుంటారు లేదా తమ సేవింగ్స్ అన్నింటినీ ఉపయోగిస్తారు. ఇది తప్పు కానప్పటికీ, మీరు లాభం కోసం దానిని విక్రయించగలుగుతారని మీరు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి, కొనుగోలు శక్తి మరియు భారతదేశం అంతటా ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరల మధ్యగల అసమతుల్యతని ఫ్యాక్టర్ ఇన్ చేయడం అనేది ముఖ్యం. ఉదాహరణకు, ముంబైలో ఒక 1 BHK ఫ్లాట్ ధర ట్యాగ్ రూ.1.8 నుంచి రూ. 2కోట్ల మధ్య ఉంటుంది. మీరు ఈ ఫ్లాట్ కొనడానికి ఒక 20 - సంవత్సరాల లోన్ తీసుకున్నప్పటికీ, మీరు ఒక లక్షకు పైగా ఉండే EMI లను చెల్లించాలి. అంటే మీరు నెలకు రూ ..3.3–4 లక్షల జీతం సంపాదించాలి అని అర్ధం. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, మీరు దానిని అఫోర్డ్ చేయగలరా అని. ఫిక్సెడ్ డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ కాలిక్యులేషన్లు చేయడం గురించి మీరు చింతించవలసిన పని లేదు. మీరు రూ. 25, 000 అంత తక్కువతో ఒక ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ తెరవవచ్చు మరియు స్థిరమైన రిటర్న్స్ సంపాదించవచ్చు.

అదనపు ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు:

మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అపార్ట్మెంట్ లేదా ప్రాపర్టీ కోసం చెల్లింపు కాకుండా, మీరు ఇతర ఖర్చులు భరించవలసి రావచ్చు ఓనర్షిప్ టైటిల్స్ నుంచి స్టాంప్ డ్యూటీ కాస్ట్ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల వరకు ఫ్యాక్టర్ ఇన్ చేయడానికి ఎంతో ఉంటుంది. రెంటింగ్ రియల్ ఎస్టేట్ నుంచి జనరేట్ చేయబడిన రిటర్న్ రేటు సంవత్సరానికి కేవలం2.5% మాత్రమే అయిన సందర్భాలు ఉన్నాయి.

మీరు మంచి వడ్డీ రేట్లు సంపాదించవచ్చు కాబట్టి ఫిక్సెడ్ డిపాజిట్లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక సింపల్ FD కాలిక్యులేటర్ ఉపయోగించడంతో మీరు దీర్ఘకాలంలో, ఎంత మొత్తం డబ్బు సంపాదించవచ్చో మీరు అర్థం చేసుకోవచ్చు.

ఇందులో ఉండే ప్రాసెస్ గురించి ఆలోచించండి:

రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే, ఆ ప్రాపర్టీ, దాని ఇరుగుపొరుగు, చుట్టపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవడానికే మీరు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీరు చెల్లిస్తున్న ధర జస్టిఫై చేయవచ్చో లేదో తెలుసుకునేందుకు ఒక కాంపిటెంట్ ప్రొఫెషనల్ ద్వారా మీ ప్రాపర్టీకి వెల కట్టించుకోవడం కూడా మంచిది. ప్రాపర్టీని వెతకడానికి చెప్పుకోదగినంత సమయం కూడా పడుతుంది. మీరు ముందుగానే మీ సమయాన్ని, మరియు సోర్సులను ప్లాన్ చేసుకునేందుకు ప్రయత్నించాలి, మరియు సరైన రియల్ ఎస్టేట్ భాగంలో ఇన్వెస్ట్ చేసేందుకు మీకు సమయం ఉన్నదా అనేది పరిగణించాలి.

మరోవైపు, మీరు ఫిక్సెడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాసెస్ చాలా సులభం. మీరు సులభంగా ఆన్‍లైన్ లో అప్లై చేసి, ప్రారంభించవచ్చు.

ట్రాన్స్పరెన్సీ:

సమాచారం అంతా విక్రయించేవారి వద్ద ఉండి కొనుగోలుదారులు దానిని ఎల్లప్పుడూ వెరిఫై చేయలేనప్పుడు రియల్ ఎస్టేట్ సిస్టమ్ అనేది సమాచార అసమానతను చూపుతుంది. ప్రతి ఒక్క క్లెయిమ్ వెరఫై చేసే అవాంతరం మీకు అక్కర్లేదు అనుకుంటే, అందుకు బదులుగా ఒక అవాంతరం లేని ఇన్వెస్ట్మెంట్ ఎంపికను ఎంచుకోండి.

ఒక FD ట్రాన్స్పెరెంట్ గా ఉంటుంది మరియు చేయబడిన క్లెయిములను సులభంగా వెరఫై చేయవచ్చు. ఒక అధిక-వడ్డీ కంపెనీ FD పై అప్రూవల్ రేటింగ్‍ని మీరు అధ్యయనం చేసి, మీ పెట్టుబడి సురక్షితమైన చేతుల్లో ఉందని తెలుసుకుని అప్లై చేయవచ్చు.

ఇప్పుడు మీ కోసం ఏది మంచిదో మీకు తెలుసు కాబట్టి, మీ ప్రస్తుత మరియు భవిష్యత్ పోర్ట్ఫోలియోను ప్లాన్ చేసుకోవలసిన సమయం ఇది. ఒక FD దానిలో ఒక భాగం అని నిర్ధారించుకుని, బజాజ్ ఫైనాన్స్ తో ఫిక్సెడ్ డిపాజిట్ కోసం అప్లై చేయండి. ఇది అద్భుతమైన FD వడ్డీ రేట్లు అలాగే మీ ఆర్థిక అవసరాలను సరిపోయే ఒక అనువైన అవధిని అందిస్తుంది.

ఇప్పుడే ఒక FD అకౌంట్ తెరవాలని అనుకుంటున్నారా? ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ తెరవడం ఎలా చదవండి.