కాల్, SMS, ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని చేరుకోండి లేదా మా బ్రాంచ్ ఆఫీసులలో ఒకదానిని సందర్శించండి.

Contact Us FAQ

  1. మమ్మల్ని సంప్రదించండి
  2. >
  3. రిజల్యూషన్ ప్లాన్ పై తరచుగా అడిగబడే ప్రశ్నలు (COVID-19)

రిజల్యూషన్ ప్లాన్ పై తరచుగా అడిగబడే ప్రశ్నలు (COVID-19)

తరచుగా అడగబడే ప్రశ్నలు

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ("BFL") తన కస్టమర్లకు రిజల్యూషన్ ప్లాన్ అందిస్తుందా?

ప్రజలకు COVID-19- సంబంధిత ఆర్ధిక ఒత్తిడుల నుండి ఉపశమనం కలిగించడానికి ఆగస్టు 6, 2020 నాడు RBI రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ గురించి వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం అర్హతగల కస్టమర్ల‌కు BFL రిజల్యూషన్ ప్లాన్‌ను అందిస్తుంది. కస్టమర్లు మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాను https://bit.ly/3iM2vDk సందర్శించడం మరియు “ఆఫర్ విభాగం” తనిఖీ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

రిజల్యూషన్ ప్లాన్ అంటే ఏమిటి?

• Covid-19 మహమ్మారి కారణంగా సంభవించిన ఆర్థిక పతనం కస్టమర్లు గణనీయమైన ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవడానికి దారితీసినందున, రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్ చేయబడుతుంది.

• మంచి రిపేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న మరియు BFL యొక్క పాలసీ ప్రకారం అర్హత కలిగిన ప్రభావిత కస్టమర్లకు ఇది ఆఫర్ చేయబడుతుంది.

• రుణ భారం వల్ల వారి క్యాష్ ఫ్లో జనరేషన్ సామర్ధ్యాలకు అనుగుణంగా వ్యాపారం యొక్క దీర్ఘకాలిక సాధ్యతపై ప్రభావం చూపించగల ఫలితంగా వచ్చే ఒత్తిడిని తగ్గించడంలో కస్టమర్ లకు సాయపడటం అనేది రిజల్యూషన్ ప్లాన్ యొక్క ఉద్దేశ్యం. లోన్ EMI మొత్తాన్ని తగ్గించడం మరియు లోన్ కాలపరిమితిని పొడిగించడం ద్వారా రిజల్యూషన్ ప్లాన్ కింద కస్టమర్లకు సహాయం అందించబడుతుంది.

• నిర్దేశిత షరతులకు లోబడి యాజమాన్యం మరియు పర్సనల్ లోన్లలో మార్పు లేకుండానే అర్హత కలిగిన కార్పొరేట్‌ల ద్వారా రిజల్యూషన్ ప్లాన్‌ని పొందవచ్చు.

• నిబంధనలు మరియు షరతులు/డాక్యుమెంటేషన్ యొక్క అంగీకారం మరియు వాటికి కట్టుబడి ఉండటానికి, పాటించడానికి లోబడి అర్హత కలిగిన కస్టమర్లకు రిజల్యూషన్ ప్లాన్ అందించబడుతుంది.

లాక్‌డౌన్ వ్యవధిలో ఫిబ్రవరి, 29, 2020 తర్వాత మంజూరు చేయబడిన కొత్త లోన్లకు రిజల్యూషన్ ప్లాన్ వర్తిస్తుందా?

లేదు. RBI మార్గదర్శకాల ప్రకారం, 'స్టాండర్డ్’ గా వర్గీకరించబడి కానీ మార్చి 1, 2020 నాటికి ఋణ సంస్థ వద్ద 30 రోజుల కంటే ఎక్కువ కాలం డిఫాల్ట్‌గా లేని అకౌంట్‌లు మాత్రమే ఈ ఫ్రేమ్‌వర్క్ కింద పరిష్కారం కోసం అర్హత కలిగి ఉంటాయి.

నేను రిజల్యూషన్ ప్లాన్ అమలు కోసం అప్లై చేస్తే నా క్రెడిట్ బ్యూరో రికార్డులు ప్రభావితం అవుతాయా?

• మీరు అర్హత కలిగి ఉన్నట్లయితే మరియు మీరు రిజల్యూషన్ ప్లాన్ పొందినట్లయితే, మీ క్రెడిట్ బ్యూరో రికార్డులు మీరు పొందిన రిజల్యూషన్ ప్లాన్ యొక్క వివరాలతో అప్డేట్ చేయబడతాయి.

• రిజల్యూషన్ ప్లాన్ కింద మీరు సహాయం పొందారనే వాస్తవం మీ బ్యూరో రిపోర్టులలో కనిపిస్తుంది. అయితే, ప్రతి సంస్థ యొక్క క్రెడిట్ పాలసీ మారవచ్చు కాబట్టి, ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థలు దీనిని ఏవిధంగా పరిగణనలోకి తీసుకుంటాయనే దానికి సంబంధించి BFL కు ఎలాంటి పాత్ర ఉండదు.

నేను రిజల్యూషన్ ప్లాన్ కోసం అభ్యర్థనను ఎప్పుడు చేయగలను?

• మీరు మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియా https://bit.ly/3iM2vDk ను సందర్శించి “ఆఫర్ సెక్షన్” తనిఖీ చేయడం ద్వారా రిజల్యూషన్ ప్లాన్ ఎంచుకోవచ్చు, డ్రాప్ డౌన్ నుండి రిజల్యూషన్ ప్లాన్ ఎంచుకొని అందుబాటులో ఉన్న ఆఫర్‌కు అప్లై చేయవచ్చు.

• మీరు మా కాంటాక్ట్ సెంటర్ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా మా కస్టమర్ సర్వీస్ బ్రాంచ్‌లను సందర్శించవచ్చు. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించడానికి https://www.bajajfinserv.in/reach-us• రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం, ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2020 తర్వాత అందుబాటులో ఉండవు.

• రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్లు నెలలోని 28 నుంచి 5వ తేదీ వరకు అందుబాటులో ఉండవు.

నేను రిజల్యూషన్ ప్లాన్ కోసం అభ్యర్థనను ఎలా చేయగలను?

మీరు రిజల్యూషన్ ప్లాన్ పొందాలనుకుంటే, మీ అర్హతను తనిఖీ చేయడానికి కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియా https://bit.ly/3iM2vDk కు లాగిన్ అవ్వండి.

• మీరు లాగిన్ అయి ధృవీకరణ పొందవలసి ఉంటుంది.

"ఆఫర్ వరల్డ్" టాబ్ ఎంచుకోండి. అందుబాటులో ఉన్న ఆఫర్‌ను తనిఖీ చేయడానికి రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్‌ను ఎంచుకోండి.

• నిబంధనలు మరియు షరతులను (“నిబంధనలు మరియు షరతులు”) జాగ్రత్తగా చదవండి మరియు అర్థం చేసుకోండి.

• నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి మరియు వాటికి కట్టుబడి ఉండేటట్లు చూసుకోండి, దయచేసి అభ్యర్ధనను సమర్పించండి.

• ఒకవేళ మీరు అర్హత కలిగి లేనట్లయితే, రిజల్యూషన్ ప్లాన్ కోసం మీరు ఎలాంటి ఆఫర్‌ని కనుగొనలేరు.
రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్లు నెలలోని 28 నుంచి 5వ తేదీ వరకు అందుబాటులో ఉండవు.

ప్రత్యామ్నాయంగా, మాకు మా కాంటాక్ట్ సెంటర్ నెంబరు‌కు కాల్ చేయండి లేదా మా కస్టమర్ సర్వీస్ బ్రాంచ్‌లను సందర్శించండి

రిజల్యూషన్ ప్లాన్ కోసం నా అభ్యర్థన అంగీకరించబడితే నాకు తెలియజేయబడుతుందా?

మీరు రిజల్యూషన్ ప్లాన్ కోసం మీ అభ్యర్థనను ప్రాసెస్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక SMS పంపడం ద్వారా మీకు తెలియజేయబడుతుంది. మీరు మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాను సందర్శించడం ద్వారా కూడా స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు మరియు ఇప్పటికే ఉన్న లేదా ప్లాన్ కింద బుక్ చేయబడిన కొత్త లోన్ కోసం మీ రివైజ్ చేయబడ్డ రీ-పేమెంట్ షెడ్యూల్‌ని చూడవచ్చు.

BFL లో నాకు ఉన్న అన్ని యాక్టివ్ లోన్లకు నాకు రిజల్యూషన్ ప్లాన్ ఇవ్వబడుతుందా లేదా ప్రతి లోన్‌కు నేను ప్రత్యేక అభ్యర్థన చేయాలా?

మీరు BFL పాలసీ ప్రకారం మీ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ లోన్లకు సంబంధించి అర్హత కలిగి ఉన్నట్లయితే, BFL వద్ద మీరు కలిగి ఉన్న వివిధ రకాల యాక్టివ్ లోన్ సంబంధాలకు కాను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విభిన్న ఆఫర్లు ఉండవచ్చు. మీరు మా వెబ్‌సైట్‌లో ఆఫర్ వివరాలను చూసిన తర్వాత, అది అర్హత కలిగిన లోన్ల వివరాలను కలిగి ఉంటుంది. మీకు ఒక లోన్ కంటే ఎక్కువ లేదా వివిధ రకాల లోన్లు ఉన్నట్లయితే మీరు ప్రతి ఆఫర్‌ను వేరుగా ఎంచుకోవాలి (ఉదా: కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, పర్సనల్ లోన్లు లేదా బిజినెస్ లోన్లు).

నేను నా లోన్ కోసం రిజల్యూషన్ ప్లాన్ పొందకూడదనుకుంటే, నేను ఏమి చేయాలి?

• మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీ లోన్ (లు) యొక్క నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న లోన్ల కోసం బ్యాంక్ నుండి మీ EMI మొత్తాలను సేకరించడం కొనసాగిస్తాము.

• ఇప్పటికే ఉన్న లోన్ల యొక్క నిబంధనల ప్రకారం రిపేమెంట్ కొనసాగించడానికి తగిన ఫండ్స్ కలిగి ఉండవలసిందిగా మేము కస్టమర్లను ప్రోత్సహిస్తాము, ఎందుకంటే రిజల్యూషన్ ప్లాన్ ప్రకారం లోన్ చెల్లింపులకు చేయబడ్డ రివిజన్ క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయబడుతుంది. బ్యాంకులు/ఫైనాన్షియల్ సంస్థలు ఇటువంటి రిపోర్టింగ్‌ను ఒకేవిధంగా లేదా విభిన్న రీతిలో పరిగణించవచ్చు మరియు కొత్త లోన్లు పొందే మీ భవిష్యత్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశాన్ని మేము తోసిపుచ్చలేము.

రిజల్యూషన్ ప్లాన్ పొందడానికి నేను ఏవైనా డాక్యుమెంట్లు, తాజా NACH డెబిట్ మాండేట్ మొదలైనవి సమర్పించాలా?

లోన్ కాలపరిమితి ముగియడానికి ముందు ప్రస్తుత మాండేట్ యొక్క గడువు ముగుస్తున్నట్లయితే మరియు రిజల్యూషన్ ప్లాన్ అమలు చేసిన తర్వాత సవరించబడిన మొత్తాన్ని కవర్ చేయడానికి NACH డెబిట్ మాండేట్ తగినంతగా లేకపోతే BFL కోరిన విధంగా మీరు కొత్త NACH డెబిట్ మాండేట్ సబ్మిట్ చేయవలసి రావచ్చు. అన్ని ఇతర సందర్భాల్లో, కొత్త మాండేట్ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. రిజల్యూషన్ ప్లాన్ క్రింద పెంచిన సహాయం కొన్ని నిబంధనలు మరియు షరతులకు అంగీకారం/కట్టుబడి ఉండటానికి లోబడి ఉంటుంది కాబట్టి, మీ లోన్ అకౌంట్లో రిజల్యూషన్ ప్లాన్ అమలు చేయడానికి BFL ద్వారా సలహా ఇవ్వబడిన నిబంధనలు మరియు షరతులు/డాక్యుమెంటేషన్‌కు మీ అంగీకారం తెలపవలసిందిగా మరియు వాటిని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము.

రిజల్యూషన్ ప్లాన్ విషయంలో నేను అదనంగా చెల్లించాల్సిన వడ్డీ రేటు ఎంత?

కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లకు, ప్రతి లోన్‌కు నెలకు 1% ఛార్జీ ఉంటుంది. అలా వసూలు చేసిన మొత్తం సుమారు మొత్తాన్ని సూచిస్తుంది. రివైజ్ చేయబడిన చెల్లింపు ప్లాన్ (రిజల్యూషన్ ప్లాన్) కింద పొడిగించిన వ్యవధికి 24% వార్షిక వడ్డీ రేటు. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ మరియు ప్రొఫెషనల్ లోన్లకు వడ్డీ ఛార్జీలు ఒకే విధంగా ఉంటాయి.

రిజల్యూషన్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి నేను ఏదైనా అదనపు ఫీజు చెల్లించవలసి ఉంటుందా?

• రిజల్యూషన్ ప్లాన్ పొందడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయబడదు.

ఒకసారి అప్లై చేసిన తర్వాత నేను రిజల్యూషన్ ప్లాన్ నుండి వైదొలగవచ్చా?

• లేదు. మీరు అందుబాటులో ఉన్న ఆఫర్ల ఆధారంగా మీ లోన్ల కోసం రిజల్యూషన్ ప్లాన్ అమలు కోసం ఎంచుకున్న తర్వాత, మీరు దాని నుండి వైదొలగలేరు.

నా లోన్ల పై మారటోరియం సమయంలో వడ్డీ ఇప్పటికే లెక్కించబడింది, అది మాఫీ చేయబడుతుందా?

లేదు. ఇప్పటికే పొందిన మారటోరియం కాలంలో లోన్ పైన వడ్డీ మాఫీ చేయబడదు.

రిజల్యూషన్ ప్లాన్ క్రింద రివైజ్ చేయబడిన లోన్‌ని పాక్షిక-ప్రీపేమెంట్ చేయడానికి లేదా ఫోర్‍క్లోజ్ చేయడానికి ఏవైనా అదనపు ఛార్జీలు ఉంటాయా?

• పర్సనల్ లోన్లు మరియు బిజినెస్ మరియు ప్రొఫెషనల్ లోన్ల యొక్క పాక్షిక చెల్లింపు లేదా ఫోర్‍క్లోజర్‌కు ఇప్పటికే ఉన్న లోన్ల యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఛార్జీలు వర్తించవచ్చు.

• కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల కోసం పాక్షిక చెల్లింపు లేదా ఫోర్‍క్లోజర్ కోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు (PL- RMPL గా మార్చబడిన CD లోన్లకు, ఎటువంటి ఫోర్‍క్లోజర్ ఛార్జీలు వర్తించవు)

లోన్లు రిజల్యూషన్ ప్లాన్ క్రింద ఉన్నప్పుడు ఫోర్‍క్లోజర్ మరియు పాక్షిక ప్రీ-పేమెంట్‌కు లాక్ ఇన్ పీరియడ్ ఎంత?

• కనీసం ఒక (1) EMI సైకిల్ పూర్తి అయ్యేంత వరకు మరియు కస్టమర్ ఆ EMI ను సకాలంలో చెల్లించే వరకు రిమీడియల్ PL యొక్క ఫోర్‍క్లోజర్ అనుమతించబడదు.

• ఇతర రిజల్యూషన్ ప్లాన్లలో ఫోర్‍క్లోజర్ మరియు పాక్షిక ప్రీ-పేమెంట్‌కు లాక్ ఇన్ పీరియడ్ లోన్ (లు) ప్రారంభ సమయంలో కస్టమర్ సంతకం చేసిన/అంగీకరించిన లోన్ డాక్యుమెంట్లు ప్రకారం నిర్ణయించబడుతుంది.

అటువంటి లోన్ల కోసం నేను అడ్వాన్స్ EMI లు లేదా పాక్షిక ప్రీ-పేమెంట్ చెల్లించవచ్చా?

Covid-19 మహమ్మారి కారణంగా సంభవించిన తాత్కాలిక సమస్యల నుండి మీకు ఉపసమనం కలిగించడానికి రిజల్యూషన్ ప్లాన్ ప్రారంభించబడింది. అయితే, లోన్ యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా ముందస్తు EMI చెల్లింపు లేదా పాక్షిక ప్రీపేమెంట్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ ఉంది.

మార్చి 1, 2020 నాటికి నా లోన్ ఇప్పటికే NPA లో ఉంటే, రిజల్యూషన్ ప్లాన్ నాకు వర్తిస్తుందా?

లేదు. రిజల్యూషన్ ప్లాన్ "స్టాండర్డ్" గా వర్గీకరించబడిన లోన్లకు మరియు మార్చి 1, 2020 నాటికి 30 రోజుల కంటే ఎక్కువ కాలం నుండి బకాయి ఉండని లోన్లకు అందుబాటులో ఉంటుంది.

నేను ఇప్పటికే ECLGS / ఫ్లెక్సి కన్వర్షన్ సదుపాయం కింద లోన్ పొందుతున్నట్లయితే, నేను రిజల్యూషన్ ప్లాన్ కోసం అర్హత కలిగి ఉంటానా?

• అటువంటి లోన్ల కోసం రిజల్యూషన్ ప్లాన్ కోసం ప్రత్యేక ప్లాన్లు/ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఫ్రేమ్‌వర్క్ కింద మంజూరు చేయబడిన మారటోరియం వ్యవధిలో నేను ఏదైనా ఇతర లోన్ (లు) కు అర్హత కోల్పోతానా?

లేదు. అయితే, ఏదైనా ఇతర లోన్ కోసం మీ అర్హత అనేది సమయానుసారంగా వర్తించే బ్యాంక్ యొక్క సంబంధిత లోన్ స్కీమ్ కోసం నిర్దేశించబడిన అర్హత నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

రిజల్యూషన్ ప్లాన్ క్రింద మారటోరియంకు గరిష్ట అవధి ఎంత?

• పర్సనల్, కన్స్యూమర్ మరియు ఇతర లోన్ల కోసం కంపెనీ యొక్క పూర్తి అభీష్టానుసారం 24 నెలల వరకు.

రిజల్యూషన్ ప్లాన్ అమలు చేసిన తర్వాత నా EMI వెంటనే ప్రారంభమవుతుందా లేదా రిజల్యూషన్ ప్లాన్ తర్వాత కొంత మారటోరియం పీరియడ్ వ్యవధి ఉంటుందా?

• రిజల్యూషన్ ప్లాన్‌కు అనుగుణంగా మీ కోసం మారటోరియం యొక్క పొడిగింపు ఆమోదించబడే వరకు, రిజల్యూషన్ ప్లాన్ అమలు చేసిన వెంటనే మీ EMI ప్రారంభం అవుతుంది.

రిజల్యూషన్ ప్లాన్ కారణంగా నా ప్రస్తుత లోన్ ఆఫర్ ప్రభావితమవుతుందా?

• ఇప్పటికే ఉన్న ఆఫర్‌కు నియమాలు BFL యొక్క అంతర్గత పాలసీ ప్రకారం ఉంటాయి.

రిజల్యూషన్ ప్లాన్ కోసం ఎంచుకునేటప్పుడు నేను EMI మొత్తం/అవధి ఎంచుకోవచ్చా?

• లేదు. మీ లోన్‌కు వర్తించే ఆఫర్ ఆధారంగా రిజల్యూషన్ ప్లాన్ అమలు చేయబడుతుంది.

ఆఫర్ పొందేటప్పుడు నేను నేను కొత్త అప్లికేషన్/అగ్రిమెంట్‌తో అప్లై చేయాలా?

• మీరు పొందిన ఆఫర్ ఆధారంగా, మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాలో లేదా BFL ద్వారా నిర్దేశించబడిన ఏదైనా ఇతర పద్ధతిలో రివైజ్ చేయబడిన నిబంధనలు మరియు షరతులు మీ అంగీకారం కోసం మీతో పంచుకోబడతాయి.

EMI గడువు తేదీలో మార్పు కోసం నేను అభ్యర్థించవచ్చా?

• EMI గడువు తేదీ స్థిరంగా ఉంటుంది మరియు అభ్యర్థనపై మార్చబడదు.

ఇవి నా చివరి 2 EMI లు, నేను రిజల్యూషన్ ప్లాన్ కోసం ఆప్షన్ పొందుతానా?

• అవును, ఒకటి కంటే ఎక్కువ EMI లు బకాయి ఉన్న సందర్భాలలో ఇది వర్తిస్తుంది.

ఒకవేళ, నా మునుపటి లోన్లు రిజల్యూషన్ ప్లాన్ క్రింద కవర్ అవుతున్నట్లయితే, నేను కొత్త లోన్ కోసం అప్లై చేయవచ్చా?

• ఇది BFL యొక్క అంతర్గత రిస్క్ పాలసీ ఆధారంగా మీ కోసం సమయానుగుణంగా జనరేట్ చేయబడే భవిష్యత్తు ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది.

రిజల్యూషన్ ప్లాన్ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

• లోన్ల కోసం రిజల్యూషన్ ప్లాన్ అమలు సాధారణంగా 10 పని రోజుల్లోపు ప్రాసెస్ చేయబడుతుంది.

ఇప్పటికే ఉన్న లోన్ (CIP) యొక్క EMI చెల్లింపు సమయంలో రిజల్యూషన్ ప్లాన్ క్రింద ఉన్న లోన్లను ఎలా పరిగణిస్తారు?

• ప్రస్తుత లోన్ ప్రాసెస్ ప్రకారం ఇది అదే విధంగా నిర్వహించబడుతుంది. కొత్త లోన్ బుకింగ్ తర్వాత క్లియరెన్స్ కారణంగా పాత లోన్ కోసం ఏదైనా అదనపు EMI డెబిట్ చేయబడితే, అది కొత్త లోన్ పై సర్దుబాటు చేయబడుతుంది.

నేను ఇప్పటికే మారటోరియం పొందాను, నేను ఆటోమేటిక్ గా రిజల్యూషన్ ప్లాన్ అమలు చేయడానికి అర్హత సాధించానా?

• లేదు. రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్లు మా ఇంటర్నల్ పాలసీ ఆధారంగా జనరేట్ చేయబడతాయి, మరియు మీరు వాటిని మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాలో తనిఖీ చేయాలి.

నేను ఒక రిజల్యూషన్ ప్లాన్ ఆఫర్‌ను ఎంచుకున్నట్లయితే నా EMI కార్డ్ బ్లాక్ చేయబడుతుందా?

• ఒకవేళ మీరు రిజల్యూషన్ ప్లాన్ అమలు కోసం ఎంచుకున్నట్లయితే, మీ EMI కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. దాని అన్‌బ్లాకింగ్ తదుపరి కొన్ని నెలలలో మీ లోన్ రిపేమెంట్ ఆధారంగా చేయబడుతుంది.

RBL బ్యాంక్ మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌తో సహా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL) ప్రోడక్టులకు ఇది వర్తిస్తుందా?

• ఇది FD పైన తీసుకున్న లోన్లు, గోల్డ్ లోన్ మరియు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఉన్న బకాయి మొత్తాలకు మినహాయించి BFL తో ఇప్పటికే ఉన్న లోన్లకు మాత్రమే వర్తిస్తుంది. స్పష్టత కోసం, రిజల్యూషన్ ప్లాన్ RBL బ్యాంక్ మరియు BFL కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌కు వర్తించదు.

రిజల్యూషన్ ప్లాన్ కోసం అప్లై చేసినట్లయితే నా బజాజ్ ఫిన్సర్వ్ EMI నెట్వర్క్ కార్డ్ ఎప్పుడు అన్‌బ్లాక్ చేయబడుతుంది?

రిజల్యూషన్ ప్లాన్ కింద లోన్ పూర్తిగా రిపేమెంట్ చేసిన తర్వాత మరియు/లేదా ప్రస్తుతం అమలులో ఉన్న BFL పాలసీ ప్రకారం అన్‌బ్లాక్ చేయబడుతుంది.

మా సోషల్ ఛానళ్ళు

సోషల్ మీడియాలో మాతో కనెక్ట్ అవ్వండి మరియు మా కొత్త వార్తలు మరియు ఆఫర్ల గురించి అప్డేట్ అయి ఉండండి