ఇసిఎస్/ నాచ్ రిటర్న్ ఛార్జీలు
ఇసిఎస్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసులు అనేవి చెల్లింపులు చేయడం లేదా ఫండ్స్ అందుకోవడం యొక్క పూర్తి ప్రక్రియను క్రమబద్ధీకరించే ట్రాన్సాక్షన్ విధానం. ఇది పూర్తి ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది మరియు ఏవైనా ఆలస్యాల అవకాశాలను తగ్గిస్తూ మానవ జోక్యం అవసరాన్ని తొలగిస్తుంది. ఇఎంఐలు యొక్క రీపేమెంట్ కోసం కస్టమర్లు ఇసిఎస్/నాచ్ మ్యాండేట్ ఇస్తారు. అటువంటి ఇసిఎస్/నాచ్ మ్యాండేట్లు ఇఎంఐ క్లియరెన్స్ కోసం షెడ్యూల్ చేయబడిన తేదీలలో కస్టమర్ల బ్యాంక్‌కు సమర్పించబడతాయి.
మీ ట్రాన్సాక్షన్ వైఫల్యానికి ఫండ్స్ లేకపోవడం లేదా ఏదైనా ఇతర కారణం ఉంటే, ఆయా ఆర్థిక సంస్థ (బ్యాంక్) జరిమానా ఛార్జీని విధిస్తుంది. అటువంటి ఛార్జీలు తమ కస్టమర్లకు సంబంధిత ఆర్థిక సంస్థ ద్వారా వెల్లడి చేయబడతాయి మరియు ఇవి ఒక ఆర్థిక సంస్థ నుండి మరొకదానికి మారవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలోని అత్యంత విశ్వసనీయమైన మరియు పారదర్శకమైన ఆర్థిక సంస్థలలో ఒకటి మరియు ఇఎంఐ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు వారి అకౌంట్‌లో తగినంత నిధులను నిర్వహించవలసిందిగా సిఫార్సు చేస్తుంది. ఇది వారి ఆర్థిక సంస్థ (బ్యాంక్) ద్వారా ఏవైనా ఇసిఎస్/నాచ్ రిటర్న్ ఛార్జీలను నివారించడానికి సహాయపడుతుంది.
ఒకవేళ మీ ఇఎంఐ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్ నాన్-ఆపరేటివ్, డార్మెంట్, ఫ్రోజెన్ లేదా క్లోజ్ చేయబడినది అయితే, ఏదైనా ఇసిఎస్/ నాచ్ రిటర్న్ ఛార్జీలు నివారించడానికి ఇఎంఐ విజయవంతంగా క్లియర్ చేయడానికి బ్యాంక్ అకౌంట్‌ను మార్చవలెను అని సూచించబడుతుంది. ప్రత్యామ్నాయంగా బజాజ్ కస్టమర్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్ ఇఎంఐ చెల్లింపు ఆప్షన్ ద్వారా ఇఎంఐ చెల్లింపు చేయవచ్చు.
ఇసిఎస్ నాచ్ రిటర్న్ ఛార్జీలు ఫిర్యాదును పంపడానికి మార్గాలు
తరచుగా అడిగే ప్రశ్నలు
ఇసిఎస్/ నాచ్ రిటర్న్ కోసం జరిమానా ఛార్జీలు సంబంధిత ఆర్థిక సంస్థ/ బ్యాంకులపై ఆధారపడి ఉంటాయి. ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకు మధ్య ఛార్జీలలో మార్పు ఉండవచ్చు. (దయచేసి మీ బ్యాంక్ ఛార్జీలు యొక్క షెడ్యూల్‌ను చూడండి)
లేదు, ఇసిఎస్ రిటర్న్ ఛార్జీలు రిఫండ్ చేయబడవు గడువు తేదీన మీ ఇఎంఐలు చెల్లించడంలో మీరు విఫలమైనప్పుడు మాత్రమే ఈ జరిమానా రుసుము విధించబడుతుంది.
ఇసిఎస్ రిటర్న్ ఛార్జీలు నివారించడానికి, ఇఎంఐ గడువు తేదీ నాటికి మీ ఇఎంఐ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉందని మీరు నిర్ధారించుకోవాలి.
మీ క్రియాశీల రుణాల కోసం మ్యాండేట్ రద్దు చేయబడదు. అయితే, మీ మూసివేయబడిన రుణాల కోసం మ్యాండేట్లను రద్దు చేయవచ్చు మరియు దానికి ఎటువంటి ఛార్జీలు వర్తించవు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, మీరు బ్యాంకుల నుండి ఇసిఎస్ లేదా మ్యాండేట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పొందడానికి ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.
అయితే, కొన్ని బ్యాంకులు సంబంధిత బ్యాంకు అకౌంట్‌లో అవసరమైన మొత్తం నిర్వహించకపోతే మ్యాండేట్ వైఫల్య ఛార్జీలు విధించవచ్చు.