ఓవర్‍వ్యూ

play

బిజీ షెడ్యూల్ నుండి విరామం కోసం మరియు విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవడానికి సెలవు పైన వెళ్లడమనేది ఒక మంచి ఆలోచన. కానీ, ఒక్కోసారి ప్రయాణంలో హోటల్ బుకింగ్ లభించకపోవడం, మీ వాలెట్ పోగొట్టుకోవడం లేదా ప్రమాదానికి గురి అవడం లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవచ్చు.

బజాజ్ ఫిన్సర్వ్ అందించే డొమెస్టిక్ హాలిడే కవర్ తో, మీరు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను సులభంగా అధిగమించవచ్చు.

 • ఎమర్జెన్సీ ట్రావెల్ సహాయం

  మీరు హోలిడేలో ఉన్నప్పుడు ఎక్కడైనా చిక్కుకుపోయినా, అత్యవసర ప్రయాణం మరియు హోటల్ సహకారం కొరకు మీ హోటల్ బిల్లులు, తిరుగు ప్రయాణం మరియు ఇతర ఖర్చుల నిమిత్తం భారతదేశంలో అయితే రూ. 50,000 వరకు మరియు విదేశాలలో అయితే రూ. 1,00,000 వరకు సులభంగా పొందవచ్చు.

 • రోడ్‍సైడ్ సహకారం

  మీరు విహారయాత్రలో ఉన్నప్పుడు కార్ మరమ్మతుకు గురి అయినదా?? వాహన మరమత్తు నిమిత్తం భారతదేశంలోని 700 ప్రదేశాలలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందండి.

 • కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్

  వ్యక్తిగత ప్రమాదాలు, యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, ట్రిప్ రద్దు కావడం, ఇంటి దోపిడీ మరియు సామాను పోవడం వంటి వాటి పై రూ. 3,00,000 వరకు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ పొందండి. మీరు విహార యాత్రలో ఉన్నప్పుడు ప్రతి అత్యవసర పరిస్థితిలో మీకు భరోసా కలిపిస్తుంది.

 • 24/7 కార్డ్ బ్లాకింగ్ సర్వీస్

  విహారయాత్రలో మీ వాలెట్ పోగొట్టుకుంటే ఎన్నో ప్రయాసలు పడవలసి వస్తుంది. ఒక్క ఫోన్ కాల్‌తో పోయిన మీ అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసే సదుపాయం పొందండి. మీ PAN కార్డును కూడా ఉచితంగా భర్తీ చేసుకోవచ్చు.

ప్రయాణ భద్రత సభ్యత్వం

బజాజ్ ఫిన్సర్వ్ అందించే డొమెస్టిక్ హాలిడే కవర్ లో ఒక సంవత్సర కాలం పాటు చెల్లుబాటు అయ్యే ట్రావెల్-సేఫ్ మెంబెర్‌షిప్ లభిస్తుంది. ఇందులో ఈ క్రింద ఇవ్వబడిన ప్రయోజనాలు ఉన్నాయి:

• మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు పోయినా లేదా చోరీకి గురి అయిన పక్షంలో, అవి దుర్వినియోగం కాకుండా వాటినన్నిటినీ బ్లాక్ చేయవచ్చు.

• నష్టం జరిగినప్పుడు మీరు భారతదేశంలో ఉన్నట్లయితే, అత్యవసర ప్రయాణ అవసరాల నిమిత్తం మీకు రూ. 50,000 వరకు ఆర్థిక సహకారం అందుతుంది. ఒక వేళ మీరు విదేశాలలో ఉన్నట్లయితే, కవరేజ్ మొత్తం రూ. 1,00,000 వరకు ఉంటుంది. గరిష్ఠంగా 28 రోజుల వరకు ఇది వడ్డీ లేని అడ్వాన్స్ మొత్తం. మీరు 28 రోజుల్లోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

• ఒక వేళ మీ కార్ మరమ్మతుకు గురి అయితే ఈ కవర్ మీకు ఆన్-రోడ్ అసిస్టెన్స్ అందిస్తుంది.

• ఇంకా, మీరు కారుకు 5 లీటర్ల ఇంధనం ధర మరియు టూ-వీలర్‌కు 2 లీటర్ల ఇంధనం ధర పొందవచ్చు.

• మీరు మీ PAN కార్డ్ ను పోగొట్టుకొని ఉంటే, ఇతర డాక్యుమెంట్స్ తో పాటు దానిని రీప్లేస్ చేయుటకు అయ్యే ఖర్చును మేము కవర్ చేస్తాము.

• ఇంకా మీరు పోయిన సామాను విలువ కవర్ తో పాటు రూ. 3 లక్షల వరకు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా పొందవచ్చు.

 

కవర్ చేయని అంశాలు ఏమిటి ?

• మీరు మత్తులో ఉన్నప్పుడు విలువైన వస్తువులు కోల్పోతే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిగణించబడదు.

• మీరు చేసిన ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వలన మీ వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే అది పరిగణించబడదు.

అవసరమైన డాక్యుమెంట్లు

• KYC డాక్యుమెంట్లు

• ట్రావెల్ సేఫ్ సభ్యత్వ లేఖ

అప్లై చేయడం ఎలా

• మీరు డొమెస్టిక్ హాలిడే కవర్ కోసం సులభంగా అప్లై చేయవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్ లోకి లాగ్ ఇన్ అవ్వండి, అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలు నింపండి మరియు క్షణాల్లో ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించండి.

క్లెయిమ్ ప్రాసెస్

• కార్డులు పోయిన సందర్భంలో, 24 గంటలలోపు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-419-4000 కు కాల్ చేయండి.

• మీకు అత్యవసర సహాయం అవసరం అయినప్పుడు ఆ అవసరానికి సంబంధించిన రుజువును మీరు చూపించవలసి ఉంటుంది.