డాక్టర్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు

మా డాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన ప్రమాణాలను తెలుసుకోవడానికి చదవండి.

అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

మీరు క్రింద పేర్కొన్న నాలుగు ప్రాథమిక ప్రమాణాలను నెరవేర్చినంత వరకు ఎవరైనా డాక్టర్ మా డాక్టర్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి మీకు డాక్యుమెంట్లు కూడా అవసరం.

అర్హతా ప్రమాణాలు

 • జాతీయత: భారతీయ
 • వయస్సు: 22 సంవత్సరాల నుండి 72 సంవత్సరాల వరకు*
 • సిబిల్ స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ
 • మెడికల్ రిజిస్ట్రేషన్: మెడికల్ కౌన్సిల్‌తో రిజిస్టర్ చేసుకోవలసిన డిగ్రీ

*మీ అవధి ముగింపులో వయస్సు 72 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

డాక్యుమెంట్లు

 • కెవైసి డాక్యుమెంట్లు - ఆధార్/ పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ ఓటర్ ఐడి
 • మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

డాక్టర్ల కోసం లోన్ అప్లికేషన్ ప్రాసెస్

డాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ గైడ్

 1. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
 3. మీ ప్రాథమిక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
 4. ఫారం నింపిన తర్వాత, రుణం ఎంపిక పేజీకి వెళ్లడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
 5. మీకు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి. మీరు మా మూడు డాక్టర్ లోన్ వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు - టర్మ్ లోన్, ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్.
 6. రీపేమెంట్ అవధిని ఎంచుకోండి – మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే అవధి ఎంపికలను ఎంచుకోవచ్చు – మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయండి’.
 7. కెవైసి ని పూర్తి చేయండి మరియు మీ డాక్టర్ లోన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

గమనిక: కెవైసి ప్రక్రియను పూర్తి చేయడానికి మీ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను అందుబాటులో ఉంచుకోండి.

మా ప్రతినిధి తదుపరి దశలలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత రుణం మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

డాక్టర్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి గరిష్ట అవధి ఎంత?

బజాజ్ ఫిన్‌సర్వ్ 96 నెలల వరకు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులను అందిస్తుంది, తద్వారా మీరు మీ డాక్టర్ లోన్‌ను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించవచ్చు.

బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్ లోన్ కోసం అర్హత పొందడానికి అవసరమైన సిబిల్ స్కోర్ ఏమిటి?

మా డాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి 685 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ అవసరం.

రిపేమెంట్ ఎలా చేయాలి?

మీరు నాచ్ మ్యాండేట్ ద్వారా మీ డాక్టర్ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు.

డాక్టర్ లోన్ పొందడానికి నేను ఏదైనా సెక్యూరిటీని అందించాలా?

మా డాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి మీరు ఎటువంటి కొలేటరల్ లేదా సెక్యూరిటీని అందించవలసిన అవసరం లేదు.

మరింత చూపండి తక్కువ చూపించండి