back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్

మాతృత్వం అనేది స్త్రీ జీవితంలోని అపురూపమైన అనుభవాల్లో ఒకటి. కానీ, ప్రసవ సమయంలో ఇది హాస్పిటలైజేషన్ ఖర్చులను పెంచుతూ, ఆర్థిక ఒత్తిడితో మీకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. కాంప్రిహెన్సివ్ మెటర్నిటీ ఇన్సూరెన్స్ అనేది కాబోయే తల్లులు ఆర్థిక భారాలను ఎదుర్కోకుండా అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందడంలో సహాయపడుతుంది. ఈ విధంగా కుటుంబ సమేతంగా సమయాన్ని గడపవచ్చు మరియు కొత్త సభ్యుడిని ఆడంబరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉండవచ్చు.

ఒక మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీ టర్మ్ కింద ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు సాధారణ మరియు సి-సెక్షన్ డెలివరీల ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ సాధారణంగా ఒక ప్రామాణిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో రైడర్ లేదా యాడ్-ఆన్ ప్రయోజనంగా చేర్చబడుతుంది. అనేక మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు రెండు ప్రెగ్నెన్సీల వరకు కవర్ చేస్తారు. ఇది నవజాత శిశువు టీకాలు అలాగే ఏవైనా ఇతర వైద్య ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు మరియు 60 రోజుల తరువాత వరకు ప్రీ- మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా అందుబాటులో ఉంటుంది.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • సమగ్ర కవరేజ్

  మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ డెలివరీ, హాస్పిటల్ బస, మందులు మరియు మరిన్ని ఖర్చులను కవర్ చేస్తుంది.

 • నవజాత శిశువు సంరక్షణ

  నవజాత శిశువులు ఏదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లయితే పాలసీ కవరేజీ వారికి విస్తరించబడుతుంది.

 • సులభమైన ఆన్‍లైన్ అప్లికేషన్

  మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

 • అంబులెన్స్ చార్జీలు

  ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ చార్జీలు ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడతాయి.

 • హాస్పిటలైజేషన్ కవరేజ్

  హాస్పిటలైజేషన్‌కు 30 రోజుల ముందు మరియు 60 రోజుల తర్వాత గర్భధారణ-సంబంధిత ఖర్చులు ఈ ప్లాన్ కింద కవర్ చేయబడతాయి.

 • క్యాష్‍‍‍‍‍లెస్ సదుపాయం

  ఏదైనా ఇన్సూరెన్స్ సంస్థ యొక్క నెట్‌వర్క్ హాస్పిటల్‌లో నగదు రహిత సౌకర్యాన్ని పొందండి.

 • క్విక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

  నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్స్ వద్ద తీసుకోబడిన చికిత్సల కోసం సింగిల్ పాయింట్ కాంటాక్ట్ వద్ద త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ పొందండి.

 • క్లెయిమ్-ఫ్రీ బోనస్

  ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరం కోసం 10% క్యుములేటివ్ బోనస్ ప్రయోజనాన్ని పొందండి.

 • పన్ను పొదుపులు

  ఆదాయ పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద రూ. 60,000 వరకు పన్ను మినహాయింపు పొందండి.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణించడం ముఖ్యం, వాటిలో కొన్నింటిని వివరంగా అన్వేషించండి:

ప్రీమియంపై దృష్టి పెట్టండి

కొన్ని మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అధిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బడ్జెట్‌లో వచ్చే ప్రసూతి ప్లాన్‌ను ఎంచుకోవడాన్ని నిర్ధారించుకోండి.

వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో ఎల్లప్పుడూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి, ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇన్సూరర్ ద్వారా చేయబడిన క్లెయిమ్‌లను అంగీకరించబడని సమయం. పరిమిత వెయిటింగ్ పీరియడ్‌తో మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఎల్లప్పుడూ ముఖ్యం.

ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెక్ చేయండి

తగినంత కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం తప్పనిసరి.

నెట్‌వర్క్ హాస్పిటల్స్

ఎంప్యానెల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందే పాలసీదారులకు మాత్రమే నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుంది.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడుతుంది?

మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చబడిన కొన్ని అంశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

• అంబులెన్స్ ఖర్చులు
• మందులు
• ఇన్‌పేషెంట్ కేర్ చికిత్సలు
• ప్రసవం ముందు ఖర్చులు
• ఫాలో-అప్ సందర్శనలు
• డే-కేర్ చికిత్సలు
• ప్రసవానంతర ఖర్చులు
• గది అద్దె ఛార్జీలు
• సిజేరియన్/సాధారణ డెలివరీ
• నవజాత శిశువు కవర్

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఏది కవర్ చేయబడదు


పాలసీ కింద కొన్ని సాధారణ మినహాయింపులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
• ముందుగా ఉన్న పరిస్థితులు
• కాస్మెటిక్ సర్జరీ
• వెయిటింగ్ పీరియడ్‌ను పూర్తి చేయడానికి ముందు గర్భధారణ-సంబంధిత ఖర్చులు
• దంతాలు, వినికిడి మరియు కంటి చూపు కోసం వైద్య ఖర్చులు

ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి, మీరు క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఒక ఫైల్ నిర్వహించడం మరియు డాక్యుమెంట్లను ఒకే చోట ఉంచడం మంచిది.

• సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారం
• పాలసీ డాక్యుమెంట్లు
• డిశ్చార్జ్ వివరాలు
• కెవైసి డాక్యుమెంట్లు
• కన్సల్టేషన్ బిల్లు
• ఒరిజినల్ ఆసుపత్రి బిల్లు
• పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఎలా చేయాలి

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడానికి క్రింద పేర్కొన్న క్లెయిమ్ ప్రాసెస్ సాధారణంగా అనుసరించబడుతుంది:
క్లెయిమ్ సమాచారం (హాస్పిటలైజేషన్ అయిన 24 గంటల్లోపు అత్యవసర కేసులు మరియు ప్లాన్ చేయబడిన హాస్పిటలైజేషన్ 48 గంటల్లోపు)

నగదురహిత ప్రీ-ఆథరైజేషన్ ఈ క్రింది వాటిని అందిస్తుంది:

• హాస్పిటలైజేషన్ సమయంలో మీ హాస్పిటల్ మీకు అందించే పూరించబడిన క్లెయిమ్ ఫారంను సబ్మిట్ చేయండి
• ఆసుపత్రి అధికారులు మీ డాక్టర్ నివేదికలతో పాటు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ ఫారం పంపుతారు
• మీ ఇన్సూరర్ నుండి ఒక ప్రతినిధి ప్రశ్నలను లేవదీయవచ్చు, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. మీ క్లెయిమ్ ఆమోదించబడితే, మీకు అర్హత ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం ప్రకారం మీ ఇన్సూరర్ నేరుగా మీ ఆసుపత్రికి చెల్లిస్తారు.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ ఈ క్రింది వాటిని అందిస్తుంది:

• రసీదులు, రిపోర్టుల మరియు వైద్య చికిత్సల బిల్లులు మొదలైనటువంటి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి పూరించిన క్లెయిమ్స్ ఫారంను సబ్మిట్ చేయండి.
• మీ ఇన్సూరర్ నుండి ఒక ప్రతినిధి ప్రశ్నలను లేవదీయవచ్చు, దీనికి మీరు సమాధానం ఇవ్వాలి మరియు అవసరమైతే అదనపు సమాచారం లేదా డాక్యుమెంట్లను సమర్పించాలి.
• మీ క్లెయిమ్ ఆమోదించబడితే, మీ అర్హత కలిగిన ఇన్సూరెన్స్ మొత్తం ప్రకారం మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు తిరిగి చెల్లిస్తుంది

మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఎక్యూలు)

1. వెయిటింగ్ పీరియడ్ లేని ఏదైనా మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా?

సాధారణంగా, వెయిటింగ్ పీరియడ్ ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుండి మరొక దానికి భిన్నంగా ఉంటుంది. ఇది 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. కావున, మెటర్నిటీ కవరేజ్ కోసం మీ వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు అయితే, అంటే మెటర్నిటీ కవరేజీ ప్రయోజనాలను పొందడానికి మీరు మీ పాలసీ ప్రారంభమైన రోజు నుండి 2 సంవత్సరాలు వేచి ఉండాలి.

2. నేను గర్భవతిగా ఉన్నప్పుడు మెటర్నిటీ కవరేజీని కొనుగోలు చేయవచ్చా?

దురదృష్టవశాత్తూ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు గర్బధారణను ముందుగా-ఉన్న పరిస్థితిగా పరిగణిస్తాయి. కావున, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మెటర్నిటీ కవరేజీని కొనుగోలు చేయడం సాధ్యం కాదు.
అందుకే మీరు దీనిని ముందుగా ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.

3. మెటర్నిటీ కవరేజీలో 2వ శిశు జననం కూడా కవర్ చేయబడుతుందా?

అవును, చాలా వరకు మెటర్నిటీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇద్దరు పిల్లల జననం వరకు కవరేజీని అందిస్తాయి.

4. మెటర్నిటీ కవరేజీలో నవజాత శిశువు కవర్ చేయబడతారా?

అవును, మీ నవజాత శిశువు పుట్టినప్పటి నుండి 90 రోజుల వరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ కింద కవర్ చేయబడతారు, ఇక్కడ నవజాత శిశువుకు సంబంధించి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర చికిత్సతో పాటు వాక్సినేషన్లు కూడా కవర్ చేయబడతాయి.

5. మీరు గర్భవతి అయితే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చా?

అవును మీరు గర్భవతిగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. అయితే, వెయిటింగ్ పీరియడ్లు ఏవైనా ఉంటే ఆ సమయంలో మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.

6. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రెగ్నెన్సీ ముందు నుండి ఉన్న పరిస్థితిగా పరిగణించబడుతుందా?

అవును, ప్రసూతి కవర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రెగ్నెన్సీ ముందుగా ఉన్న పరిస్థితిగా పరిగణించబడుతుంది, కానీ సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కాదు. ఫలితంగా, అది అవసరం అని మీరు నమ్ముతున్న వెంటనే మెటర్నిటీ కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ముఖ్యం; ఉదాహరణకు, మీ వివాహం అయిన వెంటనే మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

7.మెటర్నిటీ ఇన్సూరెన్స్‌లో అందుబాటులో ఉన్న అన్ని కవరేజీలు ఏంటి?

ప్రెగ్నెన్సీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. ప్లాన్లలో సాధారణంగా ప్రసూతి-సంబంధిత హాస్పిటలైజేషన్ బిల్లులు వంటి పూర్తి మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి, అవి పుట్టిన 30 రోజుల ముందు మరియు డెలివరీ తర్వాత 60 రోజుల తర్వాత, ప్రసవ-ముందు మరియు తర్వాత ఫీజు, హాస్పిటలైజేషన్ ఛార్జీలు మరియు కొత్త శిశువు కవరేజ్ వంటివి ఉంటాయి. సాధారణ మరియు సి-సెక్షన్ డెలివరీల కోసం కవరేజ్ అందుబాటులో ఉంది.

8. మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఖరీదైనది ఎందుకనగా, ఇతర రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌ల మాదిరిగా కాకుండా ఈ పాలసీ క్లెయిమ్ విషయంలో చెల్లింపు కోసం పూర్తి హామీ ఇస్తుంది. మరోవైపు, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్లాన్ చేయబడని వైద్య పరిస్థితులను కవర్ చేస్తాయి. ఫలితంగా, ఈ ప్రత్యేక సందర్భం (గర్భధారణ) యొక్క నిశ్చయత కారణంగా మెటర్నిటీ కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ సంస్థలు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. అయితే, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కొనుగోలు చేసేముందు ముందు కవరేజీని పొందడానికి మీరు చెల్లించాల్సిన ప్రీమియంను మరియు ప్రయోజనాలను సరిపోల్చడం మంచిది.

9. ప్రెగ్నెన్సీ కోసం ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం మంచిది?

సమగ్ర కవరేజ్ కోసం, మెటర్నిటీ కవరేజ్ కలిగి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం ముఖ్యం. బజాజ్ ఫైనాన్స్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు రెండు డెలివరీల వరకు కవర్ చేసే ప్రసూతి ప్రయోజనం యొక్క యాడ్-ఆన్ ఫీచర్‌ను అందిస్తాయి. ఇది నవజాత శిశువు వ్యాక్సినేషన్ మరియు వైద్య ఖర్చులను (ఏవైనా ఉంటే) కూడా కవర్ చేస్తుంది. అదనంగా, 30 రోజుల ముందు మరియు హాస్పిటలైజేషన్ తర్వాత 60 రోజుల వరకు ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా అందించబడుతుంది.
 

10. మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎన్ని ప్రసవాలు కవర్ చేయబడతాయి?

సాధారణంగా మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీలు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు కవరేజీని అందిస్తాయి అయితే, ఇది ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలు, షరతులను బట్టి మారవచ్చు.
 

11. మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్లకు ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా?

అవును. మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి, అయితే ఇది ఇన్సూరెన్స్ సంస్థను బట్టి మారవచ్చు ఇన్సూరెన్స్ సంస్థ సూచించిన వెయిటింగ్ పీరియడ్ అనేది సాధారణంగా 9 నెలలు మరియు 6 సంవత్సరాల మధ్య ఉంటుంది.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?