2 నిమిషాలలో చదవవచ్చు
25 మే 2021

ఒక డీమ్యాట్ అకౌంట్‌ను తెరవడం సులభం మరియు కొన్ని దశలలో పూర్తి చేయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ట్రేడ్ చేసినప్పుడు డీమ్యాట్ అకౌంట్ షేర్లను డిజిటల్‌గా స్టోర్ చేస్తుంది. ఈ రోజు షేర్లు డిజిటల్ మోడ్‌లో ట్రేడ్ చేయబడుతున్నందున, ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ప్రారంభించడానికి డీమ్యాట్ అకౌంట్ చాలా అవసరం. అందువల్ల, ఒక పెట్టుబడిదారుగా డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి మరియు తమ సంపదను నిర్మించుకోవడానికి, పెంచుకోవడానికి దానిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ కారణంగా, ఇప్పుడు మీ ఇంటిలో సౌకర్యవంతంగా కూర్చుని కొన్ని క్లిక్‍లతో డీమ్యాట్ అకౌంట్ తెరవడం సాధ్యమవుతుంది.

డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?

1996 కు ముందు, ట్రేడింగ్ భౌతికంగా జరుగుతూ ఉండేది. అయితే, సెబీ డీమ్యాట్ అకౌంట్‌ను ప్రవేశపెట్టడంతో, ప్రజలు పెట్టుబడి పెట్టే విధానం మారింది - అది ఒక డిజిటల్ ప్రాసెస్ అయింది. డీమ్యాట్ అకౌంట్లను ప్రవేశపెట్టడం అనేది సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోబడిన అత్యంత సాహసోపేతమైన చర్యలలో ఒకటిగా మారింది, ఇంకా స్టాక్ మార్కెట్లలో సులభంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి అది సామాన్య ప్రజలకు వీలు కల్పించింది.

తరచుగా డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని పిలువబడే డీమ్యాట్ అకౌంట్ అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఒక ముఖ్యమైన ఆవశ్యకత. డీమ్యాట్ అకౌంట్ లక్ష్యం ఏంటంటే మీరు కొనుగోలు చేసే షేర్లను ఎలక్ట్రానిక్‌గా స్టోర్ చేయడం. మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌లో స్టాక్స్, ఈటిఎఫ్‌లు, బాండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్స్ వంటి అనేక సెక్యూరిటీలను కలిగి ఉండవచ్చు.

పేరు సూచిస్తున్నట్లుగా, డీమ్యాట్ అకౌంట్ సెక్యూరిటీలు మరియు షేర్ల డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించబడుతుంది. ఒక పెట్టుబడిదారు తమ డీమ్యాట్ అకౌంట్‌ను ఎక్కడినుండైనా యాక్సెస్ చేయవచ్చు కనుక, ఇది మరింత సౌకర్యవంతమైన యాక్సెస్‌ను నిర్ధారిస్తుంది. డీమ్యాట్ అకౌంట్లతో, అకౌంట్ హోల్డర్లు వాటిని డిమాండ్‌పై యాక్సెస్ చేయగలరని నిర్ధారిస్తూ, భౌతిక షేర్ సర్టిఫికెట్లు డిజిటల్ ఫార్మాట్‌గా మార్చబడతాయి.

ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి దశలవారీ విధానం

మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఒక డీమ్యాట్ అకౌంట్‌ను తెరవవచ్చు. మొత్తం ప్రాసెస్ డిజిటలైజ్ చేయబడింది మరియు కేవలం ఒక మొబైల్ ఫోన్ తో 10-15 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తి చేయబడవచ్చు. ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మీకు సహాయపడే దశలు క్రింద వివరించబడ్డాయి:

 • దశ ఒకటి: డిపాజిటరీ పార్టిసిపెంట్ కోసం శోధించండి
  మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌ను తెరవాలనుకుంటున్న ఒక డిపి ని ఎంచుకోండి. డిపి యొక్క పేరుప్రతిష్ఠలని మరియు అది మీరు వెతుకుతున్న నిర్దిష్ట సర్వీసులను అందించగలదా లేదా అనేది పరిగణించండి
 • దశ రెండు: ప్రాథమిక వివరాలను అందించండి
  ఒకసారి డిపి ని ఎంచుకున్న తరువాత, ఒక ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్ ‌ ఫారంను డిపి వెబ్‌సైట్‌లో పూరించండి. ప్రారంభంలో మీరు మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్, చిరునామా మొదలైనటువంటి ప్రాథమిక వివరాలను అందించాలి. మీరు మీ పాన్ కార్డ్ వివరాలను కూడా జోడించాలి
 • దశ మూడు: బ్యాంక్ వివరాలను జోడించండి
  మీరు అకౌంట్ నంబర్, అకౌంట్ రకం, ఐఎఫ్ఎస్‌సి కోడ్ మొదలైన బ్యాంక్ వివరాలను జోడించాలి. డీమ్యాట్ అకౌంట్‌లో మీరు షేర్లు కలిగి ఉండగల ఇష్యూయర్ కంపెనీ ద్వారా మీకు చెల్లించబడవలసిన ఏదైనా డివిడెండ్, వడ్డీ మొదలైనటువంటి మొత్తాన్ని క్రెడిట్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్‌ను జోడించడం ఎంతో ముఖ్యం
 • దశ నాలుగు: డాక్యుమెంట్ అప్‌లోడ్
  ఈ దశను పూర్తి చేయడానికి మీ ఫోటో, మరియు మీ చిరునామా రుజువు మరియు గుర్తింపు రుజువుకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
 • దశ ఐదు: వ్యక్తిగత ధృవీకరణ
  మొత్తం ప్రక్రియ డిజిటలైజ్ చేయబడినందున, మీకు మీరే మీ ఇంటి వద్ద ధృవీకరణను నిర్వహించవచ్చు. డిపి నుండి ఏజెంట్ మిమ్మల్ని సందర్శించి మీ గుర్తింపును ధృవీకరించడం కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇవ్వబడిన స్క్రిప్ట్ (మీ పేరు, పాన్ నంబర్, చిరునామా మొదలైనవి) చదువుతూ మీ యొక్క ఒక చిన్న వీడియోను రికార్డ్ చేసి, దశను పూర్తి చేయడానికి దాన్ని సబ్మిట్ చేయండి
 • దశ ఆరు: ఇ-సైన్
  చాలా వరకు డిపిలు మీకు ఆధార్ అనుసంధానించబడిన మొబైల్ నంబర్ ఉపయోగించి డిజిటల్‌గా మీ అప్లికేషన్‌ను సంతకం చేయడానికి ఎంపికను అందిస్తాయి. ఇది ఒక సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్ధతి మరియు పేపర్‌వర్క్‌ను తగ్గిస్తుంది
 • దశ ఏడు: ఫారం సమర్పణ
  మీరు ఈ దశలను పూర్తి చేసిన తర్వాత, మీరు మీ ఫారంను సబ్మిట్ చేయవచ్చు మరియు మీ డీమ్యాట్ అకౌంట్ త్వరలోనే సృష్టించబడుతుంది. మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు డీమ్యాట్ అకౌంట్ నంబర్ మరియు లాగిన్ క్రెడెన్షియల్స్ వంటి మీ అకౌంట్ వివరాలను అందుకుంటారు

ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి సంబంధించిన ఛార్జీల రకాలు

డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మరియు సంబంధిత సర్వీసులను పొందడానికి స్టాక్ బ్రోకర్లు ఛార్జీలు విధిస్తారు. ఫీజు స్టాక్ బ్రోకర్ల పరంగా మారుతుంది. అందువల్ల, మీరు డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి కనీస మొత్తాన్ని చెల్లించి కానీ ఈ అకౌంట్ కలిగి ఉండటంతో వచ్చే ఫీచర్లు, ప్రయోజనాలను ఆనందించేందుకు వీలుగా సరైన స్టాక్‍బ్రోకర్‍ను ఎంచుకోవడం తప్పనిసరి.

ఈ ఛార్జీలను క్రింది విధంగా విస్తృతంగా వర్గీకరించవచ్చు:

 • అకౌంట్ తెరవడానికి ఫీజు: సాధారణంగా, మీరు మొదటిసారి డీమ్యాట్ అకౌంట్‌ను తెరిచినప్పుడు, అకౌంట్ తెరవడానికి ఫీజు ఒకసారి వసూలు చేయబడుతుంది. ఆ తర్వాత, స్టాక్‌బ్రోకర్ మీ నుండి ఈ ఫీజును మళ్ళీ వసూలు చేయరు.
 • వార్షిక నిర్వహణ ఛార్జ్ (ఎఎంసి): వార్షిక నిర్వహణ ఛార్జ్ అనేది వారి డీమ్యాట్ అకౌంట్‌ను నిర్వహించడానికి డిపి ద్వారా డీమ్యాట్ అకౌంట్ హోల్డర్ నుండి వసూలు చేయబడే రికరింగ్ ఫీజు.
 • ప్లెడ్జింగ్ ఛార్జ్: ఇది ట్రేడింగ్ పరిమితులను పొందడానికి డీమ్యాట్ అకౌంట్‌లో సెక్యూరిటీలను తాకట్టు పెట్టడానికి వసూలు చేయబడే ఫీజు.
 • అన్‌ప్లెడ్జింగ్ ఛార్జ్: తాకట్టు పెట్టిన షేర్లు అన్‌ప్లెడ్జ్ చేయవలసి ఉన్నప్పుడు, ఈ ఛార్జ్ రంగంలోకి వస్తుంది.
 • డీమెటీరియలైజేషన్ ఛార్జ్: భౌతిక షేర్ సర్టిఫికెట్‌ను డీమెటీరియలైజేషన్ ద్వారా డిజిటల్ ఫారంగా మార్చవచ్చు. దీనిలో డీమెటీరియలైజేషన్ ఛార్జ్ ఉంటుంది.
 • రీమెటీరియలైజేషన్ ఛార్జ్: ఇది డీమెటీరియలైజేషన్‍కు వ్యతిరేకం, ఇక్కడ ఒక డిజిటల్ షేర్ సర్టిఫికెట్ భౌతిక రూపంలోకి మార్చబడుతుంది.
 • డిపి ఛార్జీలు: డీమ్యాట్ అకౌంట్ నుండి ఐఎస్ఐఎన్ డెబిట్ చేయబడిన ప్రతిసారి డిపి ఛార్జ్ వర్తిస్తుంది.

కొంతమంది స్టాక్ బ్రోకర్లు డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీని మాఫీ చేయవచ్చు. ఉదాహరణకు, బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీలతో డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు ఏమీ లేవు. ట్రేడింగ్ సమయంలో వివిధ బ్రోకరేజ్ రేట్లను ఎంచుకోవడానికి పెట్టుబడిదారులకు ఎంపిక ఇచ్చే సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లు ఉన్నాయి.

డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?

మీరు స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభించడానికి మరియు పెట్టుబడి చేయడానికి సమయం అయిందని నిర్ణయించుకున్నప్పుడు, మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఫారంతో పాటు కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్లు స్టాండర్డ్ మరియు సెబీ ద్వారా నిర్దేశించబడినవి. శుభవార్త ఏమిటంటే డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు అతి తక్కువగా ఉంటాయి మరియు వాటిని సేకరించడానికి ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఫలితంగా, రిటైల్ పెట్టుబడిదారులకు అకౌంట్ ఓపెనింగ్ ఫారం నింపడం మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా అవసరమైన డాక్యుమెంట్లను అందించడం సులభం అవుతుంది.

డీమ్యాట్ అకౌంట్‌ను తెరవడానికి మీరు క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి

 1. పాన్ కార్డు
 2. పాస్ పోర్ట్ సైజు ఫోటో
 3. మీ సంతకం యొక్క ఒక కాపీ
 4. గుర్తింపు రుజువు - మీ పాన్ కార్డ్ గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది
 5. చిరునామా రుజువు - ఈ డాక్యుమెంట్లలో దేనినైనా సమర్పించవచ్చు - ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు/లేదా యుటిలిటీ బిల్లు (3 నెలల కంటే ఎక్కువ పాతది కాదు)
 6. బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న రుజువుగా బ్యాంక్ స్టేట్‍మెంట్‍ లేదా అకౌంట్ పాస్‌బుక్ కాపీ
 7. క్యాన్సిల్డ్ చెక్కు
 8. మీరు కరెన్సీ లేదా డెరివేటివ్ మార్కెట్‌లో ఆసక్తి కలిగి ఉంటే ఐటి రిటర్న్ లేదా పేస్లిప్

అదనంగా చదవండి: ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ ఎలా ప్రారంభించాలి

మీరు ఒక డీమ్యాట్ అకౌంట్‌ను ఎందుకు తెరవాలి?

ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా అతని/ఆమె డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే, అతను/ఆమె ఒక డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉంటే తప్ప అలా చేయలేరు. ఆన్‌లైన్ బ్రోకర్లు రిటైల్ పెట్టుబడిదారులకు త్వరగా మరియు సునాయాసంగా డీమ్యాట్ అకౌంట్ పొందడం సులభతరం చేశారు కాబట్టి, ఆన్‌లైన్‌లో డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవాలో తెలుసుకోవడం అనేది కెవైసి అవసరాలను అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది, ఇవి సెబీ ద్వారా తప్పనిసరి చేయబడ్డాయి మరియు స్టాక్‌బ్రోకర్లు అందరూ వాటికి కట్టుబడి ఉండాలి. 

ముందు పేర్కొన్న విధంగా మీ డీమ్యాట్ అకౌంట్ ఒక ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన ఫైనాన్షియల్ సెక్యూరిటీలను కలిగి ఉంటుంది. సెక్యూరిటీలను డిజిటల్ మోడ్‌లో ఉంచడం కాకుండా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి, ఇవి డీమ్యాట్ అకౌంట్‌ను మరింత ముఖ్యమైనదిగా చేస్తాయి:

 1. రక్షణ/భద్రత: గతంలో షేర్లు భౌతిక రూపంలో ఉన్నప్పుడు, వాటిని నిర్వహించడం చాలా కష్టంగా ఉండేది. ఎక్కడో పెట్టడం లేదా దొంగిలించబడడం ద్వారా వాటిని కోల్పోయే ప్రమాదం ఎల్లప్పుడూ ఉండేది. ఇప్పుడు, ఒక డీమ్యాట్ అకౌంట్‌తో, ఎలక్ట్రానిక్ రూపంలో సెక్యూరిటీలను కలిగి ఉండవచ్చు, ఇది చాలా సురక్షితం. నియమాలు, నిబంధనలు మరియు చట్టబద్దమైన సమ్మతులు డీమ్యాట్ అకౌంట్‌ను మరింత రక్షణ కలిగిన, సురక్షితమైన ఎంపికగా చేస్తాయి.
 2. సౌలభ్యత: అన్ని సెక్యూరిటీలు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నందున, ఎక్కడినుండైనా ఎప్పుడైనా వాటిని యాక్సెస్ చేయవచ్చు.
 3. వన్-స్టాప్: పెట్టుబడిదారు పెట్టుబడి పెట్టే ఫైనాన్షియల్ ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. ఈ ఉత్పత్తుల కోసం ప్రత్యేక అకౌంట్‍లను నిర్వహించడం గందరగోళంగా ఉంటుంది ఇంకా సమయం తీసుకుంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఒక పెట్టుబడిదారు తమ బహుళ సెక్యూరిటీలను ఒకే అకౌంట్‌లో నిలిపి ఉంచడానికి మరియు ట్రాకింగ్‌ను అవాంతరాలు-లేనిదిగా చేయడానికి సహాయపడుతుంది.
 4. ట్రాన్స్‌ఫర్ సులభం: మీరు ఒక ట్రేడ్‌ను ప్రారంభించినప్పుడు, స్టాక్‌బ్రోకర్ నేరుగా విక్రేత నుండి సెక్యూరిటీలను కొనుగోలుదారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీరు మైనర్ కోసం డీమ్యాట్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నట్లయితే, మీరు షేర్లను కొనుగోలు చేయవచ్చు మరియు మీ డీమ్యాట్ అకౌంట్ నుండి మైనర్ యొక్క డీమ్యాట్ అకౌంట్‌కు సౌకర్యవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
 5. సునాయాసంగా సెక్యూరిటీల డీమెటీరియలైజేషన్: మీకు భౌతిక సర్టిఫికెట్లు ఉంటే, మీరు వాటిని మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా సులభంగా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవచ్చు. మీరు ఎలక్ట్రానిక్‍గా నిర్వహించబడిన సెక్యూరిటీలను ఒక సులభమైన క్లిక్‌తో భౌతిక రూపంలోకి మార్చుకోవచ్చు.
 6. తక్షణ మరియు సులభమైన యాక్సెస్: ఒక డీమ్యాట్ అకౌంట్ ఇంటర్నెట్ ఉపయోగించి మీ పెట్టుబడులను సులభంగా యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కాబట్టి, ఏ సమయంలోనైనా, మీకు ఉన్న పెట్టుబడులు మీకు తెలిసి ఉంటాయి మరియు మీ సంపదను నిర్మించడానికి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.
 7. డివిడెండ్లకు సౌకర్యవంతమైన యాక్సెస్: డీమ్యాట్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి ముందు, డివిడెండ్ల కోసం అభ్యర్థించడం అనేది సమయం పట్టే ప్రాసెస్‌గా ఉండేది. అయితే, ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ఉపయోగించి డీమ్యాట్ అకౌంట్లకు డివిడెండ్లు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేయబడతాయి. ప్రతి డీమ్యాట్ అకౌంట్‌కు ఒక ప్రత్యేక ఐడి ఉంటుంది మరియు మీరు షేర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేసినప్పుడు, ఫలితంగా వచ్చే డివిడెండ్ ఏదైనా ఆ ఐడికి చెల్లించబడుతుంది.

ఇప్పుడే డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

బిఎఫ్ఎస్ఎల్ తో ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడం వలన ప్రయోజనాలు

బిఎఫ్ఎస్ఎల్ భారతదేశంలోని ప్రముఖ స్టాక్‌బ్రోకర్లలో ఒకటి. ఇది ఒక రిజిస్టర్డ్ స్టాక్‌బ్రోకర్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మరియు సెంట్రల్ డిపాజిటరీస్ సర్వీసెస్ లిమిటెడ్ మధ్య తమ డిపాజిటరీ భాగస్వామిగా ఎంచుకోవడానికి ఇన్వెస్టర్లకు వీలు కల్పిస్తుంది మరియు పెట్టుబడిదారులకు పారదర్శక ట్రేడింగ్ అవకాశాలను అందిస్తుంది. బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌తో ఒక డీమ్యాట్ అకౌంట్ తెరిచినప్పుడు రిటైల్ పెట్టుబడిదారులు అనేక ప్రయోజనాలను ఆనందిస్తారు.

 • డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ఎటువంటి ఛార్జీలు లేవు: ఎటువంటి ఖర్చులు లేకుండా ఆన్‌లైన్‌లో డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి బిఎఫ్ఎస్ఎల్ రిటైల్ పెట్టుబడిదారులకు వీలు కల్పిస్తుంది. వారి డీమ్యాట్ అకౌంట్లను తెరవడానికి మరియు నిర్వహించడానికి వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.
 • నిమిషాల్లో ట్రేడింగ్ ప్రారంభించండి: బిఎఫ్ఎస్ఎల్ తో మొత్తం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్‌కు గరిష్టంగా 15 నిమిషాలు పడుతుంది. మీరు మీ పాన్ కార్డ్, చిరునామా రుజువు మరియు బ్యాంక్ వివరాలను అందుబాటులో ఉంచుకుంటే, మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌ను చాలా త్వరగా తెరవవచ్చు, ట్రేడింగ్ ప్రారంభించవచ్చు.
 • వైవిధ్యమైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియో: షేర్లు మరియు స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడంతో పాటు, బిఎఫ్ఎస్ఎల్ తో ఒక డీమ్యాట్ అకౌంట్ ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఐపిఒలు మరియు ఈక్విటీ డెరివేటివ్‌లలో పెట్టుబడి పెట్టడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసినప్పుడు, మీరు రిస్కులను తగ్గించడమే కాకుండా లాభాలను కూడా అత్యధికం చేసుకుంటారు.
 • యూజర్-ఫ్రెండ్లీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలు: కేవలం యూజర్-ఫ్రెండ్లీ కాకుండా సౌకర్యవంతం కూడా అయిన అనేక ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలకు బిఎఫ్ఎస్ఎల్ మీకు యాక్సెస్ ఇస్తుందని మీరు తెలుసుకుంటారు. iOS లేదా ఆండ్రాయిడ్ కోసం మొబైల్ యాప్ ఉపయోగించి, మీరు ట్రేడ్ చేయవచ్చు.
 • తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు: మార్కెట్లో అతి తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలలో ఒకదానిని ఛార్జ్ చేయడం ద్వారా రిటైల్ పెట్టుబడిదారుల లాభాలను పెంచుకోవడానికి బిఎఫ్ఎస్ఎల్ సహాయపడుతుంది. సరసమైన ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల సహాయంతో, రిటైల్ పెట్టుబడిదారులు వారి ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా బ్రోకరేజ్ ఛార్జీలలో 99% వరకు ఆదా చేసుకోవచ్చు.

ఒక డీమ్యాట్ అకౌంట్ తెరిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ముందు, పరిగణించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. దాదాపుగా డిస్కౌంట్ స్టాక్‌బ్రోకర్లు అందరూ నేడు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్‌ను కలిపి అందిస్తున్నారు, అయితే, మీరు ఒక బ్రోకర్‌తో డీమ్యాట్ అకౌంట్ మాత్రమే తెరుస్తూ ఉన్నట్లయితే, ట్రేడింగ్ అకౌంట్ తెరవడం మరియు దానిని మీ డీమ్యాట్ అకౌంట్‌కు లింక్ చేయడం కూడా ముఖ్యం. దీని ద్వారా మీరు షేర్లను కొనుగోలు చేయగలుగుతారు మరియు విక్రయించగలుగుతారు. మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌ను తెరవడానికి బ్రోకర్‌ను ఎంచుకోవడానికి ముందు మీరు సరైన బ్రోకర్‌తో ఒక డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరిచారని నిర్ధారించుకోవడానికి క్రింద పేర్కొన్న పాయింట్లను తనిఖీ చేయాలి.

 • ఒక విశ్వసనీయ బ్రాండ్ పేరు: గొప్ప మార్కెట్ ప్రఖ్యాతి గల ఒక విశ్వసనీయ ప్లాట్‌ఫారంను ఎంచుకోవడం ముఖ్యం. మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌ను తెరుస్తున్న ప్లాట్‌ఫారం సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫారం అయి ఉండాలి. ఇది ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్ అయి, అన్ని సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా జారీ చేయబడిన అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
 • ఒక సెక్యూర్డ్ ప్లాట్‌ఫారం: మీరు ఎంచుకున్న ప్లాట్‌ఫారం మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క పూర్తి భద్రతను నిర్ధారించాలి.
 • బ్రోకరేజ్-ఫీజు: మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ముందు, దయచేసి బ్రోకర్ ద్వారా ఛార్జ్ చేయబడే బ్రోకరేజ్‌ను తనిఖీ చేయండి ఎందుకంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యవహారం.
 • ఉపయోగించడానికి సులభమైన యూజర్ ఇంటర్‍ఫేస్: ఒక మంచి ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారం దాని సాధారణ యుఐ మరియు యాప్‌లో సంక్లిష్టతలేని నావిగేషన్‌తో మీ కోసం విషయాలను సులభతరం చేస్తుంది.
 • సహాయం మరియు సపోర్ట్: మీరు ఒక ట్రేడ్‌ గురించి ఆలోచిస్తున్నప్పుడు అత్యవసర సపోర్ట్ అవసరమైతే, అలా చేయడానికి ప్లాట్‌ఫారంకు సామర్థ్యం ఉండాలి.

డీమ్యాట్ అకౌంట్ ఎలా తెరవాలి తరచుగా అడగబడే ప్రశ్నలు

ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ఎంత ఖర్చు అవుతుంది?

కొందరు బ్రోకర్ల ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు రద్దు చేయబడతాయి. అయితే, అకౌంట్ నిర్వహణ కోసం బ్రోకర్ల ద్వారా కొన్ని ఛార్జీలు విధించబడతాయి. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా విధించబడతాయి మరియు ఈ ఛార్జీలు బ్రోకర్ల వ్యాప్తంగా మారుతూ ఉంటాయి.

మీరు బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీల నుండి ఫ్రీడం ట్రేడింగ్ ప్యాక్ కోసం సైన్ అప్ చేస్తే మీరు ఉచిత డీమ్యాట్ అకౌంట్ తెరవవచ్చు. ఈ ప్యాక్‌తో, మొదటి సంవత్సరం కోసం డీమ్యాట్ ఎఎంసి శూన్యం మరియు రెండవ సంవత్సరం కోసం, ఇది రూ. 365+జిఎస్‌టి.

నేను ఉచితంగా ఒక డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవగలను?

మీరు బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుండి ఫ్రీడం ట్రేడింగ్ ప్యాక్ కోసం సైన్ ఇన్ చేస్తే మీరు ఉచిత డీమ్యాట్ అకౌంట్ తెరవవచ్చు. మీ ఇంటి సౌకర్యం వద్ద వ్రాతపనిలేని పద్ధతిలో విధానాన్ని నిర్వహించవచ్చు. ప్రాథమిక వివరాలను పూరించండి మరియు మీ కెవైసి ఫారం సబ్మిట్ చేయండి ఇక మీరు ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ఎంత సమయం పడుతుంది?

బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మీకు 10-15 నిమిషాల సమయం పడుతుంది. డీమ్యాట్ అకౌంట్ తెరిచే ప్రాసెస్ ఆన్‌లైన్‌లో జరగవచ్చు కాబట్టి, ఇది పెట్టుబడిదారులకు సులభమైనది, సౌకర్యవంతమైనది. ఈ విధానం పూర్తిగా వ్రాతపని లేనిది, అవాంతరాలు-లేనిది. కొన్ని ప్రాథమిక వివరాలను పూరించడం మరియు కెవైసి డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా, మీకు మీ డీమ్యాట్ అకౌంట్‌ సిద్ధం అవుతుంది.

ఒక ఎన్ఆర్ఐ డీమ్యాట్ అకౌంట్‌ను తెరవవచ్చా?

అవును. ఎన్ఆర్ఐలు ఏదైనా భారతీయ బ్రోకరేజ్‌తో ఒక డీమ్యాట్ అకౌంట్‌ను తెరవవచ్చు. కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ల కోసం వారి నిర్దిష్ట అకౌంట్లను ఉపయోగించాలి. ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్ రకం ఆధారంగా ఈ క్రింది రకాల డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

 • రీపాట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్: ఈ డీమ్యాట్ అకౌంట్ విదేశాలలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయగల ఎన్ఆర్ఐల కోసం అకౌంట్ ఒక ఎన్ఆర్ఇ అకౌంట్‌తో అనుబంధం కలిగి ఉండాలి
 • నాన్-రీపాట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్: ఈ డీమ్యాట్ కూడా ఎన్ఆర్ఐల కోసం, కానీ వారు దాని నుండి వారి ఫండ్స్‌ను విదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేయలేరు. ఇది మొదట ఒక ఎన్ఆర్ఒ అకౌంట్‌కు అనుసంధానించబడాలి

ఎస్ఐపి కోసం నాకు ఒక డీమ్యాట్ అకౌంట్ అవసరమా?

లేదు. ఎస్ఐపి కోసం డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి కాదు. అయితే, పెట్టుబడి పెట్టడానికి పెరుగుతున్న మార్గాలతో, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్ఐపితో సహా అన్ని సెక్యూరిటీలలో ట్రేడింగ్ కోసం డీమ్యాట్ అనేది ఒక వన్-స్టాప్-షాప్. ఒకే అకౌంట్ ద్వారా మీ పెట్టుబడిని అన్నింటినీ కలిగి ఉండటం అనేక లాగిన్‍లు, అకౌంట్లను నిర్వహించే ప్రయత్నం మరియు ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. ఒక డీమ్యాట్ అకౌంట్‌తో, మీరు పీరియాడిక్ అప్‌డేట్లతో మీ మొత్తం పోర్ట్‌ఫోలియోను కూడా చూడవచ్చు.

డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా పొందాలి?

 • డీమ్యాట్ అకౌంట్ పొందడానికి, మీరు చిరునామా రుజువు మరియు గుర్తింపు రుజువు కోసం ఒక పాన్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లను కలిగి ఉండాలి
 • ఇది నెరవేర్చబడిన తర్వాత, మీరు డిపాజిటరీ పార్టిసిపెంట్ వెబ్‌సైట్‌లో అకౌంట్ ఓపెనింగ్ ఫారంను సందర్శించవచ్చు
 • ఫారం నింపండి మరియు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి (పాన్, చిరునామా రుజువు, గుర్తింపు రుజువు, బ్యాంక్ రుజువు)
 • అప్లికేషన్‌ను ఇ-సైన్ చేయండి

డీమ్యాట్ అకౌంట్ల రకాలు ఏమిటి?

రిటైల్ పెట్టుబడిదారులు తెరవగల మూడు రకాల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. సాధారణ డీమ్యాట్ అకౌంట్ భారతదేశ నివాసులు మరియు పౌరుల కోసం మరోవైపు రీపాట్రియబుల్ మరియు నాన్-రీపాట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్లు ఎన్‌ఆర్‌ఐలకు మెరుగైనవి.

ఒక వ్యక్తి అనేక డీమ్యాట్ అకౌంట్లను తెరవవచ్చా?

అవును, ఒక వ్యక్తికి వివిధ స్టాక్‌బ్రోకర్‍లతో అనేక డీమ్యాట్ అకౌంట్లను తెరవడం సాధ్యమవుతుంది. అయితే, మీరు ఒకే స్టాక్‌బ్రోకర్‌తో అనేక అకౌంట్లను తెరవలేరు.

డీమ్యాట్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?

మీరు ఒక స్టాక్‌బ్రోకర్ నుండి మరొక స్టాక్‌బ్రోకర్‌కు డీమ్యాట్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీరు సిడిఎస్ఎల్ వెబ్‌సైట్ ద్వారా అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు మరియు కొత్త స్టాక్‌బ్రోకర్ ధృవీకరణను పూర్తి చేసిన తర్వాత, మీరు డీమ్యాట్ అకౌంట్‌ను ఆపరేట్ చేయగలుగుతారు. ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ సమయంలో, మీ ట్రేడ్‍ల వివరాలు సురక్షితంగా ఉంటాయి కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన పని లేదు.

భారతదేశంలో ఐపిఒ కోసం అప్లై చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరా?

అవును, మీరు భారతదేశంలో ఐపిఒ కోసం అప్లై చేయాలనుకుంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి.

నేను డీమ్యాట్ అకౌంట్ నుండి డబ్బును విత్‍డ్రా చేయవచ్చా?

మీరు షేర్లు లేదా సెక్యూరిటీలను విక్రయించిన తర్వాత, మీ డీమ్యాట్ అకౌంట్‌లో చూపబడటానికి రెండు రోజులు పడుతుంది మీరు మొత్తాన్ని చూసిన తర్వాత, మీరు మీ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా డబ్బును విత్‍డ్రా చేసుకోవచ్చు.

ట్రేడింగ్ అకౌంట్ తెరవకుండా నేను ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవవచ్చా?

మీరు సంపదను పెట్టుబడి చేసి పెంచుకోవాలనుకుంటే, మీకు కేవలం డీమ్యాట్ అకౌంట్ మాత్రమే కాకుండా ట్రేడింగ్ అకౌంట్ కూడా అవసరం. డిజిటల్ ఫార్మాట్‌లో సెక్యూరిటీల కోసం రిపాజిటరీగా ఒక డీమ్యాట్ అకౌంట్ పనిచేస్తుంది. పెట్టుబడి చేసి, ట్రేడ్‌లను అమలు చేయడానికి, మీ సెక్యూరిటీలు డీమ్యాట్ అకౌంట్‌లో నిర్వహించబడటానికి వీలుగా మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ అవసరం. అందువల్ల, ట్రేడింగ్ అకౌంట్ లేకుండా డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండటంలో ఎటువంటి ప్రయోజనం లేదు.

ఒక ట్రేడింగ్ అకౌంట్‌ను డీమ్యాట్ అకౌంట్‌కు లింక్ చేయడం అవసరమా?

మీరు షేర్లు వంటి నగదు విభాగంలో ట్రేడ్ చేస్తే, మీ డీమ్యాట్ అకౌంట్‌తో మీ ట్రేడింగ్ అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ట్రేడ్‍లు మీ ట్రేడింగ్ అకౌంట్ నుండి అమలు చేయబడతాయి మరియు ప్రాసెస్ చేయబడిన తర్వాత, అవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో కనిపిస్తాయి.

మీరు నగదు విభాగంలో ట్రేడ్ చేయకపోయినా, లింక్ చేయడం మంచిది. ఆ విధంగా, షేర్ ట్రాన్స్‌ఫర్ అవసరమైతే మీరు మీ డీమ్యాట్ అకౌంట్ వివరాలను అందించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు‌.

నేను ఒక డీమ్యాట్ అకౌంట్‌తో నా కొత్త ట్రేడింగ్ అకౌంట్‌ను లింక్ చేయవచ్చా?

అవును, మీరు మీ కొత్త ట్రేడింగ్ అకౌంట్‌ను ఒక డీమ్యాట్ అకౌంట్‌తో లింక్ చేయవచ్చు. మీరు మీ బ్రోకర్‌ను సంప్రదించాలి మరియు అవసరమైన ప్రాసెస్‌ను అనుసరించాలి.

డీమ్యాట్ అకౌంట్ యొక్క ఛార్జీలు ఏమిటి?

డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి బిఎఫ్ఎస్ఎల్ కు ఎటువంటి ఛార్జీలు లేవు. బ్రోకరేజ్ ఛార్జీలను తగ్గించడానికి మీరు సరసమైన ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో ఒకదానిని సులభంగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. బిఎఫ్ఎస్ఎల్ వార్షిక అకౌంట్ నిర్వహణ ఫీజు విధించదు.

మరి, మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు? నేడే ఒక డీమ్యాట్ అకౌంట్ తెరవండి మరియు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి!

అకౌంట్ తెరవడం సున్నా వార్షిక నిర్వహణ ఛార్జ్ (ఎఎంసి)తో ఫ్రీడం ప్యాక్ కోసం 1వ సంవత్సరం ఉచితం మరియు 2వ సంవత్సరం నుండి రూ. 365+జిఎస్‍టి.
 

డిస్‌క్లెయిమర్:
మా వెబ్‌సైట్ ‌లో సమాచారం, ప్రోడక్టులు ఇంకా సర్వీసులలో చేర్చబడిన లేదా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి జాగ్రత్త తీసుకోబడుతుంది మరియు సంబంధిత ప్లాట్‌ఫారంలు/వెబ్‌సైట్‌లు, సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో అనుకోకుండా తప్పులు లేదా టైపోగ్రాఫికల్ లోపాలు లేదా ఆలస్యాలు ఉండవచ్చు. ఈ సైట్‌లో మరియు సంబంధిత వెబ్ పేజీలలో ఉన్న మెటీరియల్ రిఫరెన్స్ సాధారణ సమాచార ఉద్దేశ్యం కోసం ఉంది మరియు సంబంధిత ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న వివరాలు ఏవైనా అసమానతలు ఉన్నట్లయితే ప్రబలంగా ఉంటాయి. ఇక్కడ అందించే సమాచారానికి అనుగుణంగా నడుచుకునేముందు సబ్‌స్కైబర్లు, వినియోగదారులు నిపుణుల సలహాలు తీసుకోవాలి. సంబంధిత ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్, వర్తించే నిబంధనలు మరియు షరతులను పరిశీలించిన తర్వాత దయచేసి ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీసుకు సంబంధించి తెలివైన నిర్ణయం తీసుకోండి. ఏవైనా అసమానతలు కనబడితే, దయచేసి దీనిపై క్లిక్ చేయండి మమ్మల్ని సంప్రదించండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి