వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్, ఇది మీ హెల్త్ కేర్ ప్లాన్‌లో ఒక భాగం అయి ఉండాలి. ఈ ప్లాన్‌లో, ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు ఇన్సూరెన్స్ మొత్తం రెండూ కూడా ఒక వ్యక్తికి సంబంధించినవి మరియు వాటిని ఇతరులతో పంచలేరు.
ప్రతీ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు మరియు వారి వైద్య అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. అందువల్ల, మీ కుటుంబంలోని ప్రతీ సభ్యునికి వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మంచిది. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ఆఫర్లతో హాస్పిటలైజేషన్, వైద్యుల సంప్రదింపులు, అంబులెన్స్ సేవలు, చికిత్స ఛార్జీలు లేదా ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ వలన అయ్యే ఖర్చులకు కవరేజ్ పొందండి.
బజాజ్ ఫైనాన్స్, అత్యవసర వైద్య పరిస్థితిలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సహాయపడే సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది.
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద అందించబడే కొన్ని ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
హాస్పిటలైజేషన్ సమయంలో అయ్యే వైద్య ఖర్చులకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కవరేజీని అందిస్తాయి.
అడ్మిషన్‌కు ముందు 60 రోజుల వరకు మీ ప్రీ-హాస్పిటలైజేషన్ ఛార్జీలు మరియు 90 రోజుల వరకు డిశ్చార్జ్ అనంతర ఖర్చులు కవర్ చేయబడతాయి.
నేటి వైద్య పురోగతులు ప్రధాన చికిత్సలను మరియు ఆపరేషన్లను 24 గంటలలోపు పూర్తి చేయటానికి వీలు కల్పిస్తాయి. ఈ చికిత్సలు డే కేర్ విధానంలో కవర్ చేయబడతాయి.
మీ వైద్యుడు ఏవైనా వైద్య సమస్యలకు ఇంట్లోనే చికిత్స పొందమని సిఫారసు చేస్తే, ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఆయుర్వేద, యునాని, సిధా మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మందులకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది. ఇది AYUSH థెరపీ కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
ప్రధాన అవయవ మార్పిడి కోసం అవయవ దాత యొక్క వైద్య మరియు సర్జికల్ ఖర్చులను ఈ ప్లాన్ కవర్ చేస్తుంది.
ఒకవేళ క్లెయిమ్ సమయంలో బేస్ ఇన్సూరెన్స్ మొత్తం మరియు సంచిత బోనస్ పూర్తిగా అయిపోయినట్లయితే, వైద్య ఖర్చులను నిర్వహించడంలో మీకు సహాయపడటానికి ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం ఆధారంగా రీబౌండ్ అమలులోకి వస్తుంది, ఇది ఒక బ్యాకప్‌గా పనిచేస్తుంది.
ప్రతీ క్లెయిమ్-ఫ్రీ సంవత్సరం కోసం కుములేటివ్ బోనస్‌ను పొందండి. మీ ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని పెంచుతూ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు రివార్డు అందిస్తుంది.
మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే, మీకు ఎటువంటి ముందస్తు జబ్బులు లేనట్లయితే, ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేని పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని మీరు పొందవచ్చు.
అనేక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, మీరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నపుడు, మీ కుటుంబానికి ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తీర్చడానికి క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తాయి. మీరు వరుసగా పది రోజులకు పైగా హాస్పిటల్లో ఉన్నపుడు, మీ కుటుంబానికి సంబంధించిన అదనపు ఆర్థిక అవసరాల కోసం ఇన్సూరెన్స్ సంస్థ నుండి పరిహారం పొందండి.
పాలసీదారుడు మానసిక అనారోగ్యాల చికిత్స కోసం కవరేజ్ పొందవచ్చు.
మంచి ఆరోగ్యపరమైన రికార్డుని నిర్వహించుకోవడంలో మీకు సహాయపడేందుకు, ఈ ప్లాన్లు ఉచిత వార్షిక హెల్త్ చెక్-అప్ లు మరియు ప్రివెంటివ్ హెల్త్ చెక్ అప్‌లను అందిస్తాయి. కొన్ని ప్లాన్లు రెన్యూవల్ సమయంలో ఫ్రీ హెల్త్ చెక్-అప్‌లను అందిస్తాయి.
అనేక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లైఫ్ టైమ్ రెన్యూవల్ కోసం ఆప్షన్లను అందిస్తాయి, ఇవి మీరు మీ జీవిత కాలం పాటు సురక్షితంగా ఉన్నారని భరోసా ఇస్తాయి. మీ జీవితంలో ఏ సమయంలోనైనా ఈ పాలసీ గడువు ముగిసినప్పుడు, దానిని రెన్యూ చేసుకోవడంలో ఈ ఆప్షన్ మీకు సహాయపడుతుంది.
ముందునుంచే ఉన్న వ్యాధులు
కోమార్బిడిటీస్, కిడ్నీలు, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధుల పూర్వపు చరిత్ర మరియు ఇతర సమస్యలు, మధుమేహానికి ప్రవృత్తి, ఒకరి ఉద్యోగంలో ఎదురయ్యే ప్రమాద కారకాలు మరియు ఇతర పరిస్థితులు అన్నీ కూడా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్ కవరేజీని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
ప్రీమియం
మీ అన్ని అవసరాలను తీర్చగల మరియు మీరు చెల్లించిన ప్రీమియం విలువకు సమగ్ర కవరేజీని అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి.
క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్
ఈ ప్రయోజనం, వైద్య అత్యవసర పరిస్థితుల్లో డబ్బును ఏర్పాటు చేయడం కోసం పరుగులు పెట్టకుండా, మీ కుటుంబ సభ్యులకు త్వరగా పరిస్థితిపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది. మీరు మీ ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డును ఉపయోగించి ఇన్సూరెన్స్ సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
సమగ్ర కవరేజ్
హాస్పిటలైజేషన్, ప్రీ-మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు సమగ్ర వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి. వైద్య పరీక్షలు, అంబులెన్స్ చార్జీలు, మందులు, వైద్యుల ఫీజులు మరియు ఇతర ఖర్చులు చేర్చబడవచ్చు.
క్యుములేటివ్ బోనస్
ఒక కుములేటివ్ బోనస్ అనేది క్లెయిమ్-రహిత పాలసీ సంవత్సరం కోసం పాలసీదారునికి ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చే ద్రవ్య ప్రయోజనం. సాధారణంగా ఈ మొత్తం రెన్యూవల్ సమయంలో ఇండివిడ్యువల్స్ కోసం మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి జోడించబడుతుంది మరియు కవరేజీలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది.
మీకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమయ్యే కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి:
జీవనశైలి మరియు వ్యాధులు
ఒత్తిడి, కాలుష్యం, పేలవమైన ఆహారపు అలవాట్లు, డివైస్ అడిక్షన్ మరియు అయోమయంగా ఉండే జీవితాలు, జీవనశైలి అనారోగ్యాల ప్రాబల్యానికి దోహదం చేస్తాయి.
పెరుగుతున్న మెడికల్ ద్రవ్యోల్బణం
భారతదేశంలో వైద్య చికిత్స ఖర్చు నిరంతరం పెరుగుతోంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, మీరు వైద్య సంక్షోభ సమయంలో అన్ని ఖర్చులను తీర్చడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండవచ్చు.
గణనీయమైన పొదుపు
వైద్య అత్యవసర సమయాల్లో మీ పొదుపును చెక్కుచెదరకుండా ఉంచడానికి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సహాయపడుతుంది. వైద్య అత్యవసర పరిస్థితుల సమయంలో మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థికంగా భద్రత కల్పించడం ద్వారా ఇది వైద్య ఖర్చులను నిరోధిస్తుంది.
పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు మారుతున్న జీవనశైలితో, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఊహించని అనారోగ్యం లేదా గాయం సందర్భంలో మీ ఆరోగ్య సంరక్షణ కోసం చెల్లించడంలో మీకు సహాయపడుతుంది. ఇండివిడ్యువల్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వైద్య అనిశ్చితి నుండి మరియు అవసరమైనప్పుడు అధిక-నాణ్యతతో కూడిన వైద్య సంరక్షణ కోసం హామీ ఇస్తాయి.
మీరు దీనిని ముందస్తుగా కొనుగోలు చేయడం మంచిది, సాధారణంగా మీ ఇరవై సంవత్సరాల వయసు ప్రారంభంలో మరియు ఉద్యోగం చేయడం మొదలు పెట్టినపుడు ఇది సరైనది. ఇండివిడ్యువల్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలుఆర్థికపరమైన ప్లాన్ చేసుకోవడంలో సహాయపడతాయి మరియు తక్కువ ధరలో సమగ్ర కవరేజీని అందిస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో అందించే ప్రీమియంలు బీమాదారుడి నుండి బీమాదారునికి భిన్నంగా ఉంటాయి. సరసమైన ప్రీమియం వద్ద అందుబాటులో ఉన్న, మీ అవసరాలకు సరిపోయే సరైన ఇన్సూరెన్స్ ప్లాన్లను మీరు సరిపోల్చవచ్చు మరియు ఎంచుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ దేశంలోని అగ్ర బీమా సంస్థలతో పాటు సరసమైన ప్రీమియంలలో విస్తృతమైన, సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణంతో, మిమ్మల్ని ఆర్థికపరంగా సురక్షితంగా ఉంచే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం.
ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్‌ల మధ్యన నిర్ణయించేటప్పుడు, ప్రీమియం మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిన అంశం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ కుటుంబం మొత్తాన్ని ఒకే పాలసీ కింద కవర్ చేస్తుంది, అయితే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్స్ని రక్షిస్తుంది. ఈ రెండు ప్లాన్ల నుండి కుటుంబ సభ్యులందరికీ భరోసానిచ్చే మరియు గరిష్ట ప్రయోజనాలను చేకూర్చే ఒక ప్లాన్‌పై దృష్టి పెట్టడం అనేది ఉత్తమ వ్యూహం.
అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సహేతుకమైన ధర వద్ద విస్తృతమైన కవరేజీని అందిస్తాయి. వివిధ బీమా సంస్థలు వేర్వేరు ప్రీమియం ఆఫర్లను కలిగి ఉంటాయి. అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని అందిస్తున్నాయి. అందువల్ల, మీరు మీ బడ్జెట్లో, మీ అన్ని అవసరాలకు సరిపోయే ఉత్తమమైన వాటిని శోధించవచ్చు మరియు ఎంచుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ అందించే విస్తృత శ్రేణి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల నుండి మీరు సరసమైన ప్రీమియంలలో లభించే వాటిని ఎంచుకోవచ్చు.
దిగువ పేర్కొన్న పలు రకాల ఆప్షన్ల కోసం కూడా మీరు చూడవచ్చు:
గ్రూప్ ఇన్సూరెన్స్: మీ ఆఫీస్‌లో ఏదైనా గ్రూప్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేయండి.
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు : ఒకే ప్రీమియం క్రింద మిమ్మల్ని మరియు మీ మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోండి.
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?