బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు

ఫిక్సెడ్ డిపాజిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్

ఫిక్సెడ్ డిపాజిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్

ఒక అవగాహనగల ఇన్వెస్టర్ గా, మీరు ఎల్లప్పుడూ సమాచారాన్ని క్రాస్-చెక్ చేసుకుని, అన్ని విభిన్న ఫ్యాక్టర్ల కోసం అకౌంటింగ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని రూపొందించాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు వైరల్ వార్తా కథనాలు లేదా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ ద్వారా ప్రలోభాలకు గురికావడం సులభం, కానీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ స్వంత అవసరాలు మరియు రిస్క్ తీసుకోవాలనే కోరికని మూల్యాంకన చేసుకోవడం మరింత ముఖ్యం.

పాప్యులర్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా, ఫిక్సెడ్ డిపాజిట్మ్యూచువల్ ఫండ్స్ ఎంతోమంది ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. మీరు ఫిక్సెడ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్-లో ఏది మెరుగైన ఎంపిక అయి ఉంటుందా అనేది నిర్ణయించుకోవటానికి కష్టపడుతున్నట్లయితే, మీ ఎంపికలను జాగ్రత్తగా పరిశీలించి, తదనుగుణంగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.

మీకు ఏది అత్యుత్తమమైనదో నిర్ణయించుకునేందుకు వీలుగా, కొన్ని సాధారణంగా అడిగబడిే ప్రశ్నల ఆధారంగా, ఇక్కడ, మేము రెండు ఇన్వెస్ట్మెంట్లను పోలుస్తాము.

Q1. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

 • ఒక మ్యూచువల్ ఫండ్ అనేది వారి డబ్బును పెంచుకోవాలి అనే ఒక సాధారణ లక్ష్యంతో ఎంతోమంది ఇన్వెస్టర్లు కలిసే ప్రదేశం.
 • ఈక్విటీలు, బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలు మరియు / లేదా ఇతర సెక్యూరిటీలలో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది.
 • ఈ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా సంపాదించిన ఆదాయం అప్పుడు ఇన్వెస్టర్ల మధ్య సమానంగా పంపిణీ చేయబడుతుంది. అయిన ఖర్చులు మినహాయించిన తర్వాత ఇది జరుగుతుంది.

 

Q2.ఫిక్సెడ్ డిపాజిట్లు అంటే ఏమిటి?

 • ఫిక్సెడ్ డిపాజిట్లలో, ఒక ఇన్వెస్టర్ల గ్రూప్ ద్వారా డబ్బు పూలింగ్ ఏమీ ఉండదు. అందుకు బదులుగా, పేరు సూచిస్తున్నట్లుగా, ఇందులో ఒక నిర్దిష్ట కాలం లేదా అవధి పాటు ఒక డబ్బు మొత్తాన్ని స్థిరంగా ఉంచడం ద్వారా వడ్డీని జనరేట్ చేయడం ఉంటుంది.
 • ఈ అవధి సాధారణంగా ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు రేంజ్ అవుతూ ఉంటుంది.
 • చెల్లించబడే వడ్డీ రేటు సేవింగ్స్ అకౌంటుకు చెల్లించబడే దాని కంటే ఎక్కువగా ఉన్నందున ఫిక్సెడ్ డిపాజిట్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
 • ప్రిన్సిపల్ తో కలిపి ఈ వడ్డీ, మెచ్యూరిటీ కాలంలో మీకు తిరిగి ఇవ్వబడుతుంది.
 • మీరు మినిమల్ డాక్యుమెంటేషన్ తో ఫిక్సెడ్ డిపాజిట్లో రూ.25, 000 అంత తక్కువ ఇన్వెస్ట్ చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి: ఫిక్సెడ్ డిపాజిట్ అంటే ఏమిటి?

 

Q3. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేసి ఉంచవచ్చు?

 • మీరు ఎంచుకునే ఫండ్ రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ కు లాక్-ఇన్ పీరియడ్స్ ఉంటాయి మరియు మీరు కోరినప్పుడు మీరు నిష్క్రమించవచ్చు. అదే విధంగా, ఫిక్సెడ్ డిపాజిట్ల కోసం, మీ డబ్బుని 1 - 5 సంవత్సరాల కోసం ఫండ్ తో ఉంచవచ్చు.
 • కానీ, మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్సెడ్ డిపాజిట్లలో దేనిని ఎంపిక చేసుకున్నా, మీరు అతి తక్కువ, అనగా, ఒక సంవత్సరం కన్నా తక్కువ వ్యవధిని ఎంచుకుంటే మీరు కొన్ని అప్రయోజనాలు ఎదుర్కుంటారని గుర్తుంచుకోవాలి,.
 • మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, సంవత్సరం ముగిసే లోపు మీరు పొందే ఏ లాభాలు అయినా షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ గా పన్ను విధించబడతాయి. ఫిక్సెడ్ డిపాజిట్ల విషయంలో, సంపాదించిన వడ్డీ గనక రూ. 10, 000 ని మించితే, ఈ అమౌంట్ యొక్క 10% రేట్ చొప్పున సోర్స్ వద్ద పన్ను మినహాయించబడుతుంది (TDS).
 • మ్యూచువల్ ఫండ్స్ లో, క్యాపిటల్ తరుగుదల నివారించడానికి మరింత ఎక్కువ-టర్మ్ పాటు ఇన్వెస్ట్ చేసి ఉంచడం మరింత తెలివిగల పని.

 

Q4. ఇందులో ఉన్న సురక్షత డిగ్రీ ఎంత ?

 • ఒక FD తెరవడానికి మీరు ఒక పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC)కి వెళ్ళినప్పుడు మెచ్యూరిటీ పై అది అందించే వడ్డీ రేటు గురించి మీకు ముందుగానే తెలియజేయబడుతుంది.
 • ఈ వ్రాయబడిన వడ్డీ రేటు గ్యారెంటీ ఇవ్వబడినది మరియు సవరించబడలేదు లేదా మార్చబడలేదు.
 • మీరు మ్యూచువల్ ఫండ్లలో సంపాదించే వడ్డీ ఫిక్సెడ్ డిపాజిట్ల కన్నా బహుశా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది స్థిరంగా ఉంటుందని హామీ ఏదీ ఉండదు. కాబట్టి ఫిక్సెడ్ డిపాజిట్లలాగా కాకుండా, మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు కాన్స్టెంట్ గా లేదా యూనిఫారం గా గానీ ఉండవు.
 • ఇది ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో అస్థిరత కు లోబడి ఉంటాయి. కాబట్టి, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటుంది అనే ఫైన్ ప్రింట్ తో వస్తుంది.
 • మీరు మ్యూచ్యువల్ ఫండ్లో లేదా ఫిక్సెడ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తారా అనే ఎంపిక అల్టిమేట్ గా మీ రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని బట్టి ఉంటుంది.

 

మీరు ఒక సురక్షితమైన, తక్కువ-రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే, ఫిక్సెడ్ డిపాజిట్ల కోసం ఎంపిక చేసుకోవడం మంచిది. బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లు అత్యుత్తమమైన ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లుతో స్థిరమైన మరియు ఎస్యూర్డ్ రిటర్న్స్ అందిస్తాయి. ఒక బటన్ క్లిక్ చేయడంతో, ఒకదానిని ఆన్‍లైన్ తెరిచే సౌలభ్యాన్ని కూడా వారు అందిస్తారు.