back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్

Group health insurance is a collective health insurance policy offered to a group of individuals. This plan allows companies, organisations, banks, and even housing societies to procure health insurance for their entire staff or members. The employer pays the premium of this policy while all employees and their families can avail the benefits. A group health insurance plan is beneficial for both the employers as well as the employees. While the employees get health coverage benefits, the employers get the increased chances of an employee staying in the company. In addition, the employer also gets tax benefits for providing such policies to its employees

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • సమగ్ర కవరేజ్

  అంబులెన్స్, మందులు, స్పెషలిస్ట్‌ల ఖర్చులు మరియు మరెన్నో వాటితో సహా వైద్య ఖర్చుల కోసం ఈ పాలసీ సమగ్ర కవరేజీని అందిస్తుంది.

 • వైద్య ప్రయోజనాలు

  ప్రమాదవశాత్తు హాస్పిటలైజెషన్ మరియు రోజువారీ హాస్పిటల్ ప్రయోజనాలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తే వైద్య ఖర్చులకు, ఈ పాలసీ సమగ్ర కవరేజీని అందిస్తుంది.

 • కవర్ చేయబడే డిపెండెంట్లు

  గ్రూప్/ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ ప్లాన్ కింద ఉద్యోగి యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లలను, సహేతుకమైన అదనపు ఖర్చుతో కవర్ చేసే ఆప్షన్‌ని మీకు అందిస్తుంది.

 • సమయం మరియు డబ్బు పొదుపు చేసుకోండి

  సమయం మరియు డబ్బుని ఆదా చేయడానికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సరైనవి. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం ఇది ఒక ఉత్తమ ఎంపిక. ఈ రకమైన ఇన్సూరెన్స్‌లో ఇన్సూర్ చేయబడిన గ్రూప్, డిస్కౌంట్లు మరియు మినహాయింపులను కూడా పొందుతుంది.

 • క్యాష్లెస్ క్లెయిములు

  అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో వైద్య చికిత్సల కోసం క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయాన్ని పొందండి.

 • ఫ్లెక్సిబుల్ టర్ములు

  మీ అవసరాలు మరియు గ్రూప్ పరిమాణాన్ని బట్టి పాలసీ టర్మ్‌ని ఎంచుకోండి.

 • Education loan scheme

  ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

  మీరు కొన్ని సులభమైన దశలతో గ్రూప్/ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 • విస్తృత ప్రయోజనాలు

  ముందనుంచే ఉన్న వ్యాధుల కోసం ఒక వైద్య కవర్ లేదా ఒక యాడ్ ఆన్ కవర్ తో ప్రసూతి ఖర్చులను పొందండి.

యజమానుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు

పన్ను మినహాయింపులు
కంపెనీలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించినప్పుడు, వారు తమకు మరియు ఉద్యోగులకు పన్ను రాయితీని బుక్ చేస్తారు.

తక్కువ ఖర్చులలో అధిక ప్రయోజనాలు
అనేక ఉద్యోగులను కవర్ చేసే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై ప్రీమియంలను చర్చించడం ద్వారా యజమానులు మెరుగైన ఖర్చు ప్రతిపాదనలను పొందవచ్చు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో పోలిస్తే ఉద్యోగులు మెరుగైన ప్లాన్ ఫీచర్ల నుండి కూడా ప్రయోజనం పొందుతారు.

ఉద్యోగుల కోసం మెరుగైన టాలెంట్ రిటెన్షన్
మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రయోజనం మెరుగైన ఉద్యోగి ఎంగేజ్‌మెంట్ మరియు మెరుగైన ఎంప్లాయర్ బ్రాండ్‌ను నిర్మించడానికి ఒక మోటివేటర్ కావచ్చు.

రిస్క్-ఫ్రీ వర్క్ కల్చర్
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులను మరింత ప్రేరణతో పని చేయడానికి అనుమతిస్తుంది, వారి ఆరోగ్యం మరియు వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి.

భారతదేశంలో ఉత్తమ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

ఇన్సూరెన్స్ ప్రదాత వేచి ఉండే వ్యవధి (ముందు నుండి ఉన్న వ్యాధులు) క్లెయిమ్ రేషియో రెన్యూవబిలిటీ నెట్‌వర్క్ హాస్పిటల్స్
Aditya Birla Group Activ Health (ABCD) 2 సంవత్సరాలు 94% - 8000+
ఆదిత్య బిర్లా సూపర్ టాప్-అప్ అందుబాటులో లేదు 94% - 8000+
బజాజ్ అలియాంజ్ అందుబాటులో లేదు 98% - 6500+
గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ
Manipal Cigna Pro-Health Group 2 సంవత్సరాలు 91% - 6500+
Manipal Cigna Pro-Health Group 4 సంవత్సరాలు 96% - 7000

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చబడినవి

ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ క్రింది విషయాలను కవర్ చేస్తుంది:

 • గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ పాలసీ క్రింద సభ్యుల సమూహాన్ని కవర్ చేస్తుంది.
 • ఇది అనారోగ్యాలు, వ్యాధులు మరియు ప్రమాదాలకు సంబంధించిన వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. అదనంగా, ఇది హాస్పిటల్‌లో చేరడానికి ముందు మరియు తర్వాత అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
 • గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో, ఒక సభ్యుని జీవిత భాగస్వామిని మరియు మూడు నెలల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ముగ్గురు పిల్లలను లేదా అదనపు ఖర్చుతో ఇతర ఆధారపడిన వారిని కూడా జోడించవచ్చు.
 • ఈ పాలసీ క్యాష్‌లెస్ సౌకర్యాలను అందిస్తుంది మరియు ఖర్చుల విషయంలో హాస్పిటల్‌తో నేరుగా సెటిల్‌మెంట్ చేస్తుంది.
 • నివాస ఖర్చులను కూడా పొందవచ్చు.
 • ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కంపెనీ నుండి కంపెనీకి వేరుగా ఉంటాయి, ప్రతీ కంపెనీ విభిన్న ఉద్యోగి బలాన్ని కలిగి ఉంటుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ప్రపంచవ్యాప్తంగా నిరంతరం మారుతున్న సందర్భాలతో, తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు ఆరోగ్య సంబంధిత ఆందోళనల కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక అవసరాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక ప్రణాళికను రూపొందించడం చాలా కీలకంగా మారింది. ఈ మార్పు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మరింత సంబంధితంగా చేసింది.

పన్ను మినహాయింపులు: గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉద్యోగులు మరియు యజమానులకు పన్ను మినహాయింపులతో వస్తుంది. అందువల్ల, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టడం అనేది యజమాని మరియు ఉద్యోగికి లాభదాయకంగా ఉంటుంది.

తక్కువ ప్రీమియంలు, గొప్ప ప్రయోజనాలు: వైద్య ఖర్చులపై మిమ్మల్ని ఇన్సూర్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక గొప్ప సాధనం. ఒక గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో సాపేక్షంగా తక్కువ ప్రీమియం ఉంటుంది మరియు మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కొన్ని కవర్లను కూడా జోడించవచ్చు మరియు మీ అవసరాలు మరియు ప్రాధాన్యతల ప్రకారం వాటిని కస్టమైజ్ చేయవచ్చు.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద మినహాయింపులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల క్రింద ముందు ఉన్న అనారోగ్యాలు కవర్ చేయబడవు.
 • తప్పనిసరి వైద్య విధానాలు లేదా టెస్టులు చేర్చబడలేదు.
 • ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో పైన పేర్కొన్నవి తప్ప వయోపరిమితి చేర్చబడలేదు.
 • యుద్ధం కారణంగా జరిగిన గాయం లేదా అనారోగ్యం కూడా పరిగణించబడదు.
 • వైద్యులు సిఫారసు చేసినప్పటికీ, కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వీల్ చైర్, లెన్సులు మొదలైన బాహ్య మన్నికైన వస్తువులను కవర్ చేయవు.
 • డెంటల్ మరియు గర్భధారణ సంబంధిత చికిత్సలు కూడా చేర్చబడలేదు.

బజాజ్ ఫైనాన్స్ నుండి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి

బజాజ్ ఫైనాన్స్ దేశంలోనే అత్యంత వైవిధ్యభరితమైన నాన్-బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇది వినియోగదారు, వ్యాపారం మరియు SME ఫైనాన్స్ వంటి అనేక ప్రోడక్ట్ మార్గాలతో, ఈ విభాగంలో అత్యంత లాభదాయక సంస్థలలో ఒకటిగా నిలిచింది.

ఒక క్లెయిమ్ ఎలా చేయాలి

క్యాష్లెస్ క్లెయిమ్

 • మీరు దేశంలో ఎక్కడైనా పార్ట్‌నర్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ చికిత్స ప్రయోజనాన్ని పొందవచ్చు. క్లెయిమ్ ఫైల్ చేసే విధానం క్రింది విధంగా ఉంటుంది:
 • మొదట, మీరు క్యాష్‌లెస్ చికిత్సను పొందాలనుకునే నగరంలో, పార్ట్‌నర్ నెట్‌వర్క్ హాస్పిటల్ (ఉదా: ఆదిత్య బిర్లా) కోసం శోధించండి.
 • ప్రణాళికాబద్ధమైన హాస్పిటలైజేషన్ విషయంలో అడ్మిషన్‌కు ముందు 3 రోజుల వ్యవధిలోపు మరియు (అత్యవసర హాస్పిటలైజెషన్) సందర్భంలో 48 గంటలలోపు ఇన్సూరెన్స్ సంస్థకు విషయాన్ని తెలియజేయండి.
 • హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు, రోగి యొక్క ఇన్సూరెన్స్ క్యాష్‌లెస్ కార్డు లేదా పాలసీ వివరాలను తీసుకెళ్లండి.
 • హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్‌లెస్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌ను హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్‌ వద్ద చూపించండి.
 • హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌ను సరిగ్గా పూరించండి మరియు దానిని హాస్పిటల్‌లో సమర్పించండి.
 • తక్షణ చర్య కోసం, అధికారిక వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ ఫారమ్‌ను పూరించండి మరియు ఇన్సూరర్‌కు తెలియజేయండి. మీ రిక్వెస్ట్ సమీక్షించబడుతుంది కావున నిర్ణయం కోసం వేచి ఉండండి.
 • రిక్వెస్ట్‌ని అందుకున్న తర్వాత ఇన్సూరెన్స్ సంస్థ తన నిర్ణయం కోసం 2 గంటల వరకు సమయం తీసుకోవచ్చు మరియు ఒక ఈ-మెయిల్, SMS ద్వారా మీకు నిర్ణయం గురించి తెలియజేస్తారు.
 • మీరు ఆన్‌లైన్‌లో స్టేటస్‌ని కూడా చెక్ చేయవచ్చు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్:

 • అత్యవసరమైన అడ్మిషన్ విషయంలో, మీరు 48 గంటల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి మరియు మా ద్వారా ముందస్తు అనుమతి జారీ చేయబడకపోతే నేరుగా హాస్పిటల్ వారికి ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది.
 • క్లెయిమ్ డాక్యుమెంట్ల సేకరణ మరియు సమర్పణ - హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన 15 రోజుల్లోపు కింద పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితాను మాకు పంపించాలి.
 • డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఇన్సూరెన్స్ సంస్థ, నిబంధనలను మరియు పాలసీ షరతుల ప్రకారం దానిని ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు.
 • రిక్వెస్ట్ అప్రూవ్ అయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్‌కు NEFT ద్వారా రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పంపిస్తారు.
 • రిక్వెస్ట్ తిరస్కరించబడితే, అదే సమాచారం మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్ మరియు ఈ-మెయిల్ ID కి చేరవేయబడుతుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

దశ1: పైన ఉన్న 'ఇప్పుడే అప్లై చేయండి బటన్' పై క్లిక్ చేయండి

దశ 2: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను స్వతహా పూరించండి మరియు ‘సమర్పించు’ బటన్ పై క్లిక్ చేయండి

దశ 3: అందుబాటులో ఉన్న పాలసీలను గురించి చర్చించడానికి మరియు అవసరమైన డాక్యుమెంట్లను స్వీకరించడానికి, మా బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

దశ 4: కొన్ని గంటల్లో మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందండి.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తరచుగా అడగబడే ప్రశ్నలు (FAQలు)

1 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ను పలు సంస్థలు, బ్యాంకులు, బిజినెస్ గ్రూప్‌లు, హౌసింగ్ సొసైటీలు మరియు ఎంప్లాయర్స్, వారి ఉద్యోగులకు అందిస్తారు మరియు ప్రీమియం ఖర్చును సంస్థ భరిస్తుంది. దీనిని కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని కూడా పిలుస్తారు. ఎంప్లాయర్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందించినప్పుడు,ఎంప్లాయర్ మరియు ఉద్యోగి ఇద్దరూ లబ్ధి పొందుతారు. ప్రీమియం అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ నుండి మరొకదానికి మారుతుంది. అదేవిధంగా, ఇన్సూరెన్స్ కవరేజ్, చెల్లింపులు మరియు ప్రీమియంలు కూడా ప్రతీ ఉద్యోగికి భిన్నంగా ఉంటాయి.

2 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు ఏవి?

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఈ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అదనంగా, పాలసీదారుడు అత్యవసర సమయాల్లో ఉత్తమ వైద్య సదుపాయాలు మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందుతాడు.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యజమానులు తమ బృందానికి అందించే ఒక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. ఊహించని పరిస్థితిలో హాస్పిటల్‌లో చేరినప్పుడు, ఉద్యోగులకు ఆర్థిక సహాయం కోసం హామీ ఇవ్వబడుతుంది. మీకుకార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ఉంటే ఆదాయపు పన్ను చట్టం క్రింద పన్ను మినహాయింపులకు ఇది సహాయపడుతుంది

3 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడినవారికి భద్రతను మరియు రక్షణను అందిస్తుంది కావున, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క భద్రత మెరుగైన ప్రోడక్టివిటీ మరియు క్రియేటివిటీకి దారితీస్తుంది.

అంతేకాకుండా, ఉద్యోగులకు కవరేజ్ అందించడం ద్వారా, యజమానులు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపులు పొందుతారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ యజమాని మరియు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు పన్ను మినహాయింపు ఉంటుందా?

అవును, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. ఎంప్లాయర్స్ ఆ పన్ను మినహాయింపు పొందవచ్చు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అందించే ప్రయోజనాలకు మాత్రమే, ఉద్యోగులు అర్హులు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియం మొత్తాన్ని వారి యజమాని చెల్లించినట్లయితే, ఉద్యోగులు పన్ను ప్రయోజనాన్ని పొందలేరు. అయితే, ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి జీతం నుండి తీసివేస్తే, అప్పుడు ఉద్యోగి పన్ను రాయితీ కోసం క్లెయిమ్ చేయవచ్చు.

5. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే ఏమిటి?

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వ్యక్తుల సమూహం యొక్క ఆరోగ్యానికి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్. ఏవైనా వైద్య ఖర్చుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక స్థిరమైన ప్రణాళిక కింద ఉద్యోగులందరినీ కవర్ చేయడానికి కంపెనీల కోసం ఇది రూపొందించబడింది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మెరుగైన కవరేజ్, ప్రయోజనాలు మరియు కస్టమైజేషన్ ఎంపికలతో ఖర్చు-తక్కువగా ఉంటుంది.

6. వ్యక్తులు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చా?

ఒక వ్యక్తుల గ్రూప్ ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు, అయితే ఒక వ్యక్తి వీటిని కొనుగోలు చేయలేరు. వివిధ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వివిధ కవరేజ్ ప్లాన్లు, చేర్పులు మరియు మినహాయింపులతో వస్తాయి. కొన్ని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు 7 నుండి 10 మంది వ్యక్తులను కవర్ చేస్తాయి, అయితే ఇతరులు 50 మంది వ్యక్తులను కవర్ చేస్తారు. మీ అవసరాలకు సరిపోయే కవరేజ్‌ను మీరు అన్వేషించవచ్చు మరియు కనుగొనవచ్చు.

7. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుడిని కవర్ చేస్తుంది, అయితే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక యజమాని ద్వారా పొడిగించబడిన ఒక కవర్ మరియు మీ కుటుంబాన్ని కూడా కవర్ చేయవచ్చు. రెండు హెల్త్ ఇన్సూరెన్స్‌లకు కవరేజ్ మరియు ఇతర ప్రయోజనాలలో వేరియేషన్లు ఉంటాయి.

8. భర్త మరియు భార్యకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవచ్చా?

భర్త మరియు భార్య అదే సంస్థ కోసం పనిచేస్తే ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగం కావచ్చు. యజమాని వినియోగించుకున్న ఆ నిర్దిష్ట పాలసీ మీ కుటుంబాన్ని కూడా కవర్ చేస్తే వారు అదే పాలసీలో భాగం కావచ్చు.

9. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?

అవును, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులందరూ తమ ఉద్యోగులను కవర్ చేయాలి. ప్రస్తుత ఆరోగ్య దృష్టాంతం ప్రభుత్వ దృక్పథాన్ని మార్చింది, అన్ని సంస్థలు తమ ఉద్యోగులను కవర్ చేయడం తప్పనిసరి చేసింది.

10. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రెగ్నెన్సీని కవర్ చేస్తుందా?

గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ నుండి ఉద్యోగులందరినీ రక్షించడానికి ఒక కవచంలా పనిచేస్తుంది. సాధారణంగా, ప్రెగ్నెన్సీ అనేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడదు కానీ అదనపు కవర్‌గా తీసుకోవచ్చు.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?