అధిక రాబడులను పొందడానికి ఉత్తమ పెట్టుబడి ఎంపికలు
పెట్టుబడి చేయడం అనేది భారతదేశంలో సంపద సృష్టించడంలో ఒక అవసరమైన భాగం. ఇది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికి మరియు మీ ఆర్థిక భవిష్యత్తును స్థిరపరచడానికి మీకు సహాయపడుతుంది. డబ్బును మీ బ్యాంక్ అకౌంట్లలో ఉపయోగించకుండా ఉంచడానికి బదులుగా, మీరు స్టాక్స్, ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడవచ్చు మరియు భారతదేశంలో అత్యుత్తమ పెట్టుబడి ప్రత్యామ్నాయాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సురక్షితమైన జీవితాన్ని గడపడానికి భవిష్యత్తు కోసం ఆర్థిక పరిపుష్టిని నిర్మించవచ్చు.
మార్కెట్లో కొన్ని పెట్టుబడి ప్లాన్లు అధిక స్థాయి రిస్క్‌ను కలిగి ఉంటాయి మరియు ఇతర అసెట్ తరగతులతో పోలిస్తే ప్రయోజనకరమైన దీర్ఘకాలిక రాబడులను పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అనేక పెట్టుబడి ప్లాన్లు అందుబాటులో ఉన్నందున, సరైన దానిని ఎంచుకోవడం అనేది సవాలుగా ఉండవచ్చు. సేవింగ్స్ పెంచుకోవడానికి సహాయపడే కొన్ని పెట్టుబడి ప్లాన్లు దిగువ జాబితా చేయబడ్డాయి.
భారతదేశంలో 14 ఉత్తమ పెట్టుబడి ప్లాన్లు
డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఎంచుకోగల కొన్ని రకాల పెట్టుబడులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
స్టాక్స్
స్టాక్స్ ఒక కంపెనీ లేదా ఒక సంస్థలో యాజమాన్యం యొక్క వాటాను సూచిస్తాయి. స్టాక్స్ అనేవి సాధారణ రాబడులను సంపాదించడానికి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఉత్తమ పెట్టుబడి మార్గాల్లో ఒకటి. అయితే, ఇవి మార్కెట్-లింక్డ్ సాధనాలు కాబట్టి, క్యాపిటల్ నష్టానికి ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది రిస్క్ లేని పెట్టుబడిదారులకు అనువైన పెట్టుబడి సాధనం. మీ డిపాజిట్ పై సురక్షితమైన రాబడులను అందించేటప్పుడు ఎఫ్‌డి మార్కెట్ కదలికలపై ఎలాంటి ప్రభావం చూపదు. అధిక రిస్క్ సామర్థ్యాలు గల పెట్టుబడి దారులు కూడా వారి పోర్ట్‌ఫోలియోను స్థిరపరచడానికి ఎఫ్‌డిలు, ఆర్‌ఇఐటిలు మరియు క్రిప్టోలలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకుంటారు.
మీరు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ సహాయంతో వడ్డీ రాబడులను లెక్కించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఫండ్ మేనేజర్ల ద్వారా నిర్వహించబడే పెట్టుబడి సాధనాలు, ఇవి ప్రజల డబ్బును పోగు చేసి, వివిధ కంపెనీల స్టాక్స్ మరియు బాండ్లలో పెట్టుబడి పెడతాయి మరియు రాబడులను అందిస్తాయి. ఒక చిన్న డిపాజిట్ మొత్తంతో ప్రారంభించినప్పుడు కూడా మీరు సాధారణ రాబడులను సంపాదించవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది రిటైరీల కోసం దీర్ఘకాలిక పొదుపు ఎంపిక. పదవీవిరమణ తర్వాత ఒక స్థిరమైన మరియు సురక్షితమైన ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం లక్ష్యంగా ఉన్నవారికి ఈ ఎంపిక సరైనది.
ప్రజా భవిష్య నిధి
పిపిఎఫ్ అనేది భారతదేశంలో ఒక విశ్వసనీయ పెట్టుబడి ప్లాన్. పెట్టుబడులు కేవలం సంవత్సరానికి రూ. 500 వద్ద ప్రారంభమవుతాయి మరియు పెట్టుబడి పెట్టిన అసలు, సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం అన్నీ పన్ను నుండి మినహాయించబడతాయి. ఇది 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది, వివిధ పాయింట్లలో పాక్షిక విత్‍డ్రాల్స్ అనుమతించబడతాయి.
ఎన్‍పీఎస్
ఎన్‌పిఎస్ అనేది పెన్షన్ ప్రత్యామ్నాయాలను అందించే లాభదాయకమైన ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. మీ ఫండ్స్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్టాక్స్ మరియు ఇతర పెట్టుబడి ఎంపికలలో పెట్టుబడి పెట్టబడతాయి. లాక్-ఇన్ వ్యవధి పొడవు పెట్టుబడిదారు వయస్సు ద్వారా నిర్ణయించబడుతుంది, ఎందుకంటే పెట్టుబడిదారు 60 సంవత్సరాల వయస్సుకు చేరుకునే వరకు ఈ స్కీమ్ మెచ్యూర్ కాదు.
రియల్ ఎస్టేట్
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి, ఇది అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంది. ఫ్లాట్ లేదా ప్లాట్ కొనుగోలు అనేది భారతదేశంలోని అనేక పెట్టుబడి ఆప్షన్లలో ఉత్తమ సాధనాల్లో ఒకటి. ప్రతి ఆరు నెలలకు ఆస్తి రేటు పెరిగే అవకాశం ఉన్నందున, రిస్క్ తక్కువగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ దీర్ఘకాల వ్యవధిలో అధిక రాబడులను అందించే ఆస్తిగా పనిచేస్తుంది.
గోల్డ్ బాండ్లు
సావరిన్ గోల్డ్ బాండ్‌లు అనేవి గ్రాముల బంగారంతో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. భౌతిక బంగారాన్ని కలిగి ఉండటానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ బాండ్‌ను జారీ చేస్తుంది. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను డబ్బు రూపంలో చెల్లించాలి మరియు మెచ్యూరిటీపై డబ్బు రూపంలో బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు.
ఆర్ఇఐటిలు
ఆర్ఇఐటిలు, లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడి ట్రస్టులు అనేవి ఆస్తి రంగాల పరిధిలో ఆదాయాన్ని పెంచే రియల్ ఎస్టేట్‌ను స్వంతం చేసుకునే లేదా ఫైనాన్స్ చేసే కంపెనీలు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆర్ఇఐటి లుగా అర్హత సాధించడానికి అనేక అవసరాలను నెరవేర్చాలి. చాలా వరకు ఆర్ఇఐటి పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందించే ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజ్‌లపై ట్రేడ్ చేస్తాయి.
ప్రభుత్వ బాండ్
ఒక ప్రభుత్వ బాండ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్, ఇప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడం లేదా సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం లాంటి వివిధ ప్రయోజనాల కోసం మూలధనాన్ని సమీకరించడానికి ప్రభుత్వం జారీ చేసే ఒక రకమైన డెట్ సెక్యూరిటీ.
ఒక పెట్టుబడిదారుడు ప్రభుత్వ బాండ్‌ను కొనుగోలు చేసినప్పుడు, వారు తప్పనిసరిగా ప్రభుత్వానికి డబ్బును రుణంగా ఇస్తారని అర్థం. ఈ రుణానికి బదులుగా ప్రభుత్వం, పెట్టుబడిదారులకు కొన్ని నెలల నుండి చాలా సంవత్సరాల వరకు నిర్ణీత కాల వ్యవధి కోసం నిర్దిష్ట రేటుతో వడ్డీని చెల్లిస్తామని హామీ ఇస్తుంది.
బాండ్ గడువు ముగింపులో ప్రభుత్వం పెట్టుబడిదారునికి ప్రిన్సిపల్ మొత్తాన్ని (అప్పుగా తీసుకున్న మొత్తాన్ని) తిరిగి చెల్లిస్తుంది. ప్రభుత్వ బాండ్లు తక్కువ-రిస్క్ గల పెట్టుబడిగా పరిగణించబడతాయి. ఎందుకంటే, వాటికి ప్రభుత్వం నుండి పూర్తి విశ్వాసం మరియు క్రెడిట్ మద్దతు ఉంటుంది, అంటే, ప్రభుత్వం తన రుణ బాధ్యతలపై డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా పరిగణించబడతాయి.
డైరెక్ట్ ఈక్విటీ:
దీనిని స్టాక్స్ లేదా షేర్లను స్వంతం చేసుకోవడం అని అంటారు, స్టాక్ మార్కెట్ నుండి నేరుగా దాని షేర్లను కొనుగోలు చేయడం అనేది కంపెనీ ఆస్తుల యాజమాన్యాన్ని సూచిస్తుంది. మీరు డైరెక్ట్ ఈక్విటీని కొనుగోలు చేసినప్పుడు, కంపెనీలో కొంత భాగాన్ని కలిగి ఉంటారు మరియు దాని ఆస్తులు మరియు ఆదాయాలపై హక్కును కలిగి ఉంటారు.
ఒక డైరెక్ట్ ఈక్విటీ హోల్డర్‌గా మీరు క్యాపిటల్ అప్రిసియేషన్ ద్వారా లాభాలను ఆర్జించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, ఇది కాలక్రమేణా డివిడెండ్లను స్వీకరించడం ద్వారా కంపెనీ షేర్ల విలువలో పెరుగుదలను సూచిస్తుంది, అలాగే, ఇది వాటాదారులకు పంపిణీ చేయబడే కంపెనీ ఆదాయాలలో కొంత భాగంగా ఉంటుంది.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యుఎల్‌ఐపిలు)
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యుఎల్ఐపి) అనేది ఒక రకమైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది పాలసీదారునికి పెట్టుబడిపై సంభావ్య రాబడుల నుండి ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది, అలాగే, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా అందిస్తుంది. ఒకే ప్లాన్‌లో పెట్టుబడి మరియు ఇన్సూరెన్స్ ఈ రెండింటి ప్రయోజనాలను పాలసీదారుకు అందించడానికి యుఎల్ఐపిలు రూపొందించబడ్డాయి. పాలసీదారు తన రిస్క్ సామర్థ్యం మరియు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి ఫండ్స్‌ని ఎంచుకునే అవకాశం ఉంది. అయితే, యుఎల్ఐపిలు పెట్టుబడి పరంగా సౌలభ్యాన్ని అందిస్తాయి కాబట్టి, పాలసీహోల్డర్లు వారి ఆర్థిక లక్ష్యాలు మరియు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వివిధ ఫండ్‌ల మధ్య మారవచ్చు, అలాగే, ఇవి కొన్ని షరతులకు లోబడి చెల్లించిన ప్రీమియం మరియు అందుకున్న ప్రయోజనాలు రెండింటిపై కూడా పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సి)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్‌సి) అనేవి భారత ప్రభుత్వం, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా అందించే ఒక సేవింగ్స్ స్కీమ్. ఇది ఒక స్థిర-ఆదాయ పెట్టుబడి, ఇది ఇండివిడ్యువల్స్‌కు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడానికి మరియు దానిపై వడ్డీ సంపాదించడానికి అవకాశమిస్తుంది. ఈ పథకం ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తుంది మరియు పెట్టుబడి సమయంలో వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం, వడ్డీ రేటు సంవత్సరానికి 6.8% (మార్చి 2023 నాటికి) గా ఉంది.
ఎన్ఎస్‌సిలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. ఎన్ఎస్‌సి పై సంపాదించిన వడ్డీ కూడా ఇండివిడ్యువల్ యొక్క పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధించబడుతుంది, అయితే, వడ్డీపై ఎలాంటి టిడిఎస్ (మూలం వద్ద మినహాయించబడిన పన్ను) ఉండదు. ఎన్ఎస్‌సిలో కనీస పెట్టుబడి మొత్తం రూ.100 మరియు పెట్టుబడి కోసం ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు.
సుకన్య సమృద్ధి అకౌంట్
సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది బెటి బచావో బేటి పఢావో అనే చొరవ కింద, ఆడపిల్లలకు మద్దత్తును ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పొదుపు పథకం. ఈ పథకం భారతదేశంలో ఆడపిల్లల సంక్షేమాన్ని మరియు వారి విద్య, వివాహ ఖర్చుల కోసం ఆదా చేసేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా కలిగి ఉంది. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల ద్వారా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల అమ్మాయి పేరుతో ఈ అకౌంటును తెరవవచ్చు. భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా అధీకృత బ్యాంకు బ్రాంచీలలో అకౌంట్‌ను తెరవవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్ కోసం కనీస డిపాజిట్ మొత్తం రూ. 250 మరియు గరిష్ట డిపాజిట్ పరిమితి సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. ఈ అకౌంట్ 21 సంవత్సరాల అవధిని కలిగి ఉంటుంది, అలాగే, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఉన్నత విద్య లేదా వివాహం కోసం పాక్షిక విత్‍డ్రాల్స్ కోసం అనుమతి ఇవ్వబడుతుంది.
ఈ అకౌంట్ ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది, ఇది ప్రస్తుతం సంవత్సరానికి 7.6% గా నిర్ణయించబడింది, వార్షికంగా సమ్మేళనం చేయబడుతుంది. అకౌంట్ పై సంపాదించిన వడ్డీ పన్ను-రహితంగా ఉంటుంది మరియు అకౌంటులో జమ చేసిన మొత్తం అనేది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది.
మీరు మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా, మీరు మార్కెట్-లింక్డ్ సాధనాలలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు లేదా మార్కెట్ కదలికల ద్వారా ప్రభావితం కాని వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్ లింక్డ్ పెట్టుబడులు అధిక రాబడులను అందిస్తాయి, కానీ ఇవి ఎల్లప్పుడూ ఉత్తమ పెట్టుబడి ప్లాన్‌లు కావు ఎందుకంటే అవి మీ మూలధనాన్ని కోల్పోతాయి. పోల్చి చూస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి పెట్టుబడి సాధనాలు ఫండ్స్ భద్రతను మరింత అందిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ అనేది అధిక ఎఫ్‌డి రేట్లు మరియు ఫండ్స్ యొక్క ద్వంద్వ ప్రయోజనాన్ని అందించే ఒక ఫైనాన్షియర్.
రిస్క్ తీసుకోవడం మీ పెట్టుబడి ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తుంది?
చాలావరకు పెట్టుబడులు ఒక నిర్దిష్ట స్థాయి అస్థిరతను కలిగి ఉంటాయి, మరియు సాధారణంగా, రిస్క్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిపై రాబడులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, పెట్టుబడిదారుల రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తరచుగా తీసుకోబడతాయి.
తక్కువ-రిస్కు పెట్టుబడులు: స్థిర-ఆదాయ సాధనాల్లో బాండ్లు, డిబెంచర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లు మరియు ప్రభుత్వ పొదుపు పథకాలు ఉంటాయి.
మధ్యస్థ-రిస్క్ పెట్టుబడులు: డెట్ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి.
అధిక-రిస్క్ పెట్టుబడులు: అస్థిరమైన పెట్టుబడులలో స్టాక్స్ మరియు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి సాధనాలు ఉంటాయి.
బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి ఎందుకు ఉత్తమ పెట్టుబడి ఆప్షన్లలో ఒకటి?
- సంవత్సరానికి 8.60% వరకు అధిక-వడ్డీ రేట్లు.
- క్రిసిల్ ఎఎఎ/స్టేబుల్ మరియు [ఐసిఆర్ఎ]ఎఎఎ(స్టేబుల్) యొక్క అత్యధిక భద్రతా రేటింగ్లు
- నాన్-క్యుములేటివ్ ఎఫ్‌డితో పీరియాడిక్ చెల్లింపు ఎంపికలు
- ప్రిమెచ్యూర్ విత్‍డ్రాల్స్ నివారించడానికి ఎఫ్‌డి పై రుణం
బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఎప్పటికంటే సులభం. మా పూర్తి ఆన్‌లైన్ పెట్టుబడి ప్రాసెస్‌తో మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి.