Bajaj Finance Best Investment Plans

నెలవారీ ఆదాయం పొందటానికి ఉత్తమ పెట్టుబడి ఆప్షన్లు

నెలవారీ ఆదాయం పొందటానికి ఉత్తమ పెట్టుబడి ఆప్షన్లు

పదవీ విరమణ తరువాత మీ ఖర్చులకు సరిపడ నిధులను, మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌ని ఉపయోగించకుండా, సమకూర్చుకోవడానికి స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి ఆప్షన్లను వెతకడం ఉత్తమం. మీ పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ చెల్లింపులను మీ సాధారణ ఖర్చులను ఫండ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది మీ ఫైనాన్సుల కోసం మరింత మెరుగైన ప్రణాళిక వేయడానికి దోహద పడుతుంది.
రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు అయిపోతాయి అనే భయం సర్వసాధారణం అయిపోయిన కారణంగా, మీ సాధారణ ఖర్చుల నిమిత్తం అనేక పెట్టుబడి ఆప్షన్లు మీ కోసం నెలవారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.

మీకు క్రమానుసార ఆదాయం అందించటానికి సహాయపడే ఉత్తమమైన పెట్టుబడి ఆప్షన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

NBFC ఫిక్స్డ్ డిపాజిట్:

ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు, కంపెనీలు (లేదా NBFCలు) మరియు పోస్ట్ ఆఫీసుల అందిస్తాయి, కానీ కంపెనీలు మరియు NBFCలు మాత్రమే డిపాజిట్ల పై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. అటువంటి కంపెనీలు త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన వడ్డీని అందిస్తాయి, మరియు మీరు ఒక సంవత్సరంలో నాలుగు నెలలకు రాబడిని కూడా పొందవచ్చు. వారు సీనియర్ సిటిజన్స్‌ కోసం 0.25% మరియు 0.5% మధ్య ఉండే అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

ఇలాంటి కంపెనీల నుండి చెల్లింపులో జాప్యము లేదా డీఫాల్ట్ ఉండటం అనే కొద్దిపాటి రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. అందుచేత మీరు ఎంచుకున్న కంపెనీ CRISIL లేదా ICRA నుండి AAA రేటింగ్స్ స్థిరంగా కలిగి అధిక క్రెడిబిలిటి కలిగిన కంపెనీ అని మీరు నిర్ధారించుకోవాలి. రిస్క్ ను తగ్గించుకోవటానికి , మీరు వివిధ కంపెనీలలో మీ డబ్బును డిపాజిట్లుగా పెట్టవచ్చు, ఇది సంవత్సరంలో ప్రతినెలా కూడా ఆదాయాన్ని పొందేలా దోహదపడుతుంది.

తమ డిపాజిట్ల సరైన బ్యాలెన్స్ మరియు సురక్షతను కోరుకునే పెట్టుబడిదార్ల కోసం, 7.35% వరకు ఆకర్షణీయమైన అధిక FD రేట్లు అందిస్తున్న బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఒక గొప్ప పెట్టుబడి ఎంపిక. CRISIL ద్వారా FAAA మరియు ICRA ద్వారా MAAA ల అత్యధిక సురక్షతా రేటింగ్స్ తో కూడా ఈ NBFC ప్రామాణీకరించబడింది, ఇది మీ డిపాజిట్ల యొక్క అత్యధిక సురక్షతను సూచిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం:

రిస్క్ లేకుండా నిరంతరం ఆదాయాన్ని పొందాలని అనుకునే పెట్టుబడిదారుల కోసం, పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలలో ఒకటి. సంవత్సరానికి 7.6% వడ్డీ రూపంలో చెల్లించబడుతుంది. ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మీరు డిపాజిట్ యొక్క ఒక సంవత్సర కాలం పూర్తి చేసినట్లయితే మీరు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన 1 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేసినట్లయితే 2% తగ్గుతుంది. మీరు 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య విత్‍డ్రా చేసుకుంటే, మీకు డిపాజిట్ చేయబడిన మొత్తం పై 1% మినహాయింపు ఉండవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం:

భారతదేశంలోని పోస్ట్ ఆఫీసులు 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఒక ప్రత్యేక పెట్టుబడి పథకాన్ని అందిస్తున్నాయి, దీనిని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని పేర్కొంటారు. ఇది గణనీయమైన రాబడులను అందించే మరొక రకమైన రిస్క్-లేని సాధనం. ఏప్రిల్ 1, 2020 తర్వాత పెట్టుబడి పెట్టిన వారికి ఈ స్కీం ద్వారా వార్షికంగా లెక్కించబడే 7.4% వడ్డీ రేటును పొందవచ్చు.

దీర్ఘ-కాలిక ప్రభుత్వ బాండ్:

మంచి రాబడులతో మరొక లో-రిస్క్ ఎంపికగా, ఒక దీర్ఘ-కాలిక ప్రభుత్వ బాండ్ సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు వడ్డీని చెల్లిస్తుంది. సంవత్సరం మొత్తం ఆదాయం సంపాదించడానికి మీరు ఇతర పెట్టుబడులతో దానిని జత చేయవచ్చు. అవి ద్వితీయ మార్కెట్‍లో ట్రేడ్ చేయబడతాయి కాబట్టి, వాటిని మీరు కోరుకున్నప్పుడు విక్రయించవచ్చు. అయితే, ఇక్కడ కిటుకు ఏమిటంటే మీరు 15 లేదా 20 సంవత్సరాల వరకు వెళ్ళగల దీర్ఘకాలిక కాలపరిమితి కోసం మీ ఫండ్స్ ను లాక్-ఇన్ చేయాలి.

ఈక్విటీ షేర్ డివిడెండ్:

ఈ ఎంపిక ఒక రెగ్యులర్ ఆదాయం వాగ్దానంతో దీర్ఘకాలంలో పెట్టుబడి లాభాలకు అనుమతిస్తుంది, కానీ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని సులభతరం చేయడానికి మీరు బహుళ స్టాక్స్ గల విభిన్న పోర్ట్ఫోలియోను నిర్మించవలసి ఉంటుంది. మీరు మూలధనంపై కాకుండా లాభాలపై డివిడెండ్‍లను అందుకుంటారు కాబట్టి, కంపెనీల రెగ్యులర్ డివిడెండ్‍లను చెల్లించకుండా ఉండేందుకు సగటు-కంటే-ఎక్కువ అవకాశం ఉంటుంది.

యాన్యుటి:

తక్కువ రిస్క్ మరియు రెగ్యులర్ ఆదాయాన్ని అందించే వార్షిక ప్రణాళికలను అందించడానికి భారతీయ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రసిద్ధి చెందినవి. ఫిక్స్డ్ విరామాలలో ఆదాయం సంపాదించడానికి ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీనిని ఒక రిటైర్మెంట్ స్ట్రాటెజీగా ఉపయోగించవచ్చు. వార్షిక చెల్లింపు ప్రణాళికలను వర్గీకరించడానికి ప్రాథమిక పద్ధతి చెల్లింపు వ్యవధి యొక్క అవధి ఆధారంగా ఉంటుంది, మరియు ఇది వాయిదా వేయబడిన వార్షిక చెల్లింపు మరియు తక్షణ వార్షిక చెల్లింపుగా విభజించబడుతుంది. వాయిదా వేయబడిన వార్షిక చెల్లింపు అనేది మీరు ఏర్పాటు చేసిన ఒక ఫిక్స్డ్ అవధి వ్యవధి తర్వాత డబ్బు అందిస్తుంది, అయితే తక్షణ వార్షిక చెల్లింపు అనేది మీరు ఏకమొత్తం చెల్లింపు చేసిన వెంటనే రెగ్యులర్ ఆదాయాన్ని అందుకోవడం కలిగి ఉంటుంది. అయితే మీరు దృష్టిలో ఉంచుకోండి, వార్షిక చెల్లింపు పెట్టుబడిలో వివిధ ఛార్జీలు ఉంటాయి, ఇందులో కమిషన్ మరియు సరెండర్ ఫీజు ఉంటాయి. ఇది పన్ను విధించదగినది కూడా మరియు ఏ పన్ను ప్రయోజనాలను అందించదు.

మ్యూచువల్ ఫండ్ నెలవారి ఆదాయం ప్లాన్:

ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఈ ప్లాన్ ఉత్తమమైనది, అయితే మీరు ఒక మధ్యస్థ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిష్పత్తి సాధారణంగా ఈక్విటీ సెక్యూరిటీలలో 20% నుండి 30% వరకు పెట్టుబడి, మరియు డిపాజిట్ సర్టిఫికెట్‍లు వంటి డెట్ సాధనాలలో 80% నుండి 70% వరకు ఉంటుంది. ఈ ప్లాన్ కోసం మంచి అవధి 2 నుండి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది, మరియు మీరు ఒక డివిడెండ్-చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా నెలవారీ ఆదాయాన్ని అందుకోవచ్చు. అయితే, ఈక్విటీ అంశం అనేది రెగ్యులర్ డివిడెండ్‍లను పొందడం కష్టంగా చేస్తుంది ఎందుకంటే డివిడెండ్‍లు అనేవి పెట్టుబడి పెట్టిన మూలధనంపై కాక లాభాలపై మాత్రమే చెల్లించబడతాయి.

ఈ పెట్టుబడి అవకాశాలలో ప్రతి ఒక్కటీ విభిన్న పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా ఉండగలదు, అయితే ఒక రిస్క్-రాబడి చిక్కు ఎల్లప్పుడూ ఉంటుంది, ఇది చాలామంది పెట్టుబడిదారులు ఫిక్స్డ్ డిపాజిట్‍లో పెట్టుబడి పెట్టే సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చేలాగా చేస్తుంది. ఒక ప్రాధాన్యతగల పెట్టుబడి మార్గంగా, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తక్కువ-రిస్క్ మరియు ఆకర్షణీయమైన రాబడుల గొప్ప బ్యాలెన్స్ ను అందిస్తుంది.

మీ ఫైనాన్సులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మరియు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఒక FD (ఫిక్స్‌డ్ డిపాజిట్) లో పెట్టుబడి పెట్టండి, ఇక్కడ మీరు అధిక వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ అవధులు మరియు హామీ ఇవ్వబడిన రాబడులను పొందవచ్చు.