ఓవర్‍వ్యూ: సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్

వయస్సు మళ్ళిన వారి సంరక్షణ కోసం ఒక ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ సరిపోదు. వయస్సు పెరిగే కొద్దీ, మన అవసరాలు మరియు ఆరోగ్య స్థితి మారుతూ ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడుతున్న వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్స్. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు సీనియర్ సిటిజెన్స్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.

వార్ధక్యంలో ఉన్న వారి మెడికల్ కేర్ సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి సీనియర్ సిటిజెన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ పాలసీ కొనుగోలు చేసే ముందు ఇన్సూరెన్స్ పొందే వ్యక్తి మెడికల్ చెకప్ చేయించుకోవాలి. మిగితావాటి లాగా, సీనియర్ సిటిజెన్స్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్‌ని కొన్ని క్లిక్స్‌తో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఒక పాలసీ కొనుగోలు చేసే ముందు రీసెర్చ్ చేసి వివిధ ప్లాన్లను సరిపోల్చి చూడవలసిందిగా సిఫారసు చేయబడుతుంది.
 

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • 1. పాలసీ యొక్క మొదటి సంవత్సరం తరువాత ముందు నుండి ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది. కొన్ని ప్లాన్ల విషయంలో, అది పాలసీ యొక్క రెండవ లేదా మూడవ సంవత్సరం తరువాత కావచ్చు.

  2. సేవింగ్స్ లేదా పెన్షన్ డబ్బు అలాగే ఉంచుకోండి ఎందుకంటే వైద్య ఖర్చులకు హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది.

  3. కొన్ని సులువు దశల్లో ఆన్ లైనులో దరఖాస్తు లేదా రెన్యూ చేసుకోవచ్చు.

  4. క్యాష్ చెల్లించే పని లేకుండా మెడికల్ క్లెయిములు సెటిల్ చేయడానికి క్యాష్‍‍‍‍‍లెస్ సదుపాయం అందుబాటులో ఉంది.

  5. ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు చేరిన తరువాత ఖర్చులు కవర్ చేయగలదు.

  6. మీకు నచ్చిన హామీ మొత్తాన్ని మీరు ఎంచుకోవచ్చు.

  7. చెల్లించిన ప్రీమియంకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

  8. ప్రతి ఒక్క క్లెయిమ్-లేని సంవత్సరం తరువాత పాలసీ రెన్యూ చేసుకోవడం పైన నో క్లెయిమ్ బోనస్ పొందవచ్చు.

  9. మీకు నచ్చిన వేరొక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ పాలసీ బదిలీ చేసుకోవచ్చు.

  10. అంబులెన్స్ చార్జీలు చేర్చబడ్డాయి.

సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క మినహాయింపులు

1. ముందు నుండి ఉన్న వ్యాధులు పాలసీ యొక్క రెండవ సంవత్సరంలో కవర్ చేయబడతాయి. కొన్ని సందర్భాలలో, అది మూడవ లేదా నాల్గవ సంవత్సరం నుండి కావచ్చు.
2. ఆలోపతి-కాని మందులు, కాస్మెటిక్, కళా సౌందర్యపరమైన లేదా సంబంధిత చికిత్సలు కవర్ చేయబడవు.
3. పాలసీ యొక్క మొదటి 30 రోజుల్లో వచ్చే ఏ వ్యాధి అయినాసరే కవర్ చేయబడదు.
4. AIDS మరియు సంబంధిత రుగ్మతలు మినహాయించబడతాయి.
5. తమకు తాముగా చేసుకున్న గాయాలకు సంబంధించిన ఖర్చులు.
6. డ్రగ్స్, మద్యానికి బానిస కావడం వలన లేదా ఏదైనా మానసిక లేదా సైకియాట్రిక్ అనారోగ్యం బారినపడడం కారణంగా అయ్యే ఖర్చులు కవర్ చేయబడవు.
7. హెర్నియా, పైల్స్, శుక్లం, నిరపాయకర ప్రాస్టేట్ గ్రంధి పెరుగుదల, మొదలైనటువంటి కొన్ని వ్యాధులు, సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంటాయి.
8. కీళ్ళ మార్పిడి సర్జరీ (యాక్సిడెంట్ కారణంగా అయినవి తప్పించి)కి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
9. కాస్మెటిక్ సర్జరీ కవర్ చేయబడదు.
10. యుద్ధం కారణంగా ఉత్పన్నమయ్యే గాయాలు కవర్ చేయబడవు.

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అర్హత


1. ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. కొన్ని సందర్భాలలో, గరిష్ట పరిమితి 80 సంవత్సరాలు.
2. పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందు పూర్తి మెడికల్ చెక్-అప్ చేయించుకుని ఉండాలి.

డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101. పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”