2 నిమిషాలలో చదవవచ్చు
25 మే 2021

ట్రేడింగ్ మరియు డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ఏదైనా సెబీ మరియు ఎక్స్‌ఛేంజ్ రిజిస్టర్డ్ ఎంటిటీని సంప్రదించండి. ఇది బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లాంటి ఒక బ్యాంక్ లేదా స్టాక్ బ్రోకర్ అయి ఉండవచ్చు. మీరు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేయగల ఒక అకౌంట్ ఓపెనింగ్ ఫారం నింపవలసి ఉంటుంది. మీరు కేవలం కొన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవడాన్ని నిర్ధారించుకోవాలి. మీరు మీ ట్రేడింగ్ అకౌంట్‌ను కలిగి ఉన్న తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం ప్రారంభించవచ్చు. భారతదేశంలో ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ అకౌంట్‌ను ఎలా తెరవాలో తెలుసుకోవడానికి మరింత చదవండి.

ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి?

షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులు కొనుగోలు చేయగల మరియు విక్రయించ గల లిస్టెడ్ కంపెనీల షేర్లు ఉంటాయి. ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది షేర్ మార్కెట్లో ఆర్డర్ కొనుగోలు మరియు విక్రయించడానికి మీకు సహాయపడే ఒక మాధ్యమం. మీరు ట్రేడింగ్ అకౌంట్ లేకుండా షేర్ ట్రేడింగ్‌లో పాల్గొనలేరు.
ట్రేడింగ్ అకౌంట్ యొక్క ప్రయోజనాలు

 • ఇది షేర్ మార్కెట్లో కొనుగోలు మరియు విక్రయింపును ఆర్డర్ చేయడానికి సహాయపడుతుంది
 • దీన్ని మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు
 • ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయడానికి మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్‌ను కలిగి ఉండాలి
 • ఇది షేర్ మార్కెట్‌లో మీ లావాదేవీలను ట్రాక్ చేస్తుంది

ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ అకౌంట్ తెరవడం చాలా సులభం మరియు కేవలం కొన్ని దశల్లో దీనిని పూర్తి చేయవచ్చు. మీరు కొన్ని ప్రాథమిక వివరాలను మాకు అందించాలి మరియు చిరునామా రుజువు, గుర్తింపు రుజువుకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడానికి అనుసరించవలసిన దశలను చూద్దాం:

ట్రేడింగ్ అకౌంట్‌ను ఎలా తెరవాలి అనేదానిపై దశలవారీ విధానం

దశ 1: బ్రోకర్ లేదా సంస్థను ఎంచుకోండి
దశ 2: అందుబాటులో ఉన్న బ్రోకరేజీల రేట్లు మరియు సర్వీసులను సరిపోల్చండి
దశ 3: అకౌంట్ తెరవడానికి, మీరు ఎంచుకున్న బ్రోకర్‌ను సంప్రదించండి
దశ 4: అకౌంట్ ఓపెనింగ్ మరియు కెవైసి ఫారం నింపండి
దశ 5: అప్లికేషన్ ధృవీకరణ ప్రాసెస్
దశ 6: ట్రేడింగ్ అకౌంట్ వివరాలను పొందండి
దశ 7: కొనుగోలు/విక్రయింపును ఆర్డర్ చేయండి

ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడానికి అనుసరించాల్సిన వివిధ దశలను వివరంగా చూద్దాం. ఒక స్టాక్ బ్రోకర్, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మీకు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్‌ను అందజేస్తారు. అయితే, దాని కోసం మీరు మీ వివరాలను అందించాలి మరియు రెగ్యులేటరీ అధికారుల ద్వారా అవసరమైన ప్రాసెస్‌ను నిర్వహించాలి. ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడం అనేది ఒక స్టాక్‌బ్రోకర్‌ను కనుగొనే పరిశోధనతో ప్రారంభమవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి గల దశలను వివరంగా తెలుసుకోవడానికి చదవండి.

1. ఒక స్టాక్ బ్రోకర్‌ను ఎంచుకోండి

అనేక మంది స్టాక్ బ్రోకర్లు ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి మీకు అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ మీకోసం 2 రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి: 1) సాంప్రదాయక బ్రోకర్లు 2) డిస్కౌంట్ బ్రోకర్లు.

2. అందించబడిన బ్రోకరేజీల రేట్లు మరియు సర్వీసులు సరిపోల్చండి

సాంప్రదాయ బ్రోకర్లు మీకు సలహా, సిఫార్సులు మరియు పరిశోధనా నివేదికలు మొదలైనటువంటి అదనపు సర్వీసులతో పాటు ట్రేడింగ్ అకౌంట్‌ను అందజేస్తారు. మీ ట్రేడ్ లావాదేవీలపై విధించే బ్రోకరేజ్ ఎక్కువగా ఉంటుంది. డిస్కౌంట్ బ్రోకర్లు మీకు ట్రేడింగ్ అకౌంటును అందజేస్తారు మరియు మీ స్వంతంగా ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవడానికి, మీరు ఉపయోగించే ప్రాథమిక సాధనాలకు ప్రాప్యతను అందిస్తారు. ఫలితంగా, వారు తక్కువ బ్రోకరేజ్ వసూలు చేస్తారు, సాధారణంగా వారు ట్రేడ్ లావాదేవీల విలువతో సంబంధం లేకుండా, ప్రతి ట్రేడ్‌ కోసం ఫ్లాట్ ఫీజును వసూలు చేస్తారు.

3. అకౌంట్ తెరవడానికి ఎంచుకున్న బ్రోకర్‌ను సంప్రదించండి

ఆఫ్‌లైన్ అకౌంట్ తెరిచే రోజులు పోయాయి. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో స్టాక్‌బ్రోకర్‌ను సంప్రదించవచ్చు మరియు వారి అకౌంట్ ఓపెనింగ్ విభాగాన్ని సందర్శించవచ్చు. మీరు వారి సర్వీస్ నంబర్లను కూడా చెక్ చేయవచ్చు, ఏదైనా సమస్యను పరిష్కరించడానికి మరియు సర్వీసు యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి వారికి కాల్ చేయవచ్చు.

4. అకౌంట్ తెరిచే మరియు కెవైసి ఫారం నింపండి

ఒకసారి బ్రోకర్‌ను ఎంచుకున్న తర్వాత, మీరు ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్ ఫారం నింపుతారు. బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్‌ వద్ద మీరు ఈ కింది దశలను అనుసరించడం ద్వారా 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవవచ్చు:

 1. అకౌంట్‌ ఓపెనింగ్ ఫారం సందర్శించండి
 2. మీ పాన్ వివరాలను అందించండి మరియు మీ పేరు, కాంటాక్ట్ నంబర్, ఇమెయిల్ మొదలైనవి పూరించండి.
 3. మీ చిరునామా మరియు బ్యాంక్ వివరాలను జోడించండి.
 4. కెవైసి డాక్యుమెంట్ల కోసం గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు, ఒక ఫోటో, సంతకం మరియు బ్యాంక్ వివరాల కోసం క్యాన్సిల్డ్ చెక్కు లేదా బ్యాంక్ స్టేట్‍మెంట్‍ లాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. మీరు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ల ట్రేడింగ్ కోసం ఎంచుకోవాలనుకుంటే, అప్పుడు అదనంగా ఆదాయం రుజువును సమర్పించాలి.
 5. మీ యొక్క ఒక చిన్న వీడియోను రికార్డ్ చేసి సబ్మిట్ చేయండి, తద్వారా మీ వ్యక్తిగత-ధృవీకరణ చేయండి.
 6. ఆధార్ నమోదిత మొబైల్ నంబర్ ఉపయోగించి డాక్యుమెంట్‌ను ఇ-సైన్ చేయండి

5. దరఖాస్తు ధృవీకరణ ప్రాసెస్

మీరు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ కోసం సబ్మిట్ చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్, బ్రోకర్ తరపున వెరిఫికేషన్ బృందం ద్వారా సమీక్షించబడుతుంది. అప్లికేషన్ ఫారంలో నింపిన వివరాలు మీ రుజువు డాక్యుమెంట్లోని వివరాలతో సరిపోలాలి. రుజువు డాక్యుమెంట్లో ఏవైనా వ్యత్యాసాలు అప్లికేషన్ తిరస్కరణకు దారితీయవచ్చు.

6. మీ ట్రేడింగ్ అకౌంట్ వివరాలను పొందండి

ఒకసారి మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత, మీరు లాగిన్ క్రెడెన్షియల్స్‌తో పాటు ఒక నిర్ధారణను అందుకుంటారు. మీరు మీ ట్రేడింగ్ అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు లైవ్ షేర్ ధరలను చూడవచ్చు, వాచ్‌లిస్ట్ క్రియేట్ చేయవచ్చు మరియు మీకు నచ్చిన కంపెనీల నుండి షేర్లను కొనుగోలు చేయవచ్చు. కానీ, అంతకుముందు మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మీ ట్రేడింగ్ అకౌంట్‌లోకి డబ్బును జమ చేయాలి.

7. కొనుగోలు/ అమ్మకం ఆర్డర్ చేయండి

ఒకసారి మీ అకౌంట్ ఓపెనింగ్ పూర్తయితే, మీరు మీ అకౌంట్‌కు లాగిన్ అయి షేర్లను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం మొదలుపెట్టవచ్చు. అలాగే, స్టాక్ బ్రోకర్ ద్వారా పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ) ఫారం మీకు పంపబడుతుంది. ఇది మీరు స్టాక్ బ్రోకర్‌కు ప్రింట్, సంతకం చేసి పంపవలసిన ఒక డాక్యుమెంట్. మీరు ఒక అమ్మకపు ఆర్డర్ చేసినప్పుడు మీ అకౌంట్ నుండి షేర్లను డెబిట్ చేయడానికి ఇది స్టాక్ బ్రోకర్‌కు అధికారం ఇస్తుంది. నిబంధనల ప్రకారం, మీ అకౌంట్ నుండి విక్రయ సూచనను సులభతరం చేయడానికి పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ) ఆథరైజేషన్ అవసరం

అదనంగా చదవండి: డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?

ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు

బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌తో ఆన్‌లైన్‌లో ఒక డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి, మీకు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు యొక్క సాఫ్ట్ కాపీలు అవసరం. అలాగే, ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడానికి పాన్ కార్డ్ కూడా తప్పనిసరి.

చిరునామా రుజువు: ఈ డాక్యుమెంట్లలో దేనినైనా మీ చిరునామా రుజువుగా అందించవచ్చు. అవి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ నంబర్‌తో కూడిన మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ లేదా ఆఖరి 3-నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్‍

గుర్తింపు రుజువు: ఈ డాక్యుమెంట్లలో ఏదైనా గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది: పాన్ కార్డ్ (తప్పనిసరి), డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ మొదలైనవి.

ఇవే కాకుండా, ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడానికి కొన్ని ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరమవుతాయి. మీరు ఎంచుకున్న స్టాక్‌బ్రోకర్‌తో సంబంధం లేకుండా, చాలా మంది ఒకేవిధమైన డాక్యుమెంట్లను అడుగుతారు. సాధారణంగా, ఒక వినియోగదారు కెఆర్ఏ ధృవీకరించబడవచ్చు లేదా కెఆర్ఏ ధృవీకరించబడకపోవచ్చు. ఇప్పటికే ఒక డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ కలిగి ఉన్న వినియోగదారు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వినియోగదారు అయితే, వీరు కెఆర్ఏ వెరిఫైడ్ కేటగిరీ కిందకు వస్తారు. ఈ వినియోగదారులకు అవసరమైన డాక్యుమెంట్లు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, వీరు చిరునామా రుజువును అందించవలసిన అవసరం లేదు అదేవిధంగా, ఒక వినియోగదారు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉంటే, వారు అకౌంట్ తెరిచే సమయంలో ఆదాయం రుజువును అందించవలసి ఉంటుంది. కాబట్టి, చిరునామా రుజువు మరియు గుర్తింపు రుజువు కాకుండా, ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి -

 1. ఫోటో
 2. వైట్ పేపర్ పై సంతకం
 3. బ్యాంక్ వివరాలు- రద్దు చేయబడిన చెక్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో బ్యాంక్ స్టేట్‍మెంట్‍.
 4. ఆదాయం రుజువు - ఎఫ్ & ఒ ట్రేడింగ్ కోసం (ఎవరైనా: 6-నెలల బ్యాంక్ స్టేట్‍మెంట్‍, 3-నెలల శాలరీ స్లిప్, నెట్-వర్త్ సర్టిఫికెట్, హోల్డింగ్ రిపోర్ట్, ఐటిఆర్ స్టేట్‌మెంట్ లేదా డీమ్యాట్ హోల్డింగ్ స్టేట్‍మెంట్‍).

అదనంగా చదవండి: స్టాక్స్ ట్రేడింగ్ ఎలా ప్రారంభించాలి

ట్రేడింగ్ అకౌంట్ ఛార్జీలు

బిఎఫ్ఎస్ఎల్ డిమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్‌తో ముడిపడి ఉన్న వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌ల కోసం బ్రోకరేజ్ ఛార్జీలు కింద ఇవ్వబడ్డాయి:

ఫ్రీడమ్ ప్యాక్

వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్: 1వ సంవత్సరం: ఉచితం
2వ సంవత్సరం నుండి: రూ. 431
డిమ్యాట్ ఎఎంసి: ఉచితం
బ్రోకరేజ్ ఛార్జీలు: రూ. 20/ ఆర్డర్ (ఈక్విటీ డెలివరీ, ఇంట్రాడే మరియు ఎఫ్&ఒ)

చేర్చబడిన ప్రొడక్ట్స్:

 • ఈక్విటీ
 • డెరివేటివ్
 • మార్జిన్ ట్రేడ్ ఫైనాన్సింగ్

ప్రొఫెషనల్ ప్యాక్

వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్: రూ. 2500
డిమ్యాట్ ఎఎంసి: ఉచితం
బ్రోకరేజ్ ఛార్జీలు: రూ. 10/ ఆర్డర్ (ఈక్విటీ డెలివరీ, ఇంట్రాడే మరియు ఎఫ్&ఒ)
ఎంటిఎఫ్ వడ్డీ రేటు: సంవత్సరానికి 12.5%.

చేర్చబడిన ప్రొడక్ట్స్:

 •  ఈక్విటీ
 • డెరివేటివ్
 • మార్జిన్ ట్రేడ్ ఫైనాన్సింగ్

బజాజ్ ప్రివిలేజ్ క్లబ్

 • వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఫీజు – రూ. 9,999
 • బ్రోకరేజ్ - ఫ్లాట్ రూ. 5/ ఆర్డర్ (డెలివరీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్)
 • అతి తక్కువ ఎంటిఎఫ్ వడ్డీ రేట్లలో ఒకటి

డిస్‌క్లెయిమర్:
మా వెబ్‌సైట్ ‌లో సమాచారం, ప్రోడక్టులు ఇంకా సర్వీసులలో చేర్చబడిన లేదా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి జాగ్రత్త తీసుకోబడుతుంది మరియు సంబంధిత ప్లాట్‌ఫారంలు/వెబ్‌సైట్‌లు, సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో అనుకోకుండా తప్పులు లేదా టైపోగ్రాఫికల్ లోపాలు లేదా ఆలస్యాలు ఉండవచ్చు. ఈ సైట్‌లో మరియు సంబంధిత వెబ్ పేజీలలో ఉన్న మెటీరియల్ రిఫరెన్స్ సాధారణ సమాచార ఉద్దేశ్యం కోసం ఉంది మరియు సంబంధిత ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న వివరాలు ఏవైనా అసమానతలు ఉన్నట్లయితే ప్రబలంగా ఉంటాయి. ఇక్కడ అందించే సమాచారానికి అనుగుణంగా నడుచుకునేముందు సబ్‌స్కైబర్లు, వినియోగదారులు నిపుణుల సలహాలు తీసుకోవాలి. సంబంధిత ప్రోడక్ట్/సర్వీస్ డాక్యుమెంట్, వర్తించే నిబంధనలు మరియు షరతులను పరిశీలించిన తర్వాత దయచేసి ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీసుకు సంబంధించి తెలివైన నిర్ణయం తీసుకోండి. ఏవైనా అసమానతలు కనబడితే, దయచేసి దీనిపై క్లిక్ చేయండి మమ్మల్ని సంప్రదించండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి