ఫారం 15G మరియు ఫారం 15H గురించి మీరు తెలుసుకోవలసినది అంతా

ఫిక్సెడ్ వడ్డీ రేటు మరియు ఆకర్షణీయమైన రాబడులతో, ఫిక్సెడ్ డిపాజిట్ అనేది చాలామంది పెట్టుబడిదారులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. అయితే, ఫిక్సెడ్ డిపాజిట్ ద్వారా మీరు సంపాదించే వడ్డీ పై పన్ను వర్తిస్తుంది. ఇటీవలి బడ్జెట్ ప్రకారం, బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల కోసం TDS థ్రెషోల్డ్ రూ. 10,000 నుండి రూ. 40,000 కు పెంచబడింది, అయితే NBFCలకు మాత్రం అది రూ. 5000 వద్ద కొనసాగుతుంది

ఫారం 15G అంటే ఏమిటి?

ఈ క్రింది షరతులు నెరవేర్చబడితే, ఆదాయంపై TDS మినహాయింపును నివారించడానికి ఫారం 15G ఉపయోగించవచ్చు:

 • మీరు ఒక వ్యక్తి (మరియు భారతదేశ నివాసి) లేదా HUF లేదా ట్రస్ట్ లేదా ఒక కంపెనీ లేదా సంస్థ కాకుండా పన్ను చెల్లించే ఇతర వ్యక్తి అయితే
 • మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నారు
 • మీ పూర్తి ఆదాయం పై లెక్కించబడిన పన్ను శూన్యం
 • ఆ సంవత్సరం కోసం మీ మొత్తం వడ్డీ ఆదాయం ఆ సంవత్సరం యొక్క ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంది, ఇది ఆర్థిక సంవత్సరం 2020-21 (ఏవై 2021-22) కోసం రూ. 2.5 లక్షలు

ఫారం 15H అంటే ఏమిటి?

60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం, కింది షరతులు నెరవేర్చబడితే TDS మినహాయింపును నివారించడానికి ఫారం 15H అందజేయవచ్చు:

 • మీరు ఒక వ్యక్తి మరియు భారతదేశంలో నివసించే వారు అయి ఉండాలి
 • మీ వయస్సు కనీసం 60 సంవత్సరాలు అయి ఉండాలి
 • మీ పూర్తి ఆదాయం పై లెక్కించబడిన పన్ను శూన్యం

వివిధ వ్యక్తుల కోసం మినహాయింపు పరిమితి యొక్క సారాంశం ఇక్కడ ఇవ్వబడింది:

కస్టమర్ రకం వివరాలు ఫారం రకం ప్రాథమిక మినహాయింపు పరిమితి
ఇండివిడ్యువల్ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసి ఫారం15G రూ. 2,50,000
సీనియర్ సిటిజన్ 60 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసి ఫారం 15H రూ. 5,00,000
సూపర్ సీనియర్ సిటిజన్ 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల భారతీయ నివాసి ఫారం 15H రూ. 5,00,000
వ్యక్తులు కాని వారు ట్రస్ట్, అసోసియేషన్, క్లబ్, HUF మరియు సొసైటీ ఫారం15G రూ. 2,50,000

ఫారం 15G లేదా ఫారం15H ఎలా నింపాలి?

మీరు ఫారాలు 15G మరియు 15H సమకూర్చడానికి అవసరమైన షరతులను నెరవేర్చిన తర్వాత, మీరు వాటిని నింపడం ప్రారంభించవచ్చు. మీరు అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • ఫారం 15G మరియు 15H లో వివిధ ఫీల్డులను నింపండి
 • డిక్లరేషన్‍‍తో మీ PAN కాపీను అటాచ్ చేయండి
 • మీ ఫైనాన్షియర్‍‍కు ఫారంలు సబ్మిట్ చేయండి.

సుదీర్ఘమైన క్యూలు మరియు కఠినమైన ప్రక్రియలను నివారించడానికి చూస్తున్నవారి కోసం, మీరు ఈ ఫారంలను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడాన్ని పరిగణించవచ్చు.

ఫారం 15G మరియు 15H రెండూ 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతాయి, మరియు సంవత్సరం ప్రారంభంలో మీ ఫైనాన్షియర్‌కు సమర్పించాలి. మీరు ఫారంలను సమర్పించడానికి ముందు మీ ఫైనాన్షియర్ పన్ను మినహాయించకుండా ఉండేలాగా నిర్ధారించుకోవాలి, ఎందుకంటే బ్యాంక్ దానిని తిరిగి చెల్లించలేకపోవచ్చు. మీ డబ్బును తిరిగి పొందడానికి, మీరు మీ ITR ఫైల్ చేసి మీ TDS మొత్తం పై రిఫండ్ క్లెయిమ్ చేయాలి.

ఫారం 15G మరియు ఫారం 15H PDF ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

ఫారం 15G లేదా ఫారం 15H డౌన్లోడ్ చేసుకోవడానికి, మీరు చేయవలసినది ఇక్కడ ఇవ్వబడింది:

 • ఆదాయ పన్ను శాఖ వెబ్‍‍సైట్ సందర్శించండి
 • ‘తరచుగా ఉపయోగించిన ఫారంలు కింద’, మీ అవసరాన్ని బట్టి, ఫారం 15G లేదా ఫారం 15H కోసం చూడండి,.
 • దాని పక్కన ఉన్న PDF ఐకాన్‍‍ను క్లిక్ చేసి ఫారంను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫారం డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, దాని యొక్క 3 కాపీలను ప్రింట్ చేయండి. ప్రింట్ చేయబడిన డాక్యుమెంట్ల పై సంతకం చేసి మీ ఫైనాన్షియర్‌కు సబ్మిట్ చేయండి.