మీరు ఫిక్సెడ్ డిపాజిట్స్ లో పెట్టుబడి పెట్టాలా లేక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ లోనా?

ఒక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది భారత ప్రభుత్వం ద్వారా అందించబడే ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనం. NSC లు భారతీయ పోస్టల్ సర్వీసెస్ యొక్క పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ యొక్క ఒక భాగంగా ఉన్నాయి మరియు , NSC VIII మరియు NSC IX అనే రెండు రూపాల్లో వస్తాయి.
ఫిక్సెడ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు అనే పేరుతో కూడా పిలవబడతాయి, ఇవి వివిధ వడ్డీ రేట్లతో బ్యాంకులు మరియు NBFC ల ద్వారా అందించబడతాయి. FD లేదా NSC లలో ఏది మంచిదో నిర్ణయించటానికి, వాటి ప్రయోజనాలు మరియు లక్షణాలను పరిశీలించండి.

FDలు మరియు NSCల ఫీచర్లు మరియు ప్రయోజనాలు
FDలు మరియు NSCల ఫీచర్లు మరియు ప్రయోజనాల పై ఒక క్లుప్తమైన వివరణ ఇక్కడ ఇవ్వబడింది:

1. అవధులు
NSCలు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల అవధితో వస్తాయి. ఆ విధంగా, ఒక ఇన్వెస్ట్మెంట్ వ్యవధిని ఎంచుకునేటప్పుడు కస్టమర్లకు ఎక్కువ ఆప్షన్లు ఉండవు.
బజాజ్ ఫైనాన్స్ 12 మరియు 60 నెలలు మధ్య FD అవధులు అందిస్తుంది. అందువల్ల, మీరు మీ ఆదర్శవంతమైన పెట్టుబడి వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు పొందుతారు.

2. వడ్డీ రేటు
NSCలు 8.5% నుంచి 8.8% స్థాయిలో ఉండే వడ్డీ రేటు కలిగి ఉంటాయి మరియు ప్రతి ఆరు నెలలకు లెక్కించబడుతుంది.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లతో, మీరు 8.35% వరకు అధిక వడ్డీ రేటు పొందవచ్చు. మీరు మా 15-నెల ప్రత్యేక FD పై ఒక 0.25% అధిక వడ్డీ రేటును పొందవచ్చు. మీరు సీనియర్ సిటిజన్స్ FD పై అదనంగా 0.25% పొందుతారు.

3. లోన్
మీరు NSC లు మరియు FD లు రెండిటి పై లోన్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ తో, మీ FD మొత్తం యొక్క 75% వరకు లోన్లు పొందండి.

4. పన్ను ప్రయోజనాలు
ఒక NSC నుండి మీరు సంపాదించే వడ్డీ సెక్షన్ 80 C కింద ఆదాయ పన్ను నుండి మినహాయించబడుతుంది. ఒక FD తో, మీ విభిన్న వనరుల నుండి మొత్తం వడ్డీ ఆదాయం ఏడాదికి రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు ఆదాయ పన్ను చెల్లించాలి.

5. ప్రీమెచ్యూర్ విత్‍‍డ్రాల్
ఈ క్రింది సందర్భాలలో NSC ఫోర్‍‍క్లోజ్ చేయబడుతుంది:
• NSC కొనుగోలుదారు మరణిస్తే.
• న్యాయస్థానం దాని ఉపసంహరణకు ఆదేశించినప్పుడు.
• ఒక గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఈ పథకానికి అనర్హుడవుతారు.

ఒక సంవత్సరం లోపల విత్‍‍డ్రా చేసుకుంటే మీరు సర్టిఫికేట్ యొక్క ఫేస్ వాల్యూ పొందుతారు. మీరు 1 సంవత్సరం తర్వాత కాని 3 సంవత్సరాలకు ముందు విత్‍‍డ్రా చేసుకోవాలని ఎంచుకున్నట్లయితే, మీరు ఫేస్ వాల్యూ మరియు ఆ ఇన్వెస్ట్ చేయబడిన మొత్తం పై సాధారణ వడ్డీని అందుకుంటారు.
మరొక వైపు, ఏ సమయంలోనైనా కనీస ఛార్జీతో ఒక FDని మెచ్యూర్ అవ్వక ముందే విత్‍‍డ్రా చేసుకోవచ్చు.
NSC వర్సెస్ FD ను పరిగణిస్తే, మీరు FD తో మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మీరు రూ.25,000. కనీస డిపాజిట్ తో బజాజ్ ఫైనాన్స్ FD లలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టే ముందు, మీ ఇన్వెస్ట్మెంట్ పై ఖచ్చితమైన ఆదాయాన్ని అంచనా వేయడానికి మా FD క్యాలిక్యులేటర్ మీకు సహాయపడగలదు. ఇది మీ ఇన్వెస్ట్మెంట్లను సాధ్యమైనంత ఉత్తమ పద్ధతిలో ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడగలదు.