Bajaj Finance Best Investment Plans

ఫిక్సెడ్ డిపాజిట్ వర్సెస్ షేర్స్

ఫిక్సెడ్ డిపాజిట్ వర్సెస్ షేర్స్

ఫిక్సెడ్ డిపాజిట్లు మరియు స్టాక్స్ అనేవి నేడు మనకు అందుబాటులో ఉన్న రెండు సాధారణ ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. మీ రిస్క్ తీసుకోగల సామర్ధ్యం ఏమిటి మరియు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేదానిని బట్టి, మీరు సరైన ఎంపికను ఎంచుకోవచ్చు.


మీరు ఇన్వెస్ట్ చేసే ప్రదేశానికి కొత్త అయితే, ఎంపికలు పజ్లింగ్ గా అనిపించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్ షేర్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లు ఒకే విధంగా కనిపిస్తూ ఉంటే, వివిధ ఇన్వెస్ట్మెంట్ ఎంపికల మధ్య తేడాలను మనం పరిశీలిద్దామా. అన్నింటికీ మించి, ఒక ఎంపిక చేసుకునే ముందు మీ ఎంపికలను అన్నింటినీ మీరు బాగా అర్థం చేసుకోవాలి.

ఫిక్సెడ్ డిపాజిట్ల యొక్క ఒక బేసిక్ ఓవర్ వ్యూ:

FD లు (ఫిక్సెడ్ డిపాజిట్లు) రెండు రకాలు, కుములేటివ్ మరియు నాన్-కుములేటివ్. ఒక కుములేటివ్ FD సంవత్సరానికి వడ్డీని కాంపౌండ్ చేస్తుంది, కాని ఒక నాన్-కుములేటివ్ FD క్రమ విరామాలలో వడ్డీని చెల్లిస్తుంది. ఈ విరామాలు మంత్లీ, క్వార్టర్లీ, సెమీ-యాన్యువల్ మరియు యాన్యువల్ అయి ఉండవచ్చు. రెండు సందర్భాల్లోనూ, ఒక నిర్దిష్ట అవధి కోసం మీ డబ్బు లాక్ చేయబడి ఉంటుంది.


ఫిక్సెడ్ డిపాజిట్ల ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

అవి తక్కువ రిస్క్ కలిగినవి: ఫిక్సెడ్ డిపాజిట్లు అనేవి తక్కువ-రిస్క్ గల ఇన్వెస్ట్మెంట్లు, అవి మార్కెట్ ఒడుదుడుకుల మీద ఆధారపడి ఉండవు. కాబట్టి మీ డబ్బు ఒక నికరమైన వేగంతో పెరగడానికి అవి సహాయపడతాయి. అంతేకాక, అవి సాధారణంగా 7% - 8% మధ్య రేంజ్ అవుతూ ఉండే మరియు ముందుగా నిర్ణయించబడే మంచి వడ్డీ రేటుని అందిస్తాయి. మీకు ఒక్కసారిగా వచ్చే లాభాలను సంపాదించే అవకాశం లేకపోయినా, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మరియు అవధి ముగింపు వద్ద మీరు ఒక ఫిక్సెడ్ మొత్తం పొందుతారు. దాని అధిక స్థిరత్వం కారణంగా ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ గొప్పగా ఆదరించబడుతుంది.


ఫిక్సెడ్ అవధి: FDలు ఒక ఫిక్సెడ్ అవధి కలిగి ఉంటాయి, కాబట్టి మీ డబ్బు కొంతకాలం సురక్షితంగా పెట్టుబడిగా పెట్టబడి ఉంటుంది. 12 మరియు 60 నెలల మధ్య ఎంచుకునే ఎంపిక మీకు ఉంటుంది. అయితే, ఇది ప్రిమెచ్యూర్ విత్‍డ్రాల్ ఎంపికను అందిస్తుంది. మీకు డబ్బు అవసరమైతే, మీరు మీ FDను సులభంగా బ్రేక్ చేయవచ్చు లేదా FD పై లోన్ తీసుకోవచ్చు. మీ వడ్డీ గనక రూ. 10, 000కు మించితే అది పన్నుకు లోబడి ఉంటుంది అని గమనించండి. అంతేకాక, మీరు ఒక ప్రిమెచ్యూర్ విత్‍డ్రాల్ చేస్తే, వడ్డీలో కొంత భాగాన్ని మీరు కోల్పోతారు.

స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం యొక్క ఒక బేసిక్ ఓవర్ వ్యూ:

స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది పూర్తిగా మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటుంది. మీరు లోతైన మార్కెట్ జ్ఞానం కలిగి ఉండి మరియు ఒక అనుభవంగల రిస్క్-టేకర్ అయినప్పటికీ, మీరు ఎల్లప్పుడూ హామీ ఇవ్వబడిన రిటర్న్స్ పొందకపోవచ్చు. మీరు ఒక్కసారిగా వచ్చే లాభాలు సంపాదించవచ్చు, కానీ ఇది ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండదు. కాబట్టి, మీరు ఒక ప్రాంభిస్తున్నవారు అయితే, నీటిలోతుని పరీక్షించడానికి కొద్ది మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని. అదనంగా, ఈ ఇన్వెస్ట్మెంట్ సాధనం అధికంగా రిస్క్ భరించగల వ్యక్తులకు బాగా సరిపోతుంది అనే విషయం గమనించాలి. మీ రిస్క్ తీసుకోగల సామర్ధ్యం అనేది మీరు ఒక ఆర్ధిక నష్టాన్ని ఎంత బాగా తట్టుకోగలరు అనేదాని ద్వారా నిర్వచించబడుతుంది. మీకు తక్కువ రిస్క్ తీసుకోగల సామర్ధ్యం ఉంటే, మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, స్టాక్ మార్కెట్ల నుంచి స్పష్టంగా దూరంగా ఉండటం మంచిది, కనీసం ప్రస్తుతానికి.

మీరు స్టాక్స్ల్ లో ఇన్వెస్ట్ చేయాలని ఎంచుకున్నప్పటికీ, మీ సేవింగ్స్ లో ఒక భాగం ఫిక్సెడ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇది మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క సురక్షతను ప్రాధాన్యతలో ఉంచుతుంది, మరియు రిటర్న్స్ కు గ్యారెంటీ ఇస్తుంది. ఇంకా, ఇది తక్కువ రిస్క్ మాత్రమే కాక, ఇది తక్కువ- ఇన్వాల్వ్మెంట్ కలిగినది కూడా. ఒకసారి మీరు FD ను తెరిచిన తర్వాత, దాన్ని నిరంతరం మీరు మానిటర్ చేయవలసిన అవసరం ఉండదు.

బజాజ్ ఫైనాన్స్ మీరు పరిగణించగల ఎక్సెలెంట్ ఫిక్స్డ్డ్ డిపాజిట్లు అందిస్తుంది. అధిక స్టెబిలిటీ రేటింగ్స్ తో సురక్షత విషయంలో వారు అన్ని బాక్సులను చెక్ చేస్తారు, మరియు 12 - 60 నెలల అనువైన అవధితో ముందుకు వస్తారు. మీరు సీనియర్ సిటిజెన్ అయితే మీరు రూ. 25, 000 అంత తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ FD వడ్డీ రేట్లు ఆనందించవచ్చు. మీ FD రిటర్న్స్ కాలిక్యులేట్ చేయడానికి, ఈ సులభమైన FD క్యాలిక్యులేటర్ను పరిశీలించండి. దీనితో పాటుగా, ఇది మీ పెట్టుబడికి ఆన్‍లైన్ యాక్సెస్ మరియు సులభ అప్లికేషన్ వంటి వివిధ యాడ్-ఆన్ ప్రయోజనాలను అందిస్తుంది.