కాల్, SMS, ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని చేరుకోండి లేదా మా బ్రాంచ్ ఆఫీసులలో ఒకదానిని సందర్శించండి.

Contact Us FAQ

  1. మమ్మల్ని సంప్రదించండి
  2. >
  3. మారటోరియం (Covid-19)

మారటోరియం కోసం తరచుగా అడగబడే ప్రశ్నలు (కోవిడ్-19)

తరచుగా అడగబడే ప్రశ్నలు

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL) తన కస్టమర్లకు మారటోరియం అందిస్తుందా?

స్థిరమైన లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్లకు BFL మారటోరియం అందిస్తుంది. మారటోరియం కోసం అర్హత పొందడానికి, కస్టమర్లు ఫిబ్రవరి 29, 2020 నాటికి వారి ఏదైనా లోన్లలో 2-EMIల కంటే ఎక్కువ ఓవర్‌డ్యూ ఉండకూడదు. 31 మార్చి 2020 తర్వాత పంపిణీ చేయబడిన ఏవైనా కొత్త రుణాలు మారటోరియం కోసం అర్హత కలిగి ఉండవు.

ఏ నెల EMI కోసం నేను ఒక మారటోరియం అభ్యర్థించవచ్చు?

జూన్, జూలై మరియు ఆగస్ట్ 2020 నెలలో బాకీ ఉన్న మరియు చెల్లించబడని తమ EMIల కోసం కస్టమర్లు మారటోరియం కోసం అభ్యర్థించవచ్చు.

నేను మారటోరియం కోసం అభ్యర్థనను ఎప్పుడు చేయాలి?

EMI మీ బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ అయ్యే నెల ముందరి నెల యొక్క 26 వ తేదీ లోపు మీరు ఒక అభ్యర్థనను పంపాలి. ఉదాహరణకు, జూన్ నెల EMI ను వాయిదా వేయడానికి, మీరు 26 మే కు ముందు అభ్యర్థనను పంపాలి.

మారటోరియం కోసం నా అభ్యర్థన ఆమోదించబడితే నాకు తెలియజేయబడుతుందా?

మీ అభ్యర్థనను అందుకున్న తర్వాత, మీ అభ్యర్థన ఏదైనా కారణం వల్ల తిరస్కరించబడినప్పుడు మాత్రమే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.

BFL వద్ద ఉన్న నా అన్ని యాక్టివ్ లోన్స్ కోసం మారటోరియం అందించబడుతుందా మరియు ప్రతి లోన్‌కు నేను ప్రత్యేక అభ్యర్థనను అందజేయాలా?

మీ EMIల యొక్క స్థిరమైన గత రీపేమెంట్ ఆధారంగా మీరు మారటోరియం కోసం అర్హత పొందినట్లయితే మరియు మీరు BFL వద్ద తీసుకున్న లోన్లలో వేటికైనా 2 EMIల కంటే ఎక్కువ బాకీ ఉండనట్లయితే, BFL వద్ద ఉన్న మీ అన్ని యాక్టివ్ లోన్ల పై మీకు మారటోరియం అందించబడుతుంది. మీ ప్రతి యాక్టివ్ లోన్ల కోసం మారటోరియం పొందడానికి మీరు ప్రత్యేక అభ్యర్థనలను ఇవ్వాలి. మీ లోన్ అకౌంటు నంబర్ల యొక్క వివరాలను మీరు అందించాలి మరియు మారటోరియం సమయానికి వర్తించే వడ్డీని భరించడానికి సిద్ధముగా ఉన్నట్లు మీరు ధృవీకరణ అందించాలి

మారటోరియం సమయం తరువత నా లోన్ ఏ విధంగా పరిగణించబడుతుంది?

• ఒక వేళ మీరు EMI మారటోరియం వినియోగించుకున్నట్లయితే, బాకీ ఉన్న లోన్ మొత్తం పై EMI మారటోరియం సమయానికి లోన్ ఒప్పందం లో ఉన్న వడ్డీ విధించబడుతుంది. అటువంటి వడ్డీ మొత్తాన్ని లోన్ యొక్క అసలు వ్యవధిని పొడిగించడం ద్వారా వసూలు చేయబడుతుంది.

• ఈ తాత్కాలిక విరామ కాలంలో నో కాస్ట్ EMI కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లకు వడ్డీ వర్తిస్తుంది. మీ తాత్కాలిక అభ్యర్థనకు వర్తించే వడ్డీపై మీకు తెలియజేయబడుతుంది మరియు మీరు మా సెల్ఫ్-సర్వీస్ పోర్టల్ https://customer-login.bajajfinserv.in/customer మరియు ఎక్స్‌పీరియా మొబైల్ యాప్ పై మీ అకౌంట్ స్టేట్మెంట్లో కూడా తనిఖీ చేయగలుగుతారు.

నాకు EMI మారటోరియం అవసరం లేకపోతే, నేను ఏమి చేయాలి?

• మీకు EMI మారటోరియం అవసరం లేకపోతే, మీరు ఎటువంటి చర్య తీసుకోవలసిన పని లేదు. మీ రీపేమెంట్ సూచనలు ప్రకారం వసూలు చేస్తాము.
• అదనపు వడ్డీ ఛార్జీలు మరియు అవధి పొడిగింపును నివారించడానికి, ఈ సమయంలో తగినన్ని నిధులు ఉన్న కస్టమర్లను చెల్లింపులను కొనసాగించమని మేము సూచిస్తున్నాము.

RBI మారటోరియం ప్రకటించినప్పుడు నా అకౌంటు నుండి డబ్బు ఎందుకు డెబిట్ చేయబడింది?

మారటోరియంను ఎంచుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ల యొక్క ఎంపిక మరియు కంపెనీ యొక్క మారటోరియం పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. మారటోరియం నిబంధనల ప్రకారం అదనపు వడ్డీ చెల్లించవలసి ఉన్నందున, కస్టమర్లందరూ మారటోరియంను ఎంచుకోకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము.

మారటోరియం వినియోగించుకున్న నో కాస్ట్ EMIల పై వడ్డీ ఎలా వసూలు చేయబడుతుంది?

నో కాస్ట్ EMI లోన్లు మరియు కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ల కోసం, వర్తించే అప్‌ఫ్రంట్ వడ్డీ, కొనుగోలు సమయంలో డీలర్ / రిటైలర్ ద్వారా భరించబడుతుంది మరియు మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో పంచుకోబడుతుంది. అందువల్ల, ఒక ఏకమొత్తం మొత్తానికి బదులుగా వాయిదాలలో ప్రోడక్ట్ ధరను చెల్లించడానికి ఇది మీకు సహాయపడింది. మీరు ఇప్పుడు ఒక మారటోరియం ఎంచుకుంటున్నట్లయితే, మీ లోన్ అవధి పెంచబడుతుంది. అందువల్ల, బకాయి ఉన్న లోన్ మొత్తం పై సంవత్సరానికి @ 24% వడ్డీ వర్తిస్తుంది. ఈ మొత్తం మాకు మీ EMI రీపేమెంట్‌లకు జోడించబడుతుంది.

నేను ఏవైనా డాక్యుమెంట్లు, తాజా NACH డెబిట్ మ్యాండేట్ వంటివి సమర్పించాలా?

కంపెనీకి అవసరమైన విధంగా రుణగ్రహీత తాజా NACH డెబిట్ మ్యాండేట్ సమర్పించవలసి రావచ్చు

మారటోరియం సమయంలో నా బ్యాంక్ అకౌంట్ నుండి నా EMIలు డెబిట్ చేయబడతాయా?

మారటోరియం ఆఫర్ చేయబడిన అన్ని లోన్ల కోసం, కట్-ఆఫ్ తేదీ ముందు మారటోరియం అభ్యర్థనను అందుకోవడం మరియు మీ మారటోరియం అభ్యర్థన ఆమోదాన్ని అనుసరించి, EMIలను హోల్డ్ చేయడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తాము.

మారటోరియం వ్యవధి యొక్క EMIలపై బౌన్స్ ఛార్జీలు విధించబడతాయా?

• బ్యాంక్ అకౌంటు నుండి EMI డెబిట్ అయ్యే నెల ముందరి నెలలో 26వ తేదీకి ముందు EMI మారటోరియం కోసం అభ్యర్థన పంపిన కస్టమర్స్‌ పై EMI బౌన్స్ ఛార్జీలు విధించబడవు.

• తమ బాకీ మొత్తాన్ని నెలలో క్లియర్ చేయని కస్టమర్ల కోసం కూడా పేర్కొనబడిన నెలకి ఆటోమేటిక్ మారటోరియం అందజేయడానికి పరిశీలించబడతారు. వారు బౌన్స్ ఛార్జీలు చెల్లించాలి కానీ వారికి ఆలస్యపు చెల్లింపు జరిమానా విధించబడదు. భవిష్యత్తు EMIల పై మారటోరియం కోసం వారు ప్రస్తుతం ఉన్న సాధారణ అభ్యర్థన ప్రక్రియను అనుసరించి అప్లై చేయవచ్చు

మారటోరియం సమయంలోని EMI నెలల పై ఆలస్యపు చెల్లింపు జరిమానా విధించబడుతుందా?

మారటోరియం అందించబడిన EMI నెలల కోసం, ఎటువంటి ఆలస్యపు చెల్లింపు ఛార్జీలను BFL విధించదు. ఏవైనా ఆలస్యపు చెల్లింపు ఛార్జీలు విధించబడితే, అవి మాఫీ చేయబడతాయి / వెనక్కు మళ్ళించబడతాయి.

నేను మారటోరియం కోసం దరఖాస్తు చేస్తే నా క్రెడిట్ బ్యూరో రికార్డులు ప్రభావితం అవుతాయా?

మీకు అర్హత కలిగి ఉంది మరియు మీరు మారటోరియం వినియోగించుకున్నట్లయితే, మారటోరియం సమయంలో EMIలను చెల్లించనందున మీ క్రెడిట్ బ్యూరో రికార్డులు ప్రభావితం కావు. మార్చి 01, 2020 కు ముందు క్రెడిట్ బ్యూరోకు రిపోర్ట్ చేయబడిన చెల్లించబడని EMIలకు ఇది వర్తించదు. అయితే, మీరు మారటోరియం వినియోగించుకుంటున్నారని క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడుతుంది.

రుణగ్రహీత మారటోరియం సమయం మధ్యలో చెల్లించవచ్చా?

ఆకస్మిక లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన తాత్కాలిక అంతరాయానికి ఒక ఉపశమనంగా ఇది రుణగ్రహీతకు అందించబడుతుంది. అయితే, రుణగ్రహీతకు తన రుణం యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా ముందస్తు EMI చెల్లింపు చేయడానికి ఒక ఆప్షన్ ఉంది.

ఫిబ్రవరి 29 నాటికి నా లోన్ NPA లో ఉంటే, 2020 నాకు మారటోరియం వర్తిస్తుందా?

లేదు. అయితే, కేసు ప్రకారం సమీక్షించడానికి కమిటీ హక్కు కలిగి ఉంటుంది.

క్యాష్‌‌‌‌బ్యాక్/వోచర్లకు అర్హత సాధించడానికి నేను నా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ యొక్క 1st 3 EMIలను క్లియర్ చేయాలి అని నేను తెలుసుకున్నాను. నా 1వ EMI 2 మార్చి 2020 నాడు క్లియర్ చేయబడింది & నేను ఏప్రిల్ నుండి ఆగస్ట్ EMIల వరకు మారటోరియంను ఎంచుకున్నాను. నా క్యాష్‌బ్యాక్ /వోచర్లకు నేను ఎప్పుడు అర్హత సాధిస్తాను?

ఒకవేళ షరతులు ఏ బౌన్స్ లేకుండా 3 EMIల రీ-పేమెంట్‍ని కలిగి ఉండి మరియు కస్టమర్ మొరటోరియం కోసం ఎంచుకున్నట్లయితే, అప్పుడు కస్టమర్ మొరటోరియం వ్యవధిని మినహాయించి ఏ బౌన్స్ లేకుండా 3 EMIలను తప్పక క్లియర్ చేయాలి.

ఈ పరిస్థితిలో, ఒక వేళ 1st EMI మార్చి 2nd 2020 నాడు క్లియర్ చేయబడి మరియు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మారటోరియం ఎంచుకున్నట్లయితే, ఆఫర్ కోసం అర్హత సాధించడానికి కస్టమర్ మిగిలిన 2 EMIలను సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో క్లియర్ చేయాలి

క్యాష్‌‌‌‌బ్యాక్/వోచర్లకు అర్హత సాధించడానికి నేను నా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ యొక్క 1st 3 EMIలను క్లియర్ చేయాలి అని నేను తెలుసుకున్నాను. తగినంత బ్యాలెన్స్ లేనందున 2nd మార్చి 2020 నాడు చెల్లించవలసి ఉన్న నా 1st EMI బౌన్స్ అయింది. అయితే, నేను మార్చి నుండి ఆగస్ట్ EMIల వరకు మారటోరియంను ఎంచుకున్నాను. నేను ఆఫర్ కోసం అర్హత కలిగి ఉన్నానా?

ఏదైనా వినియోగదారు ప్రోమో ఫుల్‌‌‌‌ఫిల్మెంట్ కోసం మార్చి EMI ఫుల్‌‌‌‌ఫిల్మెంట్ ప్రమాణాల ప్రకారం ఉంటే, మరియు ఆ EMI ని కస్టమర్ బౌన్స్ చేసినట్లయితే, అతను/ఆమె తరువాత మారటోరియంను ఎంచుకున్నప్పటికీ కస్టమర్ ఆటోమేటిక్‌‌‌‌గా అనర్హులు అవుతారు.

మా సోషల్ ఛానళ్ళు

సోషల్ మీడియాలో మాతో కనెక్ట్ అవ్వండి మరియు మా కొత్త వార్తలు మరియు ఆఫర్ల గురించి అప్డేట్ అయి ఉండండి