డీమాట్ అకౌంట్ కోసం అర్హత పారామితులు
-
జాతీయత
వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి
-
వయస్సు
వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
డీమ్యాట్ అకౌంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
ఒక డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి, మీరు ఈ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి:
-
ఐడెంటిటీ ప్రూఫ్
పాన్ కార్డ్ తప్పనిసరి (కార్డుపై మీ ఫోటో మరియు సంతకం కనిపిస్తుందని నిర్ధారించుకోండి)
-
అడ్రస్ ప్రూఫ్ (వీటిలో ఏదైనా ఒకటి)
పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ లేదా గత 3 నెలలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
-
ఇన్కమ్ ప్రూఫ్ (వీటిలో ఏదైనా ఒకటి)
6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, నెట్-వర్త్ సర్టిఫికెట్, 3 నెలల శాలరీ స్లిప్స్, ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఐటిఆర్) స్టేట్మెంట్, డీమాట్ హోల్డింగ్ స్టేట్మెంట్, లేదా హోల్డింగ్ రిపోర్ట్
-
వైట్ పేపర్ పై సంతకం
-
బ్యాంక్ ప్రూఫ్ (వీటిలో ఏదైనా ఒకటి)
క్యాన్సెల్ చేయబడిన చెక్కు, పాస్‌బుక్, గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
-
ఫోటో
ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అవసరం. డీమ్యాట్ అకౌంట్ షేర్లను డిజిటల్ మోడ్‌లో నిల్వ చేస్తుంది మరియు నష్టం, దొంగతనం, ఫోర్జరీ మొదలైనటువంటి భౌతికపరమైన షేర్ సర్టిఫికేట్లకు సంబంధించిన రిస్క్‌ను తొలగిస్తుంది. బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఒక అకౌంట్ తెరవడానికి 100% డిజిటల్ ప్రాసెస్‌ను అందిస్తుంది, కావున మీరు డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేయవచ్చు మరియు వాటిని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.
తరచుగా అడగబడే ప్రశ్నలు
అవును, మీరు మీ చిరునామాను డీమ్యాట్ అకౌంట్లో సవరించవచ్చు. దాని కోసం, మీరు అకౌంట్ సవరణ ఫారమ్‌ను పూరించాలి, దానిపై సంతకం చేయాలి మరియు సవరణకు ప్రూఫ్‌గా అవసరమైన డాక్యుమెంట్లతో మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి)కి సబ్మిట్ చేయాలి. మార్పులను అమలు చేయడానికి ముందు డిపి అభ్యర్ధనను వెరిఫై చేస్తారు.
డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయితే, డీమ్యాట్ అకౌంటును తెరిచేటప్పుడు దీనిని అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు. డీమ్యాట్ అకౌంటును తెరవడానికి అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించ గల ఇతర డాక్యుమెంట్లు ఓటరు ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, 3 నెలల కంటే ఎక్కువ పాతవి కాని యుటిలిటీ బిల్లు, మరియు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్.
భారతదేశంలో నివసించే మరియు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఏ వ్యక్తి అయినా, అతను/ఆమె పాన్ కార్డుని కలిగి ఉన్నట్లయితే, డీమ్యాట్ అకౌంటును తెరవడానికి అర్హులు. బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేయడానికి మీరు మీ పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ మరియు క్యాన్సెల్ చేయబడిన చెక్కు కాపీని అందించాలి. బ్రోకరేజ్ (డిపాజిటరీ పాల్గొనేవారు) కు ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలి.
అవును, మీరు ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా డీమ్యాట్ అకౌంట్ తెరవవచ్చు, ఎందుకనగా ఇది ఐచ్ఛికం మాత్రమే. మీరు డీమ్యాట్ అకౌంటును తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి.
- పాన్ కార్డు
- వెరిఫికేషన్ కోసం అడ్రస్ ప్రూఫ్ - మీ పేరుతో ఉన్న కరెంట్ బిల్లు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ మొదలైనవి.
- క్యాన్సెల్ చేసిన చెక్కు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాల కాపీ
అందువల్ల, మీరు గృహిణి అయినా లేదా మైనర్ అయినా (ఈ విషయంలో 18 సంవత్సరాలు) – మీరు ఆదాయం రుజువు లేకుండానే మీ పేరుతో డీమ్యాట్ అకౌంటును తెరవవచ్చు. అయితే, మీ ఖర్చు విధానాలు, టాక్స్ ఫైలింగ్ రికార్డులను ట్రాక్ చేయడానికి పాన్ కార్డ్ చాలా అవసరం.
అవును, సెబీ పేర్కొన్న విధంగా అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి కాబట్టి డీమాట్ అకౌంట్ తెరవడానికి పాన్ కార్డ్ అవసరం. అదనంగా, పాన్ కార్డ్ అనేది పెట్టుబడిదారుడి హోల్డింగ్లను ప్రత్యేక గుర్తింపుగా ట్రాక్ చేయడానికి ఒక మార్గం, ఇది తన/ఆమె ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్‌తో సరిపోల్చవచ్చు. కావున, మీరు మైనర్ లేదా గృహిణి అయినప్పటికీ వాలిడ్ పాన్ కార్డును కలిగి ఉన్నపుడు, మీరు డీమాట్ అకౌంటును తెరిచి పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
అవును, డీమ్యాట్ అకౌంటును తెరవడానికి క్యాన్సెల్ చేసిన చెక్కు తప్పనిసరి, ఎందుకనగా విక్రయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయానికి బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం. అలాగే, మీరు స్టాక్లను ఆర్డర్ చేసినప్పుడు, ఎక్స్ఛేంజ్లో స్టాక్‌ను కొనుగోలు చేయడానికి ముందు అమౌంట్ డెబిట్ అవ్వాలి. ఆ విధంగా, ఫారమ్‌లోని అప్రూవ్డ్ క్యాన్సెల్ చెక్కు డిపాజిటరీ పార్టిసిపెంట్ను స్టాక్ లావాదేవీ సమయంలో మీ అకౌంట్ నుండి నిధులను డెబిట్ చేయడానికి మరియు క్రెడిట్ చేయడానికి అనుమతిస్తుంది.