కుములేటివ్ మరియు నాన్-కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్ మధ్య గల తేడా ఏమిటి?

క్యూములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్‌‌‌‌‌‌లో, వడ్డీ ప్రతి సంవత్సరం కాంపౌండ్ చేయబడుతుంది మరియు మెచ్యూరిటీ సమయంలో చెల్లించబడుతుంది.

 

ఒక నాన్-క్యుములేటివ్ FDలో, ఇన్వెస్ట్ చేసేవారి ఎంపిక ప్రకారం వడ్డీ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ, లేదా యాన్యువల్ గా చెల్లించబడుతుంది.

సూటబిలిటీ:

ఒక పెద్ద అమౌంట్ ని సేవ్ చేయడం ద్వారా ఒక కార్పస్ ఏర్పర్చుకోవడానికి కుములేటివ్ FD లు మీకు సహాయపడతాయి.

మీ రోజువారీ ఖర్చులు నడుపుకోవడానికి రెగ్యులర్ వడ్డీ చెల్లింపులు సంపాదించుకునేందుకు నాన్-క్యుములేటివ్ FDలు మీకు సహాయపడతాయి.

 

తమ సేవింగ్స్ పొదుపు చేసి పెంచుకోవాలని కోరుకునే వ్యక్తుల కోసం కుములేటివ్ FDలు ఉత్తమంగా పనిచేస్తాయి.

వారి సేవింగ్స్ నుంచి ఒక రెగ్యులర్ ఆదాయం కోరుకునే పెన్షనర్ల కోసం నాన్-క్యుములేటివ్ FDలు ఉత్తమంగా పనిచేస్తాయి.

రిటర్న్స్:

రెండు FDలూ సేవింగ్స్ అకౌంట్ కంటే మెరుగైన రిటర్న్స్ అందిస్తాయి.

ఒక నాన్-కుములేటివ్ కంటే ఒక కుములేటివ్ FD ఎక్కువ రిటర్న్ అందిస్తుంది.

ఇది కూడా చెక్ చేయండి: బజాజ్ ఫైనాన్స్ FD