పేరుకు తగ్గట్టుగానే హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ అనేది ఒక టూల్, ఇది అసలు, వడ్డీరేటు, కాలపరిమితి వంటి అంశాల ఆధారంగా హోమ్ లోన్ నెలవారి చెల్లింపులను లెక్కిస్తుంది. హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ లో ఈ వివరాలను ఎంటర్ చేస్తే కేవలం నిమిషాల్లోనే ఫలితాలను చూపుతుంది. దీనితో పాటు హోమ్ లోన్ సరసమైన వడ్డీరేటుతో అందిస్తున్నారా లేదా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు, అలాగే ఇంటి కొనుగోలుకు అవసరమైన బడ్జెట్ ను నిర్ణయించడం, ఫైనాన్స్ రిపేమెంట్ కు సిద్ధంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
కాబట్టి, బజాజ్ ఫిన్సర్వ్ యొక్క హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు EMIలను ఎలా లెక్కించవచ్చో చూడండి.
ఉదాహరణకు, మీరు అసలు మొత్తం రూ. 90 లక్షలు , 240 నెలల కాలపరిమితి, 11% వడ్డీ రేటు ఎంటర్ చేసారనుకోండి. ఒకసారి మీరు 'ఎంటర్' ను ప్రెస్ చేయగానే, ప్రతీ నెలా రూ. 92,897 EMI గా చెల్లించాలని మీకు తెలుస్తుంది. దీనితో పాటు మొత్తం వడ్డీ చెల్లింపు రూ.1,32,95,247 లని మరియు మీ మొత్తం రిపేమెంట్ రూ. 2,22,95,247 ఉంటుందని తెలుస్తుంది.
మీకు నచ్చినన్ని సార్లు ఈ అంశాలను మార్చుతూ వెళ్లండి. మీకు అనుకూలమైన అసలు, వడ్డీరేటు, కాలపరిమితి లభించే వరకూ ఇలా చేయండి.
EMI క్యాలిక్యులేటర్ ఎలా ఉపయోగించాలిప్పుడు మీకు తెలుసింది కాబట్టి, ఒకసారి మీరు EMI చెల్లింపులు ఎప్పుడు ప్రారంభించాలి అనేది చూడండి.
EMI చెల్లింపులు ఎప్పుడు మొదలవుతాయి?
లోన్ మంజూరు అయిన తరువాత పంపిణీ జరిగిన వెంటనే మీరు EMI లు చెల్లించడం ప్రారంభించాలి. సాధారణంగా మీ ఋణదాత సూచించిన నిర్ణీత తేదీలో ప్రతీ నెలా EMI చెల్లించాలి. ఉదాహరణకు మీ లోన్ 25 నెలలో పంపిణీ చేశారు అనుకోండి, మీ EMI తేదీ ప్రతీ నెలా 5 న నిర్ణయించారు, అప్పుడు మొదటి నెల 25 తేదీ నుంచి 5 వరకు EMI లెక్కిస్తారు. ఆ తరువాత నెల నుండి మీరు మొత్తం EMI ని 5 వ తేదీన గాని లేదా ఆ తేదీ కంటే ముందు చెల్లించాలి. బజాజ్ ఫిన్సర్వ్ వంటి కొందరు ఋణదాతలు 3 EMI హాలీడే ఆఫర్ చేస్తారు, మీ
హోమ్ లోన్ మీ ఫైనాన్స్ సమకూర్చుకోవడం మరింత సులభంగా ఉండటం కోసం. మీరు ఇలాంటి లోన్ ఎంపిక చేసుకొని EMI-ఫ్రీ కాలపరిమితిని ఉపయోగించుకోవచ్చు.
హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించడం మరచిపోకండి. అత్యంత సరసమైన లోన్ తీసుకునేందుకు, ముందుగా రిపేమెంట్ ప్లాన్ తో పాటు మీరు అప్పు తీసుకునే కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు-లేని విధంగా సాగడానికి ఇది సహాయపడుతుంది.