image

టూ వీలర్ ఇన్సూరెన్స్ తరచుగా అడగబడే ప్రశ్నలు

తరచుగా అడగబడే ప్రశ్నలు

టూ-వీలర్ ఇన్సూరెన్స్ రకాలు ఏమిటి?

రెండు రకాల టూ-వీలర్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయి - కాంప్రహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ మరియు థర్డ్ పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్. చట్టప్రకారము థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. అయినప్పటికీ, ఒక కాంప్రహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ ఎక్కువగా రికమెండ్ చేయబడుతుంది.

టూ-వీలర్ ఇన్సూరెన్స్ లో ఏమేమి కవర్ అవుతాయి?

ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ చెడిపోవడము లేదా నష్టము, థర్డ్-పార్టీకి ఫైనాన్షియల్ బాధ్యత, అలాగే ఓనర్/రైడర్ కోసం యాక్సిడెంట్ కవర్ మొదలైనవి కాంప్రహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి.

బైక్ ఇన్సూరెన్స్ ను ఎలా రెన్యూ చేసుకోవాలి?

ఈ రోజులలో బైక్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకోవడం చాలా సులభం. మీ పాలసీ గడువు తేదీ ముగింపు గురించి మీకు ముందుగానే తెలియజేయబడుతుంది. మీరు ఇన్స్యూరర్ వెబ్సైట్ ను సందర్శించి ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు ఆన్‍లైన్ లో మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకోవచ్చు. దానిని ఆఫ్‍లైన్ లో రెన్యూ చేసుకోవాలని మీరు అనుకుంటే - మీరు ఒక బ్రాంచ్ ను సందర్శించవచ్చు లేదా కస్టమర్ కేర్ బృందానికి కాల్ చేయవచ్చు.

ఆన్‍లైన్ లో బైక్ ఇన్సూరెన్స్ ను ఎలా చెల్లించాలి?

బైక్ ఇన్సూరెన్స్ చెల్లించడం కొన్ని నిమిషాల పని. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా మొబైల్ వాలెట్ ద్వారా ఆన్‍లైన్ లో మీ ప్రీమియం చెల్లించవచ్చు.

టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

ద్వి-చక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం ప్రతి పాలసీహోల్డర్ కు వేరువేరుగా ఉండవచ్చు. బైక్ మోడల్ మరియు మేక్, తయారీ సంవత్సరము, ఇంజన్ సామర్థ్యం, భౌగోళిక ప్రదేశము, బైక్ యజమాని వయసు, యాంటీ థెఫ్ట్ డివైజ్ ఇన్ స్టలేషన్, మరియు వాలంటరీ డిడక్టబుల్ వంటి అనేక కారకాలు ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తాయి.

నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?

పాలసీ టర్మ్ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వారు నో క్లెయిమ్ బోనస్ లేదా NCB ఇస్తారు.

నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ ను నేను ఎలా కనుగొనగలను?

మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ ను పాలసీ కొనుగోలు చేసే సమయంలో మీరు అందుకున్న సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పైన చూడవచ్చు. మీ ఇన్స్యూరర్ నుండి మీరు ఈమెయిల్స్, లేఖల ద్వారా క్రమానుసార సంప్రదింపులు కూడా అందుకుంటారు, వాటిపై మీ బైక్ పాలసీ నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ను పోగొట్టుకుంటే, మీరు ఒక FIR ను ఫైల్ చేసి డూప్లికేట్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ కోసం అప్లై చేయవచ్చు.

నేను నా ప్రస్తుత పాలసీ లో కొత్త టూ-వీలర్ రిజిస్టర్ చేయవచ్చా?

అవును, మీ ప్రస్తుత టూ-వీలర్ పాలసీ లో పాత దాని స్థానములో కొత్త వాహనాన్ని రిజిస్టర్ చేయవచ్చును.

కాలపరిమితి సమయంలో టూ-వీలర్ పాలసీని నేను రద్దు చేయవచ్చా?

అవును, ఒక టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పాలసీ టర్మ్ సమయంలో ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. కాని, మీరు వేరొక టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేశారని లేదా RTO ద్వారా మీ టూ-వీలర్ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిందని రుజువు చేసే డాక్యుమెంట్స్ ను మీరు సబ్మిట్ చేయాలి.

తనిఖీ లేకుండా నేను ఒక టూ-వీలర్ ఇన్సూరెన్స్ పొందగలనా?

అవును, మీరు టూ-వీలర్ ఇన్సూరెన్స్ ను ఆన్‍లైన్ లో కొనుగోలు చేస్తే, తనిఖీ అవసరం లేదు.