టాటా AIG హెల్త్ ఇన్సూరెన్స్ - టాటా AIG మెడిప్రైమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్ లో కొనండి లేదా రెన్యూ చేసుకోండి
image

TATA AIG హెల్త్ ఇన్సూరెన్స్ – మెడి ప్రైమ్

ఓవర్‍వ్యూ

ఆసుపత్రిలో చేరడం, డే-కేర్ చికిత్స, మరియు ఇన్-పేషెంట్ చికిత్స ఖర్చులని కూడా కవర్ చేసే, పారదర్శకమైన మరియు క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన టాటా AIG మెడి ప్రైమ్ పాలసీతో మీ మొత్తం కుటుంబాన్ని ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ దరి చేరకుండా సురక్షితంగా ఉంచడం ద్వారా మానసిక ప్రశాంతత పొందండి.

 • ఇన్-పేషెంట్ చికిత్స

  గది అద్దె, ICU, నర్సింగ్, మందులు, మరియు వినియోగించుకునే వస్తువులు వంటి ఇన్-పేషెంట్ చికిత్స ఖర్చుల పైన ఉప-పరిమితులు ఏమీ ఉండవు.

 • ఆసుపత్రిలో చేరడం ఖర్చులు కవర్ చేయబడతాయి

  ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు మరియు చేరి ఇంటి వచ్చిన 60 రోజుల తర్వాత వరకు అయ్యే వైద్య ఖర్చులు.

 • డే-కేర్ చికిత్సలు

  24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం లేని 140 రకాల వివిధ డే కేర్ చికిత్సలకు చెల్లించడానికి ఈ పాలసీ ఉపయోగించండి.

 • క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్

  భారతదేశ వ్యాప్తంగా 3000+ ఆసుపత్రుల బలమైన నెట్వర్క్ లో క్యాష్‍‍‍‍‍లెస్ సదుపాయం పొందండి.

 • అన్ని వైద్య అవసరాలు కవర్ చేయబడతాయి

  ఆయుర్వేదం, యునాని, సిధ్దా మరియు హోమియోపతితో సహా ఈ పాలసీ కింద అన్ని రకాల చికిత్సలను కవర్ చేయండి.

 • ఇంటి వద్ద చికిత్స

  ఇతరత్రా ఆసుపత్రిలో చేరడం అవసరమయి ఉండగల స్థితి కోసం హాజరు అవుతూ ఉన్న వైద్య నిపుణుడి సలహా ప్రకారం ఇంటి వద్ద వైద్య చికిత్స పొందడానికి అయిన ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది.

 • అవయువ దానం

  అవయవ మార్పిడి కోసం ఒక దాత నుండి అవయవం సేకరించటానికి అయ్యే ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

 • దంత చికిత్స

  యాక్సిడెంట్ కారణంగా అవసరమయిన దంత చికిత్స పాలసీ క్రింద కవర్ చేయబడుతుంది.

 • జీవితకాల రెన్యూవల్

  మీ పాలసీ జీవితకాల పునరుద్ధరణను పొందండి అయితే బాకీ ఉన్న అన్ని ప్రీమియంలు చెల్లించబడి ఉండాలి.

 • ముందునుంచే ఉన్న వ్యాధులు

  వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్ల తర్వాత పాలసీ ముందే ఉన్న జబ్బులను కవర్ చేస్తుంది.

 • ఎమర్జెన్సీ అంబులెన్స్ కవర్ చేయబడుతుంది

  ఒకసారి ఆసుపత్రిలో చేరడం కోసం రూ. 2,500 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఖర్చు కవర్ చేసుకోండి.

 • ఫ్రీ లుక్ కాలం

  పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించడానికి పాలసీ అందుకున్న తేదీ నుండి 15 రోజులు పొందండి.

 • పన్ను ప్రయోజనాలు

  ఈ పాలసీ కోసం చెల్లించబడిన ప్రీమియం పైన ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద రూ. 30,000 వరకు పన్ను ప్రయోజనాలు పొందండి.

అర్హత

టాటా AIG మెడీ ప్రైమ్‌ అర్హత విధానం:


• ప్రవేశానికి కనీస వయస్సు మైనర్ల కోసం 91 రోజులు మరియు పెద్ద వారి కోసం 18 సంవత్సరాలు.
• ప్రవేశానికి గరిష్ట వయస్సు 21 మైనర్లకు మరియు పెద్దలకు 65 సంవత్సరాలు.
• హామీ ఇవ్వబడిన మొత్తం రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్యన ఉండాలి.
• పాలసీ వ్యవధి 1 లేదా 2 ఏళ్లు ఉండవచ్చు.
• వయస్సు ఆధారంగా ప్రీమియం క్యాలికులేట్ చేయబడుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది

టాటా AIG మెడీ ప్రైమ్ ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పని చేస్తుందో ఇక్కడ చూడండి:

స్టెప్ 1 :

ముందే అనుకుని ఆసుపత్రిలో చేరాలనుకుంటే టాటా AIGకి కనీసం 48గంటలు ముందుగా తెలియజేయండి లేదా అత్యవసర చికిత్స కోసం 24 గంటలలోగా తెలియజేయండి.

స్టెప్ 2 :

చికిత్స పొందండి.

స్టెప్ 3 :

అది ఒక నెట్వర్క్ ఆసుపత్రి అయితే నగదురహిత సౌకర్యం పొందండి.

స్టెప్ 4 :

అది ఒక నెట్వర్క్ ఆసుపత్రి కాకపోతే, మీ క్లెయిమ్ ని రిజిస్టర్ చేసి ఆన్‍లైన్ సమర్పించండి, ఫోన్ ద్వారా, లేదా సమీప శాఖను సందర్శించడం ద్వారా.