మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, లోన్ పొందు ప్రక్రియను కొద్దిగా సులభతరం చేయడానికి కొన్ని నియమాలు మరియు నియంత్రణలు పాటించవలసి ఉంటుంది. అవి:
1. హోమ్ లోన్ ఇంకా ప్రాసెస్ లో ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ తక్కువ కాకుండా ఉండడానికి, మీ ప్రస్తుత EMI లు చెల్లింపులను లేదా క్రెడిట్ కార్డు బకాయిలను ఆలస్యం చేయకండి. హోమ్ లోన్స్ పై ఉత్తమ డీల్, సాధారణంగా కేవలం మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది.
2. మీ కోసం ఉత్తమ లోన్ ఎంపికను ఎంచుకోండి. మీకు ఉత్తమంగా సరిపోయే, హోమ్ లోన్ వడ్డీ రేటు ను పోల్చి, అధ్యయనం చేయండి. మీరు ఒక ఫిక్సెడ్ వడ్డీ రేటు మరియు కాలవ్యవధి కోసం ప్రతి నెలా ఒక స్థిర బడ్జెట్ ను నిర్వహించాలి అని అనుకోవచ్చు.
3. మీరు కంపెనీ నుండి ఎంత మొత్తం లోన్ పొందవచ్చు తెలుసుకోవడానికి ఒక హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించండి.
4. మీ వ్యక్తిగత మరియు ఫైనాన్షియల్ హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి ఎందుకంటే అవి మీ లోన్ అప్లై చేయడం కోసం అవసరమవుతాయి.
5. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే, మీకు అది అంత మంచిది. మీరు ప్రారంభ డౌన్ పేమెంట్ కోసం ఆదా చేయడం ప్రారంభించండి, అది మీరు కొనాలని అనుకుంటున్న ఇంటికి మొత్తం ఖర్చులో 2.5% నుండి 25% మధ్య ఉండవచ్చు.
6. మీ ఋణదాత కంపెనీతో మంచి అనుబంధం కొనసాగించండి. ఇది మీ లోన్ మంజూరు లో సహాయ పడవచ్చు. దీనిని చేయడానికి ఒక మార్గం ఏమిటంటే మీ ఋణదాత నుండి ఏవైనా ప్రశ్నలకు తగిన విధంగా ప్రతిస్పందించడం.