అధిక రిటర్న్ తక్కువ రిస్క్ స్ట్రాటజీ

జీవన ప్రమాణాల వ్యయం స్థిరంగా పెరుగుతూ ఉండగా, తక్కువ రిస్క్ హామీ ఇచ్చే ఖచ్ఛితంగా ఆదాయాన్ని ఇచ్చే నిలకడైన పెట్టుబడి అవకాశాల కోసం చూడవలసిన అవసరం ఉంది. పెరుగుతున్న మార్కెట్ అస్థిరతతో, తక్కువ నష్టాలతో అధిక రాబడిని అందించే విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్ ఫోలియో సృష్టించడం చాలా ముఖ్యం.

తక్కువ రిస్కుతో అధిక రిటర్న్స్ అనే ఆలోచన సుదూర స్వప్నంలా కనిపిస్తుందా? అదీ, ఇకపైన కాదు.

నేడు, తక్కువ రిస్కుతో అధిక రిటర్న్స్ అందించే అనేక పెట్టుబడి ప్రదేశాలు ఉన్నాయి. మీరు మీ లక్ష్యాల ప్రకారంగా పెట్టుబడి పెట్టవచ్చు, మరియు క్యాపిటల్ యొక్క రిస్క్ తక్కువగా ఉన్న ఆప్షన్ల కోసం చూడవచ్చు.

గౌరవప్రదమైన రిటర్న్స్ తో తక్కువ-రిస్కుతో కూడుకున్న కొన్ని పెట్టుబడులు ఇవిగో:

అధిక వడ్డీ పొదుపు అకౌంట్స్
మీ డబ్బు పైన కొంత వడ్డీ సంపాదించడం కోసం సులువైన మార్గం అధిక సంపాదన అందించే పొదుపు అకౌంట్. కేవలం మీ అకౌంటులో డబ్బు ఉంచినందుకు, మీకు నామమాత్రపు మొత్తం వడ్డీ వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒక అకౌంట్ తెరిచి మీ డబ్బు డిపాజిట్ చేయడం, కానీ ఎటువంటి ఫీజు లేకుండా పోటీతత్వ వడ్డీ రేట్లను అందించే ఒక మంచి ఫైనాన్షియల్ సంస్థను ఎన్నుకునే విధంగా చూసుకోండి.
అది మంచి కస్టమర్ సర్వీస్, ఆన్ లైన్ అకౌంట్ మేనేజ్‍మెంట్, మరియు సులువైన డిపాజిట్స్ కూడా అందించాలి. మీరు ఎంచుకున్న బ్యాంక్ ఆధారంగా, మీరు భారతదేశంలో మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా గౌరవప్రదమైన వడ్డీ సంపాదించవచ్చు.

వార్షిక చెల్లింపులు
మీరు మీ పోర్ట్ ఫోలియోను దీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంచుకోవాలని అనుకుంటే, వార్షిక చెల్లింపులు మంచి పెట్టుబడి. అయితే, రిస్కులను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం, ఎందుకంటే కాంట్రాక్టులో అనేక షరతులు చేర్చబడిన అనేక క్లిష్టమైన ఫైనాన్షియల్ సాధనాలు చాలా ఉన్నాయి.
అనేక భిన్నమైన వార్షిక చెల్లింపులు ఉన్నాయి, కానీ ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయడం ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో వర్తకం చేయడాన్ని పోలి ఉంటుంది. భారీ మొత్తంకు ప్రతిఫలంగా, మీరు ఖచ్ఛితంగా హామీ ఇవ్వబడిన రిటర్న్స్ పొందుతారు. ఆఫర్ చేయబడుతున్న పెన్షన్ మొత్తం ఆధారంగా, వార్షిక చెల్లింపులు ఈ విధంగా ఉండవచ్చు:
• స్థిరమైన
• వేరియబుల్
• ఈక్విటీ ఇండెక్స్డ్
ఫిక్సెడ్ వార్షిక చెల్లింపులు ఫిక్సెడ్ రిటర్న్స్ అందిస్తాయి, దీని అర్థం తక్కువ రిస్క్ కలిగి ఉంటుందని. మీ వార్షిక చెల్లింపులకు ఇన్సూరెన్స్ కంపెనీ మద్దతు ఉంటుంది, మరియు క్లిష్టమైన ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అయినప్పటికీ, సాధారణంగా సురక్షితమైనవి.

మనీ మార్కెట్ ఫండ్స్
మనీ మార్కెట్ ఫండ్ అనేది వారి ప్రిన్సిపల్ పెట్టుబడిని నష్టపోకూడదని కోరుకునే వారి కోసం రూపొందించబడిన ఒక రకం మ్యూచువల్ ఫండ్. సాధారణంగా ఇది ఫండ్ లోని మీ నగదు డిపాజిట్ ను విలువైనదిగా చేయడంతో పాటుగా కొంచెం వడ్డీ చెల్లిస్తుంది . ఈ ఫండ్స్ మీ నగదు యొక్క విలువను రక్షించే ఘనమైన చరిత్రను కలిగి ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల యొక్క ప్రభావం వీటి పైన చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు మీ ప్రిన్సిపల్ పోగొట్టుకుంటారని ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

మునిసిపల్ బాండ్లు
మునిసిపల్ బాండ్ అనేది పట్టణ స్థానిక సంస్థలచే జారీచేయబడే డెట్ సాధనం, ఇది క్రమానుగతంగా వడ్డీతో ఫిక్సెడ్ ప్రిన్సిపల్ మొత్తం యొక్క చెల్లింపు హామీ ఇస్తుంది, ఈ వడ్డీ ఫిక్సెడ్ ఇంటర్వెల్స్ వద్ద లేదా కాల పరిమితి చివర, ప్రిన్సిపల్ తో చెల్లించబడవచ్చు. అటువంటి మునిసిపల్ బాండ్స్ లో పెట్టుబడి పట్టడం సాధారణంగా సురక్షితం, ఎందుకంటే మునిసిపాలిటీ దివాళా తీసే అవకాశం చాలా తక్కువ.

సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్

కమర్షియల్ బ్యాంకులు మరియు కొన్ని ఫైనాన్షియల్ సంస్థల నుండి మీరు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ పొందవచ్చు. అయితే, మీరు నిర్దిష్ట కాలం పాటు కనీసం రూ. 1 లక్ష మొత్తం డిపాజిట్ చేయాలి మరియు బదులుగా హామీ ఉన్న రిటర్న్స్ పొందుతారు. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ వడ్డీ రేట్లుతో సంబంధం లేకుండా ఆ నిర్ణీత కాలానికి మీరు స్థిరమైన వడ్డీ రేటు పొందుతారని నిర్ధారిస్తుంది. అయితే, మీరు సమాయనికంటే ముందుగా డబ్బు తిరిగి తీసుకోవాలంటే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.

మీకు నష్టం రాదని ప్రభుత్వం హామీ ఇస్తుంది, అదే సమయంలో ఆర్ధిక సంస్థ అదనపు వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇది మీ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ కాలం మరియు ప్రస్తుత వడ్డీ రేట్లచే నిర్ణయించబడుతుంది.


ట్రెజరీ బిల్స్

ఈ సాధనాలు స్వల్పకాలిక పెట్టుబడి అవకాశాలు ఆఫర్ చేస్తాయి, సాధారణంగా 1 సంవత్సరం వరకు. భారతదేశ ప్రభుత్వం ఆక్షన్ల ద్వారా మూడు రకాల ట్రెజరీ బిల్స్ ఆఫర్ చేస్తుంది——91-రోజులు, 182-రోజులు, మరియు 364-రోజులు. పెట్టుబడి పెట్టవలసిన కనీస మొత్తం రూ. 25,000, మరియు సదరు మొత్తం రూ. 25, 000. యొక్క మల్టిపుల్స్ లో పెరుగుతుంది ప్రభుత్వంచే జారీ చేయబడిన కారణంగా వీటికి సంబంధించి ఎటువంటి రిస్క్ ఉండదు, మరియు నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ (NDS) నుండి మీరు ఎలక్ట్రానికల్ గా పొందవచ్చు.


ఫిక్సెడ్ డిపాజిట్

పెట్టుబడులలో అత్యంత సురక్షితమైన వాటిలో ఇవి ఒకటి, మరియు తక్కువ-రిస్క్ ఉన్న అనేక ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఇవి గౌరవప్రదమైన స్థాయిలో రిటర్న్స్ అందిస్తాయి. బాగా పేరున్న ఆర్ధిక సంస్థలు అందించే ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ఫ్లెక్సిబిలిటి, క్రమానుగత వడ్డీ చెల్లింపులు, అధిక స్థిరత్వం మరియు విశ్వసనీయత వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని ఆర్ధిక సంస్థలు సీనియర్ సిటిజన్స్ కోసం వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా కూడా ఆఫర్ చేస్తాయి మరియు ఎమర్జెన్సీ సందర్భంలో మీరు ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ కూడా తీసుకోవచ్చు.

మీరు తక్కువ-రిస్క్ సాధనంలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే, బజాజ్ ఫైనాన్స్ దేశంలోనే అత్యధిక వడ్డీ రేట్లలో ఒకదానితో FD (ఫిక్సెడ్ డిపాజిట్స్) అందిస్తుంది, మరియు CRISIL’s FAAA/స్టేబుల్ రేటింగ్, రిస్క్ మరియు రివార్డుల మధ్యన బ్యాలెన్స్ సాధించడం కోసం దీనిని ఉత్తమమైనదిగా చేస్తుంది.