Bajaj Finance Best Investment Plans

ఫిక్సెడ్ డిపాజిట్స్ వర్సెస్ ఈక్విటీ

ఫిక్సెడ్ డిపాజిట్స్ వర్సెస్ ఈక్విటీ

మీరు ఎంతవరకు రిస్క్ హ్యాండిల్ చేయగలరు? మీరు మీ ఫండ్స్ మునిగిపోవడం మరియు ఆకాశాన్ని అంటడం చూడటానికి సిధ్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు మీరు ఫిక్సెడ్ డిపాజిట్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలా లేక ఈక్విటీలోనా అనేది నిర్ణయిస్తాయి.

ఎవరైనా గనక మీతో మీరు 2011 లో ఒక కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి సంవత్సరం కాంపౌండ్ చేయబడుతూ 2017 నాటికి మీ డబ్బు 17%వడ్డీ సంపాదించి ఉండగలదు అని చెబితే ఏమి చేయాలి? ఇది ఖచ్చితంగా మీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు గెలుచుకుంటారో నష్టపోతారో మీకు ఎప్పటికీ తెలియదు అని మర్చిపోకండి. అంటే మీరు అసలు పూర్తిగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండాలని దీని అర్థమా? అవవలసిన అవసరం ఏమాత్రం లేదు.

ఇదంతా మీరు ఫైనాన్షియల్ రిస్క్ ను ఎలా తట్టుకోగలరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఒక నష్టాన్ని భరించడానికి ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంటే, ఈక్విటీలో వారి సేవింగ్స్ అన్నింటినీ ఉంచిన వారితో పోలిస్తే మీరు తట్టుకుని నిలవగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు కోరుకునేది తక్కువ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అయితే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు.

సరైన ఎంపిక చేసుకోవడానికి మీకు సహాయపడటానికి ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఈక్విటీల మధ్య పోలిక ఇక్కడ ఇవ్వబడింది:

ఎంపికలు అర్థం చేసుకోండి:

మీ డబ్బును ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు ఖచ్ఛితంగా దేని కోసం సైన్ అప్ చేస్తున్నారో తెలుసుకుని ఉండటం సహాయకంగా ఉంటుంది. దాని గురించి ఈ విధంగా ఆలోచించండి:

చదరంగం బోర్డ్ మీద వివిధ పావులు ఎలా కదులుతాయో తెలియకుండా మీరు చెస్ ఆట ఆడగలరా? ఏమాత్రం వీలుకాదు.
అదేవిధంగా, స్టాక్ మార్కెట్, ఇండిసెస్, షేర్ ధర, షార్ట్ సెల్లింగ్, మార్జిన్ వంటి పదాలను మీరు బాగా తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీని రిసర్చ్ చేస్తూ కూడా మీరు సమయం గడపాలి. ఆ కంపెనీ ఏ విధమైన వ్యాపారంలో నిమగ్నమై ఉంది? వృద్ధికి ఉన్న స్కొప్ ఏమిటి? ఈ విషయంలో, అర్ధం చేసుకోవడానికి ఫిక్సెడ్ డిపాజిట్లు చాలా సులభం.


సుదూర ప్రయాణానికి సిధ్ధమవండి:

స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడం అనేది సహనం లేని వారికోసం కాదు. మీరు మీ స్నేహితుని సలహా ఆధారంగా స్టాక్ కొనుగోలు చేయడం ద్వారా చాలా ఎక్కువ లాభం పొందగలరని అనుకుంటే, మీరు పెట్టుబడి చేస్తున్న విధానం తప్పు. మీ పెట్టుబడి మీకు చెల్లింపు అందించడానికి సమయం పడుతుంది మరియు అది ఎప్పుడు జరుగుతుందో ఎటువంటి హామీ ఉండదు. కాబట్టి మీరు అంతగా వేచి ఉండడానికి సిధ్ధంగా ఉన్నారో లేదో ఆలోచించుకోండి. మరొక వైపున ఫిక్సెడ్ డిపాజిట్లు,, మీరు ఎంచుకున్న FD రకాన్ని బట్టి మీకు మంత్లీ గా, బై-యాన్యువల్ గా లేదా యాన్యువల్ గా క్లెయిమ్ చేయగల హామీ ఇవ్వబడిన రిటర్న్స్ అందిస్తాయి. కాబట్టి అవి షార్ట్-టర్మ్ అవసరాలలో ఆదుకుంటాయి.

భవిష్యత్తు అంచనా వేయడానికి గత రికార్డులను ఉపయోగించవద్దు:

గత దశాబ్దంలో సెన్సెక్స్ అనేక ఎత్తు పల్లాలను అనుభవించిన వాస్తవం ఈక్విటీలో పెట్టుబడులు చాలా అస్థిరమైనని అనేందుకు రుజువు. అనిశ్చితంగా ఉండే తత్వం మీకు నచ్చక పోతే, సురక్షిత మార్గాన్ని తీసుకొని FDలలో పెట్టుబడి పెట్టండి.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అందరికీ తగినది కాదు. ఇందుకోసం మార్కెట్ గురించి కొంత అవగాహన మరియు మీ ఇన్వెస్ట్మెంట్ ని నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండటం అవసరం. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే, ఫిక్సెడ్ డిపాజిట్ల వంటి రిస్క్-లేని ఇన్వెస్ట్మెంట్ సాధనాల కోసం వెళ్ళండి.

CRISIL మరియు ICRA నుండి స్టేబల్ రేటింగ్లు, FDలపై లాభదాయకమైన వడ్డీ రేట్లు మరియు ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్ వంటి ఇతర ఫీచర్లతో, బజాజ్ ఫైనాన్స్ తమ ఫిక్సెడ్ డిపాజిట్లతో అత్యంత సురక్షిత పెట్టుబడి ఆప్షన్ అందిస్తుంది. మీరు హామీ ఇవ్వబడిన రిటర్న్స్, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మరియు స్థిరమైన రిటర్న్స్ కోసం చూడవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ లతో సీనియర్ సిటిజెన్లు అధిక వడ్డీ రేట్ కోసం చూడవచ్చు, ఇది వారి రిటైర్మెంట్ కార్పస్ పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.