తరచుగా అడగబడే ప్రశ్నలు

పొడిగించబడిన వారంటీ అంటే ఏమిటి?

ఒక పొడిగించబడిన వారంటీ పాలసీ, తయారీదారు వారంటీ గడువు ముగిసిన తర్వాత తయారీ లోపాల నుండి మీ ప్రోడక్టుని కవర్ చేస్తుంది. ఒక విధంగా, ఈ పాలసీ మీ ప్రోడక్టుల పై తయారీదారు వారంటీ పొడిగింపు వంటిది.

తయారీదారు ప్రోడక్ట్ వారెంటీ కాలం ఎంతవరకు ఉంటుంది?

మీరు ఒక ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ కొనుగోలు చేసినప్పుడు, తయారీదారు మీకు పరిమిత కాలం కోసం ఒక వారంటీని అందిస్తారు, ఈ వారంటీ సమయంలో ప్రోడక్ట్ యొక్క మరమ్మతు లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చు తయారీదారు చేత కవర్ చేయబడుతుంది.. దీనిని తయారీదారు ప్రోడక్ట్ వారెంటీ కాలపరిమితి అని పేర్కొంటారు మరియు మీరు కొనుగోలు చేసిన ప్రాడక్ట్ ఆధారంగా ఈ కాలపరిమితి 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

ఈ పాలసీ క్రింద ఇన్సూర్ చేయబడగల గరిష్ఠ మొత్తం ఎంత?

మీ ప్రోడక్ట్ కోసం ఇన్సూర్ చేయబడగల గరిష్ఠ మొత్తం మీ ప్రోడక్ట్ యొక్క ఇన్వాయిస్ మొత్తానికి సమానంగా ఉంటుంది.

ఈ పొడిగించబడిన వారంటీలో ఏ ప్రోడక్టులు కవర్ చేయబడతాయి?

LED టివి, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్‌ఫోన్ & ల్యాప్‌టాప్లు వంటి ఎలక్ట్రానిక్స్ & గ్యాడ్జెట్ల పై పొడిగించబడిన వారంటీని పొందవచ్చు.

ఈ పాలసీకి ఉన్న సాధారణ మినహాయింపులు ఏమిటి?

ఈ పాలసీకి ఉన్న సాధారణ మినహాయింపులు ఇలా ఉన్నాయి:

• తయారీదారు సూచనలకు అనుగుణంగా ఉపయోగించబడని కారణంగా ఉపకరణంకి జరిగే నష్టం లేదా డ్యామేజ్
• బ్యాటరీలు, బల్బులు, ప్లగ్లు, కేబుళ్లు, రిబ్బన్లు, బెల్టులు, టేప్లు, ఫ్యూజ్‌లు, సాఫ్ట్‌వేర్ మొదలైన వాటితో పాటు వీటికి పరిమితం కాని, ఉపకరణం యొక్క ఏదైనా వినియోగించదగిన వస్తువు యొక్క రీప్లేస్‌మెంట్.
• ఉపకరణం తయారీదారు రీకాల్‌కి లోబడి ఉన్న భాగాల యొక్క వైఫల్యం
• అగ్నిప్రమాదం, దొంగతనం, పేలుడు, నీటి వలన కలిగిన నష్టం, దేవుని చర్యలు మొదలైన వాటిని కలుపుకొని వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైనా బాహ్య కారణం ద్వారా జరిగిన నష్టం లేదా డ్యామేజ్.
• ఉపకరణం వాణిజ్య, అద్దె లేదా లాభాన్ని పొందే ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది
• ఓవర్‌లోడింగ్, స్ట్రెయిన్, ఓవర్-రన్నింగ్, షార్ట్ సర్క్యూటింగ్ మొదలైన వాటి వలన కలిగే నష్టం లేదా డ్యామేజ్.
• సాధారణ అరుగుదల మరియు తరుగుదల వలన జరిగే నష్టం లేదా డ్యామేజ్
• ఉపకరణం యొక్క యాజమాన్యంలో మార్పు

నా పొడిగించబడిన వారంటీ పాలసీ పై నేను ఎలా క్లెయిమ్ చేయాలి?

మీరు దాని టోల్-ఫ్రీ నంబర్ - 1860-258-3030 పై 11AM నుంచి 9PM మధ్యన CPP బృందానికి కాల్ చేయవలసి ఉంటుంది, ఆ బృందం మిగిలిన పనిని పూర్తి చేస్తుంది.

మరమ్మతు చేయలేని విధంగా దానికి నష్టం జరిగినట్లయితే నా ప్రోడక్ట్ రీప్లేస్ చేయబడుతుందా?

అవును, అటువంటి స్పెసిఫికేషన్లు మరియు ధర ఉన్న ఉపకరణంతో మీ ఉపకరణాన్ని CPP రీప్లేస్ చేస్తుంది.

ఈ పొడిగించబడిన వారంటీ పాలసీకి కనీస కూలింగ్ ఆఫ్ వ్యవధి ఉందా?

అవును, మీ పొడిగించబడిన వారంటీ పాలసీ పై 30 రోజుల కూలింగ్ ఆఫ్ వ్యవధి ఉంటుంది. దీని అర్థం మీరు మీ పాలసీని పొందిన మొదటి 30 రోజుల వరకు మీ పాలసీ పై క్లెయిమ్ చేయలేరు.

పొడిగించబడిన వారంటీ పాలసీ బదిలీ చేయదగినది మరియు పునరుద్ధరించదగినదా?

పొడిగించబడిన వారంటీ పాలసీని బదిలీ చేయలేరు, ప్రోడక్ట్ యొక్క యాజమాన్యంలో మార్పు ఉన్నట్లయితే పాలసీ గడువు ముగుస్తుంది. అంతేకాకుండా, పాలసీ గడువు ముగిసిన తర్వాత పాలసీని రెన్యూ చేయడం కుదరదు.

మా న్యూస్ లెటర్‍‍ కు సబ్స్క్రయిబ్ చేయండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Home Loan People Considered Image

హోమ్ లోన్

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై అధిక టాప్ అప్ మొత్తం

ఇప్పుడే అప్లై చేయండి

ఫ్లెక్సీ లోన్

మీకు అవసరమైనప్పుడు విత్‍డ్రా చేసుకోండి, మీకు వీలైనప్పుడు ముందుగా చెల్లించండి

మరింత తెలుసుకోండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

EMI నెట్వర్క్

మీకు అవసరమైన ప్రతిదాన్ని సులభమైన మరియు సరసమైన EMI లలో పొందండి

మరింత తెలుసుకోండి