CRISIL రేటింగ్స్ మరియు ఫిక్సెడ్ డిపాజిట్లపై వాటి ప్రభావం

ఏజెన్సీల ద్వారా ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్ మీరు స్మార్ట్ ఎంపికలు చేసుకునేందుకు సహాయపడతాయి. రిస్క్ మరియు పాలసీ ఎడ్వైజరీ సేవలతో పాటుగా రేటింగ్స్, రిసర్చ్ అందించే అటువంటి ఒక గ్లోబల్ ఎనలిటికల్ కంపెనీ CRISIL. ఇది దేశంలో క్రెడిట్ రేటింగ్ భావనకు నాందీ పలికిన భారతదేశపు మొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.

CRISIL రేటింగ్ ఎవరి అవసరాలను తీరుస్తుంది?

CRISIL ద్వారా రేట్ చేయబడే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నింటిలో లోన్లు, కమర్షియల్ పేపర్లు, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, బ్యాంకు హైబ్రిడ్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్, మోర్ట్గేజ్-బ్యాక్డ్ సెక్యూరిటీలు, బాండ్లు, డిపాజిట్ సర్టిఫికేట్లు మొదలైనవి ఉంటాయి.

CRISIL రేటింగ్స్ పాత్ర ఏమిటి?

క్రెడిట్ రేటింగ్స్ అనేవి లోన్ తీసుకునేవారు లేదా ఇన్వెస్టర్లు లోన్లు యాక్సెస్ చేయడానికి లేదా విశ్వసనీయ ఫైనాన్సియర్లతో తమ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి సహాయపడే ఒక అవసరమైన సాధనం. దేశం యొక్క మొట్టమొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో ఒకటిగా, CRISIL యొక్క విశ్లేషణ అనేది వారి వడ్డీ చెల్లింపు బాధ్యతలు మరియు ప్రిన్సిపల్ రీపేమెంట్స్ సర్వీస్ చేసేందుకు ఫైనాన్సియర్ల రెలటివ్ సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే రిస్క్ రకాల పై ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవడంలో సహాయపడుతుంది.
ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్ పై మొత్తం యొక్క రెలటివ్ సురక్షత పై CRISIL ఒక నిష్పాక్షికమైన, ఆబ్జెక్టివ్ మరియు ఇండిపెండెంట్ అభిప్రాయాన్ని అందిస్తుంది. ఏ సమయం వద్ద నైనా ఒక ధృఢమైన ఫైనాన్షియల్ స్టాండింగ్ కూడా నిర్ధారిస్తూ ఇది ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క మార్కెటబిలిటీని పెంచేందుకు జారీచేసేవారికి సహాయపడుతుంది.

CRISIL రేటింగ్ అర్హత ప్రమాణాలు ఏమిటి?

ఫైనాన్సియర్ యొక్క ఎసెట్ క్వాలిటీ అనేది క్రెడిట్ రిస్క్ నిర్వహించేందుకు వారి సామర్ధ్యం యొక్క కొలత. ఇది వారి క్లయింట్స్ యొక్క క్రెడిట్ నాణ్యత పై మాత్రమే కాక ఎసెట్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకునేందుకు వారి సామర్థ్యం పై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక పోర్ట్ఫోలియో స్థాయిలో క్రెడిట్ మరియు మార్కెట్ రిస్కులను నిర్వహించడం మరియు నియంత్రించడం దిశగా CRISIL పనిచేస్తుంది మరియు రిస్క్ మరియు పెరుగుదల దిశగా మేనేజ్మెంట్ యొక్క వైఖరిని విశ్లేషిస్తుంది.
అందువల్ల, CRISIL యొక్క రేటింగ్స్ ఫైనాన్సియర్ మరియు లోన్ తీసుకునేవారు లేదా ఇన్వెస్టర్ల మధ్యగల ఖాళీని పూరిస్తుంది, మరియు వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ రేటింగ్స్ ఒక ఫండ్ కోసం అత్యధిక స్థాయి సురక్షతని సూచించే ఒక హామీగా వ్యవహరిస్తాయి. సమాచార సేకరణ, విశ్లేషణ మరియు మేనేజ్మెంట్ తో సమావేశాల ఆధారంగా రేటింగ్లు రూపొందించబడతాయి.
డెట్ బాధ్యతలపై CRISIL యొక్క క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఇన్స్ట్రుమెంట్ పై డిఫాల్ట్ యొక్క సంభావ్యతపై ఒక అభిప్రాయంతో పాటుగా సకాలంలో ఆ బాధ్యతలు తిరిగి చెల్లించబడగల సంభావ్యతని సూచిస్తాయి. రేటింగ్లు లాంగ్-టర్మ్, షార్ట్-టర్మ్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్, కార్పొరేట్ క్రెడిట్ రేటింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్ రేటింగ్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీల కోసం ఆర్ధిక సామర్ధ్యం రేటింగ్ల కోసం వివిధ కేటగిరీలలో లభిస్తాయి.

డిపాజిటర్లని CRISIL రేటింగ్స్ ఎలా ప్రభావితం చేస్తాయి?

ఫిక్సెడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే, మనం లాభదాయకమైన ఎంపికలు మరియు అధిక రిటర్న్స్ కోసం చూస్తాము. ఇది అధిక వడ్డీ రేట్లు అందించే ఫైనాన్సియర్స్ వైపు మనం మొగ్గు చూపేలాగా చేస్తుంది. అయితే, గవర్న్మెంట్ బ్యాకింగ్ లేనందున, కొన్ని కంపెనీ డిపాజిట్ల లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక అదనపు ప్రమాదం ఉంటుంది.
అందువల్ల, డిపాజిటర్లు వారు ఇన్వెస్ట్ చేసే డబ్బు నష్టపోయే రిస్క్ ఉంటుంది. అయితే, మీరు రేటింగ్ నాణ్యతను నిర్ణయించి సరైన ఫైనాన్సియర్ కోసం ఎంపిక చేసుకోవచ్చు కాబట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు CRISIL రేటింగ్స్ సహాయపడగలవు, విభిన్న కంపెనీల వ్యాప్తంగా లభ్యమయ్యే ఆకర్షణీయంగా ఉన్నట్లుగా కనిపించే ఆఫర్లను జల్లెడ పట్టడానికి CRISIL రేటింగ్స్ వీలు కల్పిస్తాయి. మార్కెట్లో వివిధ సంస్థల మధ్య తులనాత్మక విశ్లేషణ చేయడానికి మీరు ఈ రేటింగ్లను ఒక కొలతబద్దగా ఉపయోగించవచ్చు.

ఫిక్సెడ్ డిపాజిట్ రేటింగుల కోసం CRISIL రేటింగ్ సిస్టమ్ చూడండి:


రేటింగ్ అర్ధం
NM అర్ధవంతంగా లేనిది
ఏప్‌డీ డిఫాల్ట్
FC అధిక ప్రమాదం
FB తగినంతగా లేని సురక్షత
FA తగినంతగా ఉన్న సురక్షత
FAA అధిక సురక్షత
FAAA అత్యధిక సురక్షత

కంపెనీ FD యొక్క వడ్డీ రేట్ల మీద CRISIL రేటింగ్స్ యొక్క ఎటువంటి ప్రత్యక్ష ప్రభావము ఉండదు, కానీ సాధారణంగా ఏదైనా సంస్థ యొక్క విశ్వసనీయత పై ఆధారపడి ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను తీసుకుంటారు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ల కోసం CRISIL రేటింగ్స్ ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లకు CRISIL నుండి FAAA / స్టేబల్ రేటింగ్ కలిగి ఉన్నాయి, ఇది అత్యధిక సురక్షత మరియు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ని సూచిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ FDలు కూడా ICRA నుండి MAAA (స్థిర) రేటింగ్ కలిగి ఉన్నాయి, ఇది వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు మరొక కారణం.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లు ఏ ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయి?

అధిక సురక్షత మరియు విశ్వసనీయతతో పాటుగా, బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లతో మీరు ఈ ప్రయోజనాలను కూడా పొందవచ్చు:

  • అధిక వడ్డీ రేట్లు - మార్కెట్లో అత్యధిక వడ్డీ రేట్లలో బజాజ్ ఫైనాన్స్ ది ఒకటి, ఇది దీనిని ఇన్వెస్టర్ల ద్వారా అత్యంత ఇష్టపడే ఫైనాన్సియర్ గా చేస్తుంది. సీనియర్ సిటిజెన్లు సాధారణ వడ్డీ రేట్లకు పైన మరియు మించిన అధిక వడ్డీ రేట్ల అదనపు ప్రయోజనం పొందుతారు, అందువల్ల వారు తమ జీవితకాలపు పొదుపులను కాపాడుకుని స్థిరమైన రిటర్న్స్ నుంచి లాభం పొందగలరు.
  • రూ. 25,000 కనీస డిపాజిట్ - బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లతో, వేచి ఉండి పెద్ద కార్పస్ కూడబెట్టుకోవలసిన అవసరం లేకుండా మీరు కేవలం రూ. 25, 000తో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు, కాబట్టి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టవచ్చు, ఒక చిన్న కనీస డిపాజిట్ మొత్తంతో నైనా, మీరు మీ ఇన్వెస్ట్మెంట్లను పైకి పెంచి మెరుగైన రిటర్న్స్ సంపాదించవచ్చు.
  • హామీ ఇవ్వబడిన రిటర్న్స్ - మీ ఇన్వెస్ట్మెంట్ల పై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండనందున మీరు మీ ఇన్వెస్ట్మెంట్ల పై హామీ ఇవ్వబడిన లాభాలు పొందవచ్చు, మీ పెట్టుబడులపై మీరు హామీ పొందవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్లను సులభంగా ప్లాన్ చేసేందుకు వీలు కల్పించే ఒక ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు ముందుగానే మీ రిటర్న్స్ నిర్ణయించుకోవచ్చు.
  • సులభమైన ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రక్రియ -మీ ఇన్వెస్ట్మెంట్లను సులభంగా ట్రాక్ చేయడానికి మీకు సహాయపడే మీ FD అకౌంట్ కు సులభ ఆన్‍లైన్ యాక్సెస్ తో మీరు సమయాన్ని ఆదా చేసుకుని ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా విశ్వసనీయత మరియు ఆకర్షణీయమైన రిటర్న్స్ యొక్క పర్ఫెక్ట్ సమ్మేళనాన్ని పొందండి, ఇది అవాంతరాలు-లేని ఇన్వెస్ట్మెంట్లతో మీ లాభాలను మ్యాగ్జిమైజ్ చేసుకునేందుకు సహాయపడతాయి.

ఇప్పటికీ ఏదైనా సందేహం ఉందా? ఇన్వెస్టర్ల నిష్పాక్షికమైన సమీక్షలను చదవడానికి కస్టమర్ పోర్టల్ చెక్ చేయండి లేదా నేరుగా బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించండి.