1. నిర్వచనాలు:
కింది పదాలు ఈ నిబంధనలు మరియు షరతుల ప్రయోజనం కోసం క్రింది విధంగా నిర్వచించబడతాయి:
"బిఎఫ్ఎల్" అనేది బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్‌ను సూచిస్తుంది.
"కస్టమర్" అంటే ఆఫర్ వ్యవధిలో బిఎఫ్ఎల్ నుండి లోన్ పొందే భారతీయ పౌరులు.
"ఆఫర్ వ్యవధి" అంటే 2019 యొక్క _11-11-2019 న 12:00 AM నుండి 21-11-2019 యొక్క 23:59:59 PM వరకు ప్రారంభమయ్యే కాలం.
"పాల్గొనే స్టోర్ (లు) "అంటే BFL తో చేతులు కలిపిన మరియు ఈ ప్రమోషన్లో పాల్గొంటున్న మరియు అనెక్సర్ I లో వివరించిన ప్రదేశాలలో ఉన్న రిటైల్ స్టోర్ (లు) లేదా డీలర్ అవుట్లెట్లు.
"ప్రమోషన్" అంటే ఆఫర్ వ్యవధిలో "#BIG11DAYS" ప్రచార ప్రోగ్రామ్. "ప్రోడక్టులు" అంటే BFL యొక్క ఫైనాన్స్ సౌకర్యం ఉపయోగించి పాల్గొనే స్టోర్ల నుండి కొనుగోలు చేయబడిన ఉత్పత్తులు అని అర్థం. "రివార్డ్" ఈ ప్రచారం క్రింద కస్టమర్(లు) కు అందజేయబడే బహుమతిని సూచిస్తుంది. "వెబ్సైట్" అనగా ఈ URL వద్ద ఇవ్వబడిన BFL వెబ్సైట్
https://www.bajajfinserv.in/finance/
2. ఈ ప్రమోషన్ అటువంటి కస్టమర్లకు మాత్రమే చెల్లుతుంది:
i. పేర్కొన్న ప్రమోషన్ గురించి BFL నుండి కమ్యూనికేషన్‌ను అందుకున్నవారు.
ii. ఆఫర్ వ్యవధిలో పాల్గొనే స్టోర్ (ల) నుండి ప్రోడక్టుని కొనుగోలు చేయడానికి BFL నుండి తప్పనిసరిగా లోన్ పొందేవారు మరియు రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం లోన్ యొక్క మొదటి సమానమైన నెలవారీ ఇన్స్టాల్మెంట్లను విజయవంతంగా చెల్లించేవారు.
iii. BFL లో రిజిస్టర్ చేయబడిన వారి మొబైల్ నంబర్ నుండి 8424009661 కు "BFL11" SMS ఇవ్వడం ద్వారా ప్రమోషన్లో పాల్గొనడానికి ఎంచుకునే వారు
3. ఈ ప్రమోషన్లో భాగంగా, BFL నిర్ధేశించిన ప్రమాణాలను అందుకున్న ప్రతి కస్టమర్, ____________ విలువ గల పూర్తి 11% క్యాష్‌బ్యాక్ రివార్డును పొందడానికి అర్హత సాధిస్తారు.
4. ఇటువంటి ఆఫర్ సమయంలో ప్రతి కస్టమర్ ఒక్కసారి మాత్రమే ప్రమోషన్‌కు అర్హత సాధించగలరు. ఏవైనా సందేహాలను తొలగించడానికి, ఆఫర్ సమయంలో ఒక కస్టమర్ ఒక్క రివార్డు పొందటానికి మాత్రమే అర్హులు అని ఇందుమూలంగా స్పష్టం చేయడమైనది.
5. ఈ ప్రమోషన్ కేవలం భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాలు మరియు భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిషేధించబడిన ప్రదేశాలలో మరియు / లేదా బహుమతులు / సర్వీసులపై ఈ ప్రమోషన్ వర్తించదు, అలాంటి ఆఫర్లు ఏ కారణం చేతనైనా అందుబాటులో ఉంచబడవు. సందేహ నివృత్తి కోసం, ఈ ప్రమోషన్ తమిళ నాడు రాష్ట్రంలో వర్తించదని తెలియజేస్తున్నాము.
6. ఈ ప్రమోషన్ మరియు రివార్డులు BFL యొక్క విచక్షణాధికారం పైన ఆధారపడి ఉంటాయి మరియు ఎటువంటి ప్రకటన లేకుండా BFL దీనికి తగిన విధంగా మార్పులు చేసే అధికారం కూడా ఉంది.
7. కస్టమర్ ఈ ప్రమోషన్లో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయం మరియు ఈ ప్రమోషన్ లో పాల్గొనాలని కస్టమర్‌కి ఎటువంటి కట్టుబాటు లేదు. ఏదైనా పరిస్థితులలో అయినా ప్రమోషన్లో పాల్గొనలేకపోతే ఎటువంటి పరిహారం ఉండదు.
8. BFL అందించే ఇతర ఆఫర్/తగ్గింపు/ప్రమోషన్ లతో ఈ ప్రమోషన్‌ను జత చేయలేరు.
9. ప్రమోషన్లో ఏదైనా లేదా ఈ నిబంధనలు మరియు షరతులు ఉన్నప్పటికీ, ఏదైనా చిత్రాలు, ప్రాతినిధ్యాలు, కంటెంట్ మొదలైనవి మరియు ఏదైనా మూడవ పార్టీకి చెందిన అన్ని మేధో సంపత్తి హక్కులు అటువంటి పార్టీతో మరియు అటువంటి చిత్రాలు, ప్రాతినిధ్యాలు మొదలైనవి ఉపయోగించడం ద్వారా కొనసాగుతాయి. , BFL కు అటువంటి మేధో సంపత్తికి సంబంధించి ఎటువంటి హక్కులు లేవు.
10. అర్హతగల కస్టమర్లు BFL ద్వారా ప్రమోషన్ కింద పొందిన లోన్ పై మొదటి సమానమైన నెలవారీ ఇన్స్టాల్మెంట్ విజయవంతంగా రీపేమెంట్ చేసిన తర్వాత మాత్రమే వారి బహుమతిని అందుకుంటారు. మొదటి నెలవారీ ఇన్స్టాల్మెంట్ యొక్క విజయవంతమైన రిపేమెంట్ తరువాత, ముందుగా చెప్పిన లోన్ మొత్తం పంపిణీ చేయబడిన తేదీ నుండి 30(ముప్పై)) రోజులలో BFL వాలెట్ ద్వారా రివార్డ్ కస్టమర్‌కు ఇవ్వబడుతుంది.
11. వర్తించే అన్ని పన్నులు, ఫీజులు మరియు సుంకాలు ('బహుమతి' పన్ను లేదా మూలం వద్ద తీసివేయబడిన పన్ను మినహాయించి, వర్తించే చోట) కస్టమర్ (లు) మాత్రమే చెల్లించాలి.
12. రివార్డ్‌కు సంబంధించి మూలం వద్ద తీసివేయబడిన పన్ను, వర్తించే చోట, BFL ద్వారా చెల్లించబడుతుంది.
13. ప్రచారం కోసం రిజిస్ట్రేషన్ సమయంలో మరియు/లేదా ఆమె రివార్డ్ అందుకునే సమయంలో ఏదైనా తప్పు సమాచారాన్ని కస్టమర్ అందించినప్పుడు , అతని/ఆమె ఎంపిక రద్దుకు లోబడి ఉంటుంది.
14. ఈ ప్రమోషన్ BFL కస్టమర్లకు మాత్రమే ఒక ప్రత్యేక ఆఫర్ మరియు ఇందులో ఉన్న ఏదీ కస్టమర్ లోన్ అగ్రిమెంట్ల యొక్క నిబంధనలు మరియు షరతులకు ఎటువంటి చేయదు. ఈ నిబంధనలు మరియు షరతులు లోన్ కోసం BFL సూచించిన నిబంధనలు మరియు షరతులకు అదనంగా ఉంటాయి మరియు వాటికి నష్టం చేసివిగా ఉండవు.
15. మరిన్ని లేదా అలాంటి ఆఫర్లను అందించడానికి ఇక్కడ BFL ఎటువంటి హామీ ఇవ్వడం లేదు.
16. BFL కస్టమర్ కొనుగోలు చేసిన ప్రోడక్టుల యొక్క సరఫరాదారు / తయారీదారు/జారీదారు కాదు లేదా ఈ ప్రమోషన్ కింద కస్టమర్లకు అందించిన రివార్డులు కాదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి బాధ్యతను అంగీకరించదు. దీని ప్రకారం, మూడవ పార్టీలు అందించే ఉత్పత్తులు లేదా రివార్డుల యొక్క ఏదైనా ప్రయోజనం లేదా ఇతర అంశాల నాణ్యత, వ్యాపారత్వం లేదా ఫిట్‌నెస్‌కు BFL బాధ్యత వహించదు.
17. ఇక్కడ ఏదైనా ఉన్నప్పటికీ, మూడవ పార్టీలు అందించే ప్రోడక్టులు లేదా రివార్డ్లకు సంబంధించి లేదా వాటికి సంబంధించి లేదా పోగొట్టుకోవడం, గాయం, నష్టం లేదా నష్టానికి BFL ఎప్పుడూ బాధ్యత వహించదు.
18. ప్రమోషన్ కింద ప్రోడక్టులు/సర్వీసులు/రివార్డులకు సంబంధించి వివాదాలు ఏవైనా ఉంటే, కస్టమర్లు నేరుగా వ్యాపారి / రివార్డ్స్ జారీ చేసేవారికి వ్రాయటం ద్వారా సమాధానం పొందవచ్చు మరియు BFL ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వదు.
19. ఈ నిబంధనలు మరియు షరతులు ఏదైనా బ్రోచర్ లేదా ప్రమోషన్ ప్రకటనల యొక్క ఇతర ప్రమోషన్ సామగ్రిపై ఉంటాయి.
20. అర్హత కలిగిన లోన్ ట్రాన్సాక్షన్ యొక్క రద్దు/రిఫండ్ విషయంలో, ప్రమోషన్ మరియు/లేదా రివార్డ్ పొందటానికి కస్టమర్ యొక్క అర్హతను నిర్ణయించడం BFL యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటుంది.
21. BFL, దాని గ్రూప్ సంస్థలు / అనుబంధ సంస్థలు లేదా వారి సంబంధిత డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, విక్రేతలు మొదలైనవి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ప్రోడక్టులు / సర్వీసులును ఉపయోగించడం లేదా ఉపయోగించకపోవడం లేదా ఈ ప్రమోషన్ కింద పాల్గొనడం వంటి కారణాలతో సహా ఏదైనా పోగొట్టుకోవడం లేదా నష్టానికి, లేదా కస్టమర్ అనుభవించే ఏదైనా వ్యక్తిగత గాయానికి బాధ్యత వహించవు.
22. ఏదైనా తప్పనిసరి పరిస్థితులు వంటి సంఘటనల కారణంగా ప్రమోషన్ యొక్క ముగింపు లేదా ఆలస్యం లేదా ప్రమోషన్లో భాగమైన రివార్డులకు BFL బాధ్యత వహించదు మరియు ఎటువంటి పరిణామాలకు బాధ్యత వహించదు.
23. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రమోషన్ బదిలీ చేయబడదు మరియు బేరం చేయడం కుదరదు.
24. ఈ నిబంధనలు మరియు షరతులు భారతదేశ చట్టాలచే నిర్వహించబడతాయి. ఈ ప్రమోషన్ ఫలితంగా లేదా దాని వలన ఏవైనా వివాదాలు సంభవిస్తే అవి అన్ని పుణెలోని కాంపిటెంట్ కోర్టుల యొక్క ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటాయి. వివాదం యొక్క ఉనికి ఏదైనా ఉంటే, BFL కు వ్యతిరేకంగా దావా వేయకూడదు.
25. ఈ ప్రమోషన్ సమయానుసారంగా భారతదేశంలోని ఏ అధికార పరిధిలోనైనా వర్తించే చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది మరియు తదనుగుణంగా అనుమతించబడని ప్రదేశాలలో వర్తించదు.
26. కస్టమర్లు ఇక్కడ ఉన్న నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండడానికి అంగీకరిస్తున్నారు. కస్టమర్ తదుపరి చర్య చేయాల్సిన అవసరం లేకుండా, కస్టమర్లు ఇక్కడ నిబంధనలు మరియు షరతులను చదివిన, అర్థం చేసుకున్నట్లు మరియు బేషరతుగా అంగీకరించినట్లుగా పరిగణించబడతారు.