యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

Bajaj Finance Best Investment Plans

మెచ్యూరిటీకి ముందు ఫిక్సెడ్ డిపాజిట్ విత్డ్రాయల్

మెచ్యూరిటీకి ముందు మీ FD (ఫిక్సెడ్ డిపాజిట్) ని బ్రేక్ చేయడం

తమ పెట్టుబడుల పైన ఖచ్చితమైన రాబడులు పొందాలని అనుకునే వారికి ఫిక్సెడ్ డిపాజిట్ ఒక ఉత్తమ పెట్టుబడి ఆప్షన్. మీరు ఒక ఫిక్సెడ్ డిపాజిట్ లో ఏకమొత్తంగా డబ్బును పెట్టుబడి చేయవచ్చు, ఆ డబ్బు ఒక స్థిరమైన కాలం వరకు లాక్ ఇన్ లో ఉంటుంది మరియు దాని పైన వడ్డీ జమ అవుతుంది. కానీ, FD లిక్విడిటీ ఒక సమస్యగా మారవచ్చు, ఎందుకంటే మీరు వడ్డీని కోల్పోవడమే కాకుండా, ప్రీమెచ్యూరిటీ జరిమానాలను చెల్లించవలసి ఉంటుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ కొరకు మార్గదర్శకాలు

తమ FDని ముందుగానే విత్‌డ్రా చేసుకోవాలని అనుకునే వారి కోసం ఆర్‌‌బి‌ఐ పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.

 • 3 నెలల ముందు విత్‍డ్రాయల్: ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వద్ద ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, కనీసం 3 నెలల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. అందువలన, మరణం లాంటి పరిస్థితుల మినహా, మీ FDని 3 నెలల వరకు లిక్విడేట్ చేయలేరు.
 • 3-6 నెలల మధ్య విత్‍డ్రాయల్: ఈ వ్యవధి మధ్య మీ FDని మీరు విత్‍డ్రా చేసుకున్నట్లయితే మీరు మీ అసలు మొత్తాన్ని మాత్రమే అందుకుంటారు మరియు ఏ వడ్డీని సంపాదించలేరు.
 • 6 నెలల తర్వాత విత్‍డ్రాయల్: ఒక వేళ మీరు ప్రీమెచ్యూర్‌గా మీ FDని 6 నెలల తరువాత లిక్విడేట్ చేయాలనుకుంటే, ఒక పబ్లిక్ డిపాజిట్‌కి దాని వ్యవధిలో వర్తించదగ్గ వడ్డీ రేటు కంటే 2% తక్కువ వడ్డీ చెల్లించబడుతుంది.

ఒక వేళ ఎటువంటి రేటు పేర్కొనబడకపోతే, ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పబ్లిక్ డిపాజిట్లను అంగీకరించే కనీస వడ్డీ రేటు కంటే చెల్లించవలసిన వడ్డీ 3% తక్కువగా ఉంటుంది.

 • మెచ్యూరిటీకి ముందే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకుందామని అనుకుంటే, ఆ ప్రక్రియ గురించి మీరు ఇవి తెలుసుకోవాలి.

 • ప్రక్రియలు:

  మీ బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ నుండి ప్రీమెచ్యూర్‌గా విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటే, మీకు కావలసిన డాక్యుమెంట్లు ఇవి:

  • ఒరిజినల్ ఫిక్సెడ్ డిపాజిట్ రసీదు (FDR)
  అందరు డిపాజిట్ హోల్డర్ల ద్వారా సంతకం చేసిన పైన పేర్కొన్న అసలు FDR పై రూ. 1 ఆదాయ స్టాంప్ అతికించబడాలి
  • మీ ఫిక్సెడ్ డిపాజిట్‌ని ప్రీమెచ్యూర్‌గా మూసివేయడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కి అడ్రెస్ చేస్తూ ఒక అప్లికేషన్ లెటర్

  మీరు ఈ డాక్యుమెంట్లను మీకు సమీపంలోని BFL బ్రాంచ్‌లో సమర్పించవచ్చు మరియు 48 గంటలలోపు మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంటులోకి మీ డబ్బును పొందవచ్చు.

  అటువంటి పరిస్థితులను నివారించడానికి, మీరు మెచ్యూరిటీకు ముందుగా మీ ఫండ్స్ విత్‍డ్రా చేయవలసి వచ్చిన చోట, మీరు తక్కువ అవధికి పెట్టుబడి పెట్టడం కోసం చూడవచ్చు. మల్టిపుల్ FDలను నిర్వహించడం చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో లిక్విడిటీ అవసరాలను పరిష్కరించుకోవడానికి మీకు సహాయం చేస్తూ, అధిక రిటర్న్స్ కూడబెట్టుకోవడానికి మీకు సహాయపడగలవు.

  బజాజ్ ఫైనాన్స్ ద్వారా మీ FD మొత్తం పై లోన్ ని సులభంగా పొంది, మీ అత్యవసర పరిస్థితులు కోసం ఉపయోగించుకోండి. ఇది చాలా సులభమైన ప్రక్రియ, ఇక్కడ మీరు తక్కువ వడ్డీ రేట్లకు ఒక లోన్‌ను సులభంగా పొందవచ్చు. ఇది మీ ఫైనాన్సులు సులభంగా, మీకు అత్యవసర పరిస్థితులలో అవసరమైన నిధుల నిల్వలు లభ్యమయ్యేలా ఉండేందుకు దోహదం చేస్తుంది. మీ పెట్టుబడికి ఆటంకం కలిగించకుండా, ఇతర తాత్కాలిక అవసరాలను సులభంగా నెరవేర్చుకోవచ్చు.

  మీకు ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయా?? బజాజ్ ఫైనాన్స్ కాంటాక్ట్ వివరాలను సందర్శించండి.